Thursday, April 29, 2010

చాయ చాయ

౧. కావాల్సినవి-
టీ బ్యాగు - ౧
అర లేక మొత్తం సెంచా తేనె
ఓ నిమ్మ బద్ద
రెండు పుదీనా ఆకులు
ఓ గిన్నె, ఓ మూత, పొయ్యి, నీ సెయ్యి
ఇధానం -
గిన్నె పొయ్యిపైన పెట్టు
ఓ ౩౦ మి.లీ నీళ్ళు పొయ్యి అనగా ఓ గళాసు
పొయ్యి ఎలిగించు
నీళ్ళు కాగినాక మరిగినాక కాదు, కాగినాక
పొయ్యి ఆపెయ్యి
టీ బ్యాగు వెయ్యి, పుదీనా రెండాకులూ వేసేయ్
మూతపెట్టు
ఒక నిమిషం ఆగినాక
మూత తీసి
టీ సంచి తీసేసి
నిమ్మ దబ్బ పిండు
తేనె వేసి కలుపు
ఉష్ణతేయాకుపానీయం తయ్యారు!!!
సేవించు
ఇది ఆపీస్లో కూడా చేస్కోవచ్చు. పొయ్యి గియ్యి కి బదులు, ఆపీస్ లో వేణ్ణీళ్ళు దొరుకుతాయిగా. మిగతా!! నిమ్మకాయ ఎత్తుకెళ్ళొచ్చుగా. ఓ *త్తి పెట్టుకో ఆపీస్ లో. తేనె డబ్బా కొనుక్కోవచ్చుగా. మనసేతిలో పనే. బద్ధకం వదిలించుకుంటే అన్నీ అవే వస్తాయ్. ఏతన్తావేతి?
౨. చాయి బ్యాగు లేదు, టీపొడే ఉంది. ఎలా?
నీళ్ళు కాచినాక, టీపొడి సెంచా, పుదీనా ఆకులు వెసి మూతట్టేయ్.
ఓ నిమిషం కాంగనే పైపై డికాషన్ ఓ గళాసులో పోస్కో. నిమ్మ, తెనే కుమ్మూ ఓ పీకుడి పీకు.
పైపై డికాషన్ ఎందుకూ తేయాకు దుల్లు రాకుండా. వడపోసేది ఉంటే వడపోస్కో. బెస్టు.
ఇక కుమ్మన్డహే!!

Thursday, April 15, 2010

గోధుమ నూక దావత్

చారానా దావత్ కూ బారానా టాంగా అని ఓ సామెత.
నాదేం చారానా దావత్ గాదు, మస్త్ దావత్ ఏక్ దం!!
దావత్ అంటే పార్టీ అని. మనకి రోజూ పార్టీనే కదా, ఏం తిన్నా, ఏం తినకపోయినా.
సంగతేందంటే నిన్న మూడు గుండిగలకి వంటచేసి అవతలనుకా.
ఏమేంచేసానూ అంటే
గోధుమ అన్నం
గాజరగడ్డ ఇగురు
కోసుగడ్డ ఇగురు
ఈ కోసుగడ్డ ఇగురు ఇంతకముందే చెప్పియున్నందున, దాని గురించేం రాస్తల్లేను. ఫికర్ కాకున్రి.

ముందుగా, గోధుమ అన్నం అంటే, గోధుమ నూకతో వండిన అన్నం లేక ఉప్మా అనుకోవచ్చు. గోధుమ రవ్వ కన్నా కొంచెం పెద్దగా ఉంటుందీ నూక.

గోధుమ అన్నం, నా చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపింది. ఆరోజుల్లో, మా అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధమికోన్నత అభ్యుదయ పాఠశాలలో, పొద్దున్నే ఈ గోధుమ అన్నం పెట్టేవాళ్ళు. మేము ఒకరోజు పందార తీస్కెళ్తే ఇంకోరోజు కారప్పొడి పొట్లం కట్టుకుని తీస్కెళ్ళేవాళ్ళం పైన జల్లుకుని తింటానికి. వేడివేడి అన్నం/ఉప్మా పైన కారప్పొడి. మహాప్రసాదంలా ఉండేది.
కూరగాయలేమీ ఉండవ్ దాంట్లో, ఏ నాలుగో ఐదో ముద్దకో ఒక ఉల్లిపాయ వచ్చెదేమో.
సరే సరే కధలోకి వస్తున్నానయ్యా మగానుభావా!!
చాలా సింపుల్ ఇది. ఐతే బాగా ఉడ్కబెట్టాలి ఇది కారణం నూక కదా సరిగ్గా ఉడక్క పోతే కసకస లాడుతుంది
కావల్సినవి ఓ ఉల్లిపాయ, తిరగమాత గింజలు, ఓ నాలుగైదు సెంచాల నూనె, ఓ నలుగు మిరగాయలు, కర్వేపాకు, పల్లీలు కావాలనుకుంటే, కూరగాయలు కావాలనుకుంటే అంటే చిక్కుడు, బీన్స్, గాజరగడ్డ, ఇంకా కావాలనుకుంటే నానపెట్టిన గింజలు అనగా శనగలు, పెసలు, సజ్జలు, రాజమ్మ, ఇలాంటి కుమ్ముకోవచ్చు. ఇంకా ఓ సోలెడు గోధుమ నూక, రెండున్నర సోలల నీళ్ళు పక్కనబెట్టుకో. ఇంకా ఉప్పు, తప్పు, సిప్పు, సెప్పు.
ఎట్టసేస్తారబ్బా అంటే -
కూదగాయలన్నీ శుబ్బనంగా కడిగేస్కుని,
ఉల్స్ తరుక్కో
మిరగాయలు సన్నగా తరుక్కో
మిగతా కురగాయలు కూడా తరుక్కో
గింజల్స్ వేస్తే ఆడిని ముందురోజే నానపెట్తుకుని ఉంచుకో, బాగా నానితే వేస్కోవచ్చు
ఓ పెద్ద గిన్నె తీస్కో భాండీనో లేకపోతే
పొయ్యిపైన పెట్టు
పొయ్యి ఎలిగించు
నూనె పొయ్యి
పొయ్యిలోకాదు గిన్నెలో
కొంచెం ఏడెక్కంగనే
తిరగమాత గింజల్ వేసెయ్
అయి చిట్పట్ అనంగనే
కర్వెపాకు వేసేయ్
చిట్చిట్ పట్పట్ అంటుంది
సన్నగా తరుక్కున్న మిర్చి అందలా నూకు
కొంచెం ఏగినాక
ఉల్స్ వెయ్యి
ఇక వేగని నా సాఁవిరంగా
ఉల్స్ వేగినాక తరుక్కున కూరగాయ ముక్కలు వేసెయ్యి
బాగా వేగనీ
వేగినాక
ఆ రెండున్నరసోలల నీళ్ళు పోసెయ్.
నీళ్ళు వేడెక్కినాక, ఇప్పుడు గింజలేవో వేసెయ్యి
మూత ఓరగా పెట్టు లేకపోతే నీళ్ళు పొంగుతాయి పోయ్యారిపోద్ది
ఇక ఉడ్కనీ
అన్నీ బాగా ఉడికినాక
రుసికి ఉప్పు కుమ్ము
ఇంకో రెండుమూడు నిమిషాలు ఉడ్కనీ [ఉప్పు పట్టేదాకా అన్నమాట]
ఇప్పుడు గోధుమ నూక వేసేయ్
కలియతిప్పు
ముతబెట్టు
బాగా ఊడికిందాకా ఉంచు.
అయ్యాక కిందకి దించు.
ఇక లాగించు.

రేపు గాజరగడ్డ ఇగురు చూద్దాం ఎలా చెయ్యలో.