Friday, April 24, 2009

పాస్తా రివిజిటెడ్ బొమ్మలు సెలనసిత్రాలతో

ఇయ్యాల మా ఇంటో పాస్తా చేస్కున్నం.
దాని ఇది ఇదానం ఈడాబెడతన్నా, బొమ్మలు, సెలన సిత్రాలతో.
ఇంతకముందరే జెప్పా, పాస్తా వీజీ అని.
ఇయిగో ఇయ్యి కావాల ముందు.
From పాస్తా

సన్నంగ అన్నీ తరుక్కునే లోపు,
పాస్తాని ఏడినీళ్ళల్లో ఎయ్యాల
From పాస్తా

ఈ లోపల, ఎర్రయి, ఆకుపచ్చయ్యి, పసుప్పచ్చయి బెంగుళూరు మిరగాయలు, ఉల్లిపాయలు, మిర్చి, అల్లం, వెల్లుల్లి, రాములక్కాయ అన్ని తరుక్కుని పక్కనెట్టుకోవాల.
From పాస్తా

ఇంక, ఆ ఉడుకుతున్న పాస్తాలో ఓ చెంచా ఉప్పు, ఓ చెంచా నూనె ఎయ్యాల
From పాస్తా

అయి ఉడికినాక, ఆటిని వడపోసి ఓ సారి సల్లనీళ్ళకింద పెట్టాల.
భాండీ పెట్టి ఓ ఐదు సెంచాల నూనె పొయ్యాల. నూనె కాగంగనే, మిర్చి, వెల్లుల్లి, అల్లం ఏసి ఏపాల, ఏగినాక ఉల్లిపాయలు నూకాల.
From పాస్తా

ఉల్లిపాయలు ఏగినాక, బెంగుళూరు మిర్చి ఎయ్యాల, మళ్ళీ ఏపాల
From పాస్తా

ఇయ్యీ ఏగినాక, రాములక్కాయలు ఏసి, రామ్ములక్కాయ గుజ్జు ఓ నాలుగు సెంసాలు ఏసి ఏపాల. ఓ సెంసా ఉప్పేసి రామ్ములక్కాయలు ఉడికినయి అన్నాక పాస్తా ఏసి బాగా తిప్పాల.
From పాస్తా

మద్దెలో రాములక్కాయ గుజ్జు సాలకపోతే ఇంకొంచెం ఎయ్యాల.
అయినాక, కొత్తిమీర ఎసేసి ఓ సారి తిప్పేసి
From పాస్తా

పొయ్యి ఆపేసి, నిమ్మకాయ పిండాల.

ఇప్పుడు ఏడి ఏడిగా లాగించాల.
అదీ కత.

18 comments:

పరిమళం said...

భలేగుందండి ! నేనూ ఓపాలి సేస్తే ఇలా మీ సిత్రంలోలాగ రాలేదేటండీ ? రామ్ములక్కాయంటే టమాటాలే కదండీ ..కోసుగడ్డ అంటేనేమో క్యాబేజీ ...మీ బ్లాగ్ సూత్తన్నప్పట్నించీ సేలా ఇసియాలు తెలిసిపోతన్నాయండి ..ఆయ్ ...థాంక్సండే .. :) :)

Sravya V said...

ఇంతకి పొయ్యి మీద పేపరు ఏంటి మాస్టారు?

పుష్యం said...

నమస్తే అన్నా, పాస్తా గురించి మస్తుగ చెప్పినవ్. ఈ పాస్తా గీస్తాలను ఇటాలియనోళ్ళు తింటరు గదా. ఆళ్ళ రుచి రావల్నంటే మన నూనే బదుల్గా జర ఎకస్ట్రా వర్జిన్ ఆలివాయిలు వాడాల్న. మస్తుగుంటది. గట్లనే కొంచెం ఒరగానొ (గదేన్వయా, మన వాము చెట్టు ఆకు లేదు, గదే) కూడా జల్లితే రుచి అదర్తది.

కం//
పాస్తా వంటని చక్కగ
చేస్తే ఆలివుది నూనె చేర్చగ వలయున్
మస్తుగ రావలెనంటే
కాస్తో కూస్తో ఒరగనొ కలపగ వలయున్

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

మాకరోనీ పాస్తా కి ఇటాలియన్ రెస్టారెంట్ లో లా కొంచెం పాలు కూడ కలపొచ్చు..:-)

asha said...

ఈ పాస్తా కూడా ట్రై చేశాను కానీ...ఆ స్పెగెట్టీయే నచ్చింది నాకు.

Bhãskar Rãmarãju said...

పరిమళం గారూ - ధన్యవాద్. :)
శ్రావ్యా గారూ - మన వంటల్లో నూనె వాడకం ఎక్కువ. మరి పొయ్యి పైన చింది పడుతుందికదా నూనె. కనుక, మరకలు పడకుండా ఆ రేపర్ అన్నమాట
పుష్యం గారూ- మస్తుగ చెప్పినవ్లే. ఐతే, నేను వంటచేసినప్పుడల్లా ఓలివ్ ఓయిల్ తోనే జేస్త.
ఓరెగానో ఏయ్యాల్సుండె కానీ ఇంట్ల గది ఖతం అయ్యిందిలే. గేంజెయ్యాలే. గట్లనే తిన్నం.
రాజమల్లేశ్వర్ గారూ - పాలుపొయ్యొచ్చు. నే ఎప్పుడో జెప్పిన ఇట్లజెయ్యాలే అని రూలేమీ లేదు, కాకపోతే ఎవర్నికి తోచిన విధంగా ఆళ్ళు చేస్కోవచ్చు.:):)
భవానీ గారూ - స్పగెటి ఈసారి చేసినప్పుడు పెడాతా ఇక్కడ. అంతవరకూ అంత్యాక్షరీలో పాల్గొంటూ అప్పుడప్పుడూ ఇటు ఓ లుక్కేస్తూ ఉండండేం!!!

sunita said...

నేనైతే అన్ని రంగుల బెంగొళూరు మిరగాయలూ, సీలరీ,రాములక్కాయలూ, వెల్లిగడ్డా కలిపి నూరేసి నూనె లో ఉడికిస్తా. ఉడికేటప్పుడే ఒక స్పూన్ పంచదార కూడా వేస్తా. రాములక్కయాల్లోని ఏసిడిటీ తగ్గించడానికి.కొన్నిసార్లు కొంచం చీజ్ కూడా కలుపుతా.

జ్యోతి said...

అసలు పాస్తా కి, నూడుల్స్ కి, మాక్రోనీ కి తేడా ఏంటి??? బోలో

Bhãskar Rãmarãju said...

పాస్తా అనేది ఇటాలియన్ వంట
మాకరోని అనేది ఒక రకమైన పాస్తా. నేను చిత్రంలో పెట్టినట్టుగా పెన్నె అనేది ఒకరకమైన మాకరోనీ పాస్తా.
నూడుల్స్ అనేది, జెర్మన్ నామం ఐనా, మొట్టమొదట దానిగురించి రాసింది మాత్రం చీనా వాళ్ళు. నాలాంటి వాళ్ళు నూడుల్స్ ని ఒక రకమైన పాస్తా వేరియంట్ గా భావిస్తారు.

రాధిక said...

పెద్ద చెయ్య తిరిగిన వాడిలా తిప్పుతున్నారు గరిట.ఇన్నాళ్ళూ ఇంటావిడ సేత్తంటే మీరు బ్లాగులో పెట్టుకుంటున్నారనుకున్నా.చూత్తా వుంటే మా బా అనుభవం వున్నట్టుంది :)

Bhãskar Rãmarãju said...

రాధిక గారూ - బాగా సెప్పావ్ వొదినా, సిన్నప్పటినుండీ సేత్తల్లా మరీ :):)

భాస్కర రామిరెడ్డి said...

మీ దాసేపల్లి లో గిట్టాంటి ఏసాలేసినవనుకో ..



"ఏందయ్యో ఇయ్యో.. పాముల్లాగ సాగుతుండయ్.. ఏంతిండి ఇది. ఇది తిని పొద్దులుగూకులూ పని ఎట్టాచేత్తారేంది" అని తరుంకుంటారు.

Bhãskar Rãmarãju said...

మాబాగా సెప్పావ్ అన్నయ్యా.
మేమేమి తినివోళ్ళం చిన్నప్పుడు. వన్నం. అంతే. బాగా గుర్తుచేసావ్.
నువ్వు తిన్నావో లేదో, జొన్న అన్నం, సజ్జలు, వరిగెలు, కొఱ్ఱలు....ఇయ్యల వరి అన్నం అందరూ తిన్టన్నారు, ఆయాల వరి తిన్టన్నాడూ అంటే ఆడు ఓ పెద్ద మోతుబరి, లేకపోతే ఆయాల పండగ.

Bhãskar Rãmarãju said...

"నా బ్లాగు" స.నై.ట గారు - పందార!! హం!!! బానే ఉండచ్చు. నేనెప్పుడూ ట్రై సెయ్యలే.

teresa said...

పాస్తా సప్పగుంది గానీ నేపథ్యంలో నలదమయంతుల చెణుకులు మజాగున్నయి :)
ఒరు చిన్న సజెషన్‌ తంబీ - స్పగెట్టీ వండినప్పుడు అది తినే విధానం సూరీడు చేత విడియో డిమాంస్ట్రేషన్‌ పెట్టాలె!
పక్కనే అనఘ తల్లి పప్పన్నం చప్పరిస్తుంటే మరీ బాగు :)

Bhãskar Rãmarãju said...

లైఫ్ లో స్పైస్ ఎక్కువై పాస్తా లో తక్కువైంది తెరెసా గారూ :):)
పిల్ల ఇప్పుడే దొరికినవన్నీ నొట్టో ఏసేకుంటున్నది. ఇక ముందు ముందు ఎలా ఉండబోతోందో :):)
మా వాడు కెమెరా స్టాండ్ తో ఆటలాడుతున్నాడు...

భాస్కర రామిరెడ్డి said...

గదేంది సోదరా, మీది మాగాణి ప్రాంతం కదా
జొన్న అన్నం, సజ్జలు, వరిగెలు, కొఱ్ఱలు ?

Bhãskar Rãmarãju said...

మాగాణా? యాడా? పైనోళ్ళకే నీళ్ళు. కిందోళ్ళకేడా? తన్నుకుసావడమేగా. ఎన్ని తలలు తెగినై, ఎన్ని పొలాలు నరుకుడుపడినై. ఎన్ని రాత్రుళ్ళు జనాలు నిద్దర్లు పోకుండా దుడ్డుకర్రలు పట్టుకు తిరగిన్రో.
కుడుకాల్వ గుంటూరుకి అటువైపు జనాలకి. అనగా పేటా నుండి పైకి, అటు వైపు జనాలకి బాసూ.
పల్నాడు ఇప్పటికీ అంతే ఉంది. ఎదుగు బొదుగు లేకుండా...కిట్ట ఒడ్డునే ఉండి చుక్క నీటికి నోచుకోలేదు పల్నాడు.
బలవంతుడిదే రాజ్యం, డబ్బునోడికే నీళ్ళైనా, పదవైనా ఏదైనా.