బ్రస్సెల్ స్ప్రౌట్ చూట్టానికి చిన్న కోసుగడ్డలాగా ఉంటుంది. కోసుగడ్డ అంటే క్యాబేజి. ఇది కోసుగడ్డ కుటుంబానికి చెందిందే.
వికీవిక్కేశ్వరరావు గారు ఇలా చెప్పుకొచ్చారు-
The Brussels sprout is a member of the Gemmifera Group of cabbages (Brassica oleracea), grown for its edible buds.
The leafy green vegetables are
typically 2.5–4 cm (0.98–1.6 in) in diameter and look like miniature
cabbages. The Brussels sprout has long been popular in Brussels, Belgium, and may have originated and gained its name there.[1]
Nutrients, phytochemicals and research[edit]
Cooking and preparation[edit]
Consuming Brussels sprouts in excess may not be suitable for patients taking anticoagulants since they contain vitamin K, a blood-clotting factor. In one such reported incident, eating too many Brussels sprouts may have countered blood-thinning therapy.[12]
The
most common method of preparing Brussels sprouts for cooking begins
with cutting the buds off the stalk. Any surplus stem is cut away, and
any loose surface leaves are peeled and discarded. Once cut and cleaned,
the buds are typically cooked by boiling, steaming, stir frying, grilling, or roasting.
To ensure even cooking throughout, buds of a similar size are usually
chosen. Some cooks will make a single cut or a cross in the center of
the stem to aid the penetration of heat. Brussels sprouts can be pickled
as an alternative to cooking.
Overcooking will render the buds gray and soft, and they then develop a strong flavour and odour that some dislike.[7] The odour is associated with the glucosinolatesinigrin,
an organic compound that contains sulfur: hence the strong smell. For
taste, roasting Brussels sprouts is a common way to cook them to bring
out flavour.[13] Common
toppings or additions for Brussels sprouts include Parmesan cheese and
butter, balsamic vinegar, apple cider vinegar, bacon, pistachios, pine
nuts, mustard, brown sugar, and pepper. Another popular way of cooking
Brussels sprouts is to sauté them.
సరే ఇవన్నీ పక్కనపెడితే!
బ్రస్సెల్ స్ప్రౌట్ కాస్త ఘాటుగా ఉంటుంది. దిన్ని కాస్త వేయిస్తే, భలే రుచిగా ఉంటుంది. అంతేగాక ఆరోగ్యానికీ మంచిది.
మొన్నోరోజు ఇలా ప్రయోగంచేసినాను
బ్రస్సెల్ స్ప్రౌట్స్, రామ్ములక్కాయ, కోసుగడ్డ, బ్రొకొలి, గాజరగడ్డ, స్నిప్ పీస్ వేసి కూర చేసినా
1. బ్రస్సెల్ స్ప్రౌట్ ని నిలువుగా రెండుముక్కలు చేసినాను
2. ఉల్లిగడ్డని సనగా తరిగినాను
3. ఓ రెండు మిరగాయల్ని సన్నగా తరిగినాను
4. కోసుగడ్డని సన్నగా తరిగినాను
5. బ్రోకొలిని సన్నగా కాదు నున్నగా కాదు, పువ్వుల్ని విడగొట్టినాను
6. ఒక పావలా కాసం అల్లం సన్నగా..
7. ఓ అరడజను వెల్లుల్స్ పొట్టుతీసి ..
విధానం
1. భాండి పెట్టుడు
2. రెండు సెంచాలు నూనె వేసుడు
3. బ్రస్సెల్ స్ప్రౌట్స్ ని బోర్లించుడు
4. బాగా వేగినాక అందులో వెల్లుల్లి మిరగాయలు వేసి వేయించుడు
5. దానిమీద లేయర్స్ మొట్టమొదట ఉల్లి
6. కోసుగడ్డ
7. గాజరగడ్డ
8. స్నిప్ పీస్
9. బ్రొకొలి
అలా పేర్చి...సివరాకర్న ప్రెష్షుగా రామ్ములక్కాయలు తరిగి పైన పేర్చి, సన్నని మంట మీద మూతపెట్టుడు...
ఒక్క ఐదు నిమిషాలు చూసుడు ఉప్పు జల్లి నిమ్మకాయపిండి స్టీల్ కట్ ఓట్స్ తో కుమ్ముడు.
రెండు డబ్బాల హోల్ పెసరపప్పుకి ఓ పిరికెడు బియ్యం పోసి ఓ ఆరు గంటలో ఎందిగంటలో నానబెట్టి నీళ్ళు ఒంపేసి వెట్ గ్రైండర్లో *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును* చేసేప్పుడే ఓ పదో ఇరవైయ్యో పచ్చిమిర్చి వేసి రుచికి ఉప్పు కలిపి *పెసర అట్టుకి* క్కావాల్సిన పిండిని సిద్ధం చేస్కుని మరోవైపు ఓ ఉల్లిపాయని సన్నగా తరిగి, ఓ పావలా బిళ్ళంత అల్లం [పావలా బిళ్ళంత అల్లం కావాల్నంటే కార్ అమ్ముకోవాల్సిన్ స్థితి, అర్థం చేస్కోగలను] సన్నగా తరిగి ఓ మిరపకాయ సన్నగా తరిగి పెనం పొయ్యిమీద పెట్టి వెలిగించి వేడెక్కగానే ఓ స్పూన్ నూనె వేసి తరుక్కున్న ఉల్స్ మిరపకాయ్ అల్లం ఓ సారి వేయించి పక్కనపెట్టి, పెనాన్ని సుబ్బరంగా ఓ ఉల్లిపాయముక్కతో తుడిచి అట్లపిండిని ఓ చిప్పగంటెతోతీసి పెనంమీద వేసి అట్టుపోసి అందులో ఓ గుప్పెడు ఇందాక వేయించిన ఉల్లిమిరపఅల్లం ముక్కలు వేసి అట్టు తీసి పళ్ళెంలోకి నెట్టి.................కుమ్మేలోపు పొయ్యి కట్టేయి లేకపోతే కాలుద్ది
పచ్చపచ్చగా భలే ఉందా చూట్టానికీ? మరే! మనం చేస్తే అంతేగా మరి.
ప్రొసీజర్ సో సింపులు.
౧. ముందు సగం గుండిక్కి నీళ్ళు పోయిమీద పడేయ్.
౨. నీళ్ళు మసలంగనే అందులో బల్గర్ పడేయ్.
ఎన్ని నీళ్ళకి ఎంత బల్గర్ అనేగా నీ ప్రశ్న. ఒక కప్పు బల్గర్కి రెండు కప్పుల నీళ్ళు. ఇక కుమ్ముకో
నీళ్ళలో బల్గర్ పడేశావా..ఇక ఉడకనీ
ఇంతలో
౩. రకరకాల బెంగుళూరు మిరపకాయలు అనగా పెప్పర్స్ తరుక్కో, ఒక టిన్ను బ్లాక్ బీన్స్ పక్కన పెట్టుకో. నాకు నానపెట్టే సమయంలేక టిన్ను వాడినాను. లేకపోతే నానబెట్టినవి ఓ మారు ఉడకపెట్టి వాడుకోవచ్చు
౪. సరిపోయినన్ని బీన్స్ తరుక్కో
సరిపోయినన్ని అంటే? ఓ పది
౫. ఓ సగం ఉల్ల్స్ సన్నగా నిలువుగా తరుక్కో, ఓ నాలుగు వెల్లుల్లి తొక్కతీసి పక్కనపెట్టు
౬. ఓ అరడజను మిర్చి సన్నగా పొడుగ్గా తరుక్కో
౭. రుచికి కొత్తిమీర దూసి కడిగి పక్కన పెట్టుకో, ఒక నిమ్మకాయ కోసి పక్కన పెట్టుకో
౮. భాండీ పెట్టు, పొయ్యి ఎలిగించి.
భాండీ ఎక్కడ పెట్టాలనేగా నీ ప్రశ్న? అలా పక్కకి వెళ్దాంపదా! వద్దా? ఐతే పొయ్యిమీద పెట్టి వెలిగించు మరి
కావాల్సినవి
గాజరగడ్డ, సెలెరీ, బ్రొక్కోలి, బోక్ చోయ్, ఆనియన్, బెంగళూరు మిరయాగలు రంగురంగులవి.
ఎన్నెన్నీ? తలా ఒకటి అనుకో.
ఇంకా నువ్వులు, నేనులు, అల్లము, బెల్లము, సున్నము, వెల్లుల్లి.
ఇంకా ఓ డేగిశా, ఓ భాండీ, ఓ ల్యాప్ టాపు, అగ్గిపెట్టె, నూనె, కారం ఉప్పు పసుపు తెలుపు నలుపు
ముంఫుగా గాజరగడ్డ, సెలెరీలనీ నచ్చిన ఇధంగా తరుక్కోవాల. బ్రొక్కోలి పూవులుగా కటింగు సేస్కోవాల.
డేగిశాలో నీళ్ళు నిండిగా పోసి, తెర్లుతున్న నీళ్ళల్లో గాజరగడ్డ సెలెరీ బ్రొక్కోలి వేసి ఒక్క రెండు నిమిషాలు కాంగనే దించేసి వడగట్టి ఉడికిన ముక్కలు పక్కన సిబ్బిరేకులో పెట్టుకోవాల
ఇప్పుడు, బెంగళూరు మిరగాయలు, ఉల్స్, బోక్ చోయ్ సన్నంగా తరుక్కోవాల. అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పెట్టుకోవాల. నాలుక్కు వెల్లుల్లి సరిపోను అల్లం చాలు.
భాండీలో పొయ్యిమీన పెట్టి ఓ రెండు సెంచాలు నూనె ఏసి కాగంగనే జిలకర ఏసి చిట్పట్ అనంగనే ఉల్స్, బెంగళూరు మిరగాయలు వేసి వేపాల, ఏగినాక రుచికి ఉప్పుస్, కారమ్స్, అల్లంవెల్లుల్లి ముద్దంగళు వేసి ఓపాలి కలియతిప్పి అందులో ఉడ్కబెట్టిన ముక్కలు వెయ్యాల. ఏసినంక *స్టిర్ ఫ్రై సాస్* కొంచెం వేస్తే బాగుణ్ణిద్ది. ఉంటే ఏసి ఓ చిటికెడు తెల్ల నువ్వులు జల్లాల.
ఓ ఐదునిమిషాలు హై మీద పెట్టి బాగా ఏపాల
ఏగినాక పొయ్యి కట్టెసి కుమ్మాల
1. carrot,celery,broccoli put in boiling water for 10min
then seperate them, keep them aside.
2. cut onion,capsicum,bok choy
fry jeera in oil
add onion,capsicum,bokchoy
3. then add salt,chilli powder,garlic-ginger paste
4. add boiled veggies and stir fry sauce, sprinkle sesame seeds
5. fry 5min on high flame
కావాల్సినవి -
నాల్గు కాకర
ఓ రెండు చెంచాల కూరల కారప్పొడి
ఓ స్పూను పందార
ఓ రెండు స్పూన్లు
కర్వేపాకు నాలుగు ఆకులు
ఓ నాల్గు వెల్లుల్లి
తిరగమాత గింజలు
౧. కాకరకాయల్ని నీ ఇష్టం వచ్చినట్టు తరుక్కో, అనగా సన్నగా తరుక్కో అని
౨. వెల్లుల్లి తాట్స్ తీయి
౩. భాండి పొయ్యిమీదకి ఎక్కించు
౪. నూనె పొయ్
౫. నూనె వేడెక్కినాక, జీలకర ఆవాలు కుమ్ము
౬. కర్వేపాకులు కుమ్ము
౭. చిట్పట్ అన్నాక వెల్లుల్లి వేసేయ్ చెప్తా, వేగనీ
౮. ఇప్పుడు తరిగిన కాకరకాయ ముక్కలు వేసేయ్, బాగా వేగనీ, క్రిస్పీగా వచ్చిందాకా వేగనీ
౯. బాగా వేగినాక అందులో రెండు చెంచాలు కారప్పొడి వేయి, చిటికెడు పందార, సరిపోయినంత ఉప్పు వేస్కో
౧౦. బాగా కలిపి, ఓ రెండ్నిముషాలు వేయించి దింపు.
౧౧. ......................
అదన్నమాట
ఏవన్నా తేడా ఒస్తే చెప్పు, మా మేడం గార్ని కనుక్కు చెప్తా
ఈ మధ్య మాకు ఉచితంగా ఓ పత్రిక (పుత్రిక కాదులేవయ్యా బాబు) వస్తోంది. దానిపేరు దేనికిలేగానీ, కొన్ని కొన్ని మంచి మంచి అవసరమైన విషయాలు ఉన్నాయ్ అందులో. మనకి కావాల్సిన సెక్షన్లో నన్ను ఆకర్షించిన వంటకం ఇది. దీని పేరు కాలిబసీత (Calibasita)
కావాల్సినవి - 4 జుకిని[1]. ఇదేందిది అనుకోవద్దు. ఇది మన బీరకాయకి పెద్దమ్మ బామ్మర్ది అన్నగారికి చెల్లెలు వరస. ఇది దొరక్కపోతే కీరా వాడుకోవచ్చు, ఏంపర్లేదు. 2 టేబిలు స్పూల ఆలివ్ ఆయిల్. 1 ఒకమోస్తరు సైజు ఉల్స్ 1 వెల్లుల్లి రెబ్బ 3 మొక్కజొన్న కండెలు. 2 రోమా[2] రాంములక్కాయలు బాగా పండినవి. 1/2 కప్పు మొత్సరిల్ల ఛీజు లేక ఫెటా ఛీజు. అది ఇది దొరక్కపోతే పన్నీరు ముక్కలు అనుకోండి.[ఇది మాత్రం మీ ఇష్టం కావాలంటే వేస్కోవచ్చు లేకపోతే లేదు] రుచికి కోషర్[3] ఉప్పు. ఇదేందిది కోషర్ ఉప్పు అంటారా? ఇది మన ఇంట్లో వాడుకునే ఉప్పే కాకపోతే కొంచెం గండ్ల ఉప్పులా ఉంతుంది. మరియూ కోషర్ ఉప్పులో ఐయోడిన్ ఉండదు. పద్ధతి - ముందుగా జుకిని ని ఓ మాదిరిసైజు ముక్కలుగా కోసి ఓ చిల్లుల గిన్నెలో వేసి, కొంచెం ఉప్పుజల్లి పక్కనబెట్టు. ఉల్స్ ని తరుక్కో సన్నగా. వెల్లుల్ల్ని ఓ సారి కుక్కి తొక్క తీసేసి సన్నగా తరుక్కో. రాంములక్కాయ తరుక్కో సన్నగా మొక్కజొన్న కండె నుండి మొక్కజొన్న ఇత్తనాలని తీ. ఎట్టా? ఒలుస్తూ కూకుంటావా? తెల్లారుద్ది. కత్తిపెట్టి ఈడజూపిచ్చినట్టుగా చెయ్యి
ఒక భాండీ తీస్కుని ఆలివ్ ఆఉఇల్ వేసి, పోసి కాదు, ఓ రెండు చెంచాలు వేసి, వేడెక్కంగనే ఉల్స్, వెల్లుల్లి వెసి మూణ్ణిమిషాలు ఏపు. పైన తరుక్కున్న జుచ్చిని, మొక్కజొన్నని ఎయ్యి, 6-7 నిమిషాలు ఏపు. తరుక్కున్న రాంములక్కాయలు వేసి 2-3 నిమిషాలు ఏగనీ. [గ్రేటెడ్ ఛీజ్ జల్లు] దింపేసి రొట్టెతోనో గుడ్డుతోచేసిన అట్టుతోనో లాగించు.