చారానా దావత్ కూ బారానా టాంగా అని ఓ సామెత.
నాదేం చారానా దావత్ గాదు, మస్త్ దావత్ ఏక్ దం!!
దావత్ అంటే పార్టీ అని. మనకి రోజూ పార్టీనే కదా, ఏం తిన్నా, ఏం తినకపోయినా.
సంగతేందంటే నిన్న మూడు గుండిగలకి వంటచేసి అవతలనుకా.
ఏమేంచేసానూ అంటే
గోధుమ అన్నం
గాజరగడ్డ ఇగురు
కోసుగడ్డ ఇగురు
ఈ కోసుగడ్డ ఇగురు ఇంతకముందే చెప్పియున్నందున, దాని గురించేం రాస్తల్లేను. ఫికర్ కాకున్రి.
ముందుగా, గోధుమ అన్నం అంటే, గోధుమ నూకతో వండిన అన్నం లేక ఉప్మా అనుకోవచ్చు. గోధుమ రవ్వ కన్నా కొంచెం పెద్దగా ఉంటుందీ నూక.
గోధుమ అన్నం, నా చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపింది. ఆరోజుల్లో, మా అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధమికోన్నత అభ్యుదయ పాఠశాలలో, పొద్దున్నే ఈ గోధుమ అన్నం పెట్టేవాళ్ళు. మేము ఒకరోజు పందార తీస్కెళ్తే ఇంకోరోజు కారప్పొడి పొట్లం కట్టుకుని తీస్కెళ్ళేవాళ్ళం పైన జల్లుకుని తింటానికి. వేడివేడి అన్నం/ఉప్మా పైన కారప్పొడి. మహాప్రసాదంలా ఉండేది.
కూరగాయలేమీ ఉండవ్ దాంట్లో, ఏ నాలుగో ఐదో ముద్దకో ఒక ఉల్లిపాయ వచ్చెదేమో.
సరే సరే కధలోకి వస్తున్నానయ్యా మగానుభావా!!
చాలా సింపుల్ ఇది. ఐతే బాగా ఉడ్కబెట్టాలి ఇది కారణం నూక కదా సరిగ్గా ఉడక్క పోతే కసకస లాడుతుంది
కావల్సినవి ఓ ఉల్లిపాయ, తిరగమాత గింజలు, ఓ నాలుగైదు సెంచాల నూనె, ఓ నలుగు మిరగాయలు, కర్వేపాకు, పల్లీలు కావాలనుకుంటే, కూరగాయలు కావాలనుకుంటే అంటే చిక్కుడు, బీన్స్, గాజరగడ్డ, ఇంకా కావాలనుకుంటే నానపెట్టిన గింజలు అనగా శనగలు, పెసలు, సజ్జలు, రాజమ్మ, ఇలాంటి కుమ్ముకోవచ్చు. ఇంకా ఓ సోలెడు గోధుమ నూక, రెండున్నర సోలల నీళ్ళు పక్కనబెట్టుకో. ఇంకా ఉప్పు, తప్పు, సిప్పు, సెప్పు.
ఎట్టసేస్తారబ్బా అంటే -
కూదగాయలన్నీ శుబ్బనంగా కడిగేస్కుని,
ఉల్స్ తరుక్కో
మిరగాయలు సన్నగా తరుక్కో
మిగతా కురగాయలు కూడా తరుక్కో
గింజల్స్ వేస్తే ఆడిని ముందురోజే నానపెట్తుకుని ఉంచుకో, బాగా నానితే వేస్కోవచ్చు
ఓ పెద్ద గిన్నె తీస్కో భాండీనో లేకపోతే
పొయ్యిపైన పెట్టు
పొయ్యి ఎలిగించు
నూనె పొయ్యి
పొయ్యిలోకాదు గిన్నెలో
కొంచెం ఏడెక్కంగనే
తిరగమాత గింజల్ వేసెయ్
అయి చిట్పట్ అనంగనే
కర్వెపాకు వేసేయ్
చిట్చిట్ పట్పట్ అంటుంది
సన్నగా తరుక్కున్న మిర్చి అందలా నూకు
కొంచెం ఏగినాక
ఉల్స్ వెయ్యి
ఇక వేగని నా సాఁవిరంగా
ఉల్స్ వేగినాక తరుక్కున కూరగాయ ముక్కలు వేసెయ్యి
బాగా వేగనీ
వేగినాక
ఆ రెండున్నరసోలల నీళ్ళు పోసెయ్.
నీళ్ళు వేడెక్కినాక, ఇప్పుడు గింజలేవో వేసెయ్యి
మూత ఓరగా పెట్టు లేకపోతే నీళ్ళు పొంగుతాయి పోయ్యారిపోద్ది
ఇక ఉడ్కనీ
అన్నీ బాగా ఉడికినాక
రుసికి ఉప్పు కుమ్ము
ఇంకో రెండుమూడు నిమిషాలు ఉడ్కనీ [ఉప్పు పట్టేదాకా అన్నమాట]
ఇప్పుడు గోధుమ నూక వేసేయ్
కలియతిప్పు
ముతబెట్టు
బాగా ఊడికిందాకా ఉంచు.
అయ్యాక కిందకి దించు.
ఇక లాగించు.
రేపు గాజరగడ్డ ఇగురు చూద్దాం ఎలా చెయ్యలో.
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
మూడు గుండిగలకి వంటచేసి >> ఏమిటి నిజమే ? హరిత గారిని పిల్లల్ని ఊరు పంపి ఇక్కడ పార్టీలు చేసుకుంటున్నారా ? ఎంత అన్యాయం ఎక్కడ సూర్య మా డాడీ కోసం అని సగం సంచీ లో దాస్తుంటే మీరోమో పార్టీలా ఎంత అది ఇంకా ఎంత ఇది :)
సందు దొరికినప్పుడే నాల్రోజులకి సరిపోను సేసి ప్రిజ్జిలో పడేస్కున్టా ఉన్యానమ్మా!!!
On Saturday, I don't eat rice. This is my regular dish on every Saturday. I'll call it as "Dhaliyaaki Kichidi"
>>రేపు గాజరగడ్డ ఇగురు చూద్దాం ఎలా చెయ్యలో.
meeru ilaa promise chesi marchipotaara? memu oorukomu anthe !
naalrolu fridge lo upmaa naa ? aayana paristhithi ilaa unte, meerentandee sravya gaaru, party, enjoy antaaru ?
ilaakkadu gaanee, varoggaaniki, vaaroggem, kalisochina time, rojuko vanta fresh gaa sesi, ikkada post eyyaraadu ? mee peru cheppukuni memu party seskuntaam ?
:):)
సమయాభావం నాయనా!!
ఓ వైపు వంట తంటా
సెంబు సేట
కోళ్ళు మేకలు
ఆకళ్ళు రోకళ్ళు
మూలమూలల దోపలు
ఎంగిలి పళ్ళేలపై ఈగలు
ఇంకోవైపు రోంత ఒంటరితనం
మరోవైపు సర్వర్లు సెత్త సెదారం
ఇంతలో పెళ్ళాం పిల్లలు
ఫోను కాల్స్
అంతలో ఎస్సరైజు
ఏటి సామాన్యమనుకున్నావేటి!!!
hahahaha. vaammo ! kallu tirigettu reply ichchesaaru mee 'busy'ness gurinchi.
దోపలు ante entandee ? idokkate artham kaalaa ?
annattu meeru manthena gaari follower enaa ? aada edo blog lo parotha ante, meeru manchidi kaadu annadi meerokkare ! :-)
aithe,ganaka yoga kooda follow kandi.meeku tirugu undadu. memu 20 yrs nunchi bobbatlu kooda godhuma pinditone cheskune vallam(ee manthena gaaru raaka mundu nunchee, maida maa intlo ban).
నేను మంతెన గారి ఫాలోయర్ ని కాదు.
మైదా అనేది రిఫైన్డ్ అని, అది మంచిది కాదని హెక్డో షదివాను.
దోపలు కాదు, తప్పు తప్పు, దోమలు...
ఇలా సదూకోవాలి-
ఓ వైపు వంటా తంటా
సెంబు సేట
కోళ్ళు మేకలు
ఆకళ్ళు రోకళ్ళు
మూలమూలల దోమలు
ఎంగిలి పళ్ళేలపై ఈగలు
ఇంకోవైపు రోంత ఒంటరితనం
మరోవైపు సర్వర్లు సెత్త సెదారం
ఇంతలో పెళ్ళాం పిల్లలు
ఫోను కాల్స్
అంతలో ఎస్సరైజు
excellent blog. Really good to know your popularity.
You can review my blog
Visalakshi Vantalu
Post a Comment