Monday, November 17, 2008

కాఫీ

రూమ్ముల్లో ఉండే పోరగాండ్లకి కాఫీ/చాయ్ గంట గంటకీ పడకపోతే పిచ్చిడాట్కోడాటిన్ ఎక్కుంతుంటుంది. అంటే పెళ్లైనోళ్లకి ఇలా ఉండదూ అని కాదు - సరే బేరం దేనికీ - కొందరికీ కాఫీ గంట గంటకీ పడుతుండాలి. నేను మాఆవిడాతో "ఒక చిన్న హెల్ప్" అని అనంగనే "ఏంటి ఓ కమ్మని కాఫీకావాలా!!" అని రెప్లై ఇచ్చేస్తుంది.

అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావ్ దెగ్గర ఎవరైనా పొరబాటున "బం" అని అనీఅనకుండానే మీది బందరా అన్నట్టు, నా దెగ్గర ఎవరైనా కా అంటే చాలు, కాఫీ కొడదామా అనేస్తా. అదినా వీక్నెస్సు. :)
ముందు ఈ కాఫీ కధేంటో చూద్దాం.
ఎవుడు కనిపెట్టాడు, మనదా, అఫ్రికాదా..కన్నా..నాకు తెల్సింది చెప్తా.
కాఫీని రకరకాలుగా జేస్తారు. నాకు తెలిసి ఇటాలియన్లు కాఫీ తెయ్యారుచేసే విధానాన్ని బజ్జీ (MASTER) కొట్టారు.
సరే మనోళ్లు యుగ యుగాలుగా "పిల్టర్ కాపీ" ని తయ్యారు చేస్తూనే ఉన్నారు. ఆనాటి అర్జునుడుకూడా కురుక్షేత్ర సంగ్రామమ్లో పీకల్లోతు యుద్ధమ్లో ఉండికూడా, కాఫీ బ్రేక్ అని అరిచి అటైపోళ్లకీ ఇటైపోళ్లకీ పిల్టర్ కాఫీ పోయించేవాడని కాఫీపురాణామ్లో రాశుంది.

హా!! కాఫీలు రకరకాలు -
కాఫీ, బుర్రు కాఫీ, బ్రూక్బాండ్ కాఫీ, ఇత్తడి కాఫీ, కాఫీడే కాఫీ, హిమగిరి కాఫీ, నీలగిరి కాఫీ...పిల్లాట (కిడ్డింగ్)

ఎస్ప్రెస్సో, కపూచ్చినో, మోకా, లత్తే, మక్కియాతో, మోకచ్చినో, ఫ్రప్పే, లుంగో అమెరికానో, రిస్త్రెత్తో, పిల్టర్ కాఫి.

ఎస్ప్రెస్సో
ఒక కప్పులో కాఫీ పొడి వేసి, వేడి వేడినీటిని దాణిగుండా పంపిస్తే వచ్చేదే ఎస్ప్రెస్సో.

కపూచ్చినో
ఒకట్లో మూడుపాళ్లు ఎస్ప్రెస్సో, మూడుపాళ్లు "స్టీండ్" పాలు, మిగతాది పాల నురగ.

లత్తే
అంటే పాలు అని లాటిన్లో. ఎస్ప్రెస్సో కాఫీ లో వేడి పాలు. ఇది మన కాఫీకి దెగ్గరగా ఉంటుంది.

మోకా
లత్తే లో చిక్కొలాతో అంటే చాకోలేట్ వేసి కలిపితే మోకా.

మక్కియాతో
ఎస్ప్రెస్సో మీద ఒక స్పూన్ నురగ వేస్తే మక్కియాతో.

మోకచ్చినో
ఒకటికి నాలుగోవంతు చిక్కటి ఎస్ప్రెస్సో, ఇంకో నాలుగోవంతు చాకొలేట్, మిగతాది పాలు, పాల నురగ.

ఫ్రప్పే
నాకు బాగా గుర్తూ!! ఏథెన్స్ లో నా మొట్టమొదటిరోజు, నాపక్కన కూర్చునే దిమిత్రిగాడు నన్ను మా కార్యాలయం వంటగదికి తీస్కెళ్లి, నెస్కఫే ఓ స్పూన్, పందార, నీళ్లు ఓ లోటాలో పోసి, గిలక్కోట్టే మరతో ఓసారి దాన్ని బాగా గొలక్కొట్టి ఐసుముక్కలేసి ఇక లాగీ అన్నాడు. ఏందిరా మియా అది అంటే ఓర్నీ!!! ఇది తెలియదా!! హా!! దీన్నే ఫ్రప్పే అంటారు అని పోజుకొట్టాడు.
ఫ్రప్పేని గ్రీకులు ఎండ్లకాలం బాగా తాగుతారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తాగుతున్నార్లే.

అమెరికానో - లుంగో
పేరులోనే ఉంది. అమెరికన్ ఇష్టైల్ కాఫీ అని. నీళ్ల నీళ్లగా ఉండే కాఫీ - లుంగో అంటే లాంగ్ అని, అంటే ఓ పెద్ద లోట అని. దీన్నె ఇక్కడ రెగ్యులర్ కాఫీ అంటాం. నల్ల తుర్రునీళ్ల దికాక్షన్ అన్నమాట.

రిస్రెత్తో
అంటే రిస్ట్రిక్టెడ్ అని, అంటే కొంచెం లేక షార్ట్ అనికూడా అనుకోవచ్చు. లేకపోతే అతి తక్కువ నీళ్లతో ఎస్ప్రెస్సో. ఒక చుక్క గొంతులోఏస్కుంటే చేదు నషాలానికి అంటాలి. అంతే, ఒకేఒక షాట్ టకీలాలాగా.

పిల్టర్ కాఫీ
హమ్మయ్య..వచ్చేసా మనదెగ్గరకి.
ఎలా చేస్కోవాలి?
కావాల్సినవి - ఓ ఫిల్టర్. ఇదిగో ఇలాంటిది (వికీ నుంచి లాక్కొచ్చా ఈసిత్రాన్ని)

బహుసా ఓ 100 కి మంచిదే దొరకొచ్చు.

ఇంకా, పాలు, పందార (నేను పందార లేకుండా తాగుత)
మరియూ నీళ్లు, ఓ పొయ్య్, గిన్నె, నువ్వు, నేను మరియూ కాఫీపొడి.

బ్రూక్బాండ్ గ్రీన్లేబుల్ తెచ్చుకో.

ముందుగా పొయ్ వెలిగించు, నాలుగు గళాసుల నీళ్లుపొయ్. మరిగించు. మరిగాక, పొయ్ ఆర్పివెయ్. పిల్టర్ తీస్కో. పిల్టర్ కి మొత్తం 4 పార్ట్స్ ఉంటాయ్. కిందది కలెక్టరు, పైన కంటైనరు, లోపల పిల్టర్, పైన మూత. ముందు పిల్టర్ సెటప్ సరిగ్గా ఉందోలేదో జూడు. కింద కలెక్టరు, దానిపైన సరిగ్గా ఇన్స్టాల్ చేసిన పై కంటైనరు - అదీ బేస్ సెటప్. పైన కంటైనర్లో పిల్టర్ సరిగ్గా పెట్టావో లేదో చూడు. ఒక స్పూన్ కాఫీపొడి వెయ్, ఒక చిటికెడు పందార వెయ్, మళ్లీ ఇంకో రెండు స్పూన్లు కాఫీపొడి వెయ్. ఎన్ని స్పూన్లు వెయ్యాలి? నీకు ఎంత స్ట్రాంగ్ కావాలి? అనేదాన్ని బట్టి. నేను స్ట్రాంగు, నేను తాగే కాఫీకూడా అనుకుంటే ఓ 4 చెంచాలు వేస్కో. ఇప్పుడు, ఆ వేడి వేడి నీళ్లు నెమ్మదిగా పైకంటైనెర్లో, నీళ్లు పొడిని తడుపుకుంటూ పైదాకా వచ్చేదాకా పొయ్. నీళ్లు పైకి వచ్చాక, మూత పెట్టు. అట్టావెళ్లి ఓ రౌండు పేపరో గట్రానో చదివిరా. ఒక్కో చుక్కా ఒక్కోచుక్కా కిందకి దిగితూ ఉంటుంది కాఫీ. మళ్లీరా, పైన మూత తీ, నీళ్లుపొయ్. మూతపెట్టు. కొంచెంసేపు ఆగు.
ఇప్పుడు, కిందకి కొంత డికాక్షన్ దిగే ఉంటుంది. రెండు గుడ్డలు తేస్కో, ఓ గుడ్డతో కింద కలేక్టర్ని పట్టుకో, ఇంకో గుడ్డతో పైకంటైనర్ ని పట్టుకుని, పుల్లని విరిచినట్టు చిన్నగా నీ వైపుకి కాకుండా, నీకు వ్యతిరేక దిశలో వంచు. కంటైనెర్ పైకిలేచి కలెక్టర్ తెర్చుకుంటుంది. ఓ గ్లాస్ తీస్కో, ఓ చేత్తో పైన కంటైనర్ ని పట్టుకుని, రెండో చేత్తో కింద కలెక్టర్లోంచి డికాక్షన్ ని ఆ గ్లాస్ లోకి వంపేసి మళ్లీ పిల్టర్ ని యధావిధిగా పెట్టేయ్.

పాలు కాచుకో. ఈ డికాక్షన్లో వేడిపాలు పోశ్కో. రంగు చూస్కో మరీ నల్లగా ఉన్నాయ్ అంటే పాలు ఇంకొంచెం పోస్కో. ఓసారి తిరగొట్టు.

ఘుమ ఘుమ లాడే కాఫీ రెడీ.......

బ్రూక్బాండ్ కాఫీలో: కాఫీ ౫౪% యాభైనాలుగు శాతం, మిగతాది చికోరి. చికోరీ ఓరకమైన కాఫీ.
గుంటూర్ లో ఆంధ్రా కాఫీ లాంటి కొట్టుకి వెళ్తే మన ఇష్టం వచ్చిన రీతిలో కాఫీపొడి పట్టించుకోవొచ్చు.
కొంతమంది చెప్పటం - చికోరి మంచిదికాదు అని.
సో సివరాకరికి - ఎంజా = ఎంజాయ్ :):)

23 comments:

Sravya said...

నా దెగ్గర ఎవరైనా కా అంటే చాలు, కాఫీ కొడదామా అనేస్తా. అదినా వీక్నెస్సు. :)
ఇది నా కూడనండి, నాకు మాత్రం బ్రూ కాఫి ఇష్టం,తర్వాత మోకా
ఇష్థం ఒకసారి McDonalds lo cuppicino try చేసా నా జన్మ ధన్యం! వద్దులేండి పొద్దున్నే ఆ కష్టం తలుచుకోవటం ఎందుకు !

మీ టపా మాత్రం బాగుంది

యామజాల సుధాకర్ said...

బావుందీ సార్ మీ కాఫీ పురాణం. ఎంతకన్నా మన ఫిల్టర్ కాఫీ ముందు ఆ లాటేలు, మోకాలు దిగదుడుపేనండి.
ఫిల్టర్ కాఫీ తయారీ గురించి మీరు వర్ణించిన విధానం చాలా బాగుంది. ఇదిగో ఇప్పుడే మా ఆవిడకి ఒక స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్(రిక్వష్ట్) చేసా... వైటింగ్

వేణూ శ్రీకాంత్ said...

ఆహా కాఫీ అదిరింది బ్రదర్.... వెంటనే వెళ్ళి ఓ కాఫీ కొట్టేయాల్సిందే...

Madhu said...

ఎస్ప్రెస్సో, కపూచ్చినో, మోకా, లత్తే, మక్కియాతో, మోకచ్చినో, ఫ్రప్పే, లుంగో అమెరికానో

మొదటి రెండూ విన్నాను, మిగతావన్నీ ఎదో ఇంగ్లీష్ సినిమా టైటిల్స్ లాగా ఉన్నాయండీ... :)

chaduvari said...

ఏంటి ఇన్ని రకాల కాఫీలున్నాయా!!? ఆ పేర్లు కూడా భలే ఉన్నాయే! కొన్ని బూతుల్లాగా ధ్వనిస్తున్నాయి :)

శ్రీనివాస్ పప్పు said...

ఈ కాఫీ గోల ఇంటే నాకు ఓ సంగతి గుర్తుకొచ్చేతన్నాది.అదేతంతే..

నేను అబుధబీలో ఉన్నప్పుడు ఒకసారి Airlines అనే హొటల్ కి వెళ్ళాము ఫ్రెండ్స్ తో.ఓ గంటయ్యాక సర్వర్ సుందరం వచ్చాడు, వస్తూనే ఓ బుక్కోటి మామీద గిరటేసి వెళ్ళిపోయాడు మీ ఏడుపేదో మీరేడవండని..అసలే కడుపులో రకరకాల జంతువులు పరుగెడుతున్నాయి, ఎదో ఒకటి ఆర్ద్డర్ ఇవ్వండిరా అంటే ఉండెహే ఇందులో ఒకటీ అర్ధం కావట్లేదు ఎలాగ అంటూ ఒక్కొక్కడూ గోల..మా మొహాలు చూసేటప్పటికి ఆ సర్వర్ సుందరానికి అర్ధం అయినట్లుంది ఈళ్ళు గొట్టం గాళ్ళని..ఏమికావాలంటూ అడిగాడు..సరే మనం ఎలాగూ తిండికి ముందరే వుంటాం కదా,అందులోనూ ఆహార వ్యహారాల్లో మొహమాటం కూడదని, నేను దోశ,ఇడ్లీ రెండూ ఒకేసారి పట్రామని చెప్పేసా(ఆలస్యం అయితే continuty దెబ్బతింటుందని).మిగతవాళ్ళు కూడా మన్ని ఫాల్లో అయిఫొయారు ఏటడిగితే ఏటి తీసుకొస్తాడొ అని. మా హరిప్రసాద్ గాడు మాత్రం మొత్తం బుక్కంతా బట్టీపట్టి ఫోజుగా నాకు "కపుచినో" కావాలన్నాడు. అందరికి ఆర్దర్ చేసినవి వచ్చాయి వాడికి కొంచం టైం పడుతుందని చెప్పి మా టిఫిన్లు అయ్యాక ఓ పెద్ద కప్పులో మీరు పైనుటంకించిన ద్రవపదార్ధాన్ని తెచ్చాడు..ఆత్రంగా తీసి చూస్తే..అబ్బో అప్పుడు వాడి మొహంలోని భావాలు

చైతన్య said...

మరి టీ లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా ?

సుజాత said...

ఒక ఫిల్టర్ కాఫీ అర్జెంట్!

చదువరి గారు, నేనూ అలాగే అనుకున్నా మొదట్లో! ఇప్పుడు అల్లక్కడ బరిస్టాకెళితే ఈ బూతులన్నింటినీ చూడొచ్చు!(నేను తాగను, చూస్తానంతే! ఇంటికొచ్చి నా ఫిల్టర్ డికాషన్ తోనే ఫస్ట్ క్లాస్ కాఫీ కలుపుకుని తాగుతా)

జ్యోతి said...

ఒక వెరైటీ కాఫీ చెప్పనా .. ఏంటబ్బా. Tropical Iceberg . పాలు కాచి, కాఫీ పొడి వేసి, instant or filter చక్కెర మర్చిపోవద్దు. బాగ కలిపి డీప్ ఫ్రీజర్లో పెట్టాలి అది సగం గడ్డకట్టాక తీసి బాగ నురగొచ్చేలా గిలకొట్టి పొడవాటి గలాసులో పోసి పైన ఒక చెంచాడు వెనిల్లా ఐస్‌క్రీం వేసి పుల్లేసుకుని చుక్క చుక్క తాగుతుంటే ఉంటుంది మజా.. చల్ల చల్లాగా జిల్లు జిల్లుగా.. అదుర్స్... ఒక గమనిక.. ఇది కాఫీ డే లో తాగితే 75 రూపాయలు. ఇంట్లో చేసుకుంటే పది రూపయాలు దాటదు .. ఇది నిజం. మా పిల్లలు కాఫీ డేలో తాగొచ్చి నాకు చెప్తే ఓస్! ఇంతేనా అని నేను ఇలా తయారు చేసిచ్చాను.

భాస్కర్ రామరాజు said...

@శ్రావ్య: Do never try in MC. ఐతే మనం మనం ఒక పార్టీనే - కాఫీ పార్టీ :):)
@సుధాకర్: సరిలేరు మన పిల్టర్ కెవ్వరూ!! :):)
@వేణు శ్రీకాంత్ - U know what!! This post is dedicated to you.నీ కాఫీ పోష్టులో కామెంటుకూడా పెట్టా అనుకుంటా. Enjoy Ur Coffee :):)
@మధూ: ఇవన్నీ ఓ సగటు So Called Modern కాఫీషాపులోని కాఫీ పేర్లే అంటే బారిష్టా, బోరిష్టా, బొంగిష్టా లాంటివాటిల్లో. :):)
@చదువరి గారు: బూతుల్లా ఉన్నా, అప్పుడప్పుడూ ఫ్రీవేయ్స్ లో తాగేవే ఇవి. ఈ పేర్లన్నీ దాదాపు ఇటాలియన్ నామాలే. Thanks for the comment Sir.
@పప్పు యార్ : :):)ట్రూ. ఇలాంటివి మనకి ఎన్నో జరుగుతుంటాయ్. మొట్టమొదటిసారి మా అన్నా మరియూ మిత్ర బృందంతో కేఫ్ కాఫీడే - బ్రిగేడ్ రోడ్ కి వెళ్లినప్పుడు రెచ్చిపోయి ఎస్ప్రెస్సో ఆర్డర్ చేసా (అప్పుడు మనం మహానాటూడాట్కోడాటోఆర్జీ - అంటే ఎఱ్ఱ టర్కీ టవల్ అన్నమాట- ఇప్పుడు నాటూడాట్కాం). లోటాలో అట్టడుగున ఓ చెంచాడు ఇచ్చాడు. పందార పోసా, పందార లో కాఫీ మునిగింది. అటూ ఇటూ చూసి గుటుక్కున మింగా. నోటి చేదుపోటానికి 5 కిలోల పందార ఖర్చైంది అనుకోండి రూముకెళ్లాక. :):)
తర్వాత్తర్వాత నాకు అత్యంత ఇష్టమైన కాఫీ ఎస్ప్రెస్సో. అలా, ఓ గుక్క, పడంగనే బుఱ్ఱకి ఇగ్నీషన్. :):)
@చైతన్యా - టీలో రకాలా!! మృగరాజు చినిమాజూసే అడుగుతున్నావా? కాస్కో నా ఇంకో పోష్టు - చాయ్ చాయ్!! అన్నా చాయ్ - అహనా పెళ్లంట సినిమాలో కోట ఎఱ్ఱ బస్సులదగ్గర చాయ్ అని అరిచినట్టు ఊంహించుకో
@సుజాత గారు: U can Try Them. మనకి తెలిస్తేనే కదా అవి మన పిల్టర్తో పోలిస్తే ఎక్కడ ఉంటాయ్ అనేది ఊహించుకోటానికి. Coffee DAyలో ఐనా ఓ సారి ట్రై చేయండి. అంత ఛండాలంగా ఏమీ ఉండవ్. ఐతే మన పిల్టర్ కాఫీ కూడా చికోరీ లేకుండా 100% కాఫీ తో ట్రై చేయండి.
@జ్యోతి గారు: Thanks for Iceburg. ఇది ఫ్రప్పె లో ఇంకో రకం అన్నమాట. నాకు చల్లని కాఫీ అంటే ఎక్కదు. వేడి వేడిగా ఉండాలి కాఫీ అంటే :):) Anyways, Thanks for the comment.

Venugopal Reddy. Gurram said...

ఆ మధ్య నేను అమెరికా నుండి ఇండియా వచ్చేటప్పుడు నా కొలీగ్ ఒకాయన (అమెరికన్) ఒక కాఫీ ఫిల్టరు మరియు స్టార్ బక్స్ కాఫీ పొట్లం బహుమతి ఇచ్చారు. రుచి చాలా బాగుంది. నాకైతే అలవాటు లేదు కాని మంచి అవకాశం వస్తే వదులుకోను.

chaitanya said...

Great Post !

I'm a great fan of your writing style !

Could never imagine, lot of humor could be mixed in narrating recipes ! Mee nala bhima paakam adurs oo adurs !

Asalu nala bhimula vaaraswatvam teeskunna vaallante, naaku boledu respect ! Nenu coffee fan ne !

Kaani ila tea lu, coffee lu ante mari fuddu sangathi enti sir ? Ee sari manchi recipe okati eskondi ! Chai mareppudaina ! ( manalo mana maata, naku tea assalu nachchadu ! )

భాస్కర్ రామరాజు said...

@వేణుగోపాలా: మన పల్నాటి గోగూర ముందు ఏదైనా దానెక్క దిగదుడుపే. :)
Starbucks coffee is deep roasted coffee. DD coffee is not so. Thats why, you get "చిరు చేదు" in Starbucks coffee. ఆ చిరు చేదే కిక్కు.
@చైతన్య: నీకు టీ నచ్చదా. ఐతే నీకోసం టీ పెడతా, ఎందుకునచ్చదో చూద్దాం :):)

chaitanya said...

సోదర వజ్రం గారూ,

హ్హ హ్హ హ్హ ... మీ confidence చూస్తూంటే
ముచ్చటేస్తోంది !

(చేసే వాళ్ళ గొప్పతనం అని కాదు కానీ, కొందరికి, కొన్ని నచ్చవు !) ఐనా, ఎంచక్కా చేసి పెడతాను అంటే, అస్సలు కాదు అననుగా ! ఏ నల, భీముడి చేతిలో ఏం మహత్యం ఉందో, ఎవరికి తెలుసు ? మీకు బోలెడు థాంకులు !

గుత్తి వంకాయ ఎవరైనా చేస్తారు కానీ,మీ నలభీమ పాకం లో , గుత్తి గుమ్మడి కాయ, గుత్తి సొర కాయ(ఆనప కాయ) కూరల రెసిపీలు (కూడా?) ఇద్దురూ ?

ఊరికే పిల్లాట ! ఇది మా ఫ్రెండు idea ! ( ఒక idea జీవితాన్నే మార్చేస్తుంది ! )

DD = Dunkin Donuts ? To me, that's the worst coffee stop ! If someone wants to quit coffee, I highly recommend DD !

భాస్కర్ రామరాజు said...

@చైతన్య గారు:
నమ:స్తే!!
కాన్ఫిడెన్సా - 30ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. :):)
>>గుత్తి వంకాయ ఎవరైనా చేస్తారు కానీ,మీ నలభీమ పాకం లో , గుత్తి గుమ్మడి కాయ, గుత్తి సొర కాయ(ఆనప కాయ) కూరల రెసిపీలు (కూడా?) ఇద్దురూ ?
అహా!! ఛాలెంజ్లు నేనె ఉప్పుడూ స్వీకరిస్తా: కాస్కో- ఇదే గుత్తి గుమ్మడికాయ కూర:-
ఓ "గుమ్మ"డికాయ తీస్కో - మంచిగుమ్మడి నుకుంటున్నా - అడ్డంగా రెండు ముక్కలుజేయ్. దానిపొట్టలోని ఇత్తనాలు తీసెయ్, పైన తొక్క ఒలిచెయ్. పక్కన పెట్టు. మొన్న చేస్కున్న బంగాళదుంప కూర ఉందిగా అది తీస్కో, ఇందాక చేసిన గుమ్మడికాయ రెండుముక్కల్లో కిందముక్క తీస్కో, ఈ కూరతో దాన్ని నింపు పక్కనబెట్టు. పైముక్క తీస్కో, కూరతో నింపు - కిందముక్కని పైముక్కతో కూరకిందపడకుండా మూసేయ్. ఇప్పుడు ఓ తాడు తీస్కో, దాన్ని కట్టేసేయ్.
ఓ పెద్ద భాండీ తీస్కో, గుమ్మడికాయని దాంట్లో పెట్టగలిగేంత పెద్దది. పొయ్ వెలిగించు, ఆభాండీ పెట్టు, ఓ నాలుగు చుక్కలు నూనెపొయ్, నూనె కాగంగనే ఈ గుమ్మాడికాయ దాంట్లో వెయ్, ఇక వేయించు, గుమ్మడికాయ రంగు మారంగనే (అసలు రంగునుంచి ఏరంగుకైనా) ఉప్పు కారం, కొంచెం కారప్పొడి జల్లు, ఆ తాడు కోసేయ్, ఇక లాగించు.
పక్కనోళ్లకి మాత్రం పెట్టకు. పాం, వాళ్లనొగ్గేయ్.

chaduvari said...

గుత్తిగుమ్మడికాయ కూర చేసుకునే విధానం చదివి నవ్వాపుకోలేకపోయాను సార్! ఇరగదీసారు పొండి.

నాగప్రసాద్ said...

హ్హ...హ్హ...హ్హ... గుత్తి గుమ్మడికాయ కూర.
భలే చెప్పారు. :).

భాస్కర్ రామరాజు said...

@నాగ్:
బాబూ నాగయ్యా హ్హ...హ్హ...హ్హ...కాదు!! నువ్వూ ఓ చెయివెయ్యవయ్యా

నాగప్రసాద్ said...

@భాస్కర్ రామరాజు గారు: మీ కోరిక ప్రకారము ఓ చెయ్యి వేశా. టేస్టు అద్దిరిపోయింది. :)


అవును, ఇన్ని కాఫీలు ఎక్కడివండీ బాబు. నాకిప్పటివరకు తెలిసింది రెండే. ఒకటి బ్రూ, రెండు Nescafe sunrise. :(

మనోళ్లు యుగ యుగాలుగా "పిల్టర్ కాపీ" తయారు చేస్తున్నారా. ఆశ్చర్యంగా ఉందే. నేను ఆ పేరు వినడం ఇదే first time.

అన్నట్లు ఇప్పుడె గుర్తొచ్చింది. సంవత్సరం క్రితం మా ఇథియోఫియా ఫ్రెండు గాడి రూము కెలితే, పాలు, చక్కెర కలపకుండా, తేనె కలిపి బ్లాక్ కాఫీ అని నా చేతికిచ్చాడు.

భాస్కర్ రామరాజు said...

@నాగ్!! Thats a great idea too. I do that sometimes. Just regular coffe, with honey. :):)

krish said...

Brother, Chappadam marchi poya, meeru US vellamundu, chennai ki vacharu kada, appudu mee coffee filter naa degaray marchipoyaru :-)

ప్రణీత.స్వాతి said...

అబ్బ.. ఎంత బాగా కలిపారండీ కాఫీ..నిజంగానే మీరు నలుడో భీముడో అయ్యి వుంటారు మీ గత జన్మలో.
ఏది ఏమైనా "పెళ్ళికాని బాచిలర్లకి, పెళ్ళైన బాచిలర్ల" కే కాకుండా నా లాంటి అమ్మాయిలకి కూడా పనికోస్తోందండి..మీ నలభీమ పాకం !!
ఇకమీదట వంటల్లో ఏదైనా డౌట్ వుంటే మిమ్మల్నే అడుగుతానండి.. చెప్తారా మరీ..

bujji said...

రాజు గారు ..నలభీమ రాజు గారు!నేను కూడా కాఫీ పార్టీ ఏ నండి.. ఎదురుగా వేడి వేడి కాఫీ కుప్పు పెట్టుకుని తాగకుండా ఎలా ఊరుకోలేమో... మీ టపాలు చూసి అలానే అభినందించకుండా ఉండలేకపోతున్న.సరిగ్గా సంవత్సరం క్రితం మీ బ్లాగ్ చదివి..పని మధ్యలో కామెంట్ పడెయ్యటం మర్చిపోయా...రామ్ములక్కయ్ బాగా గుర్తుండి గూగులోడిని యెంత వేతికిపెట్టమన్నా..ఉహు..యాడా..ఇంటే కదా. :P
ఇన్నాళ్ళకి వెతికి పట్టుకున్నాను..పాత మిత్రుడిని చూసినంత ఆనందం కలిగింది..పాత వంటలే కొత్తగా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం..