Tuesday, June 23, 2020

దొండకాయ వేపుడు

పోయినేడు అనుకుంటా, భారతీయులు అందునా ముఖ్యంగా తెల్గులు అందరూ కలిసి *మొక్కలు ఇచ్చి పుచ్చుకొనుట* అనే కార్యక్రమం జరిపారు.
ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంలా తోచింది నాకు. మా ఊరిని 4 ప్రాంతాలుగా విభజించి ప్రాంతాలవారిగా ఇచ్చిపుచ్చుకునే వేదిక ఏర్పాటు చేశారు.
మీ దగ్గర ఉన్న మొక్కల్లో మీరేం ఇస్తారు, మీరేంపుచ్చుకుంటారు ఒక లిస్ట్ రాసి నిర్వాహకులకు ఇవ్వాలి.
ఆప్రకారంగా మీ పేరు పిలిచినప్పుడు వెళ్ళి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం.

ఈ చేతుల మార్పులో మాకు వచ్చిన మొక్క దొండ.

తెచ్చి ఒక బెడ్ లో నాటినాము. పాపం పెరిగి పెద్దదై, మూడు రోజులకి పావుకిలో కాయలిచ్చింది.

దొండ ప్రత్యేకత ఏంటంటే పూచే ప్రతి పువ్వూ కాయ అవుతుంది.

మొన్నోరోజు దొడోకి వెళ్ళి దొండ ఒక రెండు దోసిళ్ళు కోసుకొచ్చి ఇలా చేశాను.

వంటశాలని నేను ఆక్రమించేసి - దొండని నిలువునా నాలుగు నిలువులుగా కోసి
భాండీలో నూనె కాచి, అందులో కోసిన దొండలు వేసి
వేయించి, ముక్క వేగినాక రుచికి ఉప్పు కారం కొంచెం కొబ్బరిపొడి జల్లి 
వడ్డించాను.

దొండని ఆంగ్లమున ivy gourd అంటారుట
దొండలో ఎన్నో మంచి గుణాలున్నాయి. కొన్ని చేటూలూ ఉన్నాయి.
దొండలోని మంచి గుణాలు:
మధుమేహానికి మంచిది
అరుగుదలకు మంచిది
చర్మ సంబంధ వ్యాధులకు, ఎక్జిమా/సొరియాసిస్, మంచిది
వాపులకు మంచిది

అతిగా తినటం వల్ల మందబుద్ధులౌతారని చిన్నప్పుడు విన్నా! ఎంతవరకు నిజమో తెలియదు.

https://www.webmd.com/vitamins/ai/ingredientmono-1104/ivy-gourd