Wednesday, July 21, 2010

రాత్రి భోజనం

ఇవ్వాళ్టి నా రాత్రి భోజనం ఇదీ -



రాగి సంకటిలో ముతక బియ్యం. ముతకబియ్యం అంటే ఒంటిపట్టు బియ్యం అన్నమాట, దీన్నే దంపుడు బియ్యం అనుకోవచ్చు.
రాం+మునక్కాయ కూర
కొబ్బరి పచ్చడి
ఉల్స్
ఉప్పుమిరగాయలు ఇటైపు
సివరాకరికి మజ్జిగ్స్

Tuesday, July 6, 2010

ఈనాడులో *నలభీమ*

నలభీమ బ్లాక్కి *మనుసులోమాట* సుజాత గారు *ఈనాడు* దినపత్రిక *ఈతరం* లోని *బ్లాగోగులు* శీర్షికలో స్థానం కల్పించారు.
*పేపర్లో పెద్దచ్చరాల్లో వచ్చేంత అర్హత* నా రాతలకు [వంటలకు] ఉందా అనే ప్రశ్న ఉదయించింది  నా మనసులో. ఈనాడు వారి శీర్షిక స్థలం మరియూ సుజాత గారి సమయం వృధా అయ్యిందేమో అని నా అనుకోలు. వంట బ్లాగుకన్నా మంచి బ్లాగులు చాలానే ఉన్నాయి. వాటి గురించి రాసుంటే నలుగురికీ నాలుగు మంచి మాటలు తెలుసుండేవని నే అనుకుంటా.
ఏమైనా, వారు సమయాన్ని కేటాయించి సమాచారం సేకరించినందుకూ, ఈనాడు సహృదయతో స్థలం కేటాయించి ప్రచురించినందుకూ కృతజ్ఞతలు తెలియజేస్కుంటున్నాను.
ఇలా వార్తాపత్రికల్లో రావటం ఎంతో ఆనందదాయకమే కాక, ఉత్సాహాన్నిచ్చే విషయం కూడా.
పేపర్లో పెద్దచ్చరాల్లో మన బ్లాగు రావటం బాధ్యతల్ని పెంచుతుంది కూడా, ఇకపై రాసేప్పుడు కూసింత వళ్ళు దెగ్గరెట్టుకుని రాయమని.


మరోమారు సుజాతగారికి ధన్యవాదాలు తెలియజేస్కుంటున్నా.

ఇంతక ముందుకూడా నే రాసే బ్లాగుల్లోని ముఖ్య బ్లాగైన *నాన్న* గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నా దృష్టిలో ఇలా పేపర్లో పడటం నా బ్లాగుకి "ఓ గుర్తింపు" ఐనా నాకేమి పెద్ద ఎఛీవ్మెంట్ లా అనిపించలేదు.