అలానే ఇంట్లో కూడా చాలామంది ముంబాయి రవ్వ ఉప్మా నే చేస్కుంటుంటారు. గోధుమరవ్వ ఉప్మా సరైన పద్ధతిలో చేస్కుంటే చాలా రుచిగా ఉంటుంది మరియూ ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్ధాలు -
గోధుమరవ్వ. ఇక్కడ దీన్ని బ్రోకెన్ వీట్ అంటారు.
From ఉప్మా |
మన ఊళ్ళో బన్సీ గోధుమరవ్వ దొరుకుతుంది, దాని రుచి అత్భుతం.
సరే, ఇంకా ఒక ఉల్లిపాయ, నాలుగు మిర్చి, ఓ గుప్పెడు వేరుశనగలు, నాలుగు రెబ్బలు కర్వేపాకు, ఒక క్యారెట్టు, ఒక బంగాళదుంప, ఒక పది-పదిహేను గ్రాముల అల్లం ముక్క. తిరగమాత గింజలు, ఓ నాలుగు చంచాల నూనె.
పద్దతి -
ముందుగా మిర్చి, అల్లం, ఉల్లిపాయ, క్యారెట్టు, బంగాళదుంప తరుక్కో ఇలా
From ఉప్మా |
అయ్యక, భాండీ పెట్టి నూనె పోసి కాగంగనే తిరగమాత గింజలతోపాటు పల్లీ వేసి వేగాక కర్వేపాకు వేసి చిట్పట్ మన్నాక తరుక్కున్న మిర్చీ, అల్లం వేసేయ్. వేగినాక ఉల్లిపాయలు వెయ్యి. ఉల్లి గోల్డెన్ బ్రౌన్ కి రాంగనే
From ఉప్మా |
ఇందాక తరుక్కున్న క్యారెట్టు, బంగాళదుంప వేసేయ్. వేగనీ.
ఈలోపల ఓ నాలుగు గిద్దెల నీళ్లు సిద్ధం చేస్కో. దుంప, క్యారెట్టు వేగంగనే ఈ నీళ్లు పోసెయ్యి ఆ భాండీలో.
నాలుగు గిద్దెలు ఏమిలెక్క? లెక్కేంటంటే, ఒకటికి రెండు. అనగా ఒక పార్టు రవ్వ ఉడకటనికి రెండు పార్టుల నీరు అవసరం. కాబట్టి రెండు గిద్దెల రవ్వ కొల్చుకుని పక్కన సిద్ధంగా పెట్టుకో.
భాండీలోని నీళ్లు తెర్లుతున్నప్పుడు ఒక చెంచాడు ఉప్పేసేయ్.
From ఉప్మా |
ఇప్పుడు ఆ తెర్లుతున్న నీళ్లలో ఇందాక సిద్ధంగా పెట్టుకున్న రవ్వని నెమ్మదిగా పోస్తూ కలతిప్పుతూ పూర్తిగా పేసేసాక మొత్తం ఓ సారి కలిపేసి మూతపెట్టి, తక్కువమంటపై ఉంచు. ఉడకనీ.
ఓ ఐదు నిమిషాలకి మూతతీసి చూడు ఉడికిందేమో.
From ఉప్మా |
ఉడికే ఉంటుంది. మంట ఆపేసి ఆరగించు.
నేను చేసినదాంట్లో కొంచెం నీళ్లు తక్కువ అయినై మరియూ కొంచెం లవణం తగ్గింది.
గమనిక -
౧. గోధుమరవ్వ మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది. వారికే కాకుండ ఎవ్వరికైనా మంచిదే మరియూ తొందరగా జీర్ణం అవుతుంది కూడా.
8 comments:
గోధుమరవ్వ ఉప్మా ... తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్షా. ఈ విధంగా ఉప్మాకు ప్రచారంకల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నాం అని తెలియచేసుకుంటున్నాం.... ఉ.వ్య.సం (సరదాగా)
ఉప్మా ... :(
అద్యచ్చా, నాకు తెలుగు లో నచ్చని,అచ్చిరాని పదమేదైనా ఉంటే గింటే అది ఉప్మా నే అని మనవి చేసుకుంటున్నా.
'నాలుగు గిద్దల నీళ్ళు..' ఎన్నాళ్ళయ్యింది ఈ మాట విని...? మధుమేహ వ్యాధి గ్రస్తులు తినగలిగే కొత్త రకం వంటల గురించి రాయమని మనవి.
అన్నలూ అక్కలూ చెళ్ళెళ్లూ తమ్ముళ్ళూ - అన్నీ అందరికీ ఇష్టం ఉండవూ కానీ ఆరోగ్యకరం ఐతే తప్పక తినాలి.
భాస్కర్ గారు,
ఇక్కడ ముఖ్యమైన విషయం మరిచిపోయారు. ఎప్పుడు గాని. రవ్వను (ముంబాయి ఐనా గోధుమ ఐనా)కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. రుచిగా ఉంటుంది. ఉడికేటప్పుడు ఉండలు కట్టదు.. దీనికి కొద్దిగా నూనె ఎక్కువగా ఉండాలి. పర్లేదు అనుకుంటే చివర్లో గరిటెడు (చిన్నదో, పెద్దదో మీ ఇష్టం) నెయ్యి వేసి మూట పెట్టాలి.ఇక చూసుకొండి ఉప్మా రుచి . అదిరిపోతుంది..
asalu upma ekkada puttindo telusu kovali
asalu upma ni evaru kanipettaro urgent ga telusukuni upma yokka pramukhyathanu teliya cheppali.
Post a Comment