Wednesday, December 31, 2008

ఓ శుక్రోరం సాయంత్రం!!

ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2009 మీకు ఆనందాన్ని కలుగజెయ్యాలని కోరుకుంటున్నా.


ఓ శుక్రోరం సాయంత్రం, మరి వైటీ(IT) జనాలకి పండగేగా శుక్రోరం అంటే, బుడ్లు తెచ్చుకుని, పేపరు పరిసి, చిప్పిసు, ఓ నాలుగు మిర్చి బజ్జీలు, ఓ సోడా, నాలుగు పొట్లాలు వేపిన మసాలా బఠాణీలు పెట్టుకుని, గుటుక్కున ఓ గుక్కేడు బుడ్లోంచి గోతులోకి ఒంపేస్కుని, గబ్బుక్కున ఈ చెత్తని నోట్టోఏస్కుని కరకరా నముల్తూ, ఆపీసోడి తొడలపైనబొక్కు (LAPTOP) లో సగవ్ సీకటెల్తుర్లో పాతకాలపు ఇషాద పాటలేస్కుని ఇలా
చౌదవిక చాంధో యా అఫ్తాభ్ హో జోభీ హొ తుం ఖుదాకి కసం లా జవాబుహో..
బహరొం ఫూలు బరసావో మెర మెహబూబు ఆయాహై మెరా మెహబూబు ఆయాహై..
అభీనజావో ఛోడ్ కర్ ఏ దిల అభీ భరా నహి..
జిందగీ భర్ నహి భూలేగి ఓ బరసాత్ కి రాత్..
హం బేఖుదీమె తుంకో పుకారే ఛలేగయే..
సుహాని రాత్ ఢల్చుకి నాజానె తుం కబావొగె..
కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆతాహై..
कभी कभी मेरे दिल मैं ख्याल आता हैं
कि ज़िंदगी तेरी जुल्फों कि नर्म छांव मैं गुजरने पाती
तो शादाब हो भी सकती थी।

यह रंज-ओ-ग़म कि सियाही जो दिल पे छाई हैं
तेरी नज़र कि शुओं मैं खो भी सकती थी।

मगर यह हो न सका और अब ये आलम हैं
कि तू नहीं, तेरा ग़म तेरी जुस्तजू भी नहीं।

गुज़र रही हैं कुछ इस तरह ज़िंदगी जैसे,
इससे किसी के सहारे कि आरझु भी नहीं.

न कोई राह, न मंजिल, न रौशनी का सुराग
भटक रहीं है अंधेरों मैं ज़िंदगी मेरी.

इन्ही अंधेरों मैं रह जाऊँगा कभी खो कर
मैं जानता हूँ मेरी हम-नफस, मगर यूंही

कभी कभी मेरे दिल मैं ख्याल आता है. **

పాడుకుంటూ....ఎక్కడున్నాన్నేను...

రోజులు మారుతున్నాయ్..ఎక్కడబడితే అక్కడ ఏదిబడితే అది తింటే సస్తావ్ అని పెద్దల సామెత
ఓ శుక్రోరం సాయంత్రం ఇంటికాడ ఇట్టాజేస్కుని సూడండి:
మసాలాపాపడ్
సానా వీజి. ఆపీస్ నుంచి ఇంటికెళ్లేప్పుడు కూరగాయల కొట్టుకాడ ఓ చటాకు మిర్చి, ఓ కట్ట కొత్తిమీర, ఓ కట్ట పుదీనా, ఓ రెండు టమాటాలు, ఓ రెండు ఉల్లిగడ్డలు, ఓ నిమ్మకాయ కొనుక్కో. పక్కనే దుకాణంలో పాపడ్ కొను. ఎట్టాంటి పాపడ్, నీ రెండు అరసేతుల్నికలిపినంత పెద్దవి. ఏట్టా ఉండాల, పైన మిరియాలు ఏసిఉండాల. ఆటిని తీస్కో. ఇంటికిజేరు (బుడ్లెత్తుకెళ్లు, అదినేజెప్పాల్సిన పనిలేదనుకో).
ఇక మొదలెట్టు.
ఓ ఉల్లిపాయని సన్నగా తరుక్కో. మసాలా బండోణ్ణి గుర్తుకుతెచ్చుకో, అదే వచ్చేసుద్ది సన్నగ తరగటం. ఇప్పుడు, మిరగాయలు ఓ నాలుగు తీస్కో, కడుగు, సన్నగా తరుగు. ఇక పుదీనా తీస్కో కడుగు. సన్నగా తరుక్కో, ఇక కొత్తిమీర, బాగా కడుగు, సన్నగా తరుక్కో. ఇక మిగిలింది టమాటా, కడుక్కో ఓ సారి టమాటా ని, జాగర్తగా సన్నగా తరుక్కో, చితకిపోనీమాక ఆటిని. ఇప్పుడు, నిమ్మకాయ కోసేసి పెట్టుకో ఓ పక్కన. అన్నీ ఓ గిన్నెలో వెయ్యి, బాగాకలుపు, కొంచెం ఉప్పు వెయ్యి, కలుపు, నిమ్మకాయ పిండు. పక్కనబెట్టుకో.
ఇక పొయ్య ఎలిగించు. అప్పడాలని కాల్చు. మంట అంటీ అంటకుమండా కాలిస్తే బాగ వస్తాయ్, లేకపోతే మెలికలు తిరిగిపోయ్ బాగుండవు. మైక్రోవేవు ఉంటే, ఇంకా వీజీ. అప్పడం దాంట్లో ఎట్టేసి ఓ 30 సెకెండ్లు కొట్టావంటే తిరుగుండదు. సరే నీ తిప్పలు నువ్వు పడు. కల్చుకో మొత్తానికి, సేతులు కాదు, అప్పడం.
ఇక కుర్సో, ఓ అయిపు ఇందాకటి గిన్నెట్టుకో, ఇంకో అయిపు బుడ్డీ, ఓ సేత్తో అప్పడం. అప్పడం ఇరగ్గొట్టి గిన్నలోని మసాలో స్కూపుజేస్కుని లాగించు.
కొంతమంది అప్పడం పైన జల్లేస్కుంటారు. దానివల్ల అప్పడం మెత్తబడి, అప్పడం చపాతీ అవుతుంది.


కార్న్ మసాలా
నీలగిరీస్కో లేక ఫుడ్డు వరల్డ్కో ఎళ్లి గోయా మొక్కజొన్న టిన్ను తెచ్చుకో.
ఇందాకజెప్పిన మసాలా సిద్ధంచేస్కో. టిన్ను తెరువు. ఎలా? టిన్ను ఓపెనర్ ఉంటుంది దాంతో, బీరు ఓపెనర్తో రాదు బాబాయి, ట్రై సెయ్యటం దండగ. సరే, తెరిచాక, నీళ్లు ఒంపేసి, ఆ మొక్కజొన్నని ఓ సారి మాములు నీళ్లతో రిన్సు* చేసి పక్కన బెట్టుకో. పొయ్యి ఎలిగించు. ఓ మూకుడెట్టు. ఈ మొక్కజొన్నని ఓ సారి వేపు. వెంటనే తీసెయ్. ఉప్పు కారం వేస్కోఇందాకటి మసాలా కలుపు, నిమ్మకాయ పిండు ..ఇక లాగించు.

చెన్న మసాలా
గోయా గాడి చెన్న టిన్ను తెచ్చుకో. ఓపెనుజేసి, ఓ సారి కడుగు*. పొయ్యి ఎలిగించు. ఓ చెంచాడు నూనె వెయ్. ఎండు మిర్చి ఒకటివెయ్, ఏపు, కాంగనే ఓ వెల్లుల్లి రెబ్బ వెయ్, ఏపు, కాంగనే ఈ చెన్నా వెయ్. ఏపు, ఉప్పు కారం ఏస్కో, దీంపేసేయ్, ఇక లాగించు. ఈటినే గుగ్గిళ్లు అంటారు. ఈ పద్ధతినే శాతాలించటం అంటారు.

ఇంకోరకం చెన్నా మసాలా:
పొయ్ పెట్టు, ఓ టమాటా తరిగేసి దాంట్లో వెయ్, గంటె పెట్టి చిదుము, దాంట్లో చెన్నా వెయ్, ఉప్పు, కారం, ధనియా పొడి వేసి కుతకుతలాడంగనే దింపెయ్, దిపాక ఇందాకటి మసాలా అదేనయ్యా తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర, పుదీనా, తరుక్కున్న మిర్చి, వేసేసి ఓ సారి బాగా తిప్పి నిమ్మకాయ పిండి లాగించు. దీన్నే మేము గుంటూరులో మసాలా బండోడిదెగ్గర తింటాం. ఇక్కడ చదువుకో దానిగురించి కావాలంటే.
ఈటిని తింటా ఈ పాటలు ఇనుకో!!!!!
మామా చందమామా వినరావా నా కధ..
నీలాలా నింగిలో..
నేనొక ప్రేమ పిపాసిని..
రాగాల పల్లకిలో కోయిలమ్మా..
మబ్బే మసకేసిందిలే..
కధగా కల్పనగా..
గంధము పూయరుగా..
ఓ బంగరువన్నెల చిలకా..
ఎవరికెవరు ఈ లోకంలో..
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా..
ఏ కులము నీదంటే గోకులము నవ్విందీ..
పూలు గుస గుసలాడేనని..* కడగటం అంటే rinse thru water అని.

15 comments:

యోగి said...

:))

నరహరి said...

కనీసం వారానికొఅక సారైనా ఇంటికొచ్చాక కంప్యుటర్ ముందు కూర్చో...ఇలాంటి రెసిపి టైప్ చేయి...

.........అదిరింది....

వేణూ శ్రీకాంత్ said...

అంతా బాగానే ఉంది గానీ ఈ ఖభీ ఖభీ నే అతకట్లా :-)

చైతన్య said...

:)

కొత్త పాళీ said...

@Venu .. కభీకభీ ఎందుకతకలా?

latha said...

ఈయాల సాయంత్రం సమోస అంగట్లొ కొనుక్కున్నాక, దాంట్లోకి చింతపండు చట్నీ అడిగితె, అంగటామె ఎమన్నదో తెల్సా: 'చింతపండు ధర పెరిగింది అందుకె చట్నీ చేస్తలేం'. ఇప్పటి నుండి, నీవు చెప్పిన chaat masala recipes చెసుకుంటన్నా నిమ్మకాయేసి.

శృతి said...

సదువుతుంటేనే రుచి మొగ్గలు (టేస్ట్ బడ్స్) నిల్చున్నై సామి, ఇంక జేస్కుని తింటే పానం యాడ్కి బోతదో మరి. పోయొస్తా అంగడ్కి బోయి జర నువు జెప్పినవి తెచ్చుకోవాల గదా!

సిరిసిరిమువ్వ said...

ఓ ఇది మగాళ్లకేనన్నమాట:)

Sravya said...

మా కొసం కాదా? exit sub

భాస్కర్ రామరాజు said...

ముఖ్య గమనిక - ఇది కేవలం బాబులకోసమే కాదు. రాసింది బాబు కాబట్టి ఇష్టైల్ అలా ఉంది అంతే. అమ్మళ్లు కూడా మసాలా పాపడ్ తినొచ్చు, మస్సాలా శనగలు తినొచ్చు. మరి ఇలా దేనికి రాసా? నాకు నా రూం జీవితం గుర్తొచ్చి రాసా. అంతే.
@యోగి: ఏంజా
@నరహరి: ధన్యవాదాలు
@వేణు: నేను చెవుల్తోపాటు అన్నీకోసుకునే పాట అది.
@చైతన్య: ఆనందించు
@ అన్నగారు: ధన్యవాదాలు
@లత గారు: దీన్నిబట్టి మనకి కనీస రుచులు కూడా ఖరీదైయ్యాయన్న మాట. పుచ్!! ఏస్కోండి ఐతే ఓ మస్సాలా పాపడ్. :)
@శృతి గారు: తెచ్చుకున్నరా మరి. జేస్కున్నరా మస్సాలా పాపడ్. మస్తుగున్నదా రుచి? జర మాకూ జెప్పుండ్రి గెట్ల అచ్చిందో పాపడ్!!
@సిరిసిరిమువ్వ గారు, శ్రావ్య: అదేమీ లేదండి. మస్సాలా పాపడ్ కి మసాలా అద్దటానికి అలా రాసా. అంతే.

శరత్ 'కాలం' said...

మీ ప్రొఫయిల్ పిక్ మార్చకూడదూ. రాంగోపాల్ వర్మ సినిమాలోంచి ఎత్తుకొచ్చి పెట్టినట్లుగా చీకటి చీకటిగా వుంది.

భాస్కర్ రామరాజు said...

ఫోటోబు మార్చా..గుఱ్ఱం ఎక్కిన భాస్కర్. శుక్రోరం పోస్టు - గుఱ్ఱం ఎక్కిన భాస్కర్ ఫోటో కేవలం యాధృచ్చికం. :):)

భాస్కర్ రామరాజు said...

దేనికంటే, పెళ్లి కుదరంగనే గుఱ్ఱం ఎక్కటం మానేసా :):)

శరత్ 'కాలం' said...

ఇంట్లో అంత స్ట్రిక్టా? మా ఇంట్లోనయితే గుర్రమెక్కినప్పుడు వద్దంటారు - మానేసినప్పుడేమో ఎక్కొచ్చుగా అంటారు.

Rani said...

yummm