మనసంతా చికాకుగా ఉంది
దొడ్లోకి వెళ్ళాను
సొరకాయ కనిపించింది తీగకి
కోసుకొచ్చాను
జానెడు ముక్కకి తొక్కతీసి
తాలింపులో సొరకాయ ముక్కలేసి మూత పెట్టి
ఇంకో పొయ్యిమీద ఎసరుపోసి
ఎసట్లో దోసెడు ఓట్లు పోసి
స్నాన *పానాదులు* కానిచ్చి
సొరకాయ ఇగురులో చిటికెడు ఉప్పేసి
ఉడికిన ఓట్లను ఆపేసి
సొరకాయ కూరని కట్టేసి
గీతాంజలి సినిమాని పెట్టుకుని చూస్తూ
Wednesday, August 1, 2018
Friday, July 27, 2018
దోసకాయ కూర
అలా దొడ్లోకి వెళ్ళి
దాసపాదు లోంచి మంచి దోసకాయని కోసుకుని జేబులోవేసుకుని
అటు పక్కనున్న మిరప మొక్కలదగ్గరకెళ్ళి ఓ రెండు మిరపకాయలు కోసుకుని
మిరపకాయలు కోసేసి దాంట్లో వేసి
ఇందాక కోసుకొచ్చిన దోసకాయని ముక్కలుకోసేసి దాంట్లో వేసి కొంచెం ఉప్పు జల్లి మూతపెట్టి ముక్క మెత్తబడగానే దింపేసి కుమ్మటమే!
Friday, June 1, 2018
వడియాలు
మా చిన్నప్పుడు ఎండ్లకాలంలో కూరగాయలు రావు కాబట్టి, వాట్ని ఎండబెట్టి దాచిపెట్టుకునేవారు. వాటిని వరుగులు అనేవారనుకుంటా. అమెరికా లాంటి దేశాల్లో ఫ్రోజన్ ఫుడ్ లభిస్తుందనుకోండి ఏ సీజనులోనైనా. ఓ రకంగా వరుగు అనే విధానం అంతరించినట్టేనేమో.
కాస్తో కూస్తో కమర్షియల్ స్థాయిలోనైనా బతికున్నది వడియం.
ఈరోజు మేము సగ్గుబియ్యపు వడియాలు పెట్టుకున్నాం.
Tuesday, November 15, 2016
Sunday, March 20, 2016
కొబ్బరి ఐసుక్రీము - అనఘ గారి వంట
అనఘ తయ్యారు చేసిన మొట్టమొదటి వంటకం
నాకు బాగా నచ్చిందోయ్!Saturday, March 19, 2016
గ్రీన్ జ్యూస్ పదోరోజు
చెటాకు పాలకూర
ఆరు కేలు ఆకులు
చెటాకు పార్సులీ ఆకులు
రెండు యాపిళ్ళు
ఒక ఖీరా దోస్కాయ
రెండు సెలరీ చెక్కలు
పావలా కాసంత అల్లం
గ్రీన్ జ్యూస్ తొందోరోజు
ఆరు స్విస్సు ఛార్డు ఆకులు
గుప్పెడు ఆకుపచ్చ ద్రాక్షా
అర ఖీరా దోస్కాయ
ఒక గ్రీను యాపిలు
పావలా కాసంత అల్లం
Subscribe to:
Posts (Atom)






