Wednesday, June 23, 2021

పుదీనా పెరుగుపచ్చడి

 
మొన్నోరోజున గృహమంత్రి గారు బిర్యానీ చేసిబాసూ నాకు పనుందీరైతా చేయగలవా అన్ని అడిగినారు.
అవకాశాన్ని వదులుకోటం మన రగతంలోనే లేదుగా - అల్లాక్కానీ అనేసిఆలోచించటం మొదలెట్టాను కిటికీ దగ్గర నిల్చుని.
బిర్యానిలోకి రుచిగా ఉండే పెరుగుపచ్చడి ఏవిటీ అనిదొడ్లో ఆకుపచ్చగాపెరిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న పుదినా పొద కనిపించిందిబుఱ్ఱలో బుడ్డీ వెలిగింది.
పుదీనా పెరుగు పచ్చడి చేద్దాం అని నడుం బిగించాను.
దోశెడు సుబ్బరంగా కడిగిన పుదీనా ఆకులు
చారెడు కొత్తిమీర ఆకులు
నాలుగు మిఱగాయలు
పావు ఉల్లిగడ్డ
రెండు వెల్లుల్లి రెబ్బలు
చిటికెడు ఉప్పు 
రోట్లో వేసి మెత్తగా నూరి
అరలీటరు పెరుగు తీసుకుని
కవ్వంతో చిలికి
అందులో అర ఉల్లిపాయ చిన్న ముక్కల్గా తరిగి వేసి
కొంచెం అల్లం తరిగేసి
రోట్లో నూరిన పేస్టు వేసి
తగినంత ఉప్పు కలుపుకుని
లాగించటమే 
పెరుగుని ఇలాకూడా చేస్కోవచ్చు
తగినంత పెరుగుని వడగట్టే గుడ్డలో వేసి గాట్టిగా మూటకట్టి  గంట సేపు గిన్నెలోకి వేళాడగట్టి పెడితే పెరుగులో నీళ్ళుడ్రైన్ అవుతాయి పెరుగుని పచ్చడిలోకి వాడితే బాగుంటుందని కొందరంటారు.



Tuesday, June 23, 2020

దొండకాయ వేపుడు

పోయినేడు అనుకుంటా, భారతీయులు అందునా ముఖ్యంగా తెల్గులు అందరూ కలిసి *మొక్కలు ఇచ్చి పుచ్చుకొనుట* అనే కార్యక్రమం జరిపారు.
ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంలా తోచింది నాకు. మా ఊరిని 4 ప్రాంతాలుగా విభజించి ప్రాంతాలవారిగా ఇచ్చిపుచ్చుకునే వేదిక ఏర్పాటు చేశారు.
మీ దగ్గర ఉన్న మొక్కల్లో మీరేం ఇస్తారు, మీరేంపుచ్చుకుంటారు ఒక లిస్ట్ రాసి నిర్వాహకులకు ఇవ్వాలి.
ఆప్రకారంగా మీ పేరు పిలిచినప్పుడు వెళ్ళి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం.

ఈ చేతుల మార్పులో మాకు వచ్చిన మొక్క దొండ.

తెచ్చి ఒక బెడ్ లో నాటినాము. పాపం పెరిగి పెద్దదై, మూడు రోజులకి పావుకిలో కాయలిచ్చింది.

దొండ ప్రత్యేకత ఏంటంటే పూచే ప్రతి పువ్వూ కాయ అవుతుంది.

మొన్నోరోజు దొడోకి వెళ్ళి దొండ ఒక రెండు దోసిళ్ళు కోసుకొచ్చి ఇలా చేశాను.

వంటశాలని నేను ఆక్రమించేసి - దొండని నిలువునా నాలుగు నిలువులుగా కోసి
భాండీలో నూనె కాచి, అందులో కోసిన దొండలు వేసి
వేయించి, ముక్క వేగినాక రుచికి ఉప్పు కారం కొంచెం కొబ్బరిపొడి జల్లి 
వడ్డించాను.

దొండని ఆంగ్లమున ivy gourd అంటారుట
దొండలో ఎన్నో మంచి గుణాలున్నాయి. కొన్ని చేటూలూ ఉన్నాయి.
దొండలోని మంచి గుణాలు:
మధుమేహానికి మంచిది
అరుగుదలకు మంచిది
చర్మ సంబంధ వ్యాధులకు, ఎక్జిమా/సొరియాసిస్, మంచిది
వాపులకు మంచిది

అతిగా తినటం వల్ల మందబుద్ధులౌతారని చిన్నప్పుడు విన్నా! ఎంతవరకు నిజమో తెలియదు.

https://www.webmd.com/vitamins/ai/ingredientmono-1104/ivy-gourd

Wednesday, October 31, 2018

గోధుమ/వరి లేని భోజనం

గోధుమ/వరి లేని భోజనం

ఈ మధ్య గోధుమలు/వరి లేని భోజనం తింటం మొదలుపెట్టాను.

అనగానేమి అని బుర్రగోక్కోటం వేస్టు.

గోధుమ ఉత్పత్తులు, వరి ఉత్పత్తులు అనగా - బ్రెడ్డు రొట్టెలు గట్ర, బియ్యపన్నం గట్ర లేకుండ లాగించటం.

ఎలాగెలాగా అనుకోవచ్చు తప్పు లేదు.

మధ్యాహ్నం భోజనానికి క్విన్వా/మొలకెత్తిన సజ్జలు/జొన్నలు/రాగి/సామలు/కొర్రలు
రాత్రిపూట ఆకులు అలములు రాగిజావ లేక తోఫు.

Wednesday, August 1, 2018

సొరకాయ కూర

మనసంతా చికాకుగా ఉంది
దొడ్లోకి వెళ్ళాను
సొరకాయ కనిపించింది తీగకి
కోసుకొచ్చాను
జానెడు ముక్కకి తొక్కతీసి
తాలింపులో సొరకాయ ముక్కలేసి మూత పెట్టి
ఇంకో పొయ్యిమీద ఎసరుపోసి 
ఎసట్లో దోసెడు ఓట్లు పోసి
స్నాన *పానాదులు* కానిచ్చి
సొరకాయ ఇగురులో చిటికెడు ఉప్పేసి
ఉడికిన ఓట్లను ఆపేసి
సొరకాయ కూరని కట్టేసి
గీతాంజలి సినిమాని పెట్టుకుని చూస్తూ



Friday, July 27, 2018

దోసకాయ కూర




అలా దొడ్లోకి వెళ్ళి
దాసపాదు లోంచి మంచి దోసకాయని కోసుకుని జేబులోవేసుకుని




 అటు పక్కనున్న మిరప మొక్కలదగ్గరకెళ్ళి ఓ రెండు మిరపకాయలు కోసుకుని


 భాండి పెట్టి, నూనెపోసి తిరగమాతపెట్టి, కొంచెం పసుపువేసి, 
మిరపకాయలు కోసేసి దాంట్లో వేసి
ఇందాక కోసుకొచ్చిన దోసకాయని ముక్కలుకోసేసి దాంట్లో వేసి కొంచెం ఉప్పు జల్లి మూతపెట్టి ముక్క మెత్తబడగానే దింపేసి కుమ్మటమే!

Friday, June 1, 2018

వడియాలు


మా చిన్నప్పుడు ఎండ్లకాలంలో కూరగాయలు రావు కాబట్టి, వాట్ని ఎండబెట్టి దాచిపెట్టుకునేవారు. వాటిని వరుగులు అనేవారనుకుంటా. అమెరికా లాంటి దేశాల్లో ఫ్రోజన్ ఫుడ్ లభిస్తుందనుకోండి ఏ సీజనులోనైనా. ఓ రకంగా వరుగు అనే విధానం అంతరించినట్టేనేమో.

కాస్తో కూస్తో కమర్షియల్ స్థాయిలోనైనా బతికున్నది వడియం.
ఈరోజు మేము సగ్గుబియ్యపు వడియాలు పెట్టుకున్నాం.


Tuesday, November 15, 2016

కారపన్నం

అంటే ఏంటి అనడక్కు

చద్దన్నం డేగిషా నిండా ఉంటే ఏంజెయ్యాల్నా అని అలోచిస్తాకూకోకుండగ

తిరగమోత బెట్టి
సన్నంగ మిరగాలు తరిగేసి
అందులో పసుపు కుమ్మి
సన్నంగా నాజూక్కా తరిగిన ఉల్లిగడ్డ కుమ్మి
బాగా ఏపించి
కొరివికారమో సింతకాయపచ్చడో గోంగూర పచ్చడో కావాల్సినం కుమ్మి
అన్నం పొడిపొడి కలిపి
కుమ్ముకోటమే