మీలో ఎందరికి గుర్తూ? చిన్నప్పుడు రాంమ్ములక్కాయని పందారలో నంచుకుని తింటం! రామ్ములక్కాయ మరీ అంత పండూకాకుండ మరీ పచ్చీ కాకుండగా దోరగా పండింది సిన్న సిన్న ముక్కలుగ కోసేసి పందారజల్లుకు లాగిస్తే ఉంమ్మ.
అట్టానే పందార బదులు ఉప్పు కారం జల్లుకుని లాగించినా ఓకే!!
ఈడసూడండా!! రామ్ములక్కాయతోని మూడ్రకాలంట.
1. నిటారు రకం
దోర రామ్ములక్కాయని అడ్డంగా ముక్కలు జేస్కోండా (కింద జూపెట్టిన బొమ్మలో ఆడు మూడ్రకాల రామ్ములక్కాయల్ని నించోబెట్టాడు అయి - red, yellow, heirloom. heirloom అంటే నాటు రకం అని అనుకున్టా!). ఒకదానిమీన ఇంకోటన్ట ఎట్టండా. అర్గ్యూలా ఆకులంటా!! మనేందెలుసుద్దీ?? కొత్తిమీర నాలుగాకులు, పుదీనా నాలుగాకులు సమ్మగా కడిగేసి సన్నగా తరిగేసి పైన జల్లండా. ఓ రెండు కిట్న తులసాకులంట కుమ్మండా. ఓ రెండు సెంచాలు ఆలివ్ ఆయిలంట కుమ్మరించండా. కొంచెం కారం లేక మాడ్చి నలగొట్టిన మిరాయలు, కొంచెం ఉప్పు జల్లండా
లాగించండా. ఇది జెప్పాల్సిన పనిల్యా!
2. రోస్టు
ఓ నాలుగు ద్రాచ్చా రామ్ములక్కాయలు అట్టాగే ఆలివ్ నూనెలోనంటా, ఓ చిటాకు ఉప్పుజల్లి ఏపించండా. ఓ బేకింగు పేనా లోకి మార్చేసి, ఓవెన్ లో 425 F ఏడిమీన 7 - 10 నిమిషాలు రామ్ములక్కాయ తొక్క పగిలిపొయేంతవరకూ రోశ్టు జేయాలంట. అయినక ఓవెన్ని ఆపేసి బయటకి లాగి కిట్న తులసి లేకపోతే రెండు పుదీనా ఆకులేసి కుమ్మటమేనంట.
3. సరసా ఛీఛీ సల్సా అంట
ఓ ఐదు ఇదేదో రామ్ములక్కాయ సిన్న సిన్న ముక్కలుగా తరిగేసి, ఓ ఎర్ర ఉల్ల్స్ తరుక్కుని, పావుకప్పు సొంపు ఛీఛీ, నీ ఎంకమ్మ, సోంపు, ఓ అరడజను మిరగాయల్ని తరుక్కుని, ఓ బల్ల సెంచా (టేబిలు స్పూను) ఆలివ్ నూనె, ఓ బల్లసెంచా కమలా రసం ఓ పెద్ద బొచ్చలో ఏసి కలిపేసి ఉప్పు, మాడగొట్టి నలగ్గొట్టిన మిరియాలు ఏసి లాగించమంటాడు.
ఈ పుటోబు యాణ్ణుంచో నూక్కొచ్చి ఏడబెడుతన్నా. కాపీరైటు కాపీలెప్టు గోలమనకెందుకూ!!
[Photo is pointing to womansday.com. If any objection for linking to this photo, please let me know. I will remove it.]
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
పప్పుచారులో చింతపండుబదులు రామ్ములగ కాయలు వాడవచ్చు; ఈమధ్య చింతపండు అంత ఆరొగ్యకరమైనది రాటల్లేదంటున్నారు
గ్లోబల్ రెసిపి భలే localize చేసారు :)
సిన్న ముక్కలుగ కోసేసి పందారజల్లుకు లాగిస్తే ఉంమ్మ>>
ఈ combination మొదటి సారి వింటున్నా .
అట్టానే పందార బదులు ఉప్పు కారం జల్లుకుని లాగించి>>
ఇది కాదు కాని చిన్నప్పుడు ఊరగాయ కోసం ఎండలో పెట్టెవారు టమోటా , మామిడి కాయ ముక్కలు అవి మాత్రం బతకనిచ్చేవాళ్ళం కాదు , ఇప్పుడు తలచుకున్నా నోరూరుతుంది :(
Interesting!!!
salsa lo pickled jalapeno peppers ni chinna mukkaluga tharigi, kalipi choodandi eesaari :)
రాణీగారూ నమస్తే!! బహుకాల దర్శనం!!
తప్పకుండా!!
గద్దేశ్వరూప్ గారూ - రామ్ములకాయలు అంత పులుప్వి కూడా రావట్లేదండీ.
శ్రావ్యా - :):)
సునీత గారు - ప్రయత్నించండి ఇలా!!
Post a Comment