మొత్తానికి మా దేశీ కొట్టోడు గోంగోర మహా వృక్షాలని తెచ్చాడు మొన్న. సూడంగనే పాణం గిలగిల్లాడి, ఓ నాలుగు డాలర్లు పోతే పోనీ దీనెక్క గోంగోర తిన్ని బతుకెందుకు అనేసి, ఓ నాలుగు వృక్షాలను లారీకేసి తోలకొచ్చా. ఆదివారం, కుంపటెట్టి గోంగోర పప్పు తవండుకోవాలని ముందు ప్రణాళికేస్కున్నా, సమయాభావం పిల్లల డిమ్యాండ్ల వల్ల పప్పుగిన్నె కుంపట్లోంచి మామూలు పొయ్యిమీదకి మారింది. పప్పులో ఎయ్యంగా మరో రెండు వృక్షాలు మిగిల్నై. ఏటిసేయ్యాల్రా బగమంతుడా అంది మావిడ పిల్లని సంకనేస్కుని. వెనువెంటనే, పచ్చడి నూరూ అని నోట్ళోంచి, మన ప్రమేయంలేకుండా జాలువార్చింది నాలుక ఇంత నీళ్ళు నోట్లో ఊర్చుకుంటూ. అటులనే మాహారాజా అనేసి ఆ ప్రాణి రోలు కడగటం మొదలెట్టింది (రోలు అనగా గ్రైండరు)
ఇంతక మునుపు జరిగిన గోగుల యుద్ధంలో నే చెప్పినట్టుగా, గోంగోరతో పచ్చళ్ళు రకరకాలు.
సరే గోంగోరతో చేసే ఈ పచ్చడికి కావాల్సింది, నేను తెచ్చినట్టుగా గోంగోర మహా వృక్షాలు కాదు. ఏక్ దం ఫ్రెష్, నవనవ లాడే గోంగోర మరియూ, అప్పటికప్పుడు కోస్కొచ్చిన పచ్చిమిరగాయలు. ఓర్నీఇంట వాన కురవా, యాడ దొరకతన్నాయ్ ఇయ్యాల్రేపు "ప్రెష్" సరుకు అని అనుకోవచ్చు అందరూ, అబ్బా చోద్యం అనుకోనూ వచ్చు. అలాంటి ఆకుతో మిరగాయల్తో సేత్తే ఆ రుచే ఏరు అని నా అర్ధం.
సరే, ఓ కట్ట గోంగోర, ఓ అరడజను మిర్చి, రెండు ఎండు మిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, అరచెంచా మెంతులు, తిరగమాత సామాన్లు, ఓ చెంచా నూనె.
ముందుగా గోంగూర. మిరగాయలు ఉడకబెట్టి పక్కనెట్టుకోవల. అయినాక,
భాండీ ఎట్టి తిరగమాత ఏసేసి, దాంట్లోనే మెంతులేసేసి, చిట్పట్ అన్నాక ఎల్లుల్లి ఏసేసి ఏపాల. అయినాక ఆ ఉడకబెట్టిన గోంగోర, మిరగాయల్ని ఇందలో ఏసేసి ఓ సారి ఏయించి (నీళ్ళు ఉంటే అయి ఇంకిపోయిందాక పొయ్యిమీనే ఉంచాల), ఉప్పు ఏసేసి, రోట్లో ఏసుడు, నూరుడు. అంతమెత్తగా ఉండాల్సినపన్లా. కచ్చాపచ్చీగా ఉండా పర్లా.
దీనికి కీ - మిర్చీ, గోంగోర ఆటి వాసన్ని కోల్పోకుండా చూడాల. కాబట్టి మోడరేట్ గా వేయించుకోండా.
ఈ పచ్చడి ఎక్కువకాలం ఉండదు. కేవలం రెండు మూడ్రోజులు మాత్రమే.
ఇక దీంట్లో ఎన్ని కేలరీలు ఉంటాయో నాకు పెద్ద తెలియదు. కానీ బలమైన ఆహారమే. కారణం దీంట్లో కేవలం ఒక స్పూను నూనె, రుచుకి ఉప్పు, మిగతావి ఆరోగ్యకరమైనవే. గోంగోరలో ఇనుము అధికశాతం ఉంటుంది.
నేను ఈ రోజు రాగిజావలో దీన్నేస్కుని ఓ కుమ్ముడు కుమ్మాను.
మీరూ ఆనందించండి.
[సర్లే బాసూ అంతా బాగనే ఉంది, మరీ ఏంది అంత కొంచెం అయ్యింది పచ్చడీ అనుకుంటున్నారా? రుసి సూద్దాం అని నోట్టో ఏస్కున్నామయ్యా, ఏందంట, సగం అయిపోయింది :):)]
Monday, June 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
నోరు ఊరిస్తున్నారు గా ! మీకు కడుపు నొప్పి గ్యారెంటి :)
BTW మీ నాన్న బ్లాగు open చేస్తుంటె ఎదో problem వస్తుంది ! I hope it is problem with comment secction, I can able open without error when no comments.
ప్చ్ నా మడిలో గోగు నార ఎప్పుడు పెరిగేనో నేను పచ్చడి ఎప్పుడు చేద్దునో, ఈ లోపు మీరు మరీ ఇలా వూరించేయకండేం. వెంకటేశ్వర స్వామికీ గోంగుర ఇష్టమని మా నాన్న గారు ప్రతి శనివారం ముద్ద పప్పు, గోంగుర పచ్చడి/కూర + పరమాన్నం చేయించేవారు. పోయిన సంవత్సరం సిడ్నీ నుండి వచ్చిన నా స్నేహితురాలు, "అమ్మో అమ్మో అమెరికాలో ఇంత గోంగూర పండుతుందా" [నాకేవో బంగారు గనులున్నంతగా] ఆశ్చర్య పడిపోయి అక్కడే కూలబడి ఓ గంట ఆకు కోసి, పచ్చడి, కూరా రెండూ చేయించుకుని తీసికెళ్ళింది, వారి వారం ప్రయాణంలో అన్నంలోకి ఆధరువుగా.
Acid Reflux వుంది పచ్చడి తిన లేను గాని, మా వైపు, వేయించిన చెనక్కాయలు వేసి రుబ్బుతారు, కమ్మగ వుంటది. ఇంకో సారి వృక్షాలు తెచుకున్నప్పుడు, ఈ variation try చేయండి.
ఈ పచ్చడిలో ధనియాలు వేసి తిరగమోత పెట్టుకుంటే ఇంకా సూపర్!
వెనువెంటనే, పచ్చడి నూరూ అని నోట్ళోంచి, మన ప్రమేయంలేకుండా జాలువార్చింది నాలుక ఇంత నీళ్ళు నోట్లో ఊర్చుకుంటూ....:)))
నలభీమ గారు,
ఇది చాలా అన్యాయం. టపా రాసి ఊరించటమేకాకుండా ఫోటో కూడా పెడతారా? దీనికి ప్రతీకారంగా మా కాలనీలో కర్రీపాయింట్ లో అమ్మే 'అరటికాయ లంబా లంబా' కూర మీకు పెట్టాల్సిందే! :)
శ్రావ్యా - ఒక్కోసరి వస్తోంది. ఒక్కోసారి రావట్లేదు. బహుశ జావా స్క్రిప్ట్ సమస్య అయి ఉండవచ్చు.
కడుపునొప్పీ? ఏంపరేదు. :):)
ఉష గారూ - :):) మీరు ఏ ఊళ్ళో ఉన్నారోగానీ, మా ఊళ్ళో గోగులుపెడితే రావట్లా. దోస ఇత్తులేస్తే మా ఊళ్ళవైపు నీళ్ళుకూడా పొయ్యకుండా వస్తాయి, ఇక్కడ రావట్లా. అదీ కధ. మీ గూగులు "పూలు పూస్తే" ఓ రెండు ఇటు పడేయండేం.
లత - నాకూ సేం ఇస్టోరీ ఇక్కడ. యాసిడ్ రిఫ్లక్స్. ఐనా కుమ్మేసా. చెనక్కాయ, న!! నారేబాబా బాబూరావ్ గణపత్ రావ్ ఆప్టే ఏక్బార్ నా బోలాతో నా! కారణం - నేను ఈ మధ్య డైట్ కంట్రోల్ చేస్తున్నా. :):)
సిరిసిరిమువ్వ గారూ - నమస్తే. అవునండీ. ధనియాలు ఇంట్లో నిండుకున్నాయ్.
సుజ్జి - :):)
శేఖర్ - నిన్ననే అరటికాయ లాంబా లాంబా గురించి అనుకున్నా. నిన్న ఏనూట పన్నెండోసారో చంటబ్బాయ్ చూసా.
నేను ఎప్పుడు ఇంటికి (మా ఇంటికైనా లేదా అత్తగారి ఇంటికైనా) వెళ్ళినా ఖచ్చితంగా ఒక పుట గోంగూర రోటి పచ్చడి వుండాల్సిందే...! ఆంధ్రమాతని అమాంతం లాగిస్తేనే తృప్తిగా తిన్నట్టు......!
http://www.webmd.com/heartburn-gerd/acid-reflux-symptoms
రెండో పేజి కూడా ఉంది చూడండి ... మంచి పచ్చడి అందించారు, కానీ మీరు ఆరోగ్యం పణం గా పెట్టటమే బాధ గా ఉంది ! జాగ్రత్త భాస్కర్ గారు, మా బంధువుల్లో మొదట్లో ఈ లక్షణం కనిపించినా అశ్రద్ధ చేసి, చివరికి రాత్రుళ్ళు ఆసిడ్ ప్రాబ్లం తో, నిద్ర కూడా పోలేకపోయే వారు ... ఏముంది ఒక్క సరే గా, అనుకుంటాం , అలా ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఒక్క సారే మరింకొంచెం హాని కలిగిస్తే ?
డైట్ లో , ప్రోటీన్ ఫుడ్ కూడా ఉండాలి ... చెనక్కాయ ? ( వేరు సేనగాలా ? )అవే అయితే మాత్రం చాల చాల మంచివి...నూనె లా బరువు పెంచవు..ఉన్నా మంచి కొవ్వు ఉంటుంది ( శరీరం అరిగించుకోగలిగే కొవ్వు), అదే నూనె, నెయ్యి వీట్లో అరిగించుకోలేని కొవ్వు ఉంటుంది...నూనె రక్తం( అంటే నీరే కదా) లో కలిపేందుకు లివర్ ఎంతో కష్టపడుతుంది ... అదే సహజమైన కొవ్వు పదార్థాలు, అదే వేరు సెనగలు లాంటి గింజలు తేలిగ్గా అరుగుతాయి , వాట్లో నూనె తో పాటు వాట్ని అరిగించే పదార్థాలు కూడా ఉంటాయి గనక ..అవేమి బరువు పెంచవు ...
కాబట్టి నూనె ఒక్కటి మానేస్తే, లేదా బోల్డు చాలా తగ్గిస్తే, డైటింగ్ కిందే లెక్క !
chaalaa baagaanae ruchi choosaaru.ikkada net problam.mottaaniki gongura vrikshaalu baagaanae saadhinchaaru.
అన్న గారు మీరు ఆమాత్రం అందించండి చాలు, మేము అల్లుకుపొతాం.
ఈసారి రూంలో గోంగూర పచ్చడి కేక పెట్టిస్తాం .
గోంగూర పచ్చడికి పచ్చి ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ మంచింగ్ చేసి చూడండీసారి... అన్నట్టు ఢిల్లీ-6 పాత బాగుంది.. అక్కడ కామెంట్ ఓపెన్ కావట్లా...
nice post
శ్రీ గారూ :- నమస్తే.
నా యాసిడ్ రిఫ్లెక్స్ కి కారణం, నా పొట్ట కుండలా పెరగటం అని డాక్టర్ చెప్పాడు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పదిహేను పౌండ్లు తగ్గమన్నాడు మూడు నెలల్లో. అందుకోసం, నేను నా డైట్ ని కంప్లీట్ గా మార్చేసా. ఇక వేరుశనగలు - నా a1c విలువ 6.1 గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ ఉవాచ - దాన్ని అర్జెంటుగా అనగా మూడు నెలల్లో 5.9 లేక అంతకన్నా తక్కువకి తెచ్చుకో అని.
వీటన్నిటికీ మూల కారణం నా అధిక బరువు. ఎంత అధిక బరువు? పదిహేను పౌండ్లు. మర వేరుశనగలు తినక పోవటం దేనికి? గ్లూకోజ్ లెవెల్ ని పెంచుతుందేమో అని. Nuts do raise BGL.
మీరన్నట్టు డైట్ లో పోటీన్, ఫైబర్ ముఖ్యం. ప్రోటీన్ కోసం నేను ప్రోటీన్ డ్రింక్ తాదుతా. కారణం, నేను పొద్దున్నే వ్యాయామం, సాయంత్రం గంటా సేపు బ్రిస్క్ వాక్ చేస్తున్నా. ప్రోటీన్ స్ప్లిపెంట్స్ విధిగా తీస్కోవాలి. ఫైబర్ - అత్యంత అధికశాతంలో ఫైబర్ క్యారెట్లో ఉంతుందనివిన్నా. రోజుకో పెద్ద క్యారెట్టు తింటా. రా, తొక్క తీయకుండా, కనీసం జానెడు పొడుగున్న క్యారెట్టు.
మీ సలహాలు సూచనలు చాలా బాగున్నాయి. దయచేసి ఒకసారి nalabhima@gmail.com కి మెయిల్ ఇవ్వండి.
వేణు - గోంగోరతో మనకి విడదీయరాని సంబంధం సోదరా.
అమర్ - :):)
సునీత గారూ - ఎలా ఉన్నారూ?
మురళీ భాయ్ - అదేదో స్క్రిప్ట్ సమస్య సోదరా. కొన్ని కొన్ని సార్లు బాగనే వస్తోంది. చూస్తా. గోంగోర పెట్టుడు పచ్చడి లేక ఉప్పు గోంగోర, లేక నూనె గోంగోర వీటన్నిట్లో ఉల్స్ లేకపోతే వెలితి. :):)
భాస్కర్ గారు, మా ఇంట్లో, బంధువుల్లో అధిక బరువు, అసిడిటీ,( ఇది సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు !) కీళ్ళ నొప్పులు, ఆస్తమా లాంటి సమస్యలు మంతెన గారి ప్రోగ్రామ్స్ చూసి, ఫాలో అయ్యి తగ్గించుకున్నవే, ఒక్క పైసా డాక్టర్ కర్చు లేకుండా !
http://www.youtube.com/watch?v=UdqrK4rvqzI&feature=related
part 2, part 3 కూడా చూడండి.
ఈయనవి ఈ ఛానల్ లో, 400 పైగా ఉన్నాయి వీడియోలు !
http://www.youtube.com/user/cleinfo123
డాక్టర్స్ ఎప్పుడు మంచివి మానమని, అన్ని supplements తో సరిపెడతాం అంటారు ! మా స్నేహితుడు ఒకతన్ని glucose ఎక్కువుందని, టమాటా మనమన్నారు ! రోజు కాఫీ, అందులో చెక్కెర మాత్రం వేస్కోవచుత !
ఒక ఉదాహరణ చెప్తాను, నాకు sinus pain అని jaws, , కళ్ళు నొప్పులు...కంటి సమస్యేమో అని, కంటి డాక్టర్ దగ్గరికేల్తే, కళ్ళు బానే ఉన్నాయి, నాకూ వచ్చింది ఈ నొప్పి వర్షాల వల్ల, వారం నుంచి మందులు వాడుతున్నా, రాత్రుళ్ళు నిద్రపోలేనంత నొప్పి నాక్కూడా అని చెప్పారు ఆ కంటి డాక్టర్ !
మంతెన గారి ప్రోగ్రాం " sinus నొప్పుల గురించి చూసి, youtube లో, రెండు గంటల్లో పోగొట్టుకున్నా! ఆ కంటి డాక్టర్ ఏమో, వారం నుంచి మందులు వాడుతున్నారు, తగ్గకుండా !
ఇంకో సారి, అలాగే కంటి నొప్పులు వస్తే, కంటి డాక్టర్ దగ్గరకి వెళ్లాను, పరీక్ష చేసి, eyelids మీద debris పేరుకుంది, ఈ solution తో, వారం కనురెప్పలు క్లీన్ చేస్కోమని చెప్పారు.వారం అయ్యాక మందు మానేస్తే, మల్లి నొప్పి మొదలు, అయితే జీవిత కాలం వాడమని చెప్పారు !!!!
లివర్ సమస్యలు మనకి ఉన్నా, పైకి తెలీవు...మనం తినే నూనెల వల్ల, లివర్ పరిస్థితి బాలేకున్న దాని మీద అధిక ఒత్తిడి (జ్వరం వచినప్పుడు deadline పెట్టినట్టు మనకి ), దాంతో కను రెప్పలు సరిగ్గా పని చేయవని తెల్సింది ( ప్రక్రుతి వైద్యం తో), లివర్ బాగుపడే పదార్థాలు తింటే, మూడు రోజుల్లో తగ్గింది, ఆ వెధవ సోలుషన్ పారేసా ఇక !
మీరు తప్పకుండా ఇవి చదవండి : http://www.mantenasatyanarayanaraju.com/ebooksnew.asp
printout తీస్కుని మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వండి ! diabetes గురించి కూడా ఉంది, చూడండి ! ఆరోగ్యం దెబ్బ తింటే కాని దాని విలువ తెలీదు ... ఏ పని చేయలేము ... వీలు చూస్కుని మీకు ఈమెయిలు చేస్తాను !
http://www.mantenasatyanarayanaraju.com/videosnew.asp
వీట్లో ఉన్న వీడియోలు, ఆడియోలు కూడా వినండి తీరిక సమయాల్లో ! ఇక్కడ పెడితే, మీ బ్లాగ్ కి వచ్చే అందరు చూస్తారని ఇస్తున్నా !
western medicine ఎంత సేపు symptoms ని treat చేస్తుంది ! దాంతో జీవిత కాలం మందులు వాడాల్సి వస్తుంది, అటు ఆరోగ్యము పూర్తీ గా బాగుపడదు, నొప్పి వస్తే, నొప్పి కి మందు, అంతవరకే ...నొప్పి దేనికి వచిందో దానికి మందు ఉండదు, అసలు అంత దాకా ఆలోచించరు !
అదే ప్రక్రుతి వైద్యం "cause" ని treat చేస్తుంది, అందుకే లోపల, బయట పటిష్టం గా ఉంటాము !
శ్రీ గారూ - ధన్యవాదాలు. ఒక్కో వీడియో చూస్తున్నాను. ఉపయోగపడే సమాచారం అందించారు.
భాస్కర్ గారు, ఈ BGL, a1c అంటే ఏంటో వీలయితే ఒక టపా రాయాండి.
తప్పకుండా తీరిక సమయాల్లో, మంతెన గారి youtube videos, ఆయన website videos చూడండి, ebooks print-outs తీస్కుని చదివండి, మీ ఇంట్లో vallaki కూడా ఇచ్చి చదివించండి చాలు, పాటించటం అదే ఆటోమాటిక్ గా జరిగిపోకపోతే చూడండి !
రామరాజు గారు, మీరడిగిన నా గోంగూర మొక్కలు. మా మీవూరికి దగ్గరే.
http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#5361832494447675058
http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#5361832501346327778
Post a Comment