ఈ మధ్య నేను ప్రచురించిన గోధుమరవ్వ ఉప్మా పోస్టుకి మన బ్లాగ్ సోదరుడు "నెమలికన్ను" మురళి, మధుమేహ వ్యాధి గ్రస్తులు తినగలిగే కొత్త రకం వంటల గురించి రాయమని సూచించారు.
ఆ దిశగా ఈ ప్ర్రయత్నం, పోస్టు.
మధుమేహ వ్యాధిక్రస్తులకి చాలా అపోహలు, చాలా అపనమ్మకాలు, భయాలు అవీ ఇవీ ఉంటాయి. ఏది తినొచ్చు, ఏది తినకూడదూ. హమ్మో అది తింటె ఎలా, ఇది తింటే ఎలా...లాంటి ఎన్నో అలోచనలతో భయపడుతూ ఉంటారు.
గూగుల్లో గెలుకుతూ ఉంటే ఈ క్రింది సమాచారం తగిలింది. ఉపయోగపడుతుందీ జనాలకి అని ఇక్కడ పెడుతున్నా.
ప్లేట్ మెథడ్ - అనగా పళ్ళెం పద్ధతి -
అంటె భోజనంలో ఏమి తినొచ్చు అని.
ఈ క్రింది బొమ్మని చూడండి.
ఇది మీరు భోజనం చేసే పళ్లెం అనుకుందాం. పళ్ళెం అంటే, అర్ధవంతంగా ఉన్న సైజులో అని. పళ్లెం అనగా స్థాభాళం కాదు.
ఇప్పుడు, ఆ పళ్ళాన్ని, పైన చెప్పిన విధంగా మూడు భాగాలు చేస్కోండి. అంటే రంపం తెచ్చి కోస్కోండి అనికాదు, మూడు భాగాలు చేసాం అని ఊహించుకోండి. అనగా, ముందుగా, అడ్డంగా ఒక గీత గీయండి. పళ్ళెం రెండు భగాలయ్యింది. ఇప్పుడు కింది భాగంలో నిలువుగా ఒక గీత గీయండి.
ఇప్పుడు పైన ఉన్న సగభాగం అనగా సింహ భాగం NS పదార్ధాలు, మిగతా దాంట్లో ఒక సగం S పదార్ధాలు, మిగతా P పదార్ధాలు తినాలి. దీంతో పాటు తక్కువ లేక అస్సలు కొవ్వు లేని పాలు ఒక కప్పు, పండ్ల ముక్కలు ఒక కప్పు తీస్కోవాలి.
NS పదార్ధాలు అనగానేమీ?
NS = నాన్ స్టార్చీ అని. గంజి లేని పదార్ధాలు. ఉదాహరణకి
పాలకూర, క్యారెట్లు, లెట్యూస్, గ్రీన్స్, కోసుగడ్డ, బోక్చోయ్ (చీనా కోసుగడ్డ అంటారు)
గ్రీన్ బీన్స్, బ్రొక్కొలి, కోసుపువ్వు, రామ్ములక్కాయ
పండ్ల రసాలు, సల్సా, ఉల్లి, దోసకాయ, బీట్రూట్, బెండ
పుట్టగొడుగులు, మిర్చి, టర్నిప్ (ముల్లంగి లాంటిది)
S పదార్ధాలు అనగానేమీ?
S = స్టార్చీ అని. అనగా గంజిగల పదార్ధాలు. ఉదాహరణకి -
ముడి ధాన్యాలు లేక వాటి ఉత్పత్తులు - హోల్ వీట్ బబ్రెడ్డు.
ఎక్కువ పీచుగల పదార్ధాలు - అనగా తృణధాన్యాలు.
ఓట్మీల్, గ్రిట్స్(thick maize-based porridge), హోమిన్య్ లేక క్రీం ఆఫ్ వీట్.
వరి, పాస్తా (హోల్ గరిన్ పాస్తా) , రొట్టెలు,
మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి,
ఉడకబెట్టిన బీన్స్ - సోయా బీన్స్, బఠాణి, కిడ్నీ బీన్స్, లెంటిల్స్, పుల్లశనగ, ఇత్యాదివి.
ఇక P పదార్ధాలు -
మాంసాహారం లేక ఎక్కువ ప్రొటీను గల శాకాహారం.
మధుమేహ ఆహార పిరమిడ్
అలానే కొన్ని ఉపయోగపడే తీగలు -
https://www.diabetes.org/food-nutrition-lifestyle/nutrition/meal-planning/create-your-plate.jsp
కాబట్టి ఏమి తిన్నా, సరైన రీతిలో తినాలి అనేది పాయింటు. పళ్ళు తినకూడదా? మామిడి పండు తినకూడదా? తినొచ్చు. ఎంత అనేది ప్రశ్న.
ఇలా ఎప్పుడైనా మంచి సమాచారమ్ దొరికితే ఇక్కడ పెడుతుంటా.
Friday, May 22, 2009
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
విలువైన సమాచారం సోదరా.
పనిలో పనిగా ఆ ఓట్‌మీల్ , క్రీమాఫ్‌వీట్ ఎలా తయారుచేస్కోవాలో కూడా చెప్పేస్తే పోతుందేమో! లేకపోతే నా బోటి వాళ్ళు ఓట్ మీల్‌లో ఇంత బెల్లమేసి పరమాన్నం లాగానో, క్రీమ్‌ఆఫ్‌వీట్‌లో అంత చక్కెర పోసి కేసరి లానో తయారుజేసి కళ్ళకద్దుకునే ప్రమాదముంది. హొమ్మస్ కి కూడా రెసిపీ ఇచ్చేసి పుణ్యం కట్టుకోండి. :)
చాలా విలువైన, అవసరమైన సమాచారం.బాగుంది.
చాలా చాలా ధన్యవాదాలు.. ఈ వరుసలో వచ్చే టపాల కోసం ఎదురు చూస్తూ ఉంటా...
Mee Blog Chala baagundi. Naa blog visit chesinanduku chala santhosham mariyu thanks.
Kottimeera Dosalo biyyapu pindiki badulugaa Godhuma pindi veyavachu. Ledaa Senagapindi veyavachu.
Post a Comment