Wednesday, December 3, 2008

పాస్తా

ఆన్ సైట్ కి వెళ్లినోళ్లకి తిండి ఓ పెద్ద సమస్య. కొంతమంది "హా! డబ్బాలో మన వన్నం, బిర్యాని, పప్పుకూరలేస్కెళ్తే మసలా వాసన్లు వస్తాయ్, క్లైంటు దడ్చుకు సస్తాడు" అని అనుకుంటారు. నేను మా కార్యాలమ్లో నా సీట్లోనే కూర్చుని, అన్నం దోసకాయ పప్పు, ఆవకాయ వేస్కుని చేత్తో హ్యాపీగా కలుపుకుని లాగిస్తా. మా మేనేజెర్ వస్తే - ఓ సారి జూసి ఓహ్ అని వెళ్లిపోతాడు. బొంగు! మన బువ్వ మన ఇష్టం. అనిజెప్పి ఎండుచాపల పులుసు తీస్కెళ్లలేంలే.

చాలా సింపుల్గా, రుచిగా, డబ్బాలోబెట్టుకుని, మైక్రోవేవ్లో వేడిజేస్కుని తినగల్గే వంటల్లో పాస్తా ఒకటి. ఈ మధ్య మల్టై గ్రైన్ పాస్తా కూడా దొరుకుతున్నది మార్కెట్లో.
సరే పాస్తా అంటే అది మనదే. మన ఉప్మ కూడా ఓరకం పాస్తానే. ముందు ఈ పాస్తా సంగతేంటో జూద్దాం.
పాస్తా అంటే ఇటాలియన్లో "తడిపిన పిండి" అని అర్ధం, చపాతీపిండిలా. పాస్త అంటే ఇలాంటి పిండితో వండే వంటలు అనుకోవచ్చు. కొంతమంది "పాస్తాతో వండిన వంటల్ని పాస్తా" అంటారు. :):) అదేనాయనా గమ్మత్తు. అర్ధంకాకపోతే పాస్త వండుకుని హ్యాప్పీగా ఓ గళ్లాసులో దాచ్చారసం పోస్కుని పాస్తా తింటూ తాగుతూ అట్టా బైటపడే మంచు సూత్తా ఎన్సోయ్ చెయ్.

సరె మొత్తం 350 రకాలు ఉన్నాయంట పాస్తాల్లో.
స్ప్రింగుల్లాంటివి, గొట్టల్లంటివి, బొంగుల్లాంటివి, చెక్కల్లాంటివి, ముక్కల్లాంతివి, బీడీల్లాంటివి, సుట్టల్లాంటివి, తాళ్లలాంటివి, తేళ్లలాంటివి, నాలాంటివి, నీలాంటివి...et al.

తాడుల్లాంటి అదే పావులాఉండే పాస్తాని స్పగెటి అనికూడా అంటారు.

ఇంక ఈ సమాచారం సాలు, ఇసయంలోకొస్తే:-
పాస్తా సెయ్యటానికి ఏంగావాలా? పాస్తా గావాల. వాల్మార్ట్కో (సూపర్సెంటర్), లేక శాంస్కో లేక బీజేస్కో ఎళ్లినప్పుడు బరిల్లా పాస్తా కోసం వెతుకు. ఇదిగో ఇట్టాంటివి తెచ్చుకో


సరే - స్ప్రింగులు తెచ్చుకున్నావ్ అనుకుందాం.
ఇంకేంగావాలి? ఎజిటేబిళ్లు - అంటే కూరగాయలు. ఏమి కూరగాయలు - నీకు దొరికినవన్నీ - బీన్సు, క్యారెట్టు, బ్రొక్కొలి, బేబీ మొక్కజొన్న - మరియూ ఏ మరియూ ఆ మరియూ పా. ఇంకా, టమాటాలు, మిరగాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, నూనె, కొత్తిమీర.
ఏమి నూనె - నీకు తెలిస్తే ఆలివ్ ఆయిల్ (1), లేకపోతే, మనం మామూలుగా వాడుకునే నూనె.

చేసే పద్ధతి :
ఓ పెద్ద గిన్నే తీస్కో నువ్వు వండుదాం అనుకునే పాస్తా మెత్తం దాంట్లో పట్టగలిగేంత పెద్దది. పాస్తా మునగగలిగేంత నీళ్లు పొయ్. నీళ్లు సల సల కాకంగనే పాస్తా దాంట్లో వెయ్, కొంచెం ఉప్పు వెయ్ (బాసు!! ఉప్పు వెయ్, పొయ్యకు), ఓ చెంచాడు నూనె వెయ్ (2). ఇక ఉడకని. మీడియం లో పెట్టు మంటని పాస్తా గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది ఆ మంటతో.
ఇప్పుడు, ఉల్లిగడ్డ సన్నగా నిలువుగా తరుక్కో, మిరగాయ, నిలువుగా నాలుగు ముక్కలు జేస్కో, కూరగాయ ముక్కలన్ని తరుక్కో. బీన్స్, ఒక్కోటి నాలుగు ముక్కలు, బ్రొక్కొలి చిన్న చిన్న గుత్తులుగా, క్యారెట్టు చిన్న చిన్న క్యూబుల్లా తరుక్కో, టమాటా కూడా చిన్న చిన్న క్యూబుల్లా తరుక్కో, కొత్తిమీర కడుక్కో, పక్కనబెట్టు. ఈలోపల పాస్తా ఉడికిందేమో జూడు. ఎలా, ఓ పాస్తాని చెంచా పెట్టి గిన్నె గోడకేసి నొక్కు మెత్తగా విడిపోతే ఉడికినట్టు. సరే ఉడకంగనే పొయ్ ఆర్పివెయ్, ఓ జల్లెడ తీస్కో, సింకు దెగ్గరకి జల్లెడ, పాస్తా ఉడ్కబెట్టిన గిన్నే తీస్కెళ్లి, వడపొయ్ - గిన్నెని ఆ జల్లెడలో బోర్లించు. చల్లటినీళ్లని ఓసారి ఆ జల్లెడ మీడుగా పోని. పక్కనబెట్టు. ఇందాకటి గిన్నె తీస్కో, ఓ సారి కడుక్కో, మళ్ళీ పొయ్యి మీద బెట్టు. నూనె పొయ్. నూనె వేడెక్కేలోపు, వెల్లులి తీస్కో, బొటనవేలితో ఘట్టిగా నొక్కు, తొక్క తీయ్, పక్కనబెట్టు, నూనె వేడెక్కింది, దాంట్లో తరుక్కున్న మిరగాయ వెయ్, చిట్ పట్ అంటుంది, దడుసుకోకు, ఓ సారి తిప్పు, వెల్లుల్లి వెయ్, ఓ సారి తిప్పు, ఇప్పుడు - తరుక్కున్న ఉల్లిపాయలు వెయ్, వేపు - వేగినయ్ అనుకున్నాక, కూరగాయ ముక్కలు వెయ్, వేపు - వేగినయ్ అనుకున్నాక టమాట వెయ్, ఉప్పు వెయ్, ఓ సారి తిప్పు, టమాటా కొంచెం ఉడకని, ఇప్పుడు ఉడ్కబెట్టిన పాస్తావెయ్, తిప్పు, కొత్తిమీరతో ముగించు.
రిఫరెన్సు:
1. ఆలివ్ ఆయిల్ - ఇదేంటిది అనుకుంటున్నావా? అదే కహానిలో ట్విష్టు. ఆలివ్ ఆయిల్ నాలుగైదు రకాలు.
ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ - కోళ్డ్ ప్రెస్సింగ్ ద్వారా తీసేది. 0.8% ఆమ్లత్వం.
వర్జిన్ ఆలివ్ ఆయిల్ - 2% ఆమ్లత్వం. దీనికి రుచి ఎక్కువ
ప్యూర్ ఆలివ్ ఆయిల్ , ఆలివ్ ఆయిల్ - వర్జిన్ ఆలివ్ ఆయిల్ + రిఫైండ్ ఆయిల్
et al.
దీంట్లో సంగతి ఏంటంటే కొన్ని రకాల ఆలివ్ ఆయిళ్లని ఫ్రై వంటల్లో వాడకూడదు. వాటిని కేవలం డ్రెస్సింగుకి మాత్రమే ఉపయోగించాలి.
2. ఉడుకుతున్నవాటిల్లో నూనె దేనికి? అన్నంలో కూడా ఓ బొట్టు నెయ్యి వేస్తే - అన్నం పొడిపొడిలాడుతుంది. అట్టానే ఇక్కడకూడా నూనె వేస్తే పాస్తా కరుచుకోకుండా విడివిడిగా ఉంటాయ్.

నోట్: పాస్తా చేసే విధానం ఇది అని ఎక్కడా లేదు. ఐతే - ప్రాంతాలవారీగా ఫేమసు ఐన విధానాలు ఉన్నయ్. అంటే గోల్కొండ నవాబులు ఒకలా, పల్నాటి వీరులు ఇంకోలా, విశాఖ అరసం సభ్యులు ఇంకోలా చేస్కుంటారు.

మరి ఇంక ఆలస్యం దేనికి లాగించండి.

18 comments:

వేణూ శ్రీకాంత్ said...

వంట వండుకొని ప్రయత్నించడమేమో కానీ బ్రదర్ మీ శైలి చూసి నవ్వుకోడానికి మాత్రం ఖచ్చితం గా మీ వంటలు చదువుతా... కానీ నాకు చదువుతుంటే మన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ లాగానే అనిపిస్తుందే ఎక్కడా ఇటాలియన్ వాసనలు తగలట్లేదేంటి చెప్మా....

భాస్కర్ రామరాజు said...

అన్నాయ్!! మన ఇస్టైల్ పాస్తా అన్నాయ్!! దేశి పాస్తా. మరి మన వాసన రాకపోతే ఎలా.

teresa said...

అసలు pasta తినే ఆనందమంతా cheese లోనే గదా తమ్ముడూ. మరీ ఇంత దేశీ చేసేస్తే ఎలా :(

Sravya said...

సాస్ కూడా అవసరం లేదా? బావుంది దేశి పాస్తా

భాస్కర్ రామరాజు said...

@తెరెసా గారు: ఛీజ్??రిక్కొటానా?టెర్రకొట్టానాఎర్రకొట్టనా?చెద్దరా?రవియొలినా?మొజరిల్లానా? ఎందుకొచ్చిన గోల సమ్మగా మన ఇష్టైల్లోజేస్కోక!!
@శ్రావ్య గారు: మీకోగమ్మత్తు తెల్సా? పాస్తా లేకుండా కూడా పాస్తా చేస్కోవచ్చు. పిల్లాట:):) టమాటా సాస్ బదులు డైస్డ్ టమాటా అన్నమాట.

Sravya said...

భాస్కర్ గారు :)

Sravya said...

btw
ఈ లింక్ చుశారా? ఇక్కడ దాకా వెళ్ళింది మీ వంటల వాసన ! :)
http://blog.vihaari.net/2008/11/blog-post_25.html

భాస్కర్ రామరాజు said...

@శ్రావ్య గారు: :):) >>ఆయనెవరో భాస్కర్ రాజట నల భీమ పాకం అని మొదలు పెట్టి భలే ప్రయోగాలు చేస్తున్నాడు
Its more fun and more info too. How many of us really know that there are these many types of olive oils.

Sravya said...

Yes Yes thats y only I am a regular visitor here !

భాస్కర్ రామరాజు said...

శ్రావ్యాకి జై. ఓ ప్లేటు పాస్తా :):)

సుజాత said...

పాస్తా కూడా దేశీ స్టైలేనా? ఇక్కడ పిజ్జా హట్ వాడు, ఇతర పిజ్జా కొట్ల వాళ్ళు పిజ్జాల్లో ఉల్లిపాయలు, పనీర్, పచ్చి మిరపకాయలు,(హాలపానోలు కాదు) ఇంకా వాళ్ల పిండాకూడు వేసి దేసీ పిజ్జాలు చేస్తుంటారు లెండి.

పాస్తా ఇటాలియన్ స్టైల్లోనే బాగుంటుంది.ఇక్కడ హైద్రాబాదులో little Italy అనొక రెస్టారెంటుంది. వాళ్ల దగ్గర పాస్తా చాలా బాగుంటుంది.

మొత్తానికి మీ స్టైల్లో ఉంది పోస్టు!
పాస్తా తర్వాత egg plant parmesan ఎలా చెయ్యాలో చెప్పండి ప్లీజు!

శ్రీనివాస్ పప్పు said...

బాచి బాబూ..ఈ గోలంతా ఎందుకు కానీ మన హైదరాబాద్ వచ్చెయ్య రాదె..చక్కగా ఒక వొటేలు ఎట్టుకుని బతికేద్దాము..ఓతంతావ్..

Anonymous said...

మా ఇంట్లో నూడుల్ల్స్ ఇలాగే చేస్తా. కూరల్లేకపోతే మన వుప్మా తాలింపు అదే మినప్పప్పు, సెనగపప్పు కర్వేపాకు ఇంకా చేతికి ఏది దొరికితే అది వేసి చేసేస్తా . అది నూడుల్స్ కాదనే దైర్యం ఎవ్రికీ వుండదు . ఎందుకంటే అందులో నూడుల్స్ వుండితీరుతుందికదా . పాస్తా కొంచెం గట్టిగ వుంటుందని విన్నాను . కాబట్టి కాస్త ఎక్కువసేపు వుడకపెడితే సరిపోతుందంటారా నాన్నగారూ

జ్యోతి said...

అదీ సంగతి. ఎక్కడైనా , ఎప్పుడైనా మన దేశీ ఇస్టైల్ లో మార్చేస్తే సరి.
పాస్తా ఇలా కూడా చేసుకోవచ్చు. భలే ఉంటుంది. పాస్తా ఎలా చేయాలో తెలీక, నేను చేసిన ప్రయోగం..
బాగా మసాలా, ఉప్పు,కారం వేసి టొమాటో కూర చేసుకుని ఉడికించిన పాస్తా( గొట్టంలా , శంఖంలా ఉండేవి) వేసి మరి కాస్త ఉడికించి, కొత్తిమీర వేసి లాగంచడమే..

Aruna said...

My brother's friends are always searching for algorithms for different recipies. I will forward this link them. Its good. [:)]

భాస్కర్ రామరాజు said...

@సుజాత గారు: పాస్తా ఇలా చెయ్యాలి అని రూలేమి లేదు, కాబట్టి మన పద్ధతిలో మనం.
>> వాళ్ల పిండాకూడు వేసి దేసీ పిజ్జాలు చేస్తుంటారు లెండి.
:):) పిజ్జా క్రస్ట్ దేనికైనా ఒక్కటే (దాదాపు), పైన టాపింగు మన ఇష్టం, పప్పు లేక, పుల్లశనగ (చెన్నా), రాజమ్మ (రాజ్మా) ఏదైనా ఏస్కోవచ్చు.
@పప్పు యార్: నానేతంతాను, నువ్వేదంతే నానూ అదేఅంతాను. ఏటి, వొచ్చెయ్ మంతావేటి అన్ని ఒగ్గేసి, కుళ్లబొడిసేద్దాం, ఏతంతావ్?
@లలిత గారు: బాగాచెప్పారు. అదీ పధతి. :):)
@జ్యోతి గారు : థాంక్సులు.
@అరుణ: Thanks for forwarding my algorithms. :)

సత్యప్రసాద్ అరిపిరాల said...

రామరాజుగారు,
మీరు చెప్పిన పాస్తా ఈ రోజు ట్రై చేశాను..!! బాగుంది. తర్వాతేంటి??

ఎయ్యాలని ఎవరైనా ప్రయత్నించదలిస్తే రెండు టిప్స్: పాస్తా కనపడినదానికన్నా వుడికిన తరువాత మూడింతలౌతుంది.. దాని బట్టీ నీళ్ళు ఇతర సామాగ్రి ఏర్పాటు చేసుకోండి. టొమాటో సాస్ (మాగీ హాట్ అండ్ సార్) కూడా వేస్తే అదో రుచి..!! మీకర్థమయ్యే వుంటుంది - పాస్తా ఎక్కువై టమాటో తగ్గడంతో ఈ రకంగా సర్దేసా..!! అన్నట్టు రామరాజుగారు చెప్పిన పాస్తా పాకెట్లు మన దేశంలో దొరికే చోటు మై డాలర్ షాపులు..!!

భాస్కర్ రామరాజు said...

@సత్యప్రసాద్ అరిపిరాల :
ముందుగా, నా బ్లాగుకి స్వాగతం.
>>మీరు చెప్పిన పాస్తా ఈ రోజు ట్రై చేశాను..!! బాగుంది.
ధన్యవాదాలు మాష్టారు. మీరు ట్రైచేసి బాగుంది అని చెప్పారు.
>>తర్వాతేంటి?
ఆలోచిస్తున్న ఏమి రాద్దాం అని :):)