Tuesday, August 23, 2011

చిబాటా+కాకరకాయ కూర

ఇయ్యాల్టి మద్దానపు బువ్వ
మల్టైగ్రైన్ చిబాటా బ్రెడ్డు, నంజుకోటాకి కాకరకాయ కూర.

బల్లే ఉందిలే!!
చిబాటా బ్రెడ్డుతో పనీని అని చేస్తారు. అంటే అదేదో ఏంకాదు. ఇదోరకం సాండ్విచ్. పనీని అంటే ప్రెస్డ్ అని.
చిబాటా బ్రెడ్డుని అడ్డంగా కోసి దాన్ని శాండ్విచ్ గ్రిల్లులో ఏసి నొక్కుతారు.
అదన్నమాట....
http://en.wikipedia.org/wiki/Panini_%28sandwich%29
http://en.wikipedia.org/wiki/Ciabatta
చిబాటా పనీని మధ్యలో రోస్టేడ్ గార్లిక్ ఇన్ ఆలివ్ ఆయిల్ + బేసిల్ స్ప్రెడ్ పెట్టుకు తింటే బాగుంటుంది
కొందరు పెస్తో పెట్టుకు తింటారు.

Thursday, August 18, 2011

జొన్న బువ్వ ఎట్టావండాలా?

ఇప్పటి పల్లేల్లో ఎలా ఉందో నాకు సరైన అవగాహన లేదు గానీ!
మా ఇంట్లో పెద్దరోలు, రోకలి ఉండేవి. మా ఇంట్లో అనేకాదు, ప్రతీ ఇంట్లో అనుకోవచ్చు దాదాపు.
రోలు దాదాపు ఏ రెండొందల కిలోల బఱువో ఉండేదేమో. పెద్ద రాతిని చెక్కి రోలు చేసేవాళ్ళు. దాన్ని ఇంట్లో ఇన్స్టాల్ చెయ్యాలంటే కూడా ఓ పెద్ద తతంగమే.
కానీ!! ఆశ్చర్యం వేయదూ? వందల సంవత్సరాల క్రితం అంతంత పెద్ద రోళ్ళను ఇంటికి ఎలా తెచ్చేవాళ్ళూ? ఏ ఎద్దులబండి మీదనో వేస్కుని తోలుకొచ్చేవాళ్ళనుకుంటా.
ఇప్పట్లో బియ్యపు మూటనే ఎత్తలేరు మన జనాలు. హ్మ్!! జొన్నలు తిన్న శరీరాలు కాబట్టే వెయ్యేనుగుల బలమ్ ఉండేది మన పూర్వీకులకు. నో రైస్ మిల్, నో గ్రైన్ మిల్స్...ఓన్లీ హోల్ ఫుడ్. ప్రాసెస్డ్ యట్ హోం!!
కందులు, పెసలు, మినువులు, శెనగలు అన్నీ ఇంట్లోనే ప్రాసెస్ చేస్కునెవారు ఆడవారు. ఎంత శ్రమో తెలుసా? అంత శ్రమ పడేవారో అంత తినేవారు. అందుకే పది కాన్పులైనా అవలీలగా కనేవారు. తొమ్మిదో నెలలో కూడా కలుపులకూ కోతలకూ వెళ్ళేవార్ని నేను అనేకసార్లు చూసాను. మగాళ్ళు నాగలిని ఒక భుజం మీద, వేస్కుని పది మైళ్ళు నడక అవలీలగా కుమ్మెవాళ్ళు.
ఆ రోజులు పొయ్యాయి. ఎందుకూ? వరి బియ్యం మహత్యం. మిల్లుల మహత్యం. కందిపప్పు రుచిలేదు. వరిమీద రంగులేదు. అంతా తెలుపు. తెల్ల బియ్యం తింటే ఎంతా తినకపోతే ఎంతా?
కందిపప్పుక్కూడా పాలిష్ వేసి మూడు లేయర్లు లేపేసి, రంగేసి మార్కెట్లోకి వదులుతారు మీకు తెలుసా?
ఈవేళ మనం తింటున్నది, బలం విటమినులు ఇత్యాదివి పోగా మిగిలిన పిప్పి.

సరే!! కతలోకి పోదాం లెగండి.
జొన్న బువ్వ ఎట్టా వండాలా? అనేది పెస్న.

జొన్న బువ్వ వొంటాకి, జొన్నలుగావాల. రోలు, రోకలి కావాల.

ముంగట, జొన్నల్లో కాసిని నీళ్ళు జల్లి తడిపొడిగా సేస్కోవాల.
ఐనాక, రోట్లో ఆట్ని పోసి తొక్కాల. ఎంతకాడికి తొక్కాలా? పొట్టు లెగించిందాంక తొక్కాల.
తొక్కినాంక, ఆట్ని కడుక్కోవాల. పొట్టు పోయిందాంక కడగాల. మినుపప్పు నానబెట్టి పొట్టుతీస్తరుగా అట్టా అన్నమాట.
ఇప్పుడు ఎసరుపెట్టుకోవల, ఎసట్లో ఈ కడిగి పొట్టుదీసిన జొన్నలు వెయ్యాల.

ఉడికినంక ఏంజెయ్యలా?
గోంగోర పచ్చడి, ఓ పెద్దుల్లిపాయ పక్కనెట్టుకుని, కుమ్మాల, అయినంక, గడ్డపెరుగు ఏస్కుని, గండ్ల ఉప్పు ఏస్కుని కుమ్మాల.

Wednesday, August 10, 2011

కాల్షియం కోసం ‘రాగి అంబలి’

దేనికోసమో గాలిస్తుంటే ఈ లింకు తగిలింది.
(1) రాగుల్ని చోళ్ళు, తవిదెలు అని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. ‘చోడంబలి’ చిక్కగా, మృదువుగా ఉండి చలవనిస్తుంది. పుష్టినిస్తుంది. కడుపు నిండుతుంది. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపు చేస్తుంది.
(2) చక్కని పెరుగుని ఈ ‘రాగంబలి’లో కలిపి చిలికి ప్రాతఃకాలన తాగితే అన్నిరకాల వ్యాధులలోనూ మేలు చేకూరుస్తుంది.
(3) చదువుకునే పిల్లలకి, వృద్ధులకీ, రోగాలతో తీసుకొంటున్న వారికి, కృశించిపోతున్న వారికి, స్థూలకాయం ఉన్న వారిక్కూడా ప్రొద్దునే్న అంబలి తాగితే చాలా మేలు కలుగుతుంది. పాలుగాని, పెరుగు గాని, మజ్జిగ గాని కలిపి తాగవచ్చు కూడా!
కాల్షియం కోసం ‘రాగి అంబలి’ | Andhra Bhoomi

Tuesday, August 2, 2011

జొన్న బువ్వ + గోంగోర పప్పు

నిన్న రేత్తిరి జొన్నబువ్వ గోంగోరపప్పుతో కుమ్మినా
పెపంచికం ఇట్టా మారకముందటి రోజుల్లో జొన్నబువ్వే బువ్వ. జొన్నకూడ తింటం వొళ్ళు అలసిందాంక పనిసేయ్టం, రేత్తిరికి సీకెటేళకల్లా సల్లబువ్వ తింటం నిద్దరోటం మడిసికి అలవాటు. ఆరోజుల్లో ఇళ్ళలోనే పేద్ద రోలు రోకలి ఉండేవి అందరికీ. జొన్నలు రోట్లోఏసి తొక్కి, ఎసట్లో ఏసి ఉడకంగనే ఏడేడిగా తింటం అనేదే రీతి.
ఇయ్యాల వరిబువ్వే బువ్వ, తెల్ల బియ్యం తీపెక్కువ. ఎవుడిక్కావాల పాత ఇదానాలు. అంతా యంత్రం మాయ. తెల్లోడి మాయ. ఎర్రోడి మాయ. నల్లోడి మాయ.
ఏలం ఎర్రి....
కొత్తకి ఇంత పాతకి రోత అని ముతక సామెతలే.
నులకమంచం వారమ్మటి వార్చుకుని ఓ సుట్టపీకి ముసుగుతన్ని నిద్దరపోవాల ఇంక.
ఉంటా