Tuesday, January 15, 2013

రంగు రంగుల కూర ముక్కల కూర


కావాల్సినవి
గాజరగడ్డ, సెలెరీ, బ్రొక్కోలి, బోక్ చోయ్, ఆనియన్, బెంగళూరు మిరయాగలు రంగురంగులవి.
ఎన్నెన్నీ? తలా ఒకటి అనుకో.
ఇంకా నువ్వులు, నేనులు, అల్లము, బెల్లము, సున్నము, వెల్లుల్లి.
ఇంకా ఓ డేగిశా, ఓ భాండీ, ఓ ల్యాప్ టాపు, అగ్గిపెట్టె, నూనె, కారం ఉప్పు పసుపు తెలుపు నలుపు
ముంఫుగా గాజరగడ్డ, సెలెరీలనీ నచ్చిన ఇధంగా తరుక్కోవాల. బ్రొక్కోలి పూవులుగా కటింగు సేస్కోవాల.
డేగిశాలో నీళ్ళు నిండిగా పోసి, తెర్లుతున్న నీళ్ళల్లో గాజరగడ్డ సెలెరీ బ్రొక్కోలి వేసి ఒక్క రెండు నిమిషాలు కాంగనే దించేసి వడగట్టి ఉడికిన ముక్కలు పక్కన సిబ్బిరేకులో పెట్టుకోవాల
ఇప్పుడు, బెంగళూరు మిరగాయలు, ఉల్స్, బోక్ చోయ్ సన్నంగా తరుక్కోవాల. అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పెట్టుకోవాల. నాలుక్కు వెల్లుల్లి సరిపోను అల్లం చాలు.
భాండీలో పొయ్యిమీన పెట్టి ఓ రెండు సెంచాలు నూనె ఏసి కాగంగనే జిలకర ఏసి చిట్పట్ అనంగనే ఉల్స్, బెంగళూరు మిరగాయలు వేసి వేపాల, ఏగినాక రుచికి ఉప్పుస్, కారమ్స్, అల్లంవెల్లుల్లి ముద్దంగళు వేసి ఓపాలి కలియతిప్పి అందులో ఉడ్కబెట్టిన ముక్కలు వెయ్యాల. ఏసినంక *స్టిర్ ఫ్రై సాస్* కొంచెం వేస్తే బాగుణ్ణిద్ది. ఉంటే ఏసి ఓ చిటికెడు తెల్ల నువ్వులు జల్లాల.
ఓ ఐదునిమిషాలు హై మీద పెట్టి బాగా ఏపాల
ఏగినాక పొయ్యి కట్టెసి కుమ్మాల

1. carrot,celery,broccoli put in boiling water for 10min
then seperate them, keep them aside.
2. cut onion,capsicum,bok choy
fry jeera in oil
add onion,capsicum,bokchoy
3. then add salt,chilli powder,garlic-ginger paste
4. add boiled veggies and stir fry sauce, sprinkle sesame seeds
5. fry 5min on high flame


Wednesday, January 9, 2013

కాకరకాయ కారం

కావాల్సినవి -
నాల్గు కాకర
ఓ రెండు చెంచాల కూరల కారప్పొడి
ఓ స్పూను పందార
ఓ రెండు స్పూన్లు
కర్వేపాకు నాలుగు ఆకులు
ఓ నాల్గు వెల్లుల్లి
తిరగమాత గింజలు

౧. కాకరకాయల్ని నీ ఇష్టం వచ్చినట్టు తరుక్కో, అనగా సన్నగా తరుక్కో అని
౨. వెల్లుల్లి తాట్స్ తీయి
౩. భాండి పొయ్యిమీదకి ఎక్కించు
౪. నూనె పొయ్
౫. నూనె వేడెక్కినాక, జీలకర ఆవాలు కుమ్ము
౬. కర్వేపాకులు కుమ్ము
౭. చిట్పట్ అన్నాక వెల్లుల్లి వేసేయ్ చెప్తా, వేగనీ
౮. ఇప్పుడు తరిగిన కాకరకాయ ముక్కలు వేసేయ్, బాగా వేగనీ, క్రిస్పీగా వచ్చిందాకా వేగనీ
౯. బాగా వేగినాక అందులో రెండు చెంచాలు కారప్పొడి వేయి, చిటికెడు పందార, సరిపోయినంత ఉప్పు వేస్కో
౧౦. బాగా కలిపి, ఓ రెండ్నిముషాలు వేయించి దింపు.
౧౧. ......................
అదన్నమాట
ఏవన్నా తేడా ఒస్తే చెప్పు, మా మేడం గార్ని కనుక్కు చెప్తా

Monday, January 7, 2013

గొకమొలె/guacamole

అందరూ సేసినట్టు మనం సేస్తే మనకి అందరికీ తేడా ఏటుంటది బావా?
అహ! నువ్వే సెప్పు.
అవకాడో మంచిదంట. సరే! వలాగే!! అన్నాకదా బావా.
ఇదిగో మొట్టమొదటి సారి తింటన్నాగా బావా, కోప్పడమాక.
గొకమోలె అంట ఇదిగో మన ఇస్టైల్లో ఇట్టా జేసినా
౧. ఒక అవకాడొ
౨. సగం ఉల్లి
౩. నాలుగు పచ్చిమిరగాయలు
౪. నిమ్మ చెక్క
౫. కూసిన్ని కొత్తిమీర కాడలు

కత్తితో అవకాడోని నిలువుగా సర్రున గీయి. తొక్క పట్టుకు లాగు వచ్చేసుద్ది. నొక్కి గుజ్జు ఓ గిన్నెలోకి తీసి గింజ అవతల నూకు
ఉల్లి సన్నంగా తరుగి అందులో నూకు
మిరగాయలు సన్నంగా తరిగి అందులో ...
నిమ్మకాయ పిండు
ఉప్పు కావాల్నంటే సరిపోయినంత వేస్కో, నేనైతే వేస్కోల్యా.
ఓ సెంచాతో అంతా కలుపు
అయినంక కొత్తిమీర కడిగి సన్నంగా తరిగి పైన జల్లు

రొట్టెల్లోకి లాగించు