Friday, December 28, 2012

శుక్రోరం సందడి

కుదరత్ కీ కరిష్మా అంటుంటారు నార్తులో.
భగమంతుడు ఉల్ల్స్ ఇచ్చినాడు. కొత్తిమీరనిచ్చినాడు. పుదీనా ఇచ్చినాడు. మిరగాయల్నిచ్చినాడు. నిమ్మకాయల్నినిచ్చినాడు.
అలా మార్కెట్టుకెళ్ళి ఓ కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట, చెటాకు మిర్చి, ఓ నాల్గు నిమ్మకాయలు తెచ్చుకో. పక్కనే కొట్లో ఓ పొట్లం అప్పడాలు తెచ్చుకో.
సన్నగా ఉల్లి తరుగు
కొత్తిమ్మిర శుభ్రంగా కడిగి ఓ నాల్గు రెమ్మలు సన్నగా తరుగు
ఓ పది పుదీనా ఆక్కులు శుభ్రంగా కడిగి తుంచేసి పక్కనపెట్టు
కారంకొద్దీ మిరగాయలు అబ్బాయ్. తర్వాత ఎక్కువైనై అని నన్నంటే కాడు. జస్ట్ రెండంటే రెండే మిరగాయలు సన్నంగా తరుక్కో.
తరిగిన ఉల్లిలో ఇయ్యన్నీ కలుపు
రుచికి ఉప్పు జల్లుకో
నిమ్మకాయ పిండు

ఇప్పుడు మైక్రోవేవులో రెండు అప్పడాలు పెట్టు.
నలభై సెకెండ్లు కొట్టు
అయ్యాక అప్పడాలు పట్టు
అప్పడంపైన పైన కల్పుకున్న మిశ్రమం కొట్టు
మసాలా అప్పడాల పని పట్టు

పక్కన ముంత, ముంతలో కుంకుడు మర్చిపోకమ్మా చిన్నా. ప్చ్! పాపం, ఏవీ తెలియదు ఈకాలం పిల్కాయలకి.

Tuesday, October 2, 2012

గ్రీన్ టి

గ్రీన్ టీ సింపుల్.

ఇదానం ౧. కావాల్సినవి, చాయ కాచటానికి ఓ గిన్నె, ఓ సెంచాడు చాయ పొడి. ఓ నిమ్మకాయ బద్ద, సెంచా తేనే లేక అరసెంచాంత బెల్లం, రెండు పుదీనా ఆకులు.
వెలాగ సెయ్యాలయ్యా అంటే -
గిన్నె పోయ్యిమీన నూకి, గల్లాసు నీళ్ళోసి మరిగించాల. పొయ్యి ఎలిగించకుంటా ఎట్టా అనమాక, ఆపాట పెట్టి ఒక్కటినూకినానంటే దిబ్బలోబడాతావు.
నీళ్ళు మరిగినాక పొయ్యి ఆపినూకాల
ఇప్పుడు సెంచా చాయ పొడి ఏసి మూతపెట్టాల. నిమిషంకాంగనే వడపోసి అందులో నిమ్మకాయ బద్ద పిండి, బెల్లవో తేనే ఏసి ఓమారు కలిపి పుదీనా ఆకు నులిమి అందులో ఏసి ఓ అరనిమిషం మూతపెట్టుంచి
కుమ్మహే!!
ఇదానం ౨. కావాల్సినవి - ఏడ్నీళ్ళు, టీ పొడ డిప్, పుదీనా రెండు రెబ్బలు, ఓ నిమ్మకాయ బద్ద, తేనే ఓ సెంచా
వెలాగ సేయ్యాల్నంటే -
ఏణ్ణీళ్ళ మరకాడికిబో. ఓ గళాసులో ఏణ్ణీళ్ళు కుమ్ముకొచ్చుకో. టీ పొడ సంచీ ముంచు ఓ నాల్గుసార్లు.
నిమ్మకాయ పిండు తేనె కుమ్ము
పుదీనా నులిమి కుమ్ము కలుపు
సెంచాతో కలుపు
తాగహే ఏటి సూత్తావ్

Wednesday, June 6, 2012

ఇయ్యాల్టి రేత్తిరి బువ్వలోకి రొట్టెలు లీమా బిన్నీసు, పుల్లచెనగలు



ముందట్రోజు రేత్తిరే లీమా బిన్నీసులు, పుల్లచెనగలు నీళ్ళల్లో పోసి నానబెట్టుకోవాల.
మర్నాడు సాయంత్రానికి అదే నీళ్ళల్లో ఉడకబెట్టాల.
ఉడికినంక,
భాండీ పొయ్యిమీన పెట్టుడు,
ఓ సెంచా నూనె పోసుడు కాగినంక చిటికెడు ఆవాలు,
చిటికెడు జిలకర ఏసుడు,
ఏ రెండు ఎండుమిరగాయలు కుమ్ముడు,
సిటపటలాడంగనే ఓ నాల్గోఐదో ఎల్లుల్లి కుక్కి ఏసుడు వేయించుడు
అందలా ఈ లీమా ఉడ్కబెట్టిన లీమా బిన్నీసులు, పుల్లచెనగ ఏసుడు రవ్వంత ఉప్పు రవ్వంత కారం జల్లుడు దింపుడు.
దీన్నే మా యమ్మ శాతాలింటం అనేటిది.
శాతాలించినాంక,
ఇంకోసేత్తో ఓ ఉల్లయ్యని ఓ రెండు మిరగాయల్ని సన్నంగా కొసి పక్కనెబెట్టి ఓ నిమ్మకాయ నరికి సర్రున ఈటిమీన పిండి
ఇంకోసేత్తో రొట్టె తీస్కొనుడు మద్దెన పైన సేసిన గుగ్గిళ్ళు ఓ రెండు మూడో పస్కుండో సెంచాలు కుమ్మరించుకొనుడు పైన ఓ రెండో సెంచాలు ఉల్లిమిరగాయల్ని జల్లుకొనుడు
ఇంకా ఏందీ సూస్చా? మడతెట్టి కుమ్మహే

[నాసావే! రొట్టెలు యాణ్ణుండి తెమ్మంటా? అంటావా? కొసెన్లేసినావంటే ఇరగనూకుతా. ముందు తినహే]