Friday, December 28, 2012

శుక్రోరం సందడి

కుదరత్ కీ కరిష్మా అంటుంటారు నార్తులో.
భగమంతుడు ఉల్ల్స్ ఇచ్చినాడు. కొత్తిమీరనిచ్చినాడు. పుదీనా ఇచ్చినాడు. మిరగాయల్నిచ్చినాడు. నిమ్మకాయల్నినిచ్చినాడు.
అలా మార్కెట్టుకెళ్ళి ఓ కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట, చెటాకు మిర్చి, ఓ నాల్గు నిమ్మకాయలు తెచ్చుకో. పక్కనే కొట్లో ఓ పొట్లం అప్పడాలు తెచ్చుకో.
సన్నగా ఉల్లి తరుగు
కొత్తిమ్మిర శుభ్రంగా కడిగి ఓ నాల్గు రెమ్మలు సన్నగా తరుగు
ఓ పది పుదీనా ఆక్కులు శుభ్రంగా కడిగి తుంచేసి పక్కనపెట్టు
కారంకొద్దీ మిరగాయలు అబ్బాయ్. తర్వాత ఎక్కువైనై అని నన్నంటే కాడు. జస్ట్ రెండంటే రెండే మిరగాయలు సన్నంగా తరుక్కో.
తరిగిన ఉల్లిలో ఇయ్యన్నీ కలుపు
రుచికి ఉప్పు జల్లుకో
నిమ్మకాయ పిండు

ఇప్పుడు మైక్రోవేవులో రెండు అప్పడాలు పెట్టు.
నలభై సెకెండ్లు కొట్టు
అయ్యాక అప్పడాలు పట్టు
అప్పడంపైన పైన కల్పుకున్న మిశ్రమం కొట్టు
మసాలా అప్పడాల పని పట్టు

పక్కన ముంత, ముంతలో కుంకుడు మర్చిపోకమ్మా చిన్నా. ప్చ్! పాపం, ఏవీ తెలియదు ఈకాలం పిల్కాయలకి.