Thursday, March 25, 2010

పోగుల ఉప్మా

వారీ!! గీపొద్దు పోగుల ఉప్పమ్మ జేసినా.
హ్మ్!! సమఝ్గాలే?
ఛల్!! స్పగెటీ అంటరు దీన్ని. సైనాఓళ్ళు నూడుల్స్ అంటరు లేక చౌమెయిన్ అంటరు.

ముంగట అంగటికిబొయ్యి ఈ పోగులు తెచ్చుకో. నేని ఇవి దెచ్చినా
From spaghetti

ఇందల, గివిగో ఇన్ని పోషకైలువలున్నై -
From spaghetti

ఛల్!! ఏంగావాలే ఇది చేస్కునేందుకూ?
ఎఱ్ఱని ఎఱ్ఱని బుగ్గలున్న రాంములక్కాయలు గావాలె.
ప్రెష్ గుండేటి వెల్లుల్లి రెబ్బలు ఓ అరడజను కావాలే.
ఇంకేంగావాలే? మిర్చి ఓ నాలుగు కావలె.
ఇంకా ఇవి మస్టు. ఇంక, నాకాడ ఎఱుపు, పసుపు, కాషాయం రంగుల బెంగళూరు మిరగాయలున్నై.
ఇంక!! ఇప్పుడేంజెయ్యాలే?
ముంగట, ఓ మూకుడుదీసుకో.
నిండా నీళ్ళు పొయ్.
పొయ్యిమీనబెట్టు.
పొయ్యి ఎలుగించు, అదెమరి.
ఇంక నీళ్ళు మరిగిలోపట,
మిరగాయ తరుక్కో
సన్నగా
అయ్యిందా
గిప్పుడు వెల్లుల్లిని కుక్కు, తొక్క తీ, సన్నగా తరుగు
అయ్యినాంక, గా బంగళూరు మిరగాయలు తరుగు.
పక్కనబెట్టు
From spaghetti

గా పొయ్యిపైన నీళ్ళు మరుగుతున్నయా
అందలా గీ పోగులునూకు
ఓ సెంచా నూనె నూకు
ఇక ఉడ్కనీ
ఉడ్కిందా లేదా ఎట్టా తెల్స్ది?
ఓ పోగు పైకి లాగు, నొక్కి సూడహే
From spaghetti

దింపెయ్యి ఉడ్కినంక
ఓ డేగిషా పొయ్యినెక్కించు
ఓ నాలుగు సెంచాలు నూనెపొయ్యి
ఏడెక్కంగనే
మిరగాయలు నూకు
ఏగంగనే
వెల్లుల్లి నూకు
ఓసారి తిప్పహే
అయ్యిందా
గిప్పుడు గా బంగళూరు మిరగాయలు నూకు
ఇంక ఏగనీ
గిప్పుడు రాంములక్కాయలు కోసి అవతలనూకు
ఇంతలో ప్రిజ్జీలోంచి దాచ్చారసం తీ
From spaghetti

ఓ గళ్ళాసులో వోంపు.
ఓ గుక్క నోట్టోపోస్కో ఏందీ ఆలోసిత్తా
గిప్పుడు, బంగళూరు మిరగాయలు ఏగినయా సూడు
ఏగినయా, ఏగేఉంటై
సన్నగా తరుక్కున్న రాంములక్కాయలు అందలనూకు
From spaghetti

గిప్పుడు ఓసారి తిప్పు,
కొంచెం ఉప్పేసి ఇక ఊడ్కని
ఉడ్కినంక అందల, గీ పోగులు ఎయ్యి
From spaghetti

ఓ సారి కలియదిప్పు
ఓ నాలుగు కొత్తిమీర కాడల్ని, పైన జెప్పలే, ఏంపర్లేదు, ఉంటేనే, సన్నగా తరిగి, ఓ సారి కడిగి, ఇందల కుమ్ము.
మూతబెట్టుడు
దాచ్చారసం కొట్టుడు
ఓ పదినిమిషాలు గా రాంములక్కాయ రసం దీనికి పట్టేడాంక పొయ్యిమీదనే బెట్టు, సన్నగా బెట్టు మంటని...
ఓ పదినిషాలాగినంక.............
ఏంజెయ్యాలే?
నేజెప్పాల్నా? వారీ!! కుమ్ముడే ఇంక...

Friday, March 19, 2010

నలభీమ పునరాగమనం

అవునయ్యా!! అవునమ్మా!!! నేనొచ్చేసా!! లేకపోతే ఏటి అద్దెచ్చా?? ఫ్యాన్స్ ఏందీ ఏమీ రాయట్లా? తోటకు రా తోటకు రా అని ఓ పోస్టు భూంపుట్టక ముందు పడేస్తివి, మేం తోటకు వచ్చాం ఎళ్ళిపొయ్యాం, తోట ఆకులు రాల్చింది ఋతువులు మారిపోతనే ఉండ్లా. అని ఒకటే గోల.
ఇదిగో వచ్చినా!!
ఏందీ దావతూ? అని అడుగుతున్నవా?
సరే!! రాం! రాం!! రాంములక్కాయ. అవును తిప్పి తిప్పి తిప్పు కాదమ్మా తిప్పి రాంములక్కాయ తెచ్చినా మన పేచ్చకుల ముంగటికి.
రాంములక్కాయతో పప్పు ఏపుడు. బుఱ్ఱ గిఱ్ఱున తిరిగి కిందపడ్డావా? దాన్నే ఆంగ్లమున దాల్ ఫ్రై అందురు, తమరికి అదియునూ తెలియదు, తమరి డ్యాష్.
ముందుగా ఇప్పుడే ఓ బియ్యం మూట ఓపెన్ చేసా. చాలా మందికి బియ్యంమ్మూట ఓపెన్ సెయ్యటం రాదు, కత్తిపెట్టి కోస్తారు దాన్ని సిన్దరవన్దర సేస్తారు. ఇదీ మూట ఓపెన్ సేసే ఇదానం.
From dal_fry

అటైపు ఇటైపు కట్ చెయ్యి, ఓ పోగు పట్టుకు లాగు, పైన సూపెట్తిన ఇధంగా దారం వస్త్ది.
From dal_fry

సరే ఇక కతలోకొస్తే!!
దాల్ ఫ్రై.
ఏంజెయ్యాలా? కందిపప్పు ఓ రెండు డబ్బాలు సుబ్బనంగా కడేసి, ఒకటికి రెండు నీళ్ళోసి పొయ్యి పైకి ఎక్కించు.
ఓ చిటికెడు పసుపు కుమ్ము.
దానిమానాన దాన్ని ఉడకనియ్యి.
From dal_fry

ఈలోపల ఓ నాలుగు మిర్చి, రెండు వెల్లుల్స్, నాలుగు కరివెపాక్స్, ఓ నాలుగు రాంములక్కాయలు తెచ్చుకో.
వెల్లుల్స్ కుక్కు, తొక్కతీ పక్కనబెట్టు
మిర్చి నరుకు పక్కన..
ఉల్ల్స్ నరు..
From dal_fry

ఈలోపల పప్పు సగం ఉడికుంటుంది.
అర్జెంటుగా రాంములక్కాయలు అడ్డంగా నిలువునా నర్...పప్పులో కుమ్ము...

పక్కన ఓ భాండీపెట్టు. నాలుగు స్పూన్లు నూనె కుమ్ము.
ఏడెక్కినాక, ఓచిటెకెడు జిలకర, ఓ చిటికెడు మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ రెండు ఎండు మిర్చి కుమ్ము, చిట్పట్ అన్నాక కర్వేపాకు కుమ్ము, ఇంగువ కొంచెంకుమ్ము.
ఇప్పుడు, ఇప్పుడు సెప్పు, ఇప్పుడు ఇందాక నరికేసిన మిర్చి కుక్కేసి తోలు తీసేసిన వెల్లుల్లి కుమ్ము.
కొంచెం ఏపు.
From dal_fry

ఏగినాక, ఆ రాంమ్ములక్కాయలేసిన పప్పుని దీంట్లో కుమ్ము.
From dal_fry

ఇప్పుడు ఉప్పు ఓ సెంచానో, సెంచాన్నరో కుమ్ము
ఓ సెంచా కారం కుమ్ము
ఓ పాలి తిప్పెసి మూతెట్టు తమ్ముడూ!!! ఏందీ ఇంకా ఆలోసిస్తా??హా!!!
ఇక ఉడకనీ. ఇంతలో నిన్న తెచ్చుకున్న కొత్తిమిరుందిగా. తీ సర్రున బయటకి. ఓ గుత్తి నరికేసి సన్నక తరిగేసి నీళ్ళలో కడిగు.
మూత్తీసి కొత్తిమీర దాంట్లో ఏసేసి మూతెట్టెయ్.
From dal_fry

ఉడకనీ కొంచెంసేపు.
ఓ పదినిమిషాల్తర్వాత మూత్తీసి చూడు, ఉడికే ఉంటదీ.

వన్నంలో అయినా రొట్టెల్లో అయినా మస్తుగుంటది తమ్మీ!!
ఎంజా!!!