గార్డెన్ టు కం!! అనగా తోటకు రా!!!
ఈ మద్దెన మనకి పాపులారిటీ పెరిగిపొయ్యి, కొందరు, డవిరెక్టుగా అడిగేస్తున్నారు, అదెట్టా సెయ్యాల ఇదెట్టా సెయ్యాల అని [చందా :):)].
ఆరోగ్యనికి మంచి కూరలు ఎట్టా సేస్కోవాల? ఏవితినాల? ఏంజెయ్యాల? ఇట్టాంటివి సానా పెస్నలు లెగుత్తా ఉంటాయ్ సేనా మందికి.
అట్టాంటోళ్ళకోసం ఓ మంచి వంటకం తోటకూర కూర.
మాంచి లేత తోటకూరతో పప్పు కెవ్వు కేక. అట్టానే కూరగూడా...కెవ్వుకేక!!
ఎట్టాచేస్తారో ఏంకదో సూద్దాం తోటకిపదహే.
మార్కెట్టుకెళ్ళి
ఓ పెద్ద కట్ట తోటకూర
నాలుగు మిర్చి
ఓ గుప్పెడు పచ్చిశనగపప్పు
తాలింపు గింజలు
ఓ చెంచా నూనె
ఓ ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు బొబ్బలు నూక్కొచ్చుకో.
ఓ బక్కెట్టు నీళ్ళు తెచ్చుకో తోటకూరని దాంట్లో వెయ్యి. ముంచు లేపు, ముంచు లేపు, ముంచు లేపు. అట్టా ఓక్కో ఆకు సుబ్బనంగా కడుక్కో. దేనికీ? పెస్నలొద్దు పనిజూడు. ఎందుకంటే, తోటకూర పండిచే రైతులు నీళ్ళుపెడతారా తోటకూర సేనుకి, ఇసుక మొక్కని[చెట్టుని - ఇక్కడ కొందరు అనొచ్చు తోటకూర మొక్క కదా మా ఊళ్ళో అట్టానే అంటాం, చెట్టు వృక్షం కాదు భాయ్ అని - పిల్లాట] పట్టుకుని వదల్దు. సరిగ్గా కడుక్కోకపోతే కూర తినేప్పుడు కసకస లాడుద్ది.
సుబ్బనంగా కడుక్కున్నాక, కట్ట కట్ట అట్టానే కటింగు బల్లమీనపెట్టి ఓ మోస్తరి సైజుకి నరికేసేయ్.
ఇప్పుడు, ఓ భాండీ తీస్కో
పొయ్యిమీన పెట్టు, ఆరెండు సెంచాల నూనె ఏసేయ్
ఏడికాంగనే తాలింపు గింజలు ఏసేయ్. పచ్చిశనగపప్పు ఎక్కువ ఎసేయ్.
ఏగంగనే ఎల్లుల్లి రెబ్బల్ని అరసేత్తో కుక్కి, తొక్కపీకి ఏసేయ్. మిరగాయల్ని నాలుగుముక్కలుగా నరికేసి ఎసేయ్ దాంట్లో..
సిటపటలాడంగనే, తరుక్కున్న తోటకూర కుమ్ము. సెగ కొంచెం తగ్గించి మూతపెట్టు...
పుసుక్కున ఉడికిపోద్ది నాయాల్ది. ఉప్పు తగిలించి లాగించు. కారం సాలకపోతే ఓ మిరగాయ పక్కనెట్టుకుని లాగించవో...
రెట్టెల్లోకి బాగుండిద్ది, వన్నంలోకీ బాగుండిద్ది, దేనికైనా బాగుండిద్ది. వారోగ్యానికి వారోగ్యం..
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
నిజం గా ఆ కూర అంట రుచి గా ఉంటుందో లేదో మీరు చెప్పే స్టైల్ కి మాత్రం అప్పుడే తినాలనిపించేస్తాది.
same comment as sravya.
స్టవ్ ఏంటి అంత నీట్ గా వుంది? నేనొప్పుకోను :(
మొత్తం డెమొ బొమ్మలు పెట్టలేదూ?
ఈసారెలాగైనా అచ్చం మీరు చెప్పినట్టే చేద్దామని మార్కెట్టుకెళ్ళి కావలసినవి నామానాన నేను నూక్కొచ్చుకుంటుంటే ఆ షాపువాడు వెంట పడ్డాడండీ.. మీపేరు చెప్పినా వదల్లేదు.. :)
అన్నీ నూక్కొచ్చుకోవాలా అమ్మో ఉమ గారు చెప్పింట్లు షాప్ అతను వెంట పడతాడండీ. ఏమిటీ బకెట్ లో కడుక్కోవాలా అమ్మొ నాయనో ఇప్పుడూ అమెరికా లో వంటల కోసం బకెట్ ఎక్కడ కొనమండి.. ఏదో గిన్నెలో సరి పుచ్చుకుంటాము ఓకే నా? ఎల్లుల్లి రెబ్బలు అరచేత్తో కుక్కాలా అయ్య బాబోయ్ ఏ వూరి భాషండి అది... :-)
అవును మీ పొయ్యేమిటి అంత క్లీన్ గా వుంది నాయుడు బాబు గారి క్లీన్ అండ్ గ్రీన్ పధకమా? నాకు కూడా చాల ఇష్టమైన కూర తోటకూర (నా కొడుక్కి కాదు :( )
ఉమాశంకర్
కెవ్వుకేక :):)
అదేమరి నూకటం ఓ ఆర్టు. కనిపించెలా నూకితే ఇంతే, నా పేరుచెప్పినా వదల్రు. :):)
పోనీసారికి డబ్బు ఇచ్చేసేయ్!!
Haritha gaaru , next time , if u c him with cam kick his back
In the kitchen itself.:)
భా.రా.రె భలే చెప్పారు ..
అన్నాయి నీ పని గోయిందా ;)
టెస్ట్
why no posts in this blog since a long time ? I wish you wrote more !
Post a Comment