Wednesday, December 3, 2008

పిజ్జా పురాణం

ఎందుకో ఇది రాయాలనిపించింది.
పిజ్జా (pizza; should be read as pit.tsa. In Italiano, z=ts) అనేది, దక్షిణ ఇటలీ పట్టణమైన నపొలి (దీన్నే నేపుల్స్ అని కూడా అంటారు) లో ఎప్పుడో గడచిన కాలమ్లో పేదవాడి బ్రెడ్. బ్రెడ్డు, మీద టమాటా సాసు అదీ పీజ్జా అంటే. తర్వాత్తర్వాత నపొలి కి సందర్శకులు ఎక్కవగా రావటం, దేనికంటే అదొకపెద్ద వ్యాపార కేంద్రం, అక్కడకి దెగ్గర్లో ఓ అగ్నిపర్వతం ఉండటం, కొన్ని రకాల చేపలు అక్కడ విరివిగా దొరకటం ఇలా ఎన్నోకారణాలవల్ల జనాల తాకిడి ఎక్కువకావటం, వచ్చిన వాళ్లు ఈ పేదోని ఆహారాన్ని ఇష్టపడటం అలా అలా ఇది వ్యాప్తి చెందింది. ఇప్పటికీ నపొలి పీజ్జా అంటె ఆ రుచే వేరు. ఈ బేసిక్కు పీజ్జా లో మూడు రంగులు ఉంటాయ్. అవి - టామాటా సాస్ - ఎరుపు , మొజరిల్ల ఛీజ్ - తెలుపు, బేసిల్ ఆకులు - ఆకుపచ్చ - అవే ఇటాలియన్ ఝెండా రంగులు. దీన్నే పీజ్జా మార్గరిటా అనికూడా అంటారు. ఇలాంటిదే పీజ్జా మరినారా. తేడా ఏంటి అంటే - మరినారా పీజ్జా మీద మొజరిల్లా ఛీజ్ కి బదులు వెల్లుల్లి, ఒరెగానొ వేస్తారు.

కాబట్టి నపొలి పీజ్జా అంటే - పల్చని బ్రెడ్ లేక క్రస్ట్, దానిమీదటమాటా సాసు, మొజరిల్ల ఛీజ్ మరియూ బేసిల్ ఆకులు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి - దీన్ని కాల్చే పద్ధతి. కట్టెలు పెట్టి, ఇటుకల పొయ్యి- బ్రిక్ ఒవెన్ - లో కాలుస్తారు. అదీ దీని అసలు రహస్యం.

ఏమాటకామాట - ఆరోజుల్లో, మా కార్యాలం నుండి రూముకి వెళ్లే దారిలో ప్రోంతో పీజ్జా అనే ఒక పిజ్జేరియా లో, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఓ మీడియం పీజ్జా మార్గరిట ని ఆర్డరు జేస్కుని ఇంటికి పరిగెత్తుకుంటు వెళ్లి జ్యూసీగా ఉండె ఆ పీజ్జా ని వేడి వేడిగా లాగింస్తుంటే - అద్భుతం. అదేదో పాటలోలా "ఆరోజులు మళ్లీ రావేల నేస్తం" (అక్కినేని, ప్రభాకర్ రెడ్డి, కార్తీక్, అమల - ఏంసినిమా అబ్బా అది, ఏంపాటబ్బా అదీ? యాద్కొస్తల్లే)....

9 comments:

Rani said...

అదేదో పాటలోలా "ఆరోజులు మళ్లీ రావేల నేస్తం" (అక్కినేని, ప్రభాకర్ రెడ్డి, కార్తీక్, అమల - ఏంసినిమా అబ్బా అది, ఏంపాటబ్బా అదీ? యాద్కొస్తల్లే)....

anubandham cinema anukunta, kaani andulo amala unda??

teresa said...

పురాణం నోరూరిస్తోంది ..నిన్న పాస్తా రెసిపీలో జెప్పినట్టు, ఈ పిజ్జా మార్గరీటా మీద కూడా కుసింత కారప్పొడో, ఆవపిండో చల్లుకుంటే సినెమా పేరేం ఖర్మ , పూర్వ జనమే యాద్కొస్తది భయ్యా!

భాస్కర్ రామరాజు said...

@రాణి గారు: సరిగ్గా గుర్తు లేదు. అమలేనా? ఏమో?
@తెరెసా గారు: గప్పుడు మనం ఇటలీ ఉన్నంలే, కారప్పొడి ఎక్కడ్కెళ్లొస్తది? గందుకె, సప్పుడు జేయకుండా గట్లనే తినేసినం. :):)

Sravya said...

I hate Pizza :)

భాస్కర్ రామరాజు said...

@Sravya - Try pizza del napoli. u will love it.

సుజాత said...

నా ఫస్ట్ పిజ్జా నేను ఆ oregano వాసన భరించలేక గోంగూర పచ్చడి తో లాగించాను. తరవాత ఓకే!ఇక్కడ లేదు కానీ, cici's pizza ఇష్టం బాగా!

లలిత said...

అమల కాదండిబాబూ
తులసి అనుకుంటున్నా
మన స్తైల్లో పిజ్జా వండేసారనుకొని పరిగెత్తుకొచ్చా
నిరాసపరిచేసారు నాన్నగారూ

సిరిసిరిమువ్వ said...

పాస్తాలు పిజ్జాల మీద పడ్డారేంటి?

"ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మునుముందిక రావేమిరా"
చాలా మంచి పాట గుర్తు చేసారు.
సినిమా అనుబంధం. అందులో అమల కాదు తులసి.

భాస్కర్ రామరాజు said...

@సుజాత గారు: పీజ్జా + గోంగూర పచ్చడి :):) Well, Why not.
@లలిత గారు : ఇది కేవలం సమాచారంకోసం మాత్రమే. Just for information on Pizza. Thanks.
@సిరిసిరిమువ్వ గారు: అలా, సరదాగా. పెద్ద కారణం అంటూ ఏమీలేదు. పాట వివరాలకి Thanks.