Wednesday, January 9, 2013

కాకరకాయ కారం

కావాల్సినవి -
నాల్గు కాకర
ఓ రెండు చెంచాల కూరల కారప్పొడి
ఓ స్పూను పందార
ఓ రెండు స్పూన్లు
కర్వేపాకు నాలుగు ఆకులు
ఓ నాల్గు వెల్లుల్లి
తిరగమాత గింజలు

౧. కాకరకాయల్ని నీ ఇష్టం వచ్చినట్టు తరుక్కో, అనగా సన్నగా తరుక్కో అని
౨. వెల్లుల్లి తాట్స్ తీయి
౩. భాండి పొయ్యిమీదకి ఎక్కించు
౪. నూనె పొయ్
౫. నూనె వేడెక్కినాక, జీలకర ఆవాలు కుమ్ము
౬. కర్వేపాకులు కుమ్ము
౭. చిట్పట్ అన్నాక వెల్లుల్లి వేసేయ్ చెప్తా, వేగనీ
౮. ఇప్పుడు తరిగిన కాకరకాయ ముక్కలు వేసేయ్, బాగా వేగనీ, క్రిస్పీగా వచ్చిందాకా వేగనీ
౯. బాగా వేగినాక అందులో రెండు చెంచాలు కారప్పొడి వేయి, చిటికెడు పందార, సరిపోయినంత ఉప్పు వేస్కో
౧౦. బాగా కలిపి, ఓ రెండ్నిముషాలు వేయించి దింపు.
౧౧. ......................
అదన్నమాట
ఏవన్నా తేడా ఒస్తే చెప్పు, మా మేడం గార్ని కనుక్కు చెప్తా

7 comments:

సుజాత వేల్పూరి said...

అద్భుతః :-)

Chandu S said...

ఫోటో బాగుంది . గోధుమ అన్నం కూడా ఎలా చెయ్యాలో చెప్పండి

పద్మ said...
This comment has been removed by the author.
పద్మ said...

పైన వస్తువుల్లోనేమో స్పూనుడు పందార అన్నారు. కింద చేసేటప్పుడేమో చిటికెడు అన్నారు. మీ చిటికె ఒక స్పూనంత పెద్దదాండి? :D

మా ఇంట్లో కాకరకాయ చేసే ఒకానొక పద్ధతి ఇదే కాబట్టి చాలా బావుంది. :)) ఫోటో మటుకు సూపర్. :)

Bhãskar Rãmarãju said...

Migataa pandaara notto veskunte sari

పద్మ said...

హిహిహి.

నాకు మహ బాగా నచ్చింది ఏంటంటే కాకరకాయ మజ్జిగ వగైరాల్లో నానబెట్టలేదు. చేదు విరగటానికని మా ఫ్రెండ్ ఒకావిడ గింజెలు తీసేసి, మజ్జిగలో నానబెట్టి బీభత్సం చేస్తుంది. అంత చేసేదానికి అసలు కాకరకాయ తినటం ఎందుకు అనిపిస్తుంది నాకైతే. కాకరకాయ లక్షణమే గింజె, చేదూనూ.

Maitri said...

ఇలా చేస్తారని నాకు తెలియదే!ఇదే మొదటిసారి వినడం. అయితే ఇవ్వాళ్ళ రాత్రికి ఇదే మా కూర. ఇంతకీ ఆఖర్న వేసిన ఆ పందార కరుగుతుందా? ఇంతకీ పంచదార చేదు విరగడానికా? మరి పులుపేదీ అవసరం లేదా?
ఫోటో మాత్రం బ్రహ్మాండం.
క్రిష్ణవేణి!