ఇదిగో వచ్చినా!!
ఏందీ దావతూ? అని అడుగుతున్నవా?
సరే!! రాం! రాం!! రాంములక్కాయ. అవును తిప్పి తిప్పి తిప్పు కాదమ్మా తిప్పి రాంములక్కాయ తెచ్చినా మన పేచ్చకుల ముంగటికి.
రాంములక్కాయతో పప్పు ఏపుడు. బుఱ్ఱ గిఱ్ఱున తిరిగి కిందపడ్డావా? దాన్నే ఆంగ్లమున దాల్ ఫ్రై అందురు, తమరికి అదియునూ తెలియదు, తమరి డ్యాష్.
ముందుగా ఇప్పుడే ఓ బియ్యం మూట ఓపెన్ చేసా. చాలా మందికి బియ్యంమ్మూట ఓపెన్ సెయ్యటం రాదు, కత్తిపెట్టి కోస్తారు దాన్ని సిన్దరవన్దర సేస్తారు. ఇదీ మూట ఓపెన్ సేసే ఇదానం.
From dal_fry |
అటైపు ఇటైపు కట్ చెయ్యి, ఓ పోగు పట్టుకు లాగు, పైన సూపెట్తిన ఇధంగా దారం వస్త్ది.
From dal_fry |
సరే ఇక కతలోకొస్తే!!
దాల్ ఫ్రై.
ఏంజెయ్యాలా? కందిపప్పు ఓ రెండు డబ్బాలు సుబ్బనంగా కడేసి, ఒకటికి రెండు నీళ్ళోసి పొయ్యి పైకి ఎక్కించు.
ఓ చిటికెడు పసుపు కుమ్ము.
దానిమానాన దాన్ని ఉడకనియ్యి.
From dal_fry |
ఈలోపల ఓ నాలుగు మిర్చి, రెండు వెల్లుల్స్, నాలుగు కరివెపాక్స్, ఓ నాలుగు రాంములక్కాయలు తెచ్చుకో.
వెల్లుల్స్ కుక్కు, తొక్కతీ పక్కనబెట్టు
మిర్చి నరుకు పక్కన..
ఉల్ల్స్ నరు..
From dal_fry |
ఈలోపల పప్పు సగం ఉడికుంటుంది.
అర్జెంటుగా రాంములక్కాయలు అడ్డంగా నిలువునా నర్...పప్పులో కుమ్ము...
పక్కన ఓ భాండీపెట్టు. నాలుగు స్పూన్లు నూనె కుమ్ము.
ఏడెక్కినాక, ఓచిటెకెడు జిలకర, ఓ చిటికెడు మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ రెండు ఎండు మిర్చి కుమ్ము, చిట్పట్ అన్నాక కర్వేపాకు కుమ్ము, ఇంగువ కొంచెంకుమ్ము.
ఇప్పుడు, ఇప్పుడు సెప్పు, ఇప్పుడు ఇందాక నరికేసిన మిర్చి కుక్కేసి తోలు తీసేసిన వెల్లుల్లి కుమ్ము.
కొంచెం ఏపు.
From dal_fry |
ఏగినాక, ఆ రాంమ్ములక్కాయలేసిన పప్పుని దీంట్లో కుమ్ము.
From dal_fry |
ఇప్పుడు ఉప్పు ఓ సెంచానో, సెంచాన్నరో కుమ్ము
ఓ సెంచా కారం కుమ్ము
ఓ పాలి తిప్పెసి మూతెట్టు తమ్ముడూ!!! ఏందీ ఇంకా ఆలోసిస్తా??హా!!!
ఇక ఉడకనీ. ఇంతలో నిన్న తెచ్చుకున్న కొత్తిమిరుందిగా. తీ సర్రున బయటకి. ఓ గుత్తి నరికేసి సన్నక తరిగేసి నీళ్ళలో కడిగు.
మూత్తీసి కొత్తిమీర దాంట్లో ఏసేసి మూతెట్టెయ్.
From dal_fry |
ఉడకనీ కొంచెంసేపు.
ఓ పదినిమిషాల్తర్వాత మూత్తీసి చూడు, ఉడికే ఉంటదీ.
వన్నంలో అయినా రొట్టెల్లో అయినా మస్తుగుంటది తమ్మీ!!
ఎంజా!!!
4 comments:
ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు వంట చెసారా? మీ ఆవిడ మిమ్మల్ని బాగా గారాబం చెస్తున్నారండీ :P
ఆ బియ్యం మూట విప్పడం నిజంగ ఒక కళ. నాకు ఒక్కొసారి దారం అలా వచ్చెస్తుంది ఒక్కొసారి ప్రతీ కుట్టునీ కత్తిరించాల్సొస్తుంది.
టమోటా పప్పుకూ కి ఈ దాల్ ఫ్రై కి నాకేమి తేడా కనపడటం లేదు, ఏమన్నా తేడా ఉందంటారా ?
అవును నాది శ్రావ్య గారి డౌటే, టమోటా పప్పే కదా మీరు చెప్తుంటా, అంత ఘనం గా దాల్ ఫ్రై అంటే ఏమిటో అనుకున్నా కదా..
రాణీ గారూ - పెల్లా జెల్లా ఆవిడాయ్ అందరూ భారతావనిలో ఉన్నారు.
శ్రావ్యా, భావనా - అదేమరి. డాల్ ఫ్రై కి మామూలుగా వండే పప్పుకీ ఓ పెద్ద తేడా ఏంలేదు.
:):)
Post a Comment