నా నిన్నటి పోష్టు - కాఫీ లో నన్ను ఓ బ్లాగరి ఇలా సవ్వాల్జేసారు:
పప్పు వొప్పు దేముంది ఎవుడైన జేస్తాడు, దమ్ముంటే గింబళి తేగలరా(మాయాబజార్ నుండీ కాపీకొట్టా) అన్నట్టు - గుత్తి వంకాయ ఎవరైనా చేస్తారు కానీ,మీ నలభీమ పాకం లో , గుత్తి గుమ్మడి కాయ, గుత్తి సొర కాయ(ఆనప కాయ) కూరల రెసిపీలు (కూడా?) ఇద్దురూ ?
అహా!! ఛాలెంజ్లు నేనె ఎప్పుడూ స్వీకరిస్తా: కాస్కో- ఇదే గుత్తి గుమ్మడికాయ కూర:-
ఓ "గుమ్మ"డికాయ తీస్కో - మంచిగుమ్మడనుకుంటున్నా - అడ్డంగా రెండు ముక్కలుజేయ్. దానిపొట్టలోని ఇత్తనాలు తీసెయ్, పైన తొక్క ఒలిచెయ్. పక్కన పెట్టు. మొన్న చేస్కున్న బంగాళదుంప కూర ఉందిగా అది తీస్కో, ఇందాక చేసిన గుమ్మడికాయ రెండుముక్కల్లో కిందముక్క తీస్కో, ఈ కూరతో దాన్ని నింపు పక్కనబెట్టు. పైముక్క తీస్కో, కూరతో నింపు - కిందముక్కని పైముక్కతో కూరకిందపడకుండా మూసేయ్. ఇప్పుడు ఓ తాడు తీస్కో, దాన్ని కట్టేసేయ్.
ఓ పెద్ద భాండీ తీస్కో, గుమ్మడికాయని దాంట్లో పెట్టగలిగేంత పెద్దది. పొయ్ వెలిగించు, ఆభాండీ పెట్టు, ఓ నాలుగు చుక్కలు నూనెపొయ్, నూనె కాగంగనే ఈ గుమ్మాడికాయ దాంట్లో వెయ్, ఇక వేయించు, గుమ్మడికాయ రంగు మారంగనే (అసలు రంగునుంచి ఏరంగుకైనా) ఉప్పు కారం, కొంచెం కారప్పొడి జల్లు, ఆ తాడు కోసేయ్, ఇక లాగించు.
పక్కనోళ్లకి మాత్రం పెట్టకు. పాపం, వాళ్లనొగ్గేయ్.
ఇది కేవలం పిల్లాట
Friday, November 21, 2008
Subscribe to:
Post Comments (Atom)
33 comments:
Wow, stuffed pumpkin - like stuffed turkey. Bhale...Bhale.
@లత గారూ:):)
మా అమ్మమ్మ నిజంగానే గుత్తి ఆనపకాయ కూర చేసేది. పెద్ద ఆనపకాయని తీసుకుని, పెద్ద పెద్ద క్యూబ్స్ లాగ తరిగి, ఒక్కో క్యూబ్ మీదా డీపుగా ఇంటూ మార్క్ పెట్టి, అందులో మెంతి-కొత్తిమీర కారం కూరి, వేయించి, వేగాక లైట్ గా చింతపండు పులుసు పోసి మగ్గనిచ్చేది.
కాకపోతే గుత్తి ఆనపకాయ వేరే, గుత్తి గుమ్మడికాయ వేరే. మీరు చెప్పిన రెసిపీ చెయ్యాలంటే తినడానికి గుండె ధైర్యంతో పాటుగా చాలా టాలెంట్ కావాలి.
firstly, ROFL for your writing style and for the recipe !
Thank you, thank you for the "OnDemand" recipe !
(మనలో మన మాట, చిరంజీవి 'ఛాలెంజ్' ఎన్ని సార్లు చూసేరేంటి ? )
........అందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా ? అన్నారు పెద్దలు !
అలా గుత్తి గుమ్మడి కాయ లో గుత్తి వంకాయ stuffing లాంటిది ఆలోహించి చెప్తారనుకున్నా !
సాంఘిక సినిమా లో రాజుని పెట్టినట్టు , గుమ్మడి కాయ లో stuffing బంగాళా దుంపల కూర ( అదీ మొన్న చేసిందా ? ) హన్నా !!!
నేనే గనక ఈ రెసిపీ తో ఈ కూర చేస్తే,పార్సెల్ ఎవరికీ పంపాలబ్బా స్టాంపు లేకుండా ? పగ వాళ్ళంటే కూడా సడన్ గా జాలేహేస్తోంది ! ;-)
@wanderer గారూ, అవునా ? ఇలాక్కూడా చేయొచ్చా ? అయితే నేను గుత్తి గుమ్మడి కాయ నలభీమ పాకం లాను,గుత్తి సొరకాయ wanderer పాకం లాను ట్రై చేసి చూస్తా !
మెంతి-కొత్తిమీర కారం --- దీని అర్థం చెప్తారా ప్లీజ్ ? వేయించిన మెంతులు, కొత్తిమీర కలిపి రుబ్బెసి, ఉప్పు, కారం వేస్తారా ?
ఇప్పటివరకూ అభిలాష, చాలెంజ్ ఎన్నిసార్లు చూశాను? గుర్తులేదు!!!
"ఏమైన సినిమా పెట్టు, వీడి కార్లగోల, లేక జీవోడి సీరియళ్ల తలనొప్పి, లేక వెదర్ ఛానెల్ చూసీ చూసీ విసుగేస్తోంది"
"ఏం పెట్టను!! అభిలాషా లేక ఛాలెంజా!! మాకూ మిగతా సినిమాల్జూసే అవకాశాం ఇవ్వు"
"సరే!! అది ఒద్దు!! ఇదీ ఒద్దు!! ఇకేంజేస్తాం, అభిలాషపెట్టూ"
ఇంట్లో నాకు, నా కళత్రానికి మధ్య అప్పుడప్పుడు జరిగే సంభాషణ.
చైతన్య గారు, మెంతి-కొత్తిమీర కారం అంటే, మెంతికారం లో కొత్తిమీర గెస్ట్ అప్పియరెన్స్ అన్నమాట. మెంతికారం అంటే మెంతులు, శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసిన కారం.
బాబోయ్... ఇక్కడ రెసిపీ టైప్ చేస్తుంటే చేతులు వొణుకుతున్నాయి. అనువుగాని చోట.... ఇంక నన్నేమీ అడక్కండి బాబూ...
Wanderer గారు: భయం దేనికండి...ఇది కేవలం సరదాకోసం మాత్రమే. Nothing serious. Type in something and laugh.
హ్హ హ్హ హ్హ ... పాపం అన్ని సార్లు బుక్ ఐపోయేరా, ఆ సినిమాలకి ! ప్చ్ !
@ wanderer గారూ, Thank you for the recipe !
Yo!! ఇక్కడ ఆ సినిమాలకి HARDCORE FANS. నాకు నచ్చిన సినిమాల్లో మొట్టమొదటి 10లో ఉంటాయ్ ఇవి. :):) Have Fun!!
గుత్తి కొబ్బరికాయ కూడా ఇదే టైపులో చెయ్యొచ్చంటారా?
@Rani గారు: Well, We can certainly Try. గుమ్మడికాయ అనంగనే ఎదో ఆశువుగా రాసేసా, ఎందుకంటే దాన్ని ఎలా కావాలంటే అలా నరుక్కో(తరుక్కో)వచ్చుకాబట్టి. కొబ్బెర/కొబ్బరి కాయా అంటే అలోచించాల్సిందే.
We can Try like this I think:
కొబ్బరికాయ పైన టెంకెని జాగర్తగా తీసేసి అంటే లోపలి కాయ ఏమాత్రం దెబ్బతినకుండా , పీలర్తో పైన నల్లని చెక్కుని లేపేసి, కాయ కాయ అట్టానే టమాటా కూరలో, ములక్కాడలతో పాటు వేసి, ఓ పింగాణి గిన్నెలో వేసి, ఒవెన్ ని 300 కి హీట్ చేసి దాంట్లో పెట్టి 20 నిమిషాలు ఉన్నాక తీసి, ఉప్పులు కారాలు మిరియాలు వేసుకుని, బల్లపరుపు బ్రెడ్ - Flat Bread తో లాగిస్తే ఎట్టాఉంటుందబ్బా?
కడుపులో బల్ల పుట్టినట్టుంటుంది :)
మీరు సరదాకి చెప్పినా కూడా అలాంటి రెసిపీలు కూడా వున్నాయండి.కాకర కాయ అలాగె కోసి స్టఫింగ్ చేసి దారం కట్టి వేపుతారు.వేగిపోయాకా దారం తీసి తినడమే.
@రాధిక గారు: నేను దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది రాసా :):)
@teresa gAru: :):) Happy Friday!! Enjoy Your Weekend.
కేక కేక :-)
భలే! బంగాళా బౌ బౌ టైపులో ...గుత్తి గుమ్మడికాయ :))
ఓ పదేళ్ళ క్రితం ఒక ఫ్రెంచి రెస్టరాంటుకెళితే సరిగ్ఘా ఇదే పెట్టి ఇరవై డాలర్లు ముక్కు పిండి వసూలు చేశాడు. ఆడు ఫ్రెంచోడు కాబట్టు డాబుసరికి దాంట్లో కొంచెం చీజూ, బాదం పప్పుల్ళాంటియి కూడా ఏశాడనుకో. మంచి రెసిపీ.
పెద్దబాణలి లేకపోతే నిరాశ చెందనక్కర్లా. అవెన్‌లో 400 డిగ్రీల సెటింగులో 40 నిమిషాలు బేకితే సరి.
:) I will this today !
భాస్కర్ గారు,
మీతో జాగ్రత్తగా ఉండాలి! నా డౌటు ఇది ఇంట్లో కూడా మీరొక్కరే తినుంటారని!
teresa, మీ కామెంట్ కేక!
శ్రావ్య,
జాగ్రత్తండి! మీరు తినకండి, పక్క వాళ్ళకి పెట్టి, వాళ్ళు బాగుంటే అపుడు మీరు...!
అబ్బా!! ఈ లెక్కన గుత్తిబూడిదగుమ్మడి కాయ కూడా చేసి అవతల నూకుండాలే :)నాకు మాత్రం గుత్తిపొట్లకాయ కావాలబ్బాయ్,నువెట్టా జేస్తావో యేమో గాని,
అసలు ముందు పల్నాటి వంటలు అంటూ ప్రత్యేకమైన జాబితా యావన్నా ఉందా?ఉంటే రాకూడదూ?? కామెడీ కాదు నిజంగా అదుగుతున్నా,ఎందుకంటే సాంప్రదాయ వంటలు సంరక్షించుకోవాలని ఒక చిన్న ప్రయత్నం.త్వరలో దీనిమీద మరిన్ని వివరాలు తెలియజేస్తా.అన్నట్టు ఫోటోలు కూడా కావాలబ్బాయా,వీలుంటే వీడియొలు కూడా
http://www.vizagdaily.co.cc/
బాచి బాబూ...కేకో కేక..కుమ్మేస్తున్నావు కదా..అప్పోజిషనోళ్ళకి పెట్టి ఇరగదీసెయ్యొచ్చు కదేటి..
హమ్మాయ్య .............ఐ పొఇందడీ నాన్నగారూ అచ్చంగా మీరుచెప్పినట్టే గుత్తిగుమ్మిడికాయ కూరచేసి నాబ్లాగుకి దిస్టితీసి పక్కింట్లో ఇచ్చేసి వచ్చా .
@ లలిత :)
భలే ఫినిషింగ్
మీ గుత్తి గుమ్మడి కాయ కూరేమో కాని వ్యాఖ్యలు మాత్రం మంచి పసందుగా ఉన్నాయి.
తెరెసా :)
లలిత :), పక్కింటోళ్లు పచ్చడి బండతో వస్తారేమో, తలుపులేసేసుకున్నారా??
రాజేంద్ర గారు, అబ్బ, మీరింకా అచ్చ తెలుగు గుంటూరు భాష మర్చిపోలేదా...." గుత్తి బూడిద గుమ్మడికాయ కూర కూడా చేసి అవతల....." వామ్మో!
లలిత....
సూపరు! కేక మీరు కూడా పెట్టించారు. అన్నట్టు పక్కింటోళ్ళు అది రుచి చూడకముందే మీరు విహారానికెళ్ళి అర్థ రాత్రి దాటాక రండి.
@వేణు: :):) మరి!! పల్నాడోళ్లతో పెట్టుకుంటే గుమ్మడికాయలు బద్దలు.
@మధు: వ్రూమ్ వ్రూమ్. ధన్యవాదాలు.
@కొత్తపాళీ అన్నగారు: ఇరవై డాలర్లా? విష్ణు మాయ్ :):) అన్నట్టు అన్నగారు మీ వ్యాఖ్య కోసం నా ఇంకో టపా కళ్లు గోగూరఆకులైయ్యేలా ఎదురు చూస్తోందొ. ఓ సారి పలకరించండి దయచేసి. ఇదీ లింకు http://nalabhima.blogspot.com/2008/10/blog-post_29.html
@శ్రావ్యా: నిజంగా ట్రై చేస్తారాఏంటి??? ఓసారి చంటాబ్బాఇ సినిమా గుర్తుతెచ్చుకోండీ :):)
@సుజాత గారు: మీరు మరీ అండీ. ప్రయోగాలు నేనెందుకు చేస్తా? ఇట్టా చెయ్, ఇదిగో ఫోను వచ్చింది, ఇప్పుడే వస్తా, గాయబ్ :):)
@రాజే: అదేమంత పెద్ద కష్టాం కాదు హ:):)
అన్నట్టు - పల్నాడూలో మంచిగుమ్మడి వాడకం చాలా తక్కువ. మాకు గుమ్మడితో కూర అనే కాన్సెప్ట్ లేదు. మరి గుంటూర్ పట్టణంలో ఉందేమో? పల్నాడూలో కూడా మా ఇంట్లో మేము ఎపుడూ విన్లా. మిగతా వోళ్ళు వండుకునే వారేమో మరి. బూడిద గుమ్మడి పులుసులో వేస్కునేవాళ్లు, వడియాలకి అంతే.
:):)
@పప్పూ యార్: ఏదో నీఅసుంటోళ్ల అభిమానం :):)
@లలిత గారు: పాపం. వాళ్ళేమి చేసారండీ ఇలా పగబట్టారు? :))
@సిరిసిరిమువ్వ గారు: థాంక్సులు
ఇక్కడ కామెంటకపోతే నా ఇష్ట దైవాలు నలుడు, భీముడు ఆగ్రహిస్తారేమో అని...
@దిలీపు: వ్యాఖ్య పెట్టావ్, విషయంజెప్పలేదు. గుత్తిగుమ్మడికాయ ఎలా ఉందంటావ్?
భాస్కర్ గారు,
బాగుందండి... ఇప్పుడు నేను దీన్ని అనుసరించి, గుత్తి పొట్లకాయ చేద్దామా అని ఆలోచిస్తున్నాను... అంత పొడుగు పట్టే బాండీలు దొరుకుతాయా అని కూడా సందేహం వచ్చింది...
నిజంగానే ఇలాంటి వంటకం ఉంది తెలుసా. మా నాన్నగారు చెప్పేవారు. ఇదివరకు ఒకసారి కరువు వచ్చినప్పుడు ఇలాంటివే తినేవారుట. అది ఎలా వండుతారంటే -- గుమ్మడికాయ ముచిక దగ్గర జాగ్రత్తగా కొయ్యండి. చెయ్య పట్టేటట్లు. అందులోంచి గింజలూ గట్రా జాగ్రత్తగా తీసెయ్యండి. అందులో బియ్యం కడిగి పోసి ఉడికేందుకు గాను నీళ్లుకూడా పొయ్యండి. మళ్ళీ ముచికను జాగ్రత్తగా పైన పెట్టెయ్యండి. ఈ గుమ్మడికాయను పిడకలు కాల్చి అందులో పెట్టండి. ఆవేడికి లోపల బియ్యం ఉడుకుతాయి, గుమ్మడికాయ ఉడుకుతుంది. కాకపోతే ఇది తియ్య తియ్య గా ఉంటుంది. ఉప్పువేస్తారో లేదో నాకు తెలియదు. ప్రస్తుత టెక్నాలజీ లో దీనిని మైక్రోవేవ్ లో ట్రైచేయ్యవచ్చేమో.
@D. Venu Gopal గారు:
నిజమే అయిఉండవచ్చు. నేను చెప్పింది కూడా, హాస్యం కన్నా కొంచెం నిజంగా ఆలోచిస్తే, ఇలా ఎందుకు ప్రయత్నించకూడదూ అనిపిస్తుంది.
Thanks for your comment.
హహహ బాగుందండీ! మా అమ్మ ఈ గుమ్మడి గింజలతో పొడి చేస్తుంది చాలా రుచికరంగా ఉంటుంది అది! మీరేమో ఆ గింజలని పాడేసారు!
Post a Comment