Showing posts with label ఆక్కూర. Show all posts
Showing posts with label ఆక్కూర. Show all posts

Wednesday, June 23, 2021

పుదీనా పెరుగుపచ్చడి

 
మొన్నోరోజున గృహమంత్రి గారు బిర్యానీ చేసి, బాసూ నాకు పనుందీ, రైతా చేయగలవా అన్ని అడిగినారు.
అవకాశాన్ని వదులుకోటం మన రగతంలోనే లేదుగా - అల్లాక్కానీ అనేసిఆలోచించటం మొదలెట్టాను కిటికీ దగ్గర నిల్చుని.
బిర్యానిలోకి రుచిగా ఉండే పెరుగుపచ్చడి ఏవిటీ అని. దొడ్లో ఆకుపచ్చగాపెరిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న పుదినా పొద కనిపించింది. బుఱ్ఱలో బుడ్డీ వెలిగింది.
పుదీనా పెరుగు పచ్చడి చేద్దాం అని నడుం బిగించాను.
దోశెడు సుబ్బరంగా కడిగిన పుదీనా ఆకులు
చారెడు కొత్తిమీర ఆకులు
నాలుగు మిఱగాయలు
పావు ఉల్లిగడ్డ
రెండు వెల్లుల్లి రెబ్బలు
చిటికెడు ఉప్పు 
రోట్లో వేసి మెత్తగా నూరి
అరలీటరు పెరుగు తీసుకుని
కవ్వంతో చిలికి
అందులో అర ఉల్లిపాయ చిన్న ముక్కల్గా తరిగి వేసి
కొంచెం అల్లం తరిగేసి
రోట్లో నూరిన పేస్టు వేసి
తగినంత ఉప్పు కలుపుకుని
లాగించటమే 
పెరుగుని ఇలాకూడా చేస్కోవచ్చు
తగినంత పెరుగుని వడగట్టే గుడ్డలో వేసి గాట్టిగా మూటకట్టి ఓ గంట సేపు గిన్నెలోకి వేళాడగట్టి పెడితే పెరుగులో నీళ్ళుడ్రైన్ అవుతాయి. ఆ పెరుగుని పచ్చడిలోకి వాడితే బాగుంటుందని కొందరంటారు.



Wednesday, October 31, 2018

గోధుమ/వరి లేని భోజనం

గోధుమ/వరి లేని భోజనం

ఈ మధ్య గోధుమలు/వరి లేని భోజనం తింటం మొదలుపెట్టాను.

అనగానేమి అని బుర్రగోక్కోటం వేస్టు.

గోధుమ ఉత్పత్తులు, వరి ఉత్పత్తులు అనగా - బ్రెడ్డు రొట్టెలు గట్ర, బియ్యపన్నం గట్ర లేకుండ లాగించటం.

ఎలాగెలాగా అనుకోవచ్చు తప్పు లేదు.

మధ్యాహ్నం భోజనానికి క్విన్వా/మొలకెత్తిన సజ్జలు/జొన్నలు/రాగి/సామలు/కొర్రలు
రాత్రిపూట ఆకులు అలములు రాగిజావ లేక తోఫు.

Thursday, March 10, 2016

గ్రీన్ జ్యూస్ - ఆకుపచ్చ రసాలు - రెండో రోజు

రెండోరోజు
అయిదు చెటాకులు పాలకూర
మూడు కేల్ ఆకులు
మూడు సెలరీ ముక్కలు
అర కీరా దోసకాయ
రెండు ఫుజీ ఆప్ పిళ్ అనగా యాపిలు
మిక్సీ కుమ్ము నిమ్మబద్ద పిండు
గబుక్కున మింగు 




Wednesday, March 9, 2016

గ్రీన్ జ్యూస్ - ఆకుపచ్చ రసాలు - మొదటిరోజు


రెండు కప్పులు అనాస
అయిదు కేల్ ఆకులు
౧ కీరా దోసకాయ
ఒక మిరపకాయ
మిక్సర్లో వేసి కుమ్ముడు 


Wednesday, January 9, 2013

కాకరకాయ కారం

కావాల్సినవి -
నాల్గు కాకర
ఓ రెండు చెంచాల కూరల కారప్పొడి
ఓ స్పూను పందార
ఓ రెండు స్పూన్లు
కర్వేపాకు నాలుగు ఆకులు
ఓ నాల్గు వెల్లుల్లి
తిరగమాత గింజలు

౧. కాకరకాయల్ని నీ ఇష్టం వచ్చినట్టు తరుక్కో, అనగా సన్నగా తరుక్కో అని
౨. వెల్లుల్లి తాట్స్ తీయి
౩. భాండి పొయ్యిమీదకి ఎక్కించు
౪. నూనె పొయ్
౫. నూనె వేడెక్కినాక, జీలకర ఆవాలు కుమ్ము
౬. కర్వేపాకులు కుమ్ము
౭. చిట్పట్ అన్నాక వెల్లుల్లి వేసేయ్ చెప్తా, వేగనీ
౮. ఇప్పుడు తరిగిన కాకరకాయ ముక్కలు వేసేయ్, బాగా వేగనీ, క్రిస్పీగా వచ్చిందాకా వేగనీ
౯. బాగా వేగినాక అందులో రెండు చెంచాలు కారప్పొడి వేయి, చిటికెడు పందార, సరిపోయినంత ఉప్పు వేస్కో
౧౦. బాగా కలిపి, ఓ రెండ్నిముషాలు వేయించి దింపు.
౧౧. ......................
అదన్నమాట
ఏవన్నా తేడా ఒస్తే చెప్పు, మా మేడం గార్ని కనుక్కు చెప్తా

Thursday, October 1, 2009

తోటకు రా!!

గార్డెన్ టు కం!! అనగా తోటకు రా!!!

ఈ మద్దెన మనకి పాపులారిటీ పెరిగిపొయ్యి, కొందరు, డవిరెక్టుగా అడిగేస్తున్నారు, అదెట్టా సెయ్యాల ఇదెట్టా సెయ్యాల అని [చందా :):)].
ఆరోగ్యనికి మంచి కూరలు ఎట్టా సేస్కోవాల? ఏవితినాల? ఏంజెయ్యాల? ఇట్టాంటివి సానా పెస్నలు లెగుత్తా ఉంటాయ్ సేనా మందికి.
అట్టాంటోళ్ళకోసం ఓ మంచి వంటకం తోటకూర కూర.
మాంచి లేత తోటకూరతో పప్పు కెవ్వు కేక. అట్టానే కూరగూడా...కెవ్వుకేక!!
ఎట్టాచేస్తారో ఏంకదో సూద్దాం తోటకిపదహే.
మార్కెట్టుకెళ్ళి
ఓ పెద్ద కట్ట తోటకూర
నాలుగు మిర్చి
ఓ గుప్పెడు పచ్చిశనగపప్పు
తాలింపు గింజలు
ఓ చెంచా నూనె
ఓ ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు బొబ్బలు నూక్కొచ్చుకో.

ఓ బక్కెట్టు నీళ్ళు తెచ్చుకో తోటకూరని దాంట్లో వెయ్యి. ముంచు లేపు, ముంచు లేపు, ముంచు లేపు. అట్టా ఓక్కో ఆకు సుబ్బనంగా కడుక్కో. దేనికీ? పెస్నలొద్దు పనిజూడు. ఎందుకంటే, తోటకూర పండిచే రైతులు నీళ్ళుపెడతారా తోటకూర సేనుకి, ఇసుక మొక్కని[చెట్టుని - ఇక్కడ కొందరు అనొచ్చు తోటకూర మొక్క కదా మా ఊళ్ళో అట్టానే అంటాం, చెట్టు వృక్షం కాదు భాయ్ అని - పిల్లాట] పట్టుకుని వదల్దు. సరిగ్గా కడుక్కోకపోతే కూర తినేప్పుడు కసకస లాడుద్ది.

సుబ్బనంగా కడుక్కున్నాక, కట్ట కట్ట అట్టానే కటింగు బల్లమీనపెట్టి ఓ మోస్తరి సైజుకి నరికేసేయ్.

ఇప్పుడు, ఓ భాండీ తీస్కో
పొయ్యిమీన పెట్టు, ఆరెండు సెంచాల నూనె ఏసేయ్
ఏడికాంగనే తాలింపు గింజలు ఏసేయ్. పచ్చిశనగపప్పు ఎక్కువ ఎసేయ్.
ఏగంగనే ఎల్లుల్లి రెబ్బల్ని అరసేత్తో కుక్కి, తొక్కపీకి ఏసేయ్. మిరగాయల్ని నాలుగుముక్కలుగా నరికేసి ఎసేయ్ దాంట్లో..
సిటపటలాడంగనే, తరుక్కున్న తోటకూర కుమ్ము. సెగ కొంచెం తగ్గించి మూతపెట్టు...
పుసుక్కున ఉడికిపోద్ది నాయాల్ది. ఉప్పు తగిలించి లాగించు. కారం సాలకపోతే ఓ మిరగాయ పక్కనెట్టుకుని లాగించవో...

రెట్టెల్లోకి బాగుండిద్ది, వన్నంలోకీ బాగుండిద్ది, దేనికైనా బాగుండిద్ది. వారోగ్యానికి వారోగ్యం..