Wednesday, October 29, 2008

గోంగూర పప్పు - కుంపటి.

నేపధ్యం : 2008 వేసవి కాలం మేము, సరదాగా కుంపటి మీద గోంగూర పప్పు వండాం. అమెరికా లో కుంపటా అని అనుకుంటున్నరా? అవును. కుంపటే.
ఇదిగో మా కుంపటి. నాటు కుంపటి.
ఎలా చేసా? వాల్మార్ట్ లో ఒక టెర్రకోట కుండీ తెచ్చా. అక్కడే తెల్ల ఇసుక తెచ్చా. కుండీ కింద బొక్కని ఒక అట్ట ముక్క పెట్టి మూసేసి ఇసుక పోసా. కుంపటి తయ్యారు. బొగ్గులు తెచ్చా, ఒక మూట, ఇసుక మీద కావాల్సినన్ని పేర్చా. వెలిగించా. ముందుగా మొక్కజొన్నలు కాల్చుకున్నాం, తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత చిక్కుడు కాయలు. మా బుడ్డోడు ఎంజోయ్ చేసాడు, నేనూ కేరింతలు కొట్టా. సేఫ్టీ గానే ఉంచాలేండి.
ఓరోజు మాఆవిడ దం బిర్యాని వండింది. నేనూ ఇంకో రోజు రొట్టెల మీద అదే అదే నిప్పుల మీద రొట్టెలు కాల్చా.
ఒకానొక రోజునగోంగూర పప్పు వండాం కూడా. వాహ్...వాహ్..వాహ్....క్యా బోలూం మియా...క్యా బాత్ హై....ఫాంటాష్టిక్కు, అదుర్స్ కెవ్వు కేక, మేక తోక...
ఈ కుంపటి అడ్వాంటేజ్ ఏంటంటే, వంట తంటా అయ్యాక ఇసుకని బొగ్గుల మీద కప్పేస్తే వెంటనే నిప్పు ఆరి పోతుంది.
అదీ కధ.

పెద్దలు చెప్పినట్టు పప్పుని కుక్కర్లో పెడితే పెద్ద బావోదు. బయటే వండాలి. ఐతే ఇది తీరిక సమయాల్లో మాత్రమే. ఎనిమిదింటికి ఆఫీస్కెళ్లాలి, పొయ్యిమీద పప్పు పడేయ్, రేపొద్దునకి తయ్యారు అవుతుంది..అలా కాదు. లిమిటెడ్ టైం లో ఇలాంటివి పెట్టుకోవద్దు..ఆరాం గా ఉన్నప్పుడు ఇలాంటివి.

సరే ఇంకో మాట. ఉద్యోగం లేని బ్యాచిలర్స్కి - పొట్ట ముఖ్యం. కమ్మగా వండుకుని తిన్న ఒక్క ముద్దైనా కమ్మగా తింటే ఒక సాటిస్ఫాక్షను వల్ల, జావానో డాట్ నెట్టు మీదనో ఏకాగ్రతతో కుస్తీ పడొచ్చు. చాలా మంది కమ్మగా తింటే నిద్ర పోతాం అనుకుంటారు. కానీ, పొట్ట పగల తింటే నిద్రొస్తుంది, కమ్మగా కాదు..
వస్తువులు:
కుంపటి,
బొగ్గులు,
అగ్గిపెట్టె (జేబులోంచి లైటర్లాగు బైటికి),
కిరసనాయిలు.
మందపాటి గిన్నె - మా ఇంట్లో రాచ్చిప్ప గిన్నె, రాచ్చిప్ప గంటే అని ఉండేవి, కేవలం కుంపటి మీద వంటకోసం (రాచ్చిప్ప = రాతి చిప్ప)
గోంగూర పప్పుకి కావాల్సినవి:
గోంగూర - ఒక కట్ట (10 గోగికాడలు).
కంది పప్పు - మనుషుల్ని బట్టి. నాలుగు గుప్పిళ్ళు.
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - 4
తిరగమాత గింజలు, ఉప్పు గిప్పు ...

విధానం - గోంగూర కి వెళ్లు ఇందిరా నగర్లో,100 ft రోడ్డు పక్కన !! గోంగూర పప్పు పార్సిలు తెచ్చుకో మింగు...కాదు
కుంపటిరా జెయ్యి - అంటే వెలిగించు. ఎలా? బొగ్గులు వెయ్. ఎన్ని? కొన్ని. కిరసనాయిలు కొన్ని చుక్కలు అన్ని బొగ్గుల మీద పడేట్టు జల్లు (చేతికి కిరసనాయిలు అంటానీమాక). అగ్గిపుల్ల గీ, దానిమీద పడేయ్. అంటుకుంటుంది. భగ్గున మంట వొస్తుంది. భయపడకు. వెంటనే తగ్గిపోతుందిలే. బొగ్గులు ఆ మంటకి అంటుకుంటై. నిప్పు రాజుకున్నదాకా ఇసెనకఱ్ఱతో ఇసరతా ఉండు. అన్నీ బొగ్గులు రాజుకునేలోపు,
గిన్నెలో కందిపప్పు వెయ్, కడుగు, ఒకటికి మూడు నీళ్లు పోయి. పక్కన పెట్టు. నిప్పులు అన్నీ రాజుకున్నాయా చూడు, గెన్నె దాని మీద బెట్టు. చిటికెడు పసుపు వెయ్. మూత బెట్టు.

గోంగూర కడుగు, పక్కన బెట్టు.
ఉల్లిగడ్డ మిలువునా నాలుగు ముక్కలు జెయ్యి, పక్కన బెట్టు.
పచ్చిమిరగాయలు తొడిమలు తీయ్, పక్కన బెట్టు.
అలా గిన్నె వైపు చూస్తూ వుండు. పొంగు వస్తుంది కొంచెం సేపు ఐతే. అప్పుడు మూత తీ, గోగూర, ఉల్లి, మిర్చి వెయ్. ఓరగా మూతబెట్టు. నిప్పులు ఉన్నయో లేదో చూస్తూ ఉండు. ఉప్పు కారం వెయ్యి. అప్పుడప్పుడు విసెనెకఱ్ఱతో వీస్తా ఉండు.
పప్పు ఉడికిందో లేదో ఎలా తెల్సుకోవటం, చెంచాబెట్టి ఒక పప్పు తీస్కుని నలిపి జూడు. మెత్తగా నలిగింది అంటే ఉడికినట్టు.

తిరగమాత :- ముందు పప్పు గిన్నె తీసి పక్కన బెట్టు చిప్ప గంటె తీస్కో, పొయ్యి మీద పెట్టు. కొంచెం నూనె వెయ్. 3 చెంచాలు. నూనె కాగినాక ముందు (మందు కాదు బాబు - ముందు) మినప్పప్పు వెయ్, తర్వాత ఆవాలు మెంతులు వెయ్, చిట్పట్ అనగానే జీలకర చిటికెడు ఎండుమిరపకాయ ఒకటి చేత్తో విరగ్గొట్టి వెయ్, ఒక్క 10 సెకండ్లు ఆగు, కర్వేపాకు వెయ్, ఇంగివ జల్లు, పప్పులో వేసేయ్..
మళ్లీ పప్పు గిన్నె పొయ్యిమీద పెట్టు. ఒక్క నిమిషం ఉంచు..దింపేసేయ్. కుంపట్లో నిప్పులు ఆర్పెయ్...లేకపోతే ఇల్లు కుంపటే...
ఇంక లాగించు.
బాబూ!!! కాంబినేషన్ తెల్సుకో. గోంగూర పప్పు లోకి ఉప్పుమిరపకాయలు అదుర్స్. బైట కొనకు, మీ ఇంటినుండి తెచ్చుకో ఈసారి ఎళ్లినప్పుడు. బయట కొన్నవాటిల్లో మజ్జిగ కంటెంటు బగా తక్కువ, ఉప్పు కంటెంటు ఎక్కువ.

65 comments:

విరజాజి said...

ఎందుకండీ... చలికాలం వేడి వేడి గోంగూర పప్పుని గుర్తు చేసి మా వంట్లో చలిని, పొట్టలో ఆకలి మంటల్ని రేపుతారు...? అందరికీ కుంపటి తయారు చేసుకోడానికి మంచి ఐడియా ఇచ్చారు. మీ గోంగూర పప్పు టపా చా..............లా రుచిగా ఉంది.

మరో మాట. కుంపటి రెడీ కదా, మరి కుంపటి లో కాల్చిన కుమ్మొంకాయ పచ్చడి కూడా ట్రై చెయ్యండి...అదుర్సో అదుర్స్.

లలిత said...

సూపర్................
నవ్వలేక చచ్చాను.
గొంగూర పచ్చడితప్ప ,పప్పు తెలీదు.
మీదయవల్ల అదినేర్చుకున్నాను.
అటకమీద కుంపటి దించి, పెరట్లో గొంగూర తుంచి మళ్ళీ వస్తాను.

సుజాత said...

లాభం లేదు, ఇవాళ గోంగూర పప్పు వండాల్సిందే, కుంపటి లేదు గానీ!
అసలు మీ కుంపటి చూస్తుంటే కుళ్ళుగా ఉంది!

ఆ మధ్య బేలూరు, హళేబీడు వెళ్ళినపుడు రాచ్చిప్ప తెచ్చాను గానీ దాంట్లో కాసిని పూలు నిలబెట్టి షోకేసులో పెట్టాను, అంతకంటే ఏమి చెయ్యాలో తెలీక!

భాస్కర్ గారు, లలిత గారు చెప్పినట్టు గోదావరి జిల్లాల వాళ్లకి గోంగూర పప్పు తెలియదు. వాళ్ళు పచ్చి సెనగపప్పు పోసి పులుసు (మనం పులుసుకూర అంటాం కదా) చేస్తారు. గోంగూర పచ్చడికే కాకుండా, పప్పు కి కూడా పేటేంట్ మనదే!

మీ పప్పు రెసిపీ చదువుతుంటే అమ్మ చేసే పప్పు రుచి గుర్తొస్తోంది.

Pappu said...

అమ్మా సుజాత గారూ...లలిత గారికి గోంగూర పప్పు తెలియదు అంటే మొత్తం గోదావరి జిల్లావాళ్ళెవరికీ తెలియదని చెప్పలేదు...పైగా పేటెంట్ రైట్స్ కూడా తీసేసుకున్నారు...హన్నా...ఇక్కడ ఇంకా తూ.గో.జి వాళ్ళు ఉన్నారు...మా ఇంట్లొ మా మేడం చక్కగా గోంగూర పప్పు చేస్తుంది...మా అక్క కూడ సూపర్ గా చేస్తుంది...(అసలు గోంగూర పేరు లోనే ఉంది ఆ మహాత్యం....శాకంబరీ దేవీ ప్రసాదం...చెయి తిరిగిన వంట వాళ్ళు ఎవరు చేసినా స్వర్గానికి బెత్తెడు దూరమే...ఓహ్...ఎక్కడ ఉన్నాను...)

Pappu said...

ఆ...మర్చిపోయాను...అందులో వెల్లుల్లి తిరగపోపెడితే ఇహ చూడండి...సూపరో...సూపర్...మా ఇంటి ఇల్లాలు ఇలగే చేస్తుంది మరి...

D. Venu Gopal said...

నేను Pappu గారితో ఏకీభవిస్తున్నాను. గోదావరి జిల్లావాళ్ళకు గోంగూర పప్పు తెలీదా! ఛా! కందిపప్పు సరే, శనగ పప్పుతో కూడా ట్రైచేసి చూడండి.

భాస్కర్ రామరాజు said...

@వేణు గోపాలా: గోంగూర మాదే. అన్ని హక్కులూ మావే. ఐతే..మనం మనం ఒక్కటే. తు.గో.జీ/పా.గో.జీ ఎవ్వరైనా ఒక్కటే. పప్ అంటే పప్పు ఎలా ఉందో చూద్దాం, మీమా మీమాశ కన్నా...:)
@విరజాజి: చలికాలం మధురస్మృతులు వెచ్చటి అనుభూతుల్ని కలుగజేస్తే మంచిదే కదా.
వ్యఖ్య కి నా థాంక్సులు.
>>అందరికీ కుంపటి తయారు చేసుకోడానికి మంచి ఐడియా ఇచ్చారు.
:):)
@లలిత: గోగూర పచ్చడి..రకరకాలుగా చేస్తారు. I am happy that someone learnt something from my post. :)
@సుజాత: మీకేమండి, ఇప్పటికిప్పుడు వెళ్లి గోగులు పూయిస్తారు, లేక గోగిపప్పు వండుకుంటారు. మాకు ఇక్కడ ఈ జీవితాలకి, వేసవి కాలమ్లో మా ఇండియా బజార్ వాడు దయదలిస్తే నాలుగాకులు విదిలిస్తాడు. వాటితోటే ఇలా సర్దుకొస్తున్నాం.
ఎదో గుర్తుకొచ్చింది, మేము గుంటూరికి వచ్చేదాకా గోగూరని కొనుక్కోలేదు. మిరపకాయలు కొన్నుక్కుని ఎరగం. చిక్కుళు, సొరకాయలు, గుమ్మడికాయలు, బీరకాయలు, కాకర కాయలు, దొండకాయలు, బూడిద గుమ్మడికాయలు, మునక్కాయలు కొన్నట్టు నాకు గుర్థుకూడా లేదు. అలాంటిది ఇవ్వాళ 10 గోగి కాడలు మూడు దాలర్లు. కలిప్రభావం నాయనా...
@పప్పు బ్రదర్: ఇక్కడేఉన్నావ్. ఈసారి నేను కుంపటి పెట్టి గోంగూర పప్పు చేసినప్పుడు ఓకేక వేస్తా. సిద్ధంగా ఉండండి.

Pappu said...

ఎందుకు బాబూ..గోంగూర కొనుక్కొచ్చి నన్ను పిలిస్తే...నేను అందులో దూకటానికా...అంటే పప్పు మిగులుద్దామనా...హన్నా)అయినా మా ఆవిడ ఆ అవకాశం నీ వరకూ రానిస్తుందా...నాయనా...)అమ్మో దగ్గర్లో లేదు కదా?)

భాస్కర్ రామరాజు said...

@pappu bradar:
>>...)అమ్మో దగ్గర్లో లేదు కదా?)
ఒక్కసరి తలకాయ్ 180 డిగ్రీలు తిప్పు. మీఆవిడ మీ వెనకే ఉంది. But, she wud say, Ohkay, మగోళ్లుకూడ వంటల కతలు రాస్తున్నారన్నమాట, వాటికి మొగోళ్లు కామెంట్సు కూడా ఏస్కుకుంటున్నారూ!!!, కలికాలం అనేసి ఊర్కుంటుందిలే. Dont worry.
నిన్ను ఎందుకు దూకనిస్తా బ్రదర్...మీకు చెప్పలేదు కదా!! మాది పల్నాడు...దూకినా ఏంజేసినా పిల్చినోళ్లే జెయ్యాల.:):)

Pappu said...

అసలు వంటలకి పేరు పెట్టిందే మగవాళ్ళు స్వామీ.నల భీమ పాకం అన్నారు కదా..మీ బ్లాగ్ హెడర్ కూడా అదే కదా..మనదే "పేటేంట్"...క్షమించండి నాకు వంట రాదు కాకపోతే సాయం చెయ్యమంటే తినిపెడతాను...

Rani said...

gongura tho pappu maa intlo kooda cheyyaru. senagapappu tho chestaamu.
gongura ishtam undadu kaani mee post maatram chaala baavundi :)

రాధిక said...

నాకూ తెలియదండి గోంగూరపప్పు చేస్తారని.మాదీ తూగోజీనే.అదేమో తెలీదు ఆనీ నోరూరుతుంది చదువుతుంటే.

సుజాత said...

pappuగారు,
మీ మేడం గారు సెనగపప్పుతో చేస్తారా? వేణుగోపాల్ గారు, సెనగపప్పుతో చేసేది గోంగూర పప్పు గాదు స్వామీ, అది పులుసు. రాధిక గారికి కూడా తెలీదంట చూడండి గోంగూర పప్పు! పెళ్ళయ్యాక నేను వండి పెట్టేదాకా మా ఇంట్లో (వాళ్లది పగోజీ లెండి) తెలీదు గోంగూర పప్పు వండుతారని. (అమ్మయ్య, బోలెడు సాక్ష్యాలు చూపించేసా)భాస్కర్ గారు చెప్పినట్టు మనమంతా ఒకటే అయినా గోంగూర మీద వోల్మొత్తం రైట్సన్నీ మాకే, మా గుంటూరోళ్ళకే!

భాస్కర్ గారు,మేము ఒక్లహోమా లో ఉన్నపుడు ఇండియా స్పైసెస్ పటేలు గోంగూర రాగానే నాకు ఫోన్ చేసి "గొంగుర ఆయీ హై " అని చెప్పేవాడు. అందువల్ల నేను రేసులో ఫస్టు ఉండేదాన్ని! బాచెలర్ ఫ్రెండ్స్ అందరూ మా సాయంత్రానికి మా ఇంటిచుట్టూ కార్లు పెట్టి, హాజరు టప్పర్ వేర్ డబ్బాలు పుచ్చుకుని.

Pappu said...

మా వూరోడు ఎవడూ లేకపోతే పులి కధ చెపుతానన్నాట్ట..ఒకడు..అలాగ...అసలే సమయానికి మా మేడం కూడా సాయం లేదు అందరూ కల్సి నన్ను తిరపోపెట్టేస్తున్నారు...పోనీలెండి సెమిన్సెయ్యండి..ఈపాలికి...ఆయ్ కొంచం మీరు వండిన గోంగూర పప్పెడతరా...పండగ చేసుకుంటాము..ఆయ్

సుజాత said...

pappu,
అల్లా రండి దారికి!

భాస్కర్ రామరాజు said...

గోగులకీ జై, పల్నాడూ ఢాంఢీం!!! సుజాతగారికీ జై..

నాగప్రసాద్ said...

గోంగూర నా ఫేవరేట్. వెంటనే వెళ్ళి గోంగూర పప్పు తినాలి.

అదేంటీ గోంగూర పప్పు మా రాయలసీమ లో కూడా చేస్తారు కదా. పేటెంటు మీరెలా తీసుకుంటారు.

వేణూ శ్రీకాంత్ said...

Super post brother... kumpati adurs

మరమరాలు said...

మన ఆంధ్ర మాత గోంగూరతో ఏమి చేసిన నాకు ఇష్టమే, పప్పుతో గోంగూర పచ్చడి కలుపుకోని ఉల్లిపాయతో నంజుకు తింటూంటే.. ఆహ ఓహొ స్వర్గలోకపు తాకి రావచ్చు.

మరమరాలు

వేణుగోపాల్ రెడ్డి said...

గుంటూరు గోంగూర పులుపంతా వలపేలే (ముఠామేస్త్రి సినిమా లో పాట) లాగా ...ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి.....రోజు తిన్న మరి ...మోజే తీరనిది....!

కొత్త పాళీ said...

గోంగూర గురింఛి చాలానే యుద్ధం జరిగిందే!
కానీ బొగ్గుల బార్బెక్యూని కుంపటిగా ఉపయోగించడం అవిడియా సూపరు.

భాస్కర్ రామరాజు said...

@కొత్త పాళీ అన్నగారు:
>> కానీ బొగ్గుల బార్బెక్యూని కుంపటిగా ఉపయోగించడం అవిడియా సూపరు.
- Thanks Sir :):)

రాధిక said...

కొత్తపాళీగారూ ఒక డే అవుట్ లో బొగ్గుల బార్బీక్యూ గ్రిల్ మీద పెనం పెట్టి అట్లు వేసుకున్నాము మేము :)ఆలోచిస్తే బోలెడు అవుడియాలొస్తాయి :)

ఏకాంతపు దిలీప్ said...

ఇదేంటి ఇక్కడ ఎవరో గోదావరి వాళ్ళకి గోంగూర పప్పు తెలియదు అంటున్నారు... గోదావరిలో గో , గోంగూరలో గో కనపడటం లేదా? అయినా మాకు తెలియదు అనే ధైర్యం చేస్తున్నారా? :-)

నేను చిన్నప్పటి నుండీ తింటున్నానండి బాబు... మాది పశ్చిమ గోదావరి... చిన్నప్పుడు గాస్ లేనప్పుడు, పొయ్యి మీద మా అమ్మ వండిన గోంగూర పప్పు రుచి ఇంకా నాకు గుర్తే...

భాస్కర్ రామరాజు said...

@దిలీపు: బహుశా కొన్ని యుగాలనాడు మీరు పల్నాడు నుండి అటైపుకి వెళ్లిపోయినట్టున్నారు :):)

ఏకాంతపు దిలీప్ said...

హమ్మా...! ఈ గుంటూరు వాళ్ళున్నారు చూడండి పేటేంట్ల వరకూ వెళ్ళిపోయారంటే తీవ్రంగా ఖండించాల్సిందే...

గుంటూరు వాళ్ళకి కేవలం గోంగూర నిలవ పచ్చడిలో ఒకరకమైన ఫార్ములాకి పేటంటు ఉంటుంది మహా అయితే...

గోంగూరు, ఉల్లిపాయ,పచ్చి మిరపకాయ, తగినంత కల్లు ఉప్పు, ధనియాలు వేసి రోట్లో చేసే తొక్కుడు పచ్చడి ఉంటుంది చూడండి... అబ్బా ఏముంటుంది అది మా గోదావరిలో భూమి పుట్టనప్పుడు నుండే చేసుకుని తింటున్నారు... హా!

ఇంకా గోంగూర, ఎండు రొయ్యలు.. అబ్బా ఏముంటుంది! అది మా గోదారి పుట్టినప్పటి నుండి మేము చేసుకుని తింటున్నాము...గోదారి గట్టు మీద గోంగూర కోసుకుని, గోదార్లో రొయ్యలు పట్టుకుని కలిపి తింటుంటే అనిపించడంలేదు మీకు? గోంగూర గోదావరిలోనే పుట్టి ఉంటుందని?!

ఇంకా గోంగార పులుసు (పచ్చి మిరపకాయలు చిన్న ముక్కల కోయకుండా)... గోదావరి వదిలేసి 15 సంవత్సరాలైన నాకే ఇన్ని గుర్తుంటే... హన్నా! మీరు మీ బడాయిలు..

గోంగూర అంటే గుర్తొచ్చింది... మా ఇంట్లో అయితే ఎప్పుడూ గోంగూర మొక్కలు ఉంటాయి... దీపావళి అప్పుడు గోగు నారతో దివిటీలూ కొడతాము... గోంగూరకి మాకు,గోదారికి గోంగూర పుట్టనప్పటి నుండి అవినాభావ సంభంధం ఉండి ఉంటుందని నేను నమ్ముతున్నాను... కొన్ని పరిశోధనలు చేసి ఈ గుంటూరు వాళ్ళ బడాయిని, అసత్య ప్రచారాన్ని పూర్తిగా పోగడతానని శపధం చేస్తున్నాను...


@భాస్కర్ గారు
నాకు మీ బ్లాగు నచ్చింది... నేను వంటల గురించి బ్లాగు మొదలుపెడితే ఈ పేరే పెట్టేవాడినేమో! :-)

ఏకాంతపు దిలీప్ said...

@ భాస్కర్ గారు,
:-)) నేనొప్పుకోనంతే!

teresa said...

ఈ కుంపటి దెచ్చి చించిగురు పప్పొండాలబ్బా! ఇంకా 4-5 నెల్లయినా ఆగాల్సిందే ,స్నో పడుతోందిగా :( అయినా భాస్కరం గారూ, ఇట్టాటి పోష్టులు రాసిపడేసే ముందు కాస్త వెదరూ గట్రా చూసుకోవద్దుటండీ,మరీనూ...

సుజాత said...

దిలీపూ,
ఇక లాభం లేదండి! అమ్మో అమ్మో గోంగూరకీ, గోదావరికీ లింకెక్కడ ఉండండి అసలు? ఏదో నాలాంటి ఔత్సాహికులెవరో గోదారి ట్రిప్పుకెళ్ళి, అక్కడ మా గోంగూర విత్తనాలు మీవాళ్ళకిచ్చి ఉంటారు...దానితో మీరంతా మీరు చెప్పిన సదరు వంటకాలన్నీ చేసుకుని తినేస్తూ....ఇప్పుడు గోంగూరే మీదంటున్నారు.(నాకేంటి చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నాడు?)

"గోంగూర మొక్కలు" అనడంలోనే తెలిసిపోయింది మీ నేటివిటీ.....! అవి గోంగూర మొక్కలు కాదండి,దాన్ని మొత్తంగా 'గోగు మడి" అంటారు.

హ హ హ (వికటాట్టహాసం అని చదువుకోగలరు), అసత్య ప్రచారం కాదు, మాయా బజారు లోని సత్య పీఠం మీద మిమ్మల్ని ఎక్కిస్తే మీరే నిజం చెప్పేస్తారు..."గోంగూర పుట్టిల్లు అత్తిల్లు పెద్దిల్లు చిన్నిల్లు అన్నీ గుంటూరే గుంటూరే గుంటూరే అని"...ష్! అబ్బా! భాస్కర్ గారు, ఒక ఫిల్టరు కాఫీ టేబుల్ నంబర్ 2 కి అర్జెంట్!

సుజాత said...

దిలీప్ గారు,
గోంగూర మొక్కలా? ఇంకా నయం గోంగూర వృక్షాలన్నారు కాదు....!

భాస్కర్ రామరాజు said...

బాసు దిలీపు!!
ఇహలాభం లేదోయ్!! నీకు గోంగోరోపాఖ్యానం చెయ్యాల్సిందే!!
గోంగోర మా పల్నాడులో మధ్యరాతి యుగం నాడే వాదుకలో ఉండేది. ఇప్పటికీ భూగర్భ గుహల్లో, ఎత్తిపోతల గుహల్లో, గుత్తికొండ బిలాల్లో లోపలకి, గోంగూర - కుంపటి బొమ్మలేసి ఉన్నాయ్. నీకు గోంగూర పురాణం చెప్పాలని ఉంది, కానీ సమయా భావం వల్ల చెప్పలేకపోతున్న....

భాస్కర్ రామరాజు said...

@తెరెసా గారు: పోని వచ్చే వేసవికి ఇప్పటినుండే ప్రిపేర్ అవ్వండి. చించిగురు పప్పు, గోంగూర పప్పు లిష్ట్లో కలిపేసేసాం..:):) మమ్మల్ని పిలవండేం, మిషిగన్ వస్తాం:):)
@రాధిక గారు: కుంపటి పెట్టి దానిమీద మట్టిమూకుడు మీద వేస్కోండి ఈ సారి, నూనె లేకుండా. థాంక్సులు.
@సుజాత గారు: ఈ దిలీపు ఏంటండి అసలు!!! ఓసారి కారంపూడి తీస్కెళ్లి వీర్లబావి జూపిస్తే సరి. దార్లోకొస్తాడు. వేణుశ్రీకాంత్ ఓ పట్టు పడదాం రా:):)

వేణూ శ్రీకాంత్ said...

దిలీప్ గారు
హన్నన్నా !! ఈ శపధాలు ఏంటండీ... కావాలంటే పులసలు మా గోదారోళ్ళవి అనండి ఒప్పుకుంటా కానీ గోంగూర మాదంటే ఎలాగండీ... అసలు గుంటూరు నీ గోంగూర నీ విడదీయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండీ బాబు.

ఏకాంతపు దిలీప్ said...

@ సుజాత గారు

అసలు మీకు మొక్కలు అని ఎందుకు అంటా ఉన్నానో తెలిత్తే అట్టా యాసండం సేత్తా పసండాలివ్వరు గంద... నేను మా కయ్యలోనో, దొడ్లోనో మడి గట్టి గోగాకు సేత్తే అట్ట గోగుమడే అనే వోడిని గదా... మా దొడ్లో వో మూల అలా గోగాకు మొక్కలు సిన్నగా ఉన్నప్పుడు తుంచకుండగ.. గోగు నార కోసరం... దీపాల పండగప్పుడు దివిటీలు కొట్టేదాని కోసరం... సంధర్భం గూడా సెప్పినానే, అంత ఇకటాట్టాసం ఏమి పూడ్సేదానికో? ఆ ఇకటాట్టాసానికి మా వూరి ముత్తాలమ్మ తల్లైతే గోగు నారతో సిచ్చించి ఉండేది గదా! అయినా గోదారోళ్ళకి మడులు గురించి సెప్తారా ఎవురైనా? ఇదెక్కడి సోద్దెం? కలి కాలం గదా... ఏమి సేత్తును?!

( మిట్టూరోడి పుస్తకం చదివిన మత్తులో...)

మీరు గోదావరి విహార యాత్రలకి ఈ మధ్యే కదా వస్తుంది... గోదావరి సినెమా చూసి అక్కడ కూడా విహార యాత్రలకి వెళ్ళొచ్చు అని తెలిసి మీలాంటి ఔత్సాహికులు ఇటు వైపు అంతా ఒకేసారి వచ్చేస్తున్నారు... లేకపోతే పల్నాటి వాళ్ళకి అక్కడున్న చిన్న చెరువులు పిల్ల కాలవలే కదా గొప్ప విహార యాత్రలు! :-) ఎక్కువ మాట్లాడేసానా?! అయినా సరే, గోంగూర ని గోదావరి కి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్న ఈ కుట్రని వ్యతిరేకించడానికి నేను గోంగూర పప్పులోంచి తీసిన పప్పు గుత్తి దూసి యుద్ధానికైనా సిద్ధమే అని ప్రకటిస్తున్నాను...!

అహ్! ఇప్పుడు గోగు పువ్వులు ఎక్కడ దొరుకుతాయబ్బా! వాటిని కస బిసా నమిలి తింటేనే కానీ నాకు శాంతంగా ఉండదు...

@భాస్కర్ గారు
నేను సిద్ధం. ఇప్పటికే గోదారికీ గోంగూరకి ఉన్న అవినాభావ సంభంధాన్ని చెప్పేసాను...

@వేణూ శ్రీకాంత్
:-) గోంగూరు మాది మాత్రమే అనలేదు, గుంటూరుని గోంగూరనీ వేరు చెయ్యలేదు నేను... గోదారి నుండి గోంగూరని వేరు చేస్తుంటే ప్రతిఘటిస్తున్నాను అంతే!

వేణుగోపాల్ రెడ్డి said...

హి...హి ....హి...ఆంధ్రమాత అయిన గోంగూర మీద ఆంధ్రులందరికీ హక్కు వుంది......! ఆంధ్రులు అంటే ఆంధ్ర + తెలంగాణా వాళ్ళు అందరునూ ....కాని మొత్తానికి అది గుంటూరు గొంగోర...హ హ హ......!

భాస్కర్ రామరాజు said...

బాసు!!
>> లేకపోతే పల్నాటి వాళ్ళకి అక్కడున్న చిన్న చెరువులు పిల్ల కాలవలే కదా గొప్ప విహార యాత్రలు! :-)
- ఎంత మాట అన్నావ్? మీకు గోదావరిలానే, మాకు కిట్నమ్మ ఉంది. పల్నాడు కిట్టేమ్మటే ఉంటది. మీకు తెరసాప పడవల్లానే మాకు తెప్పలు, సిన్న సిన్న పడవలూ ఉన్నాయ్, తెరసాప పడవలు కూడా ఉన్నయి. నువ్వు సప్తపది సినిమా జూశావా? సెంబు దొర్లుకుంటా నీళ్లళ్లోపడుద్ది, అది కిట్నమ్మే. మాకూ ఇసుక మేటేస్తది, మాకూ ఇహార యాత్రలు ఉన్నయ్, జానపాటి సైదులు కాడ్నించి, మట్టుపల్లి నర్సింసోవి, నాగార్జున సాగరం, యతి-తపో-తల, మాసెర్ల, గావాలపాడు, దాస్పల్లి - నీకు పల్నాడ్లో రోడ్డుకి సెరిత్ర, రాయి రప్పక్కూడా సెరిత్ర, సెట్టు సేవకీ సెరిత్ర - గొడ్డుగోదాకీ సెరిత్ర - పతీ ఊరూ ఇహారయాత్రే, ఈసే గాలీ ఇహార యాత్రే - నాగులేరు ఇహార యాత్ర కి అమ్మమ్మ. ఇంకేంసెప్పమ్మంటా?

భాస్కర్ రామరాజు said...

సివరాకరికి -
ఏటి? పప్పుగుత్తి దూస్తావా? సోదరా, నీకు యుద్ధం అంటే తెల్సా? మా దేశం - పల్నాడు - యుద్ధ భూవి.
ఇప్పటికీ మాకు యుద్ధాలు జరుగుతునే ఉన్నాయ్ - నక్సలైట్లో, ఫ్యాక్షనో ఎదోటి.
కాబట్టి సోదరా - గోంగోర మన అందరిదీ - కొంచెం ఎక్కువ మాది. అంతే :):)

సుజాత said...

భాస్కర్ గారు,
మన దిలీప్ కి సాగర్ రిజర్వాయర్ ని, సత్రశాల, పొందుగల,వాడపల్లి, ఇంకా అమరావతి చూపించెయ్యాలి! అంతే కాక చంద్రవంక, పన్లో పనిగా వర్షాకాలంలో పొంగులెత్తే నాగులేరుని కూడా!

ఇంకో మాట....కృష్ణ నీళ్లలో నల్ల పూస వేస్తే వంగి తీసుకోవచ్చు..అంత స్వచ్చం!

పప్పుగుత్తి దూసి యుద్ధానికి సిద్ధం అన్నారు కాబట్టి ఒక సారి కారంపూడి వీరుల పండక్కి కూడా పిలవాల్సిందే!

ఏకాంతపు దిలీప్ said...

@ భాస్కర్ గారు
మేము ఒప్పుకోమండి. గోంగూర అందరిదీ సమానంగా... కావాలంటే గోంగూర నిలవ పిచ్చడి మీది... అంతే! అంతకన్నా ఎక్కువ కాదు! గుంటూరు గోంగూర పచ్చడి అంటారు గానీ, గుంటూరు గోంగూర ఎండు రొయ్య అనరు... అలానే గుంటూరు గోంగూర పులుసు అనరు... కాబట్టి, గోంగూర అందరిది... గోంగూర నిలవ పచ్చడి మాత్రమే మీది...

@ సుజాత గారు

సాగర్ రెజెర్వాయురు చూపిస్తారా? నేను సముద్రం చూపిస్తాను పదండి... :-) ఇంక అన్నీ గుంటూరు వాళ్ళవేనా హన్నా!
నల్గొండ వాళ్ళు ఎవరూ లేరా ఇక్కడ? పోని కనీసం తెలంగాణ వాళ్ళు లేరా? :-D మీరెన్ని చూపించినా నిత్యం పారే మా గోదారి పాయల( వోల్మొత్తం గోదారి కూడా కాదు) ముందు అవన్నీ పిల్ల కాలవలే..

గోదారి నిత్యం పారే మహా నది... ఎన్నో పాయలని కలుపుకుని వస్తుంది... కృష్ణ లాగా తన దారిని తాను పోయేది కాదు, కాబట్టి నీళ్ళు రంగు ఉంటాయి...

భాస్కర్ రామరాజు said...

బాసూ
గోంగూరతో కేవలం నిలవపచ్చళ్లేకాదు - ఉప్పు గోంగూర, నూనె గోంగూర - అప్పటికప్పుడుజేస్కునే పచళ్లు కూడా ఉన్నాయ్, say, రోటి పచ్చళ్లు. పచ్చిమిరగాయలు గోంగూర వేసి చేసేవి, ఎన్నో రకాలు.
నీకు ఇవన్ని తెలియకనే గుంటూరు - కేవలం నిలవ పచ్చాడి అంటున్నావ్.

I dont know how your lands are but, In Guntur, especially towards palnadu, the land is "నల్లరేగడి",పోను పోను సున్నపురాయి, బాగా డ్రై. కాబట్టే ఈ ప్రాంతాల్లో గోంగూర బాగా పండుతుంది. ఈయ్యాల్టిరోజున అమెరికాలోకూడా పెరట్లో గోగులేస్కుంటున్నారు జనాలు. మరీ మేముండే ప్రాంతమ్లో ఇరగ రాకపోవచ్చు, కానీ దచ్చినం అయిపు జనలు బానే పండించుకుంటున్నారు. అదీ కధ.

రాధిక said...

భాస్కర్ గారూ రెండు గోంగూర మొక్కలు [సుజాత గారూ నిజ్జం గా మేము అలాగే పిలుస్తాము]ఇటు పంపండి.ఇంతకీ అమ్రికాలో మీరెక్కడో?

భాస్కర్ రామరాజు said...

@రాధిక గారు - ఇప్పుడు మాపెరడు మొత్త రాలిపొయింది అండీ. ఇక గోగులేకాదు, గోగి నార కూడ లేదు. ఇక్కడ చూడండి, ఎన్ని మొక్కలో http://picasaweb.google.com/ramarajubhaskar/hsdpVI#5241986170566697154. మామిడి పిలక ఎండిపోయింది, మిర్చి తెల్లపురుగు వచ్చింది, బయట పడేసాం, తులసి ఎండిపోయింది, అయినా ఇంట్లోనేపెట్టాం, గులాబీలు మాత్రం చిగుళ్లొచ్చి మొగ్గలు వేస్తున్నాయ్ ఇంట్లో హీటరు వేడికి.

మేము "upstate new york" లో ఉంటాము. మా ఊరిపేరు - ఆల్బని - న్యూ యార్క్ రాష్ట్ర రాజధాని.

chaitanya said...

సోదర సోదరీ మణులారా !!! మన తెలుగు జాతి మాణిక్యాల్లారా !!! తెల్ల జెండా ఊపేసా ... ఆగి ఆయాసం తీర్చుకోండి కొద్ది సేపు ! ఇదేనా , ఇదేనా , ఇదేనా మీ/మన సంఘటితత్వం ? గోంగూర పప్పు లో కూడా తుఫాను సృష్టించగలం అన్న అపవాదు మనకి అవసరమా ? అసలు అవసరమేనాఆఆఆఆఆఆ ???

గోంగూర వండామా, తిన్నామా ? చరిత్రలెందుకు చెప్పండి ?

అయినా తెలీక అడుగుతా ... ఈ పేటెంట్ అన్న పదానికి అసలు విలువ ఏడిసిందా అని ??? పసుపు పేటెంట్ అమెరికా వోడు తీస్కోలే ? అట్టానే యోగ పేటెంట్ కూడా కాజేయలే ?

ఇట్టా మనం ఒక రాష్ట్రం లోనే గోంగూరకి, వంకాయకి పేటెంట్లకి పోరు పెట్టుకుంటేనే మరి ... పిల్లి పోరు కోతి తీర్చినట్టు ... అసలు pay-టెంట్లు ఎవుడో ఎత్తుకు పోతాడు !!! నేను చెప్పేది ఇంతే ...

( ఏమైనా ఈ పోరు భలే కామెడిగా ఉండ్లా ? ఇంకొద్ది సేపు జూద్దాం అనుకున్నా కానీ , ఇంతలోనే తెలుగుతనం తన్నుకొచ్చి,సంఘటిత శక్తీ మీద ఉపన్యాసం దంచే ఛాన్స్ ఇంత కన్నా దొరకదు అని ఇలా ... !!! )

సుజాత said...

దిలీపు గారండి,
మీరు రొయ్యలే వేసుకుంటారో, కోళ్ళే కోసుకుంటారో గోంగూరలోకి....అసలు గోంగూర అన్న పదార్థమే గుంటూరుదయ్యాక, మీరు అందులో ఏమి వేసి ఒండినా..ప్చ్ లాభం లేదండి! సరే, పోట్లాటలాపి సమానంగా పంచేసుకుందాం గోంగూరని. ఇక్కడ మా దిక్కుమాలిన హైద్రాబాదులో గోంగూర పేరేంటో తెల్సా...."పుంటికూర" ...ఇదేంటో నాకర్థం కాదు.

చైతన్య గారు,
ఏదో సరదాకి దెబ్బలాడుకున్నాంలెండి! మీ ఉపన్యాసం విన్నాం..చాలా బాగుంది. ఇంకాపేస్తున్నాం!

భాస్కర్ రామరాజు said...

@సుజాత గారు: నేనూ మీతో ఏకీభవిస్తున్నా. సరే ఇంతలా ఉపన్యసించినందుకు చైతన్య కో జై.
నా ఈ గోంగూరపప్పు విందుకి వచ్చి రుచిచూసిన జనులందర్కీ ఆ ఆంధ్రమాత ఆశీస్సులు సదా ఉండాలనీ కోరుకుంటూ "గోంగూర కి జై" "వీర పల్నాడు కి జై"

ఏకాంతపు దిలీప్ said...

@భాస్కర్ గారు
"గోంగూరతో కేవలం నిలవపచ్చళ్లేకాదు - ఉప్పు గోంగూర, నూనె గోంగూర - అప్పటికప్పుడుజేస్కునే పచళ్లు కూడా ఉన్నాయ్, సయ్, రోటి పచ్చళ్లు. పచ్చిమిరగాయలు గోంగూర వేసి చేసేవి, ఎన్నో రకాలు.
నీకు ఇవన్ని తెలియకనే గుంటూరు - కేవలం నిలవ పచ్చాడి అంటున్నావ్."

అదేంటండి పైన వీటిగురించీ రాసేసాను కదా? నాకు తెలియదంటారు... మేము రోటి పచ్చళ్ళని తొక్కుడు పచ్చడి అని కూడా అంటాము. నిలవ పచ్చడి అని ఎందుకు అన్నానంటే అది గుంటూరులో బాగుంటుంది కాబట్టి! అంతే!
మీ కోసం, పశ్చిమ గోదావరి లో అన్ని రకాల నేలలు ఉన్నాయి. ఓండ్రు మట్టి, నల్ల రేగడి, గరప (ఎర్ర మట్టి)... గోంగూరు దాదాపు అన్ని చోట్లా తినడం తెలుసు నాకు...

చైతన్య గారు మనం అంతా ఒక్కటి. నేను కూడా తెలుగు వారి సంఘటితమవ్వడానికే పాటుపడుతున్నాను. ఒక ప్రాంతం ఒక వనరు మీద గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటే, అది అందరిదీ అని ఎలుగెత్తి చాటుతున్నాను.... :-)

సుజాత గారండీ,
మీరూ ఎన్ని రకాలుగా చేసుకున్నా, గోంగూర గుంటూరిది అవ్వదండి... మా పొలాల్లో కలుపు మొక్కలతో పాటూ గోంగూర మొక్కలు కూడా పెరుగుతాయండి, పెరట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ గోగు పువ్వు నమలందే ఏ బిడ్డ పెరిగి పెద్దవ్వరండి...

సరే... గోంగూర అందరిదీ సమానంగా అని అందరూ అనేసారు కాబట్టి నేను కూడా విరమించుకుంటున్నాను...
గోంగూరకి జై... గోదావరికి జై ( చూడండి ఈ నినాదం ఎంత బాగుందో! :-) )

chaitanya said...

నా ఉపన్యాసం విని, స్పందించిన అందరికీ జేజేలు ! గోంగూరకి జై ... తెలుగు తల్లికీ జై ! ( ఇదీ అదిరిపోయే నినాదం అంటే !!! )

oremuna said...

>> ఇక్కడ మా దిక్కుమాలిన హైద్రాబాదులో గోంగూర పేరేంటో తెల్సా...."పుంటికూర" ...ఇదేంటో నాకర్థం కాదు.

అందుకే మాకు మా తెలంగాణా కావాలి. మా భాషను, మా పలుకుబడినీ అనుక్షణం అవమానిస్తున్నారు. ఏం చేస్తాం, అహంకారం మీ నరనరానా జీర్ణించుక పొయ్యిందాయా.

chaitanya said...

సుజాత గారు, థాంకులు అండీ !

భాస్కర్ గారు, గోంగూర అది అందరిదీ, ఈ ఆంధ్ర మాత అందరి కోసములే, అని ఇప్పుడే ఒక understanding కి వస్తుంటే...మళ్ళీ ఎగదోయటానికి కాపోతే గోంగూర పక్కన , వీర పల్నాడు అని అంటారు ! హన్నా ! మనలో మన మాట,పల్నాడులో కోళ్ళ పందాలు మీ ఫేవరెట్ ఆ ?

దిలీపు గారు ...మీరు చెప్పింది నిజమే ! పూర్తి గా ఏకీభవించేస్తున్నా !
------------------------------
అసలు ఆలోచిస్తే , నా హృదయం మూలుగుతుంది నీరసం గా ! ఆయుర్వేదం అంత పురాతన శాస్త్రం లో చెప్పిన పసుపు పేటెంటు, పసుపు అంటే తెలియని అమెరికా వాడిది ! యోగాకి పుట్టిల్లైన మన దేశం లో యోగా నేర్చేస్కుని, పేటెంట్ అమెరికాదే ! ఎంత అన్యాయం కదండీ ! మనం కల్సుండకపోతే ఒక రాష్ట్రంలోనే , రేపొద్దున్న (అమెరికా వోడో) బ్రిటీశోడు వచ్చి, గోంగూర మాదే పేటెంటు, మేము అప్పట్లో విదిల్చిన ఆకులు ఇప్పుడున్నవి అన్నా అంటాడేమో అని ... !

Divide and Rule concept ఇదే కదండీ ? నా ప్రాంతం, నీ ప్రాంతం అనుకుంటే ... రాష్ట్రం, దేశం అనే బదులు ... ఇలా నీరస పడిపోయాం ఇన్నేళ్ళు !

నాకు 'Chak De India' సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇందుకే ! ఒక్కొక్కరు introduce చేస్కొండి అంటే ... నేను xyz from బీహార్, నేను abc from తమిళనాడు అంటూ చెప్తుంటే ... నేను from ఇండియా అని చెప్పే వరకు వదలడు కోచ్ ! నిజంగా, ఆ సినిమాకి నా జోహార్లు ! కోటానుకోట్ల వీర తాళ్ళు ! చూడకపోతే ఎవరైనా ఆ సినిమా, గోంగూర పప్పు తింటూ చూసెయ్యండి ! చక్కటి గోంగూర లాంటి సినిమా !

chaitanya said...

ఒరెమూనా అన్నా , మీ ఆవేదన నాకు సమజ్ అయింది ! పరేషాన్ ఎక్కడ ఒస్తది అంటే ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ్వటం వల్ల మనకి ఏం ఒరగది ! మధ్యలో దొంగల్ దొంగల్ ... ఊళ్ళు పంచుకుంటారు జూడు, గట్ల ఈ రాజకీయ నాయకులు పంచుకుంటారు అన్నట్టు ... ఈ రోజోస్తాది, రేపోస్తాది అని kcr ఎట్లా డ్రామా ఆడుతుండు అసలు ? ఆడు తెలంగాణా వాడే కాదు !
ఆడికి ఎందుకంత భక్తీ ఒచ్చింది తెలంగాణా అంటే ? జర సోచాయిద్దాం కూసుని ! కాపోతే, గిట్ల ఎక్కిరిస్తే , మేము కూడా బాధ పడతం కదా...మిమ్ముల్ని మేం ఎక్కిరిస్తున్నామ ? అని వాళ్ళకి చెప్తే ... సమజ్ ఐతది గదా వాళ్లకి కూడా !

చిన్నప్పటి సంది విన్న పేరు కాకుంట, ఇంకో పేరు తో పిల్చేటి సరికి ... అట్లా అన్నారేమో ? ఏమైనా గానీ ... అది తప్పే అనుకో ... గట్ల మనం తిరిగి అహంకార్లు , అది ఇదీ అని ... యుద్దాలేందుకు చెప్పు ? మంచి గా ఒక్కసారి చెప్పి అప్పుడు గూడ ఇనకుంటే .. గసొంటి మాటలు అంటే అర్థం ఉంది కానీ ! జర సోచాయించు !

చైతన్య said...

ఒరెమూనా అన్నా,
గోంగూర కు పుంటికూర కు తెలంగాణ కు లింకా అన్నా! :(

సుజాత said...

ఒరెమూనా గారు,
తెలంగాణా అన్లేదుగా నేను!హైదరాబాదు అన్నాను. నన్ను ఇరికించకండి బాబూ!

నిజంగానే "పుంటికూర" అని ఏ లెక్కన పెట్టారో అర్థం కాలేదు నాకు! పుల్ల కూర అన్నా అర్థం ఉంది కానీ! ఇంకో మాట చెప్పనా..కత్తి పీట ను హైదరాబాదులో ఏమంటారో ఊహించండి.....చెప్పేస్తున్నా...ఈలపీట.(లాజిక్ ఏమైనా ఉందా అసలు)

ఏకాంతపు దిలీప్ said...

ఇప్పుడు అమ్మ ఏమి చెప్పిందంటే, గుంటూరు గోగు ఆకులో నీరు తక్కువగా ఉంటుందంట, అందుకు నిలవ పచ్చడి బాగా వస్తుంది అని చెప్పింది...

chaduvari said...

గోంగూర కోసం ఇంత గోలైందే.. రేపు చావాకిరణ్ వాళ్ళ తెలంగాణాను తీసుకోని, మనల్ని బైటికి తంతే కొత్త రాష్ట్రపు రాజధాని కోసం ఎంత తగువౌద్దో!

సుజాత said...

కొత్త రాష్ట్ర రాజధానిగా వాళ్ళు హైదరాబాదు కావాలంటే గొడవ మొదలవక తప్పదు. దానికి నా ఫుల్లు సపోర్టు అని మనవి(గొడవక్కాదు, అది ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనే దానికి) చేసుకుంటున్నా!

!

ఏకాంతపు దిలీప్ said...

@ చదువరి గారు,
ఖమ్మం లోని కొన్ని ప్రాంతాలు, భద్రాచలంతో పాటుగా, కలుపుకుని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కలిసి ఒక రాష్ట్రం కావాలని మేము ముందుకొస్తున్నాము.... మా ప్రగతి నిరోధించడమైనది, మా భాష ని వెక్కిరించడమైనది, మా ఆదాయాన్ని వేరే ప్రాంతాలకి ఖర్చుబెట్టడమైనది... ఇలా రక రకాలుగా మాకు తీవ్రమైన నష్టం చేకూరింది... ముందు భద్రాచలం గోడవ తేలాకే తెలంగాణ! :-)

ఏకాంతపు దిలీప్ said...

@ సుజాత గారు

హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం అయితే పర్లేదు కానీ, ప్రత్యేక రాష్ట్రమైతే ఇప్పుడున్న పరిస్థితి కన్నా 100 రెట్లు హీనంగా తయారవుతుంది... వీటన్నిటికన్నా హైదరాబాదు తెలంగాణాలో ఉండటమే చాలా మంచిది... హైదరాబాదు ఇప్పుడున్న ప్రగతికి కారణం అన్ని వైపుల నుండి జనం వచ్చి స్థిరపడటం వల్ల. ఆ జనం ఉండటం వల్ల హైదరాబాదుకు కావలసిన ప్రధానమైన మౌళిక సదుపాయం "నీరు" సమకూర్చబడుతుంది. అది ప్రత్యేక రాష్ట్రమైతే దానికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు.... అటు రాయలసీమ మీద నుండి కర్నూలు మీదుగా చేరుకునే వలస కబ్జా దారులు, రౌడీలు తాండవం చేస్తారు. ఇంకా, పాతబస్తీ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలు అంతే! హైదరాబాదు ప్రత్యేకం కన్నా, తెలంగాణా రాజధానిగా ఉండటమే బెటర్!

భాస్కర్ రామరాజు said...

నర్సరావుపేట రాజధానిగా పల్నాడు రాష్ట్రం ఏర్పాటుకు ఇక నేనూ నడుము బిగిస్తా

వేణుగోపాల్ రెడ్డి said...

నా పరిచయం....
అందరికి వందనములు ....నా పేరు వేణుగోపాల్. ఏదో పొట్టకూటి కోసం చిన్న ఉద్యోగం (చర్లపల్లి కేంద్రియ కారాగారం పక్కనే మా సంస్థ). నేను కూడా మీ అందరితోపాటు అన్ని చర్చల్లో పాలు పంచుకొంటాను...నన్ను కూడా మిగతా వారిలాగే ఆదరించండి....

ఇక నా చరిత్ర ..మా తాతగారు నిజాం కాలంలో(1940) పాలమూరు (ప్రస్తుతం మహబూబ్ నగర్) జిల్లా నుండి వలస వచ్చారు. మాది దాచేపల్లి పక్కన ఒక కుగ్రామము(మా నాన్నగారు , నేను అక్కడే పుట్టాము). 30 సంవత్సరాల నుండి దాచేపల్లిలో వుంటునాము. నేను గత 12 సంవత్సరాల నుండి హైదరాబాద్ లో వెలగబెడుతున్నాను.

(కొసమెరుపు - తెలుగులో ఆంగ్ల పదాలు వాడటం నాకు అసలు నచ్చదు. నేను సాధ్యమైనంతవరకు స్పష్టమైన తెలుగు ఉపయోగిస్తువుంటాను.)

మరొక్కసారి అందరికి వందనాలు......!

వేణుగోపాల్ రెడ్డి said...

@ భాస్కర్ గారు....అంత దూరం వద్దు. నాగార్జునసాగర్ రాజధానిగా పల్నాడు జిల్లా (గురజాల + మాచర్ల) ని రాయలసీమ లో గాని , తెలంగాణా లో గాని కలపాలి. ఎందుకంటే మన పల్నాడు ఆంధ్రా లో వున్నా అభివృద్ధి లేదు. మీరు గమనించారోలేదో పల్నాడు జిల్లా (గురజాల + మాచర్ల) చుట్టూ కొండలు ఒక దుర్గం(కోట) లాగా వుంటాయి......!

భాస్కర్ రామరాజు said...

@వేనూగోపాల్ రెడ్డి బ్రదర్ : అట్టానే కానిద్దాం. మన మాసెర్లకేం తక్కువ, లేక గురజాలకేం తక్కువ...

ఏకాంతపు దిలీప్ said...

ఏం తక్కువ? :-)

భాస్కర్ రామరాజు said...

@దిలీపా:
>>హైదరాబాదు ఇప్పుడున్న ప్రగతికి కారణం అన్ని వైపుల నుండి జనం వచ్చి స్థిరపడటం వల్ల
ఏమి ప్రగతి బ్రదర్? ఇళ్లు పోయి అపార్టుమెంట్లు రావటమా ప్రగతి? అడ్డుగోలుగా సిటీ పెరగటమా ప్రగతి?
మనం దీనిగురించి తర్వాత మాట్టాడదాం లేక, Please read my other posts
http://ramakantharao.blogspot.com/2008/11/blog-post_20.html
http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_31.html
http://ramakantharao.blogspot.com/2008/09/blog-post_22.html
http://ramakantharao.blogspot.com/2008/06/blog-post.html

ఏకాంతపు దిలీప్ said...

మీరు ఆ రూట్లో వస్తే మీతో ఏకీభవించక తప్పదండీ. ఈ విషయం మీద మనిద్దరం తరవాత మాట్లాడుకుందాము... ఆ వ్యాఖలో నా ఉద్దేశం అసలు ప్రగతి అంటే ఏంటి అని కాదు, హైదరబాదు ప్రత్యేకమైతే కష్టమేమిటో ఆలోచిద్దామనే అంతే!

భాస్కర్ రామరాజు said...

@Dilip: I got you. I feel like this is time to think about Do we need HYD as our Capital (Either for united AP or even after Seperated States)?