ఇది సెయ్యటానికి కావాల్సినవి
ఓమాదిరి సైజు కోసుగడ్డ ఒకటి.
ఓ నాలుగు పచ్చిమిరపకాయలు.
ఐదురూపాయల నాణెం అంత అల్లం.
ముఫైఎనిమిది.నాలుగు గ్రాముల ఆవుదం సమించండి గుర్గారు నూనె.
తిరగమాత గింజలు.
మరియూ ఇంగువ.
ఓ చెంచా ఉప్పు.
ఓ అరచెంచా కారం.
ఈ విధానం బెంగళూరు పద్దతి.
ఏటయ్యా అంటే -
ముందుగా మిరిచి నిలువునా చేరేసి పక్కనెట్టు.
అల్లం సిన్న సిన్న ముక్కలుగా తరుక్కో పక్కనెట్టేయ్.
ఇప్పుడు కూసుగడ్డని సన్నగా తరిగేస్కో.
భాండీ ఎట్టు. నూనెపొయ్యి, వేడెక్కినాక తిరగమాత వెయ్యి. చిట్పట్ అన్నాక ఇంగువ వెయ్యి. అయ్యాక పసుపు చిటికెడు వేసేయ్. తిరగమాత మాడకముందే అల్లం మిర్చి వేసేయ్యి. వేయించు. ఓ నిమిషం అయ్యాక తరుక్కున్న కోసుగడ్డ వేసేయ్. ఓసారి మొత్తం తిప్పి మూతెట్టు.
గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపు, ఉప్పు కారం వేయ్యి.
దింపి లాగిఉంచు వేడి వేడి అన్నం, నెయ్యి వేస్కుని.
ఈ కూరలో కీ - ఇంగువ. తిరగమాతలో వేసే ఎండుమిర్చి ఇంగువలో వేగుట. ఈ కూర తినునప్పుడు ఈ ఎండు మిర్చీని కొరుక్కుంటు ఆస్వాదించు.
సరే అలానే - పురజనుల కోరికపై కోసుగడ్డ అనగా కోసేసిన గడ్డ కాదు, క్యాబే-జీ. అబ్బే, అదేంతిట్టు కాదబ్బాయ్ క్యాబేజీ అని.
Wednesday, April 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
కోసుగడ్డ >> గీదేందండి?
కోసుగడ్డ ? అంటే ?
ఉల్లిపాయ?
అదే అనుమానం... కోసుగడ్డ అనగానేమి??
భాస్కర్ గారూ,
అందరూ మొదటిలైను, సారీ.. హెడ్డింగు దగ్గరే ఆగిపోయారు... కింకర్తవ్యం? ...
ఇది మరీ దారుణం. అంటే ఎవ్వరూ ఈ పోస్టుకి ముందరి పోస్టులు చదవట్లేదన్నమాట. హన్నా!! కోసు పువ్వు అనగా కాలీఫ్లవర్ అనీ, కోసుగడ్డ అనగా క్యాబే-జీ అనిన్నీ అది ఇదీ అనిన్నీ http://nalabhima.blogspot.com/2009/03/blog-post.html ఈ నా తాజా వంట పోస్టులో రాస్తే, ఇప్పుడొచ్చి, అయ్యా ముఖ్యమంత్రి గారూ, కోసుగడ్డ అంటే ఏంటీ అని ప్రశ్నించటం భావ్యమా అధ్యక్షా?
అయ్యా అధ్యక్షా!!వ౦ట బాగు౦ది కాని ఇ౦ట్లొ ఇలా చెయలెదె మీరు.ఇనా మూడు పూటలు ఆ కూరె తిన్నారు(మెము తినలేక వదిలేస్తె).వ౦ట విధాన౦ బాగు౦ది చేసి౦ది ఎలాఉన్నా!
ha ha ha:) అసలు రహస్యం బయటకు వచ్చింది ! హరిత గారు ఎవరో నాకు తెలిసింది !
కుళ్ళుబోతులు. నేనుప్పొకోను. ఆడాళ్లందరూ కలిసి ఒక్కటై అది ఇది...డమాల్ ఢిమీల్
BTW పరీక్షలు పెట్టె ముందు కొంచం క్లూ ఇవ్వాలి మాస్టారు ! అసలే మేము intellisense use చేసే డెవలపర్లమి
శ్రావ్యా - ఇది సాధారణంగా చెప్పుట!! డెవలపర్స్ తో మేము (నేనూ, నాలాంటి బూట్లేస్కున్నోళ్లు) ఆడే కాలిబంతి ఆటలో, మేమెప్పుడూ బంతిని డెవలపర్స్ కోర్టులోనే ఉంచాలని చూస్తాం.
కాబట్టి బ్లూస్ క్లూస్ అన్నీ మీరే పట్టేయ్యాలి
కాస్త హరిత గారి రుచులు కూడా ద్రుష్టిలొ పెట్టుకుని మరీ రెసిపీ ఉండాలి అధ్యక్షా!
ఐదురూపాయల నాణెం అంత అల్లం అంటే ఆమజ్జెనొచ్చినయ్యా,ఇప్పుడొస్తున్నయ్యా?? సరిగా చెప్పాలి
తిరగమాత గింజలు అవి తితగమోత గింజలని నా అనుమానం
మరియూ ఇంగువ ఈ మరియూ ఇంగువ ఏషాపులోనూ లేదంటున్నారు ?
అలాగే ఈ కీ - ఇంగువ కూదా ఎవదూ అమ్మట్లా
వంటల గురించి రాసేవ్ప్పుడు నాలుగురకాల జనాభాని దౄష్టిలో పెట్టుకుని రాయాలని శాస్త్రం
మొదటిది-పెళ్ళికాని వారు(ముఖ్యంగా మగవాళ్ళు)
రెండు-బలవంతపు బ్రహ్మచారులు:భార్య పుట్టింటికి వెళ్ళ్గా వంట ఒంటరిగా చెసుకుంటున్నవారు
మూడు-భార్య ఊరు వెళ్ళి పిల్లల థో ఉండి వంటచేయవలసిన వారు
నాలుగు ????
కాబట్టి ఇకముందు కోసుగడ్డ,,కోసుపువ్వు అని రాసేటప్పుడు పక్కనే వాటి అసలు(వాడుకలో)పేర్లు కూడా రాయాలన్నమాట.
గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా???
అసలీ గోల్డెన్ బ్రౌన్ అంటే ఎందో కాస్త చెప్పయ్యా
అదెక్కదికి వచ్చుద్దో వస్తే ఏమిచెయ్యాలొ కూడా వివరించు
అన్నా -
టైపో మిస్టేకు. ముందుగా "మరియూ ఇంగువ" వరకే రాసా, ఆత్తర్వాత ఉప్పూ కారం తగిలించా.
గోల్డెన్ బ్రౌన్ అనగా మాట్టానికి కొంచెం ముందు. ఏం పర్లేదు అటు ఇటు ఐనా. :):)
గో.బ్రౌ ఐతే ఏమవ్వుద్ది? పట్టించుకోకోకపోతే మాడుద్ది, పట్టించుకుని, ఉప్పులూ కారాలేసేస్కుని దింపేస్కుంటే కమ్మని కూరౌవుద్ది
:):)
సునీత గారు - అట్టానే అద్దెచ్చా
ఎప్పుడూ కేబేజి తేని నేను మీ రెసిపీ చూశాక కొనుక్కొచ్చి వండాను. భ్రహ్మాండంగా ఉంది ..మరి మీ శ్రీమతికెందుకు నచ్చలేదో! :)
తెరెసా గారు: ధన్యవాదాలు. ఇక మా ఆవిడ, సరదాగా అంతే :):)
Post a Comment