Thursday, April 29, 2010

చాయ చాయ

౧. కావాల్సినవి-
టీ బ్యాగు - ౧
అర లేక మొత్తం సెంచా తేనె
ఓ నిమ్మ బద్ద
రెండు పుదీనా ఆకులు
ఓ గిన్నె, ఓ మూత, పొయ్యి, నీ సెయ్యి
ఇధానం -
గిన్నె పొయ్యిపైన పెట్టు
ఓ ౩౦ మి.లీ నీళ్ళు పొయ్యి అనగా ఓ గళాసు
పొయ్యి ఎలిగించు
నీళ్ళు కాగినాక మరిగినాక కాదు, కాగినాక
పొయ్యి ఆపెయ్యి
టీ బ్యాగు వెయ్యి, పుదీనా రెండాకులూ వేసేయ్
మూతపెట్టు
ఒక నిమిషం ఆగినాక
మూత తీసి
టీ సంచి తీసేసి
నిమ్మ దబ్బ పిండు
తేనె వేసి కలుపు
ఉష్ణతేయాకుపానీయం తయ్యారు!!!
సేవించు
ఇది ఆపీస్లో కూడా చేస్కోవచ్చు. పొయ్యి గియ్యి కి బదులు, ఆపీస్ లో వేణ్ణీళ్ళు దొరుకుతాయిగా. మిగతా!! నిమ్మకాయ ఎత్తుకెళ్ళొచ్చుగా. ఓ *త్తి పెట్టుకో ఆపీస్ లో. తేనె డబ్బా కొనుక్కోవచ్చుగా. మనసేతిలో పనే. బద్ధకం వదిలించుకుంటే అన్నీ అవే వస్తాయ్. ఏతన్తావేతి?
౨. చాయి బ్యాగు లేదు, టీపొడే ఉంది. ఎలా?
నీళ్ళు కాచినాక, టీపొడి సెంచా, పుదీనా ఆకులు వెసి మూతట్టేయ్.
ఓ నిమిషం కాంగనే పైపై డికాషన్ ఓ గళాసులో పోస్కో. నిమ్మ, తెనే కుమ్మూ ఓ పీకుడి పీకు.
పైపై డికాషన్ ఎందుకూ తేయాకు దుల్లు రాకుండా. వడపోసేది ఉంటే వడపోస్కో. బెస్టు.
ఇక కుమ్మన్డహే!!

3 comments:

భావన said...

too much మాస్టారు మీరు :-))

Unknown said...

భాస్కర్ రామరాజు గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Wanderer said...

రామరాజు గారండీ,

దిక్కుమాలిన గూగుల్ అంతా వెతికినా చిమ్మిలి రెసిపి దొరకలేదు. నాకేమో ఇక్కడ ప్రాణావసరం వచ్చి పడింది. సాయంకాలం లోపల చిమ్మిలి రెసిపి కావాలి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూంటే మీ బ్లాగ్ ఙ్ఞాపకం వచ్చింది. మీకా రెసిపి తెలిస్తే కాస్త సాయం చేద్దురూ, పుణ్యముంటుంది...

Wanderer