Wednesday, June 23, 2021

పుదీనా పెరుగుపచ్చడి

 
మొన్నోరోజున గృహమంత్రి గారు బిర్యానీ చేసిబాసూ నాకు పనుందీరైతా చేయగలవా అన్ని అడిగినారు.
అవకాశాన్ని వదులుకోటం మన రగతంలోనే లేదుగా - అల్లాక్కానీ అనేసిఆలోచించటం మొదలెట్టాను కిటికీ దగ్గర నిల్చుని.
బిర్యానిలోకి రుచిగా ఉండే పెరుగుపచ్చడి ఏవిటీ అనిదొడ్లో ఆకుపచ్చగాపెరిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న పుదినా పొద కనిపించిందిబుఱ్ఱలో బుడ్డీ వెలిగింది.
పుదీనా పెరుగు పచ్చడి చేద్దాం అని నడుం బిగించాను.
దోశెడు సుబ్బరంగా కడిగిన పుదీనా ఆకులు
చారెడు కొత్తిమీర ఆకులు
నాలుగు మిఱగాయలు
పావు ఉల్లిగడ్డ
రెండు వెల్లుల్లి రెబ్బలు
చిటికెడు ఉప్పు 
రోట్లో వేసి మెత్తగా నూరి
అరలీటరు పెరుగు తీసుకుని
కవ్వంతో చిలికి
అందులో అర ఉల్లిపాయ చిన్న ముక్కల్గా తరిగి వేసి
కొంచెం అల్లం తరిగేసి
రోట్లో నూరిన పేస్టు వేసి
తగినంత ఉప్పు కలుపుకుని
లాగించటమే 
పెరుగుని ఇలాకూడా చేస్కోవచ్చు
తగినంత పెరుగుని వడగట్టే గుడ్డలో వేసి గాట్టిగా మూటకట్టి  గంట సేపు గిన్నెలోకి వేళాడగట్టి పెడితే పెరుగులో నీళ్ళుడ్రైన్ అవుతాయి పెరుగుని పచ్చడిలోకి వాడితే బాగుంటుందని కొందరంటారు.