ఇయ్యాల మావిడ రొట్టెల్జేసి అవ్వతలనూకి కూరసెయ్యటానికి టైం దొరకట్లా ఏమైనా సెయ్యరాదా అని పిల్లల్తో పర్గులుపెడుతూ అంది.
ఏమున్నాయ్ అన్నా.
క్యారెట్లు పాడైపోతున్నాయ్ అంది.
ఫ్రై జేస్కో అంది.
నీ ఇష్టం కిచెన్ నీదే అంది.
సరే, ఎప్రాన్ నడుముకి కట్టుకునేలోపు మళ్ళీ ఓ మాట సెప్పింది. క్యారెట్టు తురిమి ఉప్పు, మిరియాలపొడి జల్లుకుని లాగించొచ్చుకదా అని ఓ సలహా పడేసింది.
ఠడా!! మంచి ఆలోచనే అని దూకా, రంగంలోకి.
తను ఇచ్చిన ఔడియాని పొడిగించా.
ఇలా -
క్యారెట్ల పైన తొక్కని ఓ రౌండు తీసేసి, పీలర్తో క్యారెట్టు మొత్తాన్నీ స్పగెట్టి లా పీల్ చేసేసా.
అదే చేత్తో ప్రిజ్జీలోంచి పాపాయు దోస్కాయ ( బేబీ క్యూకుంబర్) ని తీసి సన్నగా తరిగేసేసి,
ఓ ఉల్స్ ని సన్నగా నిలువునా తరిగేసేసి అన్నీ ఓ తెల్ల బొచ్చలో వేసేసి, ఓ నిమ్మ బద్ద పిండేసి కొంచెం ఉప్పుజల్లేసి ఇలా
బాగా కలిపేసి,
రొట్టె పైన పెట్టి మద్దెనుండి మడిచి ఈ చివర్ని లోనికి మడిచి, ఆ చివర్ని మొత్తం ఇలా
సుట్టేసి సుబ్బరంగా లాగించా.
దీంట్లోకి మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన సజ్జలు ఏవైనా మస్తుగుంటై.
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
Wow ! What a creativity :)
Thanks for giving an easy and tasty recipe!
BTW where is the pepper powder?
బాగుంది! బాగుంది! మీ రొట్టెరోల్...మరి గంత లావ్ చుడ్తే నోట్లో పడ్తదా?
ఈ ట్రిక్ పాతదే. మేమెప్పుడో ట్రై చేసేసాం అధ్యక్షా!!
కాకపోతే పేరు బాగా పెట్టారు. "రోలు" ను ఇలా అనొచ్చని తెలీదు.
Yummy!
ఏమైనా మీరు సూపరండీ ...
శ్రావ్యా - :):) ఎంజాయ్
మహిగ్రాఫిక్స్ - మనది కొంచెం పెద్దనోరులే :):)
సునీత గారు - :):)
భరద్వాజ్ - ధన్యవాద్
పరిమళం గారూ - మీరు మరీనూ...:):)
Post a Comment