Friday, May 31, 2013

రామ్ములక్కాయ మొక్కజొన్న ఇగురు

రాత్రి వంట చేస్కుందాం, ఏవున్నాయో ఫ్రిజ్ లో అని చూస్తే పండిపోతున్న రామ్ములక్కాయలు కనిపించాయి. సరే అని రామ్ములక్కాయలు ఓ మూడు చేతిలోకి తీస్కుని, మిరగాయలు తిద్దాం అని కింద సొరుగు లాగితే మొన్న తెచ్చిన మొక్కజొన్న కంకులు కనపడ్డాయి. అంతే! మనలోని షెఫ్ మెల్కొన్నాడు.
రామ్ములక్కాయ కూరలో మొక్కజొన్న వేసి వండినాను.
బాగుంది!!

Thursday, May 30, 2013

ఫ్రైడ్ బల్గర్

ఫ్రైడ్ రైస్ లాగా ఇది ఫ్రైడ్ బల్గర్ అన్నమాట.
పచ్చపచ్చగా భలే ఉందా చూట్టానికీ? మరే! మనం చేస్తే అంతేగా మరి.
ప్రొసీజర్ సో సింపులు.
౧. ముందు సగం గుండిక్కి నీళ్ళు పోయిమీద పడేయ్.
౨. నీళ్ళు మసలంగనే అందులో బల్గర్ పడేయ్.
ఎన్ని నీళ్ళకి ఎంత బల్గర్ అనేగా నీ ప్రశ్న. ఒక కప్పు బల్గర్కి రెండు కప్పుల నీళ్ళు. ఇక కుమ్ముకో
నీళ్ళలో బల్గర్ పడేశావా..ఇక ఉడకనీ
ఇంతలో
౩. రకరకాల బెంగుళూరు మిరపకాయలు అనగా పెప్పర్స్ తరుక్కో, ఒక టిన్ను బ్లాక్ బీన్స్ పక్కన పెట్టుకో. నాకు నానపెట్టే సమయంలేక టిన్ను వాడినాను. లేకపోతే నానబెట్టినవి ఓ మారు ఉడకపెట్టి వాడుకోవచ్చు
౪. సరిపోయినన్ని బీన్స్ తరుక్కో
సరిపోయినన్ని అంటే? ఓ పది
౫. ఓ సగం ఉల్ల్స్ సన్నగా నిలువుగా తరుక్కో, ఓ నాలుగు వెల్లుల్లి తొక్కతీసి పక్కనపెట్టు
౬. ఓ అరడజను మిర్చి సన్నగా పొడుగ్గా తరుక్కో
౭. రుచికి కొత్తిమీర దూసి కడిగి పక్కన పెట్టుకో, ఒక నిమ్మకాయ కోసి పక్కన పెట్టుకో
౮. భాండీ పెట్టు, పొయ్యి ఎలిగించి.
భాండీ ఎక్కడ పెట్టాలనేగా నీ ప్రశ్న? అలా పక్కకి వెళ్దాంపదా! వద్దా? ఐతే పొయ్యిమీద పెట్టి వెలిగించు మరి
౯. రెండో మూడో చెంచాల నూనె పోయి
౧౦. కాగగానే తరుక్కున్న మిరగాయలు వెయ్యి, చిట్పట్ మనగానే వెల్లుల్లి వెయ్యి
౧౧. ఓ సారి వేయించి తరిగిన ఉల్లిపాయలు వేసేయ్ చెప్తా
౧౨. ఉల్స్ కాస్త వేగయానే మిగతా ముక్కలు కూడా వేసేయ్
౧౩. బాగా వేగినాక బ్లాక్ బీన్స్ వేసేయ్
౧౪. ఓ రెండు మూడు నిమిషాలు శాతాలించి
౧౫. రుచికి కావాల్సినంత ఉప్పు తగిలించి కలిపి
౧౬. ఉడకబెట్టిన బల్గర్ కలుపు
౧౭. ఒకసారి కలియతిప్పి నిమ్మకాయ పిండి, కొత్తిమీర జల్లి
.....................................................అదన్నమాట

బల్గర్ అంటే గోధుమ నూక లాంటిదే!
http://en.wikipedia.org/wiki/Bulgur
బల్గరు అనేది హై ఇన్ ఫైబర్. ఇది హోల్ గ్రైన్.