Thursday, August 13, 2009

కాలిబసీత

ఈ మధ్య మాకు ఉచితంగా ఓ పత్రిక (పుత్రిక కాదులేవయ్యా బాబు) వస్తోంది. దానిపేరు దేనికిలేగానీ, కొన్ని కొన్ని మంచి మంచి అవసరమైన విషయాలు ఉన్నాయ్ అందులో. మనకి కావాల్సిన సెక్షన్లో నన్ను ఆకర్షించిన వంటకం ఇది. దీని పేరు కాలిబసీత (Calibasita)

కావాల్సినవి -
4 జుకిని[1]. ఇదేందిది అనుకోవద్దు. ఇది మన బీరకాయకి పెద్దమ్మ బామ్మర్ది అన్నగారికి చెల్లెలు వరస. ఇది దొరక్కపోతే కీరా వాడుకోవచ్చు, ఏంపర్లేదు.
2 టేబిలు స్పూల ఆలివ్ ఆయిల్.
1 ఒకమోస్తరు సైజు ఉల్స్
1 వెల్లుల్లి రెబ్బ
3 మొక్కజొన్న కండెలు.
2 రోమా[2] రాంములక్కాయలు బాగా పండినవి.
1/2 కప్పు మొత్సరిల్ల ఛీజు లేక ఫెటా ఛీజు. అది ఇది దొరక్కపోతే పన్నీరు ముక్కలు అనుకోండి.[ఇది మాత్రం మీ ఇష్టం కావాలంటే వేస్కోవచ్చు లేకపోతే లేదు]
రుచికి కోషర్[3] ఉప్పు.
ఇదేందిది కోషర్ ఉప్పు అంటారా?
ఇది మన ఇంట్లో వాడుకునే ఉప్పే కాకపోతే కొంచెం గండ్ల ఉప్పులా ఉంతుంది. మరియూ కోషర్ ఉప్పులో ఐయోడిన్ ఉండదు.
పద్ధతి -
ముందుగా జుకిని ని ఓ మాదిరిసైజు ముక్కలుగా కోసి ఓ చిల్లుల గిన్నెలో వేసి, కొంచెం ఉప్పుజల్లి పక్కనబెట్టు.
ఉల్స్ ని తరుక్కో సన్నగా.
వెల్లుల్ల్ని ఓ సారి కుక్కి తొక్క తీసేసి సన్నగా తరుక్కో.
రాంములక్కాయ తరుక్కో సన్నగా
మొక్కజొన్న కండె నుండి మొక్కజొన్న ఇత్తనాలని తీ. ఎట్టా? ఒలుస్తూ కూకుంటావా? తెల్లారుద్ది. కత్తిపెట్టి ఈడజూపిచ్చినట్టుగా చెయ్యి

ఒక భాండీ తీస్కుని ఆలివ్ ఆఉఇల్ వేసి, పోసి కాదు, ఓ రెండు చెంచాలు వేసి, వేడెక్కంగనే ఉల్స్, వెల్లుల్లి వెసి మూణ్ణిమిషాలు ఏపు.
పైన తరుక్కున్న జుచ్చిని, మొక్కజొన్నని ఎయ్యి, 6-7 నిమిషాలు ఏపు.
తరుక్కున్న రాంములక్కాయలు వేసి 2-3 నిమిషాలు ఏగనీ.
[గ్రేటెడ్ ఛీజ్ జల్లు]
దింపేసి రొట్టెతోనో గుడ్డుతోచేసిన అట్టుతోనో లాగించు.

నోట్ -
1. జుకిని http://en.wikipedia.org/wiki/Zucchini
2. రోమా రాంములక్కాయలు http://en.wikipedia.org/wiki/Roma_tomato
3. కోషర్ ఉప్పు http://en.wikipedia.org/wiki/Kosher_salt

Nutrition Facts
* Calories 143
* Total Fat 7g
* Saturated Fat 1g
* Cholesterol NA
* Sodium 602mg
* Total Carbohydrates 21g
* Dietary Fiber 4g
* Protein 4g

11 comments:

నేస్తం said...

టమాటలు ఎప్పుడు వేయాలో రాయనే లేదు,,జుకినీ మీద జల్లిన ఉప్పు సరిపోతుందా లేక మళ్ళి ఉప్పు జల్లాలా లాస్ట్ లో :)

sunita said...

baagundi!!!naenoo Try chaestaa.

మురళి said...

కొలెస్ట్రాల్ ఫ్రీ అన్నమాట.. బాగుంది చూడ్డానికి :-)

సుభద్ర said...

chustene tneyalipistundi,tappaka try chestaa!thanks.

Sravya Vattikuti said...

చూడటానికి మాత్రం సూపర్ గా ఉంది , సగం ingradiants మర్చిపోయారు :(. కాని అదేమి పేరు కలిబసీత ?

భాస్కర్ రామరాజు said...

నేస్తం - ఉప్పు సివరాకరికి ఇంకా కావాలి అనిపిస్తే వేకోడమే...టమాటాలు!! అవును మరసితిని!! ఇప్పుడు కలిపితిని..
సునీత గారు - :):)
మురళి భాయ్ - ఇది మీకోసమే.
సుభద్ర - తప్పక ట్రై చేయండి. ఓ ఫోటో పంపండి మాక్కూడా
శ్రావ్యా - సగం ingredients మర్చిపోయారు :(.
అల్టిమేట్లీ - నిజమే. సగం కాదులే కానీ టమాటా మర్సిపొయ్యా.
కాలబసితాస్ అనేది లాటిన్ పదం. కాలబసిత అంటే స్క్వాష్ అని అర్ధం. స్క్వాస్ అంటే గుమ్మడికాయ అనుకోవచ్చు.
అలావచ్చింది ఆ పేరు.

భాస్కర రామి రెడ్డి said...

"కాలిబసీత" మీరు పెట్టిన పేరా? లేక మీ బుడుగు పెట్టిన పేరా?

ఉమాశంకర్ said...

(సరదాగా)
నాకు తెలీని ఈ "సీత" ఎవరో అనుకుంటూ ఉండగా, చప్పున ఇంకో ఆలోచన వచ్చింది. మన భాస్కర్ గారికి పదాల్ని అడ్డంగా, ఆ తరువాత నిలువుగా నరికి, ఆనక మధ్యలోకి మడతెట్టి, అంతటితో ఆగక గ్రైండరులో వేసి రుబ్బటం అలవాటేగా, అలాంటిదిదేదో అయి ఉంటుంది అనుకున్నా..పోస్టు లోకి వెళ్ళి చూస్తే కాదు :) ..

(భాస్కర్ గారు ,మడ్పడిల్ , గుర్తుందాండీ? :) )

భాస్కర్ రామరాజు said...

:):)
తస్సదియ్యా!!!
Search in google for calibasita.
This specific dish is from this link
http://www.womansday.com/Recipes/Jill-s-Favorite-Calibasita-Recipe

చందా said...

చాలా బాగుంది వంటకం సింపుల్గా ! ఎప్పటిలాగే సరదాగా బాగా రాసారు.బొమ్మ ఎత్తేసినట్టున్నారు కదా సోర్సు సైట్ నుంచి, acknolwedge చేయకపోతే, కేసేట్టేస్తారేమో చూసుకోండి మరి ! ( సరదాగా)
ఇంతకీ పండు మిరప్పచ్చడి, పప్పు లేని ఆకుకూరలు తినే భాగ్యం కలిగించి పుణ్యం కట్టుకోండి సార్.

నేను చేసినవి నేనే తినలేకపోతున్నా ఆకు కూరలు ! :-(

lakshmi sravanthi udali said...

నా బ్లాగుని కూడా ఒకసారి చూడండి నాన్న నెను మీకు పోటీ రాలెనులెండి
అంతే కాదు మీ సలహాలు, సూచనలు నాకు ఇవ్వగలరు
మీ నలభీమ పాకం చాలా బాగుంది
http://sravanthivantaillu.blogspot.com/