Thursday, March 25, 2010

పోగుల ఉప్మా

వారీ!! గీపొద్దు పోగుల ఉప్పమ్మ జేసినా.
హ్మ్!! సమఝ్గాలే?
ఛల్!! స్పగెటీ అంటరు దీన్ని. సైనాఓళ్ళు నూడుల్స్ అంటరు లేక చౌమెయిన్ అంటరు.

ముంగట అంగటికిబొయ్యి ఈ పోగులు తెచ్చుకో. నేని ఇవి దెచ్చినా
From spaghetti

ఇందల, గివిగో ఇన్ని పోషకైలువలున్నై -
From spaghetti

ఛల్!! ఏంగావాలే ఇది చేస్కునేందుకూ?
ఎఱ్ఱని ఎఱ్ఱని బుగ్గలున్న రాంములక్కాయలు గావాలె.
ప్రెష్ గుండేటి వెల్లుల్లి రెబ్బలు ఓ అరడజను కావాలే.
ఇంకేంగావాలే? మిర్చి ఓ నాలుగు కావలె.
ఇంకా ఇవి మస్టు. ఇంక, నాకాడ ఎఱుపు, పసుపు, కాషాయం రంగుల బెంగళూరు మిరగాయలున్నై.
ఇంక!! ఇప్పుడేంజెయ్యాలే?
ముంగట, ఓ మూకుడుదీసుకో.
నిండా నీళ్ళు పొయ్.
పొయ్యిమీనబెట్టు.
పొయ్యి ఎలుగించు, అదెమరి.
ఇంక నీళ్ళు మరిగిలోపట,
మిరగాయ తరుక్కో
సన్నగా
అయ్యిందా
గిప్పుడు వెల్లుల్లిని కుక్కు, తొక్క తీ, సన్నగా తరుగు
అయ్యినాంక, గా బంగళూరు మిరగాయలు తరుగు.
పక్కనబెట్టు
From spaghetti

గా పొయ్యిపైన నీళ్ళు మరుగుతున్నయా
అందలా గీ పోగులునూకు
ఓ సెంచా నూనె నూకు
ఇక ఉడ్కనీ
ఉడ్కిందా లేదా ఎట్టా తెల్స్ది?
ఓ పోగు పైకి లాగు, నొక్కి సూడహే
From spaghetti

దింపెయ్యి ఉడ్కినంక
ఓ డేగిషా పొయ్యినెక్కించు
ఓ నాలుగు సెంచాలు నూనెపొయ్యి
ఏడెక్కంగనే
మిరగాయలు నూకు
ఏగంగనే
వెల్లుల్లి నూకు
ఓసారి తిప్పహే
అయ్యిందా
గిప్పుడు గా బంగళూరు మిరగాయలు నూకు
ఇంక ఏగనీ
గిప్పుడు రాంములక్కాయలు కోసి అవతలనూకు
ఇంతలో ప్రిజ్జీలోంచి దాచ్చారసం తీ
From spaghetti

ఓ గళ్ళాసులో వోంపు.
ఓ గుక్క నోట్టోపోస్కో ఏందీ ఆలోసిత్తా
గిప్పుడు, బంగళూరు మిరగాయలు ఏగినయా సూడు
ఏగినయా, ఏగేఉంటై
సన్నగా తరుక్కున్న రాంములక్కాయలు అందలనూకు
From spaghetti

గిప్పుడు ఓసారి తిప్పు,
కొంచెం ఉప్పేసి ఇక ఊడ్కని
ఉడ్కినంక అందల, గీ పోగులు ఎయ్యి
From spaghetti

ఓ సారి కలియదిప్పు
ఓ నాలుగు కొత్తిమీర కాడల్ని, పైన జెప్పలే, ఏంపర్లేదు, ఉంటేనే, సన్నగా తరిగి, ఓ సారి కడిగి, ఇందల కుమ్ము.
మూతబెట్టుడు
దాచ్చారసం కొట్టుడు
ఓ పదినిమిషాలు గా రాంములక్కాయ రసం దీనికి పట్టేడాంక పొయ్యిమీదనే బెట్టు, సన్నగా బెట్టు మంటని...
ఓ పదినిషాలాగినంక.............
ఏంజెయ్యాలే?
నేజెప్పాల్నా? వారీ!! కుమ్ముడే ఇంక...

5 comments:

Rao S Lakkaraju said...

గుంటూరు వాళ్ళు అందరూ ఒక విధం గానే ఆలో చిస్త రాళ్లే ఉంది. నా బెస్ట్ సేమ్యా ఉప్మా. నా చేత కోరికగా మా ఆవిడ చేయించుకు తింటుంది. ఆవిడకి వంట చెయ్యటం ఇష్టం లేనప్పుడు కాదని ఘనత పతం గ చెప్పగలను.
ఈ తడవ అరోరా వచినప్పుడు పిలవండి. ఫాక్స్ వాలి మాలు దగ్గరలో ఉంటాము.

Sravya V said...

మాఇంట్లో ద్రాక్ష రసం లేదు మధ్యలో అది తాగకుండా చేస్తే ఈ పోగులు ఉప్మా సరిగ్గా రాదా ఏంటి ఇప్పుడు అదెక్కడ కొనుక్కురావాలి దేముడా :)

Sujata M said...

వెల్లుల్లి బదులు అల్లం తరుగు నూకితే బావుంటదేమో ?!

Hey...Chikitha said...

chala chakkaga rasaru.keep it up.

pitcrew said...

గదేందిబై, అందట్ల కుసింత సోయమురుగు పోస్తె మస్తుగుంటది.