Tuesday, December 16, 2008

సిక్కుడుకాయ కూర ఇదానంబెట్టిదనగా

ఇనరా తెలుగు ఈర పుత్రుడా ఈ సిక్కుడుకాయ కూర ఇదానం
తందాన తానా
"స్రోతలందరికీ నమస్కారాలు. బెమ్మసారిగా ఈ జానెడు పొట్టపడే కష్టాలకి సిక్కుడు సెల్లి సేసే సేవ ఇప్పుడు మీముంగట ఇరియబోతున్నది"
"ఆగు సోదరా ఆగు! జానెడు అన్నాడు, పొట్ట అన్నావు, అన్నా! మాకు ఇంకా ఇవరంగాజెప్పు"
"అదేరా! గదుల్లో సమయానికి తొండిలేక, కళ్లముంది పచ్చటి కూరగాయలెన్నున్నా సేస్కోటం రానోళ్లకి ఆకలి మంటేగా"
"ఈసారి అర్ధం ఐంది సోదరా, నిజంగా కష్టలే, మరి సిక్కుడుకాయ కూర ఎట్టాజేస్తారో ఇవరంగా జెప్పు"
"ఇనరా తెలుగు ఈర పుత్రుడా ఈ సిక్కుడుకాయ కూర ఇదానం"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
తందానా దేవనందనానా.. తందానా దేవనందనానా
"ముంగట కిలో సిక్కుళ్లు"
"సై"
"ఇంటికి సంచిలో తెచ్చుకో"
"సై"
"సిక్కుళ్లని కదిగావా, ఒక పళ్లెమ్లో పోసావా"
"భాళా భళీ" ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"సిక్కుళ్లని కడిగావా, ఒక పళ్లెమ్లో పోసావా"
భాళా భళీ
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఒక్కో సిక్కుడు తీసుకో"
"సై"
"ఈనెల్ని ఇర్సుకో"
"సై"
"మూడు ముక్కలుజేసుకో"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"అగ్గి పెట్టి పొయ్యి ఎలించి"
భాళా భళి
"ఓ పెద్ద గిన్నెలో నీళ్లతో"
భాళా భళి
"ఆ పొయ్యిమేద బెట్టేసి"
సై
"నీళ్లు మరగంగనే"
సై
"గిన్నెడు నీళ్లు మరగంగనే"
సై
"ఆ గిన్నెడు నీళ్లు మరగంగనే"
తందానా దేవనందనానా
"ఒక చిటికెడుపసుపుఏస్కో"
సై
"ఒక చెంచా ఉప్పు ఏసుకో"
సై
"ఆ సిక్కుడు ముక్కలు కుమ్మరించుకో"
భళా భళీరా సోదరా, బాగున్నదిరా ఈ కూరరా.హై
"మూతబెట్టి బాగా ఉడకనీ"
హై
"బాగా ఉడికినాక పొయ్యిని ఆర్పేసి"
హై
"ముక్కల్ని వడగట్టి"
హై
"ఓ పక్కన సిద్దంగా బెట్టుకో"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఇప్పుడింకేమి సెయ్యాలో ఇవరంజెప్పు అన్నా"
"అట్టాగేరా, ఇనుకో"
సై
"అగ్గి పెట్టి పొయ్యి ఎలించి"
భళాభళి
"ఓ చెంచాడు నూనెపోసి"
భళాభళి
"తిరగమాతే వేసావా"
తందాన తానా
"తిరగమాత శిటపట అన్నదా"
తందాన తానా
"ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు"
భళాభళి
"ఓ రెండు వెళ్లి రెబ్బలు"
భళాభళి
"ఓ రెండు వెళ్లి రెబ్బలు"
భళాభళి
"నలగ్గొట్టి దాంటో ఏసావా"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
తందానా దేవనందనానా.. తందానా దేవనందనానా
"ఇప్పుడు కొంచెం ఉప్పేసుకో"
తందాన తానా
"కొంచెం కారం ఏసుకో"
తందాన తానా
"ఇప్పుడు ఆ సిక్కుళ్లని"
తందానా దేవనందనానా
"ఇప్పుడు ఆ సిక్కుళ్లని"
తందానా దేవనందనానా
"ఆ భాండీలో ఏసుకో"
తందానా దేవనందనానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఆ కూరని ఓ సారి తిప్పావా"
సై
"ఓ 5 నింషాలు పొయ్యిమీనే ఉంచావా"
సై
"ఇప్పుడింక పొయ్యినాపేసి, ఆ కూరని దింపుక్ని లాగించు"
"అయ్యింది అన్నా, బలే బాగాజెప్పావ్,కూరా సానా రుసిగా ఉంది"
"ఇందుమూలంగా యావన్మందికి నమస్కారాలతో ఇక సెలవ్ దీస్కుంటూ"
"జై హింద్"
నోట్: సిక్కుడుకాయ ఇలా జెయ్యాలి అని ఎక్కడా లేదు. ఒక్కోరోజు కారంతోబాటు కొబ్బరి తురిమేసి సేస్కుంటే, ఇంకోరోజు మాడ్చిన కారం దీన్నే మేము కారప్పొడి అంటాం - ఇదేస్కోవచ్చు, ఇంకోపూట కొబ్బరి కారం, ఇంకోసారి శనగపొడి (పుట్నాల పప్పు, ఎండు మిర్చి, ఉప్పు తిరగమాతలో వేసి దంచితే వచ్చే పొడి) ఇలా రకరకాలుగా వండుకోవచ్చు.
సిక్కుడుకాయకి ఈనెలు తియ్యటం ఎలా? ఇక్కడ సూడండి
వంట

38 comments:

hello said...

Chala bagundhi mee chikudkaya kura.
ela gokarkaya kuura nu chestamu memu ma intlo..but with pachi karamu + kobbari turumu

--Revathi

Srinivas said...

మాస్టారు:

గొరు చిక్కుళ్లు కూర నాకు బాగా నచ్చిన కూర.

యోగి - The outcast said...

హాహ్హ, మంచిగుంది.. గిప్పుడు గాజర్ కి హల్వ గెట్ల జేస్తరో ఒక ఘజల్ పాడి జెప్పరాదె?

వేణూ శ్రీకాంత్ said...

భాళా భళి :-)

వేణుగోపాల్ రెడ్డి said...

ఇలాగకుడా....చేత్తారేటి...సూద్దాం......ఒకసారి.......!

వేణుగోపాల్ రెడ్డి said...

మరి నాకు ఇట్టమైన పచ్చిమిరగాయల తొక్కు గురించి కుడా సెప్పరాదేటి.....!

Sravya said...

బాగుంది ! బాగుంది !

gaddeswarup said...

వెళ్లి రెబ్బలు అంటే ఏమిటి? ఏమధ్యే చిక్కుడు పాదులు పెట్టాను.

భాస్కర్ రామరాజు said...

ముందుగా స్వరూప్: వెళ్లి రెబ్బలు కాది భాయి, వెల్లిల్లి రెబ్బలు.
మిగతా అందరికీ నమస్కారాలు. అంతరించిపోతున్న లేక అంతరించిపోయిన "బుఱ్ఱకధ"ని మళ్లీ బతికించుకుందాం.

ఏకాంతపు దిలీప్ said...

బాగుంది :-) ఆ ఉప్పు కాడా, కారం కాడా ఎంతేసుకోవాలో సెప్తే(1 కేజీ సిక్కుడు కాయల్కి) మాకు సిక్కుడు కాయ కూర సెయ్యటం వచ్చేసినట్టే! :-)

భాస్కర్ రామరాజు said...

దిలీపు, ఎలా మరీ ఇలా అయితే, బొత్తిగా, ఓ రెండు గుప్పిళ్ళలు ఉప్పు, నాలుగు దోశిళ్లు కారం పొసేయ్..:):) ఓ చెంచాన్నర ఉప్పు, అంతే కారం ఏస్కో.

నాగప్రసాద్ said...

కూరా బాగుంది. బుఱ్ఱకథ కూడా బాగుంది. ఈ బుఱ్ఱకథని సినిమాల్లో తప్ప బయట చూసినట్లు నాకు గుర్తులేదు. బహుశా అంతరించిపోయిందనుకుంటా.

బైదవే.. నాకు ఈ కూర నచ్చినందుకు గాను, మీకు బహుమతిగా T-Shirt ఇస్తున్నాను. ఇదిగో తీసుకోండి.
http://nagaprasadv.blogspot.com/2008/12/blog-post_16.html

ఇక్కడినుండి కూడా తీసుకోవచ్చు. http://2.bp.blogspot.com/_YPT3xXvDuWw/SUbzNjrXfWI/AAAAAAAAAM8/cNp-HNW_uUc/s1600-h/nalabhima2.jpg

Amar said...

నాకు చిక్కుడు కాయ కూర భలే ఇష్టం .
ఇంక నేను రూంలో వండుకుంటా .
క్రుతఘ్నతలు .

Sravya said...

@అమర్ గారు భయంకరమైన ముద్రారాక్షసం ! :)

Sravya said...

@అమర్ గారు భయంకరమైన ముద్రారాక్షసం ! :)

డా.ఇస్మాయిల్ said...

నాకు చాలా ఇష్టమైన "చిక్కుడు కాయ" కూరని, ఇంకా ఎక్కువ ఇష్టమైన "బుఱ్ఱకథ"తో తాళింపు వేసి వండారు చూడండి...అదరహో! (నిజమే, బుఱ్ఱకథ విని ఎన్నాళ్లయ్యింది? ఏదో ఇలా అయినా తృప్తి పడాలి. నెనర్లు.)

సుజాత said...

నాజర్ గారూ,
చిక్కుడు కాయ కూర సూపరు!

మధుర వాణి said...

చిక్కుడు కాయ కూర చాలా రుచిగా ఉందండోయ్.. :)
మీ బుర్ర కథ మాత్రం సూపర్.. నిజంగా చెపుతుంటే చెవులారా విన్నట్టే అనిపించింది నాకయితే..

సిరిసిరిమువ్వ said...

వినుడు వినుడు సిక్కుడుకాయ కూర గాథా వినుడీ మనసారా....బాగుంది మీ కథా విధానం.

@సుజాత గారు, మధ్యలో ఈ నాజర్ ఎవరండి? భాస్కర్ గారికి మరో పేరా?

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

సిరిసిరిమువ్వ గారూ....నాజర్ ఎవరా??
అయ్యో నా గుంటూరు జిల్లా చరిత్ర నా కళ్ళముందే కనుమరుగవుతుందా???
ప్రస్తుతానికి ఇక్కడ నుంచి చదవండి
http://te.wikipedia.org/wiki/%E0%B0%B7%E0%B1%87%E0%B0%95%E0%B1%8D_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D
త్వరలో మరిన్ని వివరాలు,అసలా నాజర్ బుర్రకధ చదివించే ఏర్పాటు చేస్తాను మీలాంటివారి చేత.

సుజాత said...

వరూధిని గారు,
ఈ ప్రశ్న మీరు వెయ్యాల్సింది కాదు. బుర్ర కథా పితా మహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత నాజర్ గురించి మీకు నేను చెప్పాలా?

భాస్కర్ రామరాజు said...

ముందుగా: పల్నాటి సెరిత్ర బుఱ్ఱకధ నాజర్ చెప్తేనే వినాలి. ఒకానొకనాడు జనాలకి కాలక్షేపం ఇవే, బుఱ్ఱకధలు, హరికధలు మొదలైనవి. ఇప్పుడు టీవీ వొచ్చి మన సంస్కృతీ సాంప్రదాయాల్ని మింగేసింది.
నాగ్: నువ్వు అచ్చేసిన టీ చొక్కా బాగుంది
@అమర్: మనవైపు చిక్కుళ్లు చాలా రుచి. అన్నట్టు క్రుతఘ్నతలు కాదు, కృతజ్ఞతలు
@శ్రావ్య: బాగా గమనించారు
@డా.ఇస్మాయిల్: నేను దీన్ని పాడ్క్యాస్ట్లా పెడదాం అనుకున్నా. కాని సమయాభావం వల్ల, మరియు వసతి లేకపోవటం వల్లా పెట్టలేకపోతున్నా. నాకు బాగా గుర్తు, మా బళ్లో బుఱ్ఱకధ ప్రక్రియ కి కావాల్సిన సంగీత సాధనాలు, అంటే తంబూర మరియూ బొటనవేలుకి పెట్టుకునే గజ్జలు, డప్పు - దీన్ని డప్పు అనకూడదేమో, బుఱ్ఱ అనుకోవచ్చు. బుఱ్ఱ అంటే పల్లెల్లో మంచినీళ్లు పోసుకునే మట్టి పాత్ర లాంటిది. మేము ఎండ్లకాలం సెలవల్లో ఇరగబాదేవాళ్లం ఆ పరికరాల్ని.
@సుజాత గారు: ధన్యవాదాలు
@మధుర వాణి గారు: అభివాదాలు
@సిరిసిరిమువ్వ గారు: నాజర్ - బుఱ్ఱకధ పితామహ అంటారు ఆయన్ని
@రాజే అన్నాయ్: బుఱ్ఱకధ మీన టపా కోసం సూస్తా ఉంటాం. :):)
@వేను గోపాల్ రెడ్డి: మనకి దాచేపల్లిలో పీర్లపండగప్పుడు బుఱ్ఱకధ చెప్పేవాళ్లు అనుకుంటా, చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు. తర్వాత మేము మోర్జంపాడు వెళ్లినప్పుడు ఓ రోజు ఇంటికాడ ఏసారు పల్నాటిసెరిత్ర బుఱ్ఱకధ ని.
@వేణు శ్రీకాంత్: కార్యమపూడిలో బాగనే ప్రదర్సనలు ఉండేవి. ఈర్లపండక్కి తప్పకుండా ఉంటుంది (అనుకుంటా - నాకు సరిగ్గా గుర్తులేదు)
@యోగి: ఘజల్ పాడాదాం తమ్మి, తప్పకుండా ఇనిపిస్తా.
@శ్రీనివాస్ మాష్టారు: ఈ సారి రాస్తా గోరుసిక్కుళ్ల కూరని.
@రేవతి: పోష్టులో నోట్ పెట్టా. ధన్యవాద్
@స్వరూప్ గారు:ధన్యవాదాలు

సిరిసిరిమువ్వ said...

@ రాజేంద్ర, సుజాత, క్షమించేయండి, క్షమించేయండి, నా మట్టి బుఱ్ఱ బుఱ్ఱకథ వైపు ఆలొచించల.
రాజేంద్ర గారు, ఇలా అయినా మీ చేత ఓ పోస్టు వ్రాయించుతున్నానన్నమాట, మరి త్వరగా మాట నిలబెట్టుకోండి.

Aruna said...

ఇలా ముగించాలి అనుకుంటా.
తందానా దేవ నందనాన. తధికిట జంతరి థా. (CorrectE naa)?

ఎప్పుడో చిన్నప్పుడు TVలో చూసాను బుర్ర కథలు

వేణుగోపాల్ రెడ్డి said...

@ అరుణ గారు ....చాలా బాగా గుర్తుంచుకున్నారు.....!

శరత్ 'కాలం' said...

మీకు నిజ్జంగా బుర్రకథ చెప్పడం వచ్చా?! అంటే ఇలా బ్లాగులో కాకుండా స్టేజీ మీద చెప్పడం వచ్చా అనేది నా ప్రశ్న. వస్తే మరి మీ ప్రోగ్రాం ఎప్పుడు చూపిస్తారు?

భాస్కర్ రామరాజు said...

శరత్ గారు: వచ్చండి. ఐతే ఎప్పుడో బళ్లో ఉన్నప్పుడు ఇచ్చాము స్టేజి మీద. :):) పెడతా ఓ వీడియో పాడ్కాస్టు :):)

latha said...

కూరలు ఉడక బెట్టి నీల్లు ఒలక బొస్తే పోసకాహారాలు నీల్లల్లొ కొట్క బోతై. తిరగమాత లోనె కూర ముక్కలేసి, లోట నీల్లెసి, మూత పెట్తె అర్ధగంట లో ఉడికి పోతది.
Great screenplay for Burrakatha.

భాస్కర్ రామరాజు said...

లతా గారూ: మంచిగ చెప్పిన్రు. మరి నీళ్లెక్కువైతే ఏంజెయ్యాలే? కూరంతా నీళ్లైపోవా ఏంది?

latha said...

కిలో చిక్కుల్లకి ఒక లోట(8 ounce = 230 ml) నీల్లు సరిపోతై. ఆఖర్లో(మాడిపోక ముందు), మూత తెర్సి, ముక్క చిదిపి సూడు,ముక్క వుడికి నీల్లు ఇంగ కనిపిస్తే, గిన్నె కింద మంట పెంచు, నీల్లావిరై పోతై.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నలుగురు మనుషులకి ఒక్కపూటకిపావుకిలో చిక్కుళ్ళు,నాలుగుటొమాటోలకూర చాలు.కిలోల్లెక్కనతింటానికి ఎంతమందున్నారన్నది లెక్క!

భాస్కర్ రామరాజు said...

అన్నయ్యా, మేము కూర ఎక్కువ తినే బ్యాచీ, రూము అంటె కనీసం ముగ్గురు అని. లేకపోతే అది రూమే కాదు. :):)

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

14 years industry ఇక్కడ! డిగ్రీమూడేళ్ళు,యూనివర్శిటీలో పదకొండేళ్ళూ
పెళ్ళయ్యాకా తరచూ గరిటె తిప్పుతూనే ఉన్నా ఆయ్!

భాస్కర్ రామరాజు said...

అన్నాయ్!! సరే ప్రాసకోసం వాడా!! :):) మీదగ్గర దాపరికం దేనికి!!!

sri said...

@ లత గారు, మస్తు జెప్పిన్రు ...

@ అందరు:
లత గారు జెప్పినట్టు పొపు వేసి, సిక్కుల్లు ఏసి మూత పెట్టి వండెప్పుడు, ముందు కుంచెం నీల్లు పొసి, పది మినట్స్ ఐనాంక, ఇంకొంచెం పొసి ... గట్ల వండుకోవచ్చు. గట్ల కాదు అనుకుంటే, ఒకే సారి మస్తు నీల్లు పొసి, కూర ఉడికిపొయినాంక కూడ నీల్లు మిగిలితే, ఎక్కువైతే సెనగ పిండి కుంచెం నీల్లల్లో కలిపి కూరలో వేస్తే నీల్లని పీల్చుకుంటది (కూరలో నీల్లతో కలిసి ఉండలు కట్టకుండా,సెనగ పిండి కుంచెం నీల్లల్లొ కల్పి ఏస్తన్నం అన్నట్టు ) !

గిట్ల సెనగ పిండి నీల్లతో కల్పి వేసి, మూత బెడితే, ఐదు నిమిషాల్లో, సెనగ పిండి పచ్చి వాసన వేయకుండా, కూరతో కల్సిపోతది , నీల్లు కూడ మస్తు పీల్చుకుంటది ! గిట్ల జేస్తే , సిక్కుడు కూర మస్తు రుచొస్తది కూడ !

మూత తీసి వండొద్దు చాలా కూరలు, ఆవిరితో పొసకాలు కొట్కబొతై ! సిక్కుల్లు అందులో ఒకటి ! వేపుడు కూరలల్ల అందుకనే పొసకాలు ఏం మిగలవి !

నేనో సారి , వేరు సనగ పొడి ( కేవలం వేరు సెనగలు పొడి చేసి ) వేసినా ! అద్దిరి పోయింది !ఉప్పు, పచ్చి మిర్చి, పోపు, కొబ్బరి వేసి ... (ఎండు కారం వేయలే ) సిక్కుల్లో పచ్చి మిర్చి మస్తుంటది మరి !

భాస్కర్ రామరాజు said...

సోదరీ! మస్తుజెప్పినవ్లే!! ఛల్, ఇక్కడ్నించి గట్లనే జేద్దం, అందరీ మంచి అంటే మనమూ మంచే. నల్గురు ఎళ్లిందే నాకూ బాట.:):)

teresa said...

బుర్ర కథ మహా రంజుగా జెప్పిన్రు...మళ్ళెప్పుడు?

భాస్కర్ రామరాజు said...

@తెరెసా గారు: లేటుగా అయినా లేటెష్టుగా వ్యాఖ్యానించారు. రాస్తున్నా ఇంకో వంటకం :)