Wednesday, July 29, 2009

(రాం)ములక్కాయలు

నిన్న (రాం)ములక్కాయలు వండుకున్నాం. అదేంది బ్రాకెట్టులో రాం అని రాసారు? ప్రతీదానికీ రామ నామం జపిస్తారా అని ఎవురైనా అనుకోవచ్చు. తప్పులేదు.
ఏందయ్యా కత అంటే రాంములక్కాయ మరియూ ములక్కాయ కూర. ఏంటి?? నోరూరిందా? మరి ఊరదా? ముక్కులు వాసన కోసం ఎగురుతున్నాయా? మరి ములక్కాయ రాంములక్కాయలో ఉడుకుతుంటే ఆ వాసనే వేరుకదా!!
దీనిక్కావాల్సింది -
ఎర్రని నవనవలాడుతున్న రాంములక్కాయలు ఓ రెండు, నాజూకైన ములక్కాయలు ఓ రెండు, ఓ ఉల్స్, నాలుగు వెల్లుల్లి, కొంచెం అల్లం, ఓ చెటాకు కొత్తిమీర, ఓ చెంచాల నూనె, తిరగమాత గింజలు గట్రా!!. నేను ఈ మధ్య వంటలకి ఆలివ్ ఆయిల్ నూనె వాడుతున్నా
ఇక మొదలుపెడదామా!!
ముందు, మిర్చిని సన్నగా తరుక్కో. తర్వాత, అరచేతినిబెట్టి, వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు (క్రష్), అప్పుడు వాటిపైన తొక్కతీసేసి సన్నగా ఛాప్ చేసి పక్కన్బెట్. అల్లం, పైన తొక్క తోసేసి, సన్నగా తర్క్స్, పక్కన్బెట్స్.

ఉల్లిపాయని సన్నగా తరుక్కో, ములక్కాయల్ని సుబ్బరంగా కడుక్కుని ఐదు ముక్కలుగా నరుకు, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో.

పొయ్యి వెలిగించు, చట్టి పెట్టు అదే, డేగిషా.
నూనె పొయ్యి. కాగంగనే మినుములు, పచ్చిశనగపప్పు, ఎండు మిర్చి, ఆవాలు, జిలకర, చివరాకరికి కర్వేపాకులు లతో తిరగమాత వేసేయ్. ఓ చెటికెడు పసుపు వెయ్యి. ఇప్పుడు మిర్చి, వెల్లుల్లి వెయ్యి. ఓ సారి బాగా కలుపు. ఇప్పుడు ఉల్స్ వెయ్యి, డీప్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించు.
అయ్యిందా, ఇప్పుడు తరుక్కున్న ములక్కాయలు, రాంములక్కాయలు వేసేయి. కలుపు లేక గంటే బెట్టి తిప్పు. ఉప్పు, కారం వెయ్యి కలియ తిప్పు, మూతెట్టు. గ్రేవీ అంటే నీళ్లు సరిపోను లేవు అనుకుంటే ఓ గళాసు పోస్కో (ఆంటే అవసరాన్ని బట్టి అని)
ఉడకనీ ఇక.
ఉడికినాక, కొత్తిమీర (పైన్లీ వాష్డ్ అండ్ ఛాప్ప్డ్ - శుభ్రంగా కడిగిన మరియూ సన్నగా తరిగిన) జల్లు - ఇంకొంచేస్పు ఇగరనీ - పొయ్యి ఆపేసి డెగిషాని దింపి ఇక సిగ్గు లేకండా అదేన్వాయా సిగ్గు పడకుండా లాగించు.



కొందరు ములక్కాయని జస్ట్ గుజ్జుని పళ్ళతో లాగించేసి పక్కన పడెస్తారు. కానీ ములక్కాయ రుచి ఆసాంతం నమిలి పీల్చి పిప్పిని మాత్రం వదిలనప్పుడే. అందుకే సిగ్గు లేకండా అదేన్వాయా సిగ్గు పడకుండా లాగించు అన్నది. కాబట్టి, మునక్కాయ ముక్క బాగా ఉడకటం ఇక్కడ కీ. అలానే ఈ కూర ఆరోగ్యానికి కూడా మంచిదే!!

29 comments:

Amar said...

నోరు వూరుతుంది. నేనూ ప్రయత్నిస్తా.

Bhãskar Rãmarãju said...

నా బ్లాగుని లాట్వియా నుండి ఎవరో చూస్తున్నారు.
ఆనందం!! నాకు లాట్వియా లోని రిగా టెక్నికల్ యూనివర్సిటీలో ఓ కోర్సు చేయటనికి అనుమతి లభించింది, ఒకానొక కాలంలో..కొన్ని కారణాలవల్ల చేరలేకపొయ్యా. :):)

అమర్!! చెసేయ్!! తర్వాత సంగతి తర్వాత.

శ్రీ said...

మస్తుగున్నది మునక్కాయల వంటకం!

సుభద్ర said...

aa colour yala vachindi ,rahasyam gaa tamato kudaa vesaraa...

Bhãskar Rãmarãju said...

సుభద్ర గారూ - ఏమన్నారూ? రహస్యంగా టమాటా వేసానా?
శివశివా!! ఏమైంది నాదేశానికీ? ఏమైంది నా ఆంధ్రరాష్ట్రానికీ? ఏమైంది నా తెలుగు భాషకి?
టమాటా = రాంములక్కాయ.

Rani said...

సుభద్ర గారూ - ఏమన్నారూ? రహస్యంగా టమాటా వేసానా?
శివశివా!! ఏమైంది నాదేశానికీ? ఏమైంది నా ఆంధ్రరాష్ట్రానికీ? ఏమైంది నా తెలుగు భాషకి?
టమాటా = రాంములక్కాయ.

asalu post pakkanapetti, ee comment choosi navvaagatledu

Bhãskar Rãmarãju said...

రాణీ గారు -
పాపంలేండి!! ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని ఉండిఉంటారు వారు!! మీరు మరీ!!

అదిసరే ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కామెంటు.
ధన్యవాదాలు.
శ్రీ భాయ్ - :):)
సుభద్ర గారూ - ధన్యవాదాలు!! ఏంఅనుకోకండేం...

భాస్కర రామిరెడ్డి said...

అర్జెంట్ గా మీ ఇంటికి రావాల్సిందే :)

madhu said...

"ఏమైంది నా ఆంధ్రరాష్ట్రానికీ? ఏమైంది నా తెలుగు భాషకి?"

ఇదన్యాయం అన్నా ! అది మీ పల్నాడు/గుంటూరు భాష కామోసు ! ఇటు తెలంగాణా లోనూ, అటు రత్నాల సీమ రాయల సీమ లోను, కోస్తాలోను, రామములక్కాయ అనరు, నాకు తెలిసి ! అందరికీ టమాటా గానే తెలుసు, సివరాఖరికి తెలుగు మీడియం వాళ్ళకి, పనోళ్ళకి కూడా !

ఇకపోతే,కూర చూస్తుంటేనే రుచి తెల్సిపోతోంది ! అర్జెంటు గా చేస్కుని తినేయ్యాల !
మీరే స్వయంగా వండినారా ?

Mauli said...

hammaaa....ivvale maa cousin mulakkaya koora ante!!! ikkadi mulakkayalu baguntayya ani light teesukonna.....

anukokundaa mee post choosi :P inka no doubt ... going to have this dish next week (next week first shopping is mulakkayalu ....!!!)...thanks for sharing :)

Memory Makers said...

ఆ!!కూర చేసి పొయ్యి పైన పెడితె ఫొటొ యెప్పుడు తీసారు?నేను చూడనె లేదె?హమ్మా!

Bhãskar Rãmarãju said...

మేడం
తమరు చేసింది కాబట్టే రంగు రుచి వాసన తగ్గింది :):)

భాస్కర రామిరెడ్డి said...

హి హి, హీ.. భాస్కర్, ఇలాంటి పనులు కూడానా?

Bhãskar Rãmarãju said...

ఊర్కోన్నాయ్!! నువ్వు భలేవాడివే :):)

Sravya V said...

కూర బాగుంది ! ఇదన్న మాట అసలు సంగతి హరిత గారు వండితే మీరు చేసినట్లు బిల్డప్ ఇక్కడ :)

madhu said...

>>తమరు చేసింది కాబట్టే రంగు రుచి వాసన తగ్గింది :):)
హరిత గారు, తనే వెతుక్కుని వచ్చి, పెద్ద చాపల వలలో పడ్డారు !
ఇంకెందుకు మీరు రోజూ వంట చేయటం ? రంగు, రుచి , వాసనా తగ్గకుండా దొరవారు ఒక్కరే చేయగలరు కదా, ఆయనకే వంటిల్లు అప్పజేప్పేయ్యండి ! తన statement వెనక్కి తీస్కుంటే సరే,లేకుంటే వంటింటికి మీకు చెల్లు ! ;-)

వీరుభొట్ల వెంకట గణేష్ said...

My mother was born & brought up in Guntur. Only in Gunntur people will call Tomato as "Ramalakkayi".

Sreelatha said...

మాది రాయలసీమ. చిన్నప్పుడు పల్లెకి వెళ్తే, cherry tomatos కనిపించాయి tomato మొక్క మీద, ఇవేంటి అని అడిగితె, 'రాములక్కాయలు' అని చెప్పారు. నాటు tomatosను రాములక్కాయలు అంటారని నేను decide ఐపోయా.

sunita said...

"ఆ!!కూర చేసి పొయ్యి పైన పెడితె ఫొటొ యెప్పుడు తీసారు?నేను చూడనె లేదె?హమ్మా!"

మరదే? ఏదో బ్రమ్హచారులు గా ఉన్నప్పుడు అన్నీ కలిపి తిరగమోత పెట్టడం, ఆలూ, కోడిగుడ్డు వేపుడు లాంటివి తేలిక రకాలు మాత్రమే వస్తాయి. ఇన్నిరోజులూ భాస్కర్ గారు ఇన్నీ రాస్తుంటే వంట బాగా తెలుసేమో అనుకున్నాను. హమ్మా! ఇదన్నమాట రహస్యం.

sunita said...

హ్మ్!! రామ్ములక్కాయలు మాకు సహజమైన పేరే! మా జిల్లా లో తప్ప ఎవరూ అలా పిలవరా? ఐతే టమాటాకు తెలుగు పేరు ఇంకోటి ఏదన్నా ఉందా?

Memory Makers said...

చ౦దా గారు!పాప౦ వ౦కలు పెట్టర౦డి ఈయన సామాన్య౦గా అ౦దుకనె ఆ ఛాన్స్ లేదు.
సునీత గారు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు బాగా చేసెవారని వీళ్ళ స్నేహితులు అ౦టు౦టారు.నాకు యెక్కువ ఛాన్స్ రాలెదు వ౦డి౦చుకోటానికి.

Bhãskar Rãmarãju said...

మేడంగారూ!! ఇది టూమచ్ :):)
సునీతగారూ -
>>మరదే? ఏదో బ్రమ్హచారులు గా ఉన్నప్పుడు అన్నీ కలిపి తిరగమోత పెట్టడం, ఆలూ, కోడిగుడ్డు వేపుడు లాంటివి తేలిక రకాలు మాత్రమే వస్తాయి. ఇన్నిరోజులూ భాస్కర్ గారు ఇన్నీ రాస్తుంటే వంట బాగా తెలుసేమో అనుకున్నాను. హమ్మా! ఇదన్నమాట రహస్యం.
ఇది మరీ దారుణం!! నెచేసినవి చాలానే ఉన్నాయి.:(:(
శ్రావ్యా - నువ్వుకూడా ఎక్స్పార్టీయేనా?
దేవుడా దేవుడా దేవుడా!!! నన్ను సపోర్టుచేసేవారే లేరా? హుష్!!!

Padmarpita said...

నేనున్నానండి సపోర్ట్ మాత్రమే చేస్తానండోయ్.... తయారు చేసుకుని తినమనకండి....ఎంతైనా మనం మనం ఒకటిగా:)

తృష్ణ said...

nice curry!!naku mulakkadalatO imko renDu rakaala curries telusanDi..mI nabheema blog chusinappudallaa naaku maa annayyE gurtu vastaadanDi..ade vayasu,ade interest,ade rakam maatalu..nijamgaa iddaru maushulu okelaa untaaraa ani doubt ostu untumdi..maa annaayya gurinchi repati post lO..

Bhãskar Rãmarãju said...

పద్మార్పితాజీ - ధన్యవాదాలు నాకు మద్దతు తెలిపినందుకు.

తృష్ణాజీ - :):) మీ సహోదరులకు నా నమస్తే తెలియజేయండేం!!

pari said...

baagundi vamtakam.

Sujata M said...

ఒక నండూరి రాం మోహన్ రావు గారు చేసిన అనువాద గ్రంధంలో చక్కని రాం ములక్కాయ లాంటి అమ్మాయి అని పద ప్రయోగం చూశాను. అసలు రాం ములక్కాయంటే ఏమిటో కొంచెం ఫుటువా (Photo) చూపిస్తారా మేష్టారూ ? నేనయితే, మామూలు ములక్కాయ లాగా సన్నగా, నాజూగ్గా, పొడుగ్గా ఉందేమో ఆ అమ్మాయి అనుకున్నా !

:D

Sujata M said...

ఒక నండూరి రాం మోహన్ రావు గారు చేసిన అనువాద గ్రంధంలో చక్కని రాం ములక్కాయ లాంటి అమ్మాయి అని పద ప్రయోగం చూశాను. అసలు రాం ములక్కాయంటే ఏమిటో కొంచెం ఫుటువా (Photo) చూపిస్తారా మేష్టారూ ? నేనయితే, మామూలు ములక్కాయ లాగా సన్నగా, నాజూగ్గా, పొడుగ్గా ఉందేమో ఆ అమ్మాయి అనుకున్నా !

:D

Saahitya Abhimaani said...

రాంములక్కాయ అంటే తెలుగులో (!) టమేటో కాదూ. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని రామమోహనరావు గారు అలా వర్ణించి ఉంటారు.