Tuesday, July 6, 2010

ఈనాడులో *నలభీమ*

నలభీమ బ్లాక్కి *మనుసులోమాట* సుజాత గారు *ఈనాడు* దినపత్రిక *ఈతరం* లోని *బ్లాగోగులు* శీర్షికలో స్థానం కల్పించారు.
*పేపర్లో పెద్దచ్చరాల్లో వచ్చేంత అర్హత* నా రాతలకు [వంటలకు] ఉందా అనే ప్రశ్న ఉదయించింది  నా మనసులో. ఈనాడు వారి శీర్షిక స్థలం మరియూ సుజాత గారి సమయం వృధా అయ్యిందేమో అని నా అనుకోలు. వంట బ్లాగుకన్నా మంచి బ్లాగులు చాలానే ఉన్నాయి. వాటి గురించి రాసుంటే నలుగురికీ నాలుగు మంచి మాటలు తెలుసుండేవని నే అనుకుంటా.
ఏమైనా, వారు సమయాన్ని కేటాయించి సమాచారం సేకరించినందుకూ, ఈనాడు సహృదయతో స్థలం కేటాయించి ప్రచురించినందుకూ కృతజ్ఞతలు తెలియజేస్కుంటున్నాను.
ఇలా వార్తాపత్రికల్లో రావటం ఎంతో ఆనందదాయకమే కాక, ఉత్సాహాన్నిచ్చే విషయం కూడా.
పేపర్లో పెద్దచ్చరాల్లో మన బ్లాగు రావటం బాధ్యతల్ని పెంచుతుంది కూడా, ఇకపై రాసేప్పుడు కూసింత వళ్ళు దెగ్గరెట్టుకుని రాయమని.


మరోమారు సుజాతగారికి ధన్యవాదాలు తెలియజేస్కుంటున్నా.

ఇంతక ముందుకూడా నే రాసే బ్లాగుల్లోని ముఖ్య బ్లాగైన *నాన్న* గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నా దృష్టిలో ఇలా పేపర్లో పడటం నా బ్లాగుకి "ఓ గుర్తింపు" ఐనా నాకేమి పెద్ద ఎఛీవ్మెంట్ లా అనిపించలేదు.

9 comments:

Sravya V said...

Congrats !ఇప్పుడన్నా ఒక కొత్త వంట రాయమని అభిమానుల విన్నపం !

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఈఆనందంలో మాసూరిగాడీకి స్పెషల్ వంటేదైనా రుచిచూపాలన్నోయ్.
అయినా నాన్నని వదిలి నలభీముణ్ణి పెట్టాడు రామోజీరావుకి మతిచెడిందా?

Unknown said...

eenadu paperlo mee blog gurinchi chadivia. open chesi chusa. enta bagundo. nenu ammayine ayina 15 years nunchi vantalu chestunna meeku vachinnanni vantalu naku raavandi babu. mee vantalu chusi nenu avi cheyydam modalu pettestunna.ika mee language... nenu english teach cheyyadam aapesi telugu lo desi varieties teach cheste baaguntundemo anna idea vachesindi. emaina mana moolaalu advitiyam ani mee language to vantalato malli prove chesarandi. dhanyavadaalu.

Bhãskar Rãmarãju said...

శ్రావ్యా
తప్పకుండా రాస్తా ఈ వారం...చాలా వంటలు లైన్లో ఉన్నాయి కానీ...సమయం దొరకట్లేదు.
చైతన్య - :):)
సౌజన్య - నమస్తే. మీరు చక్కకా తెలుగుఁలోనే రాయవచ్చుకదా? http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html ఇక్కడ నొక్కండి "తెలుగులో రాయటం ఎలా?" కోసం

d.o.l.l.y said...

హలో రాజుగారు, మీరన్నట్టె చక్కగా తెలుగు లోనే రాస్తాను లెండీ. కాని దానికి మీరు ఇచ్హిన లింకులు నాకు సరిగా రాక వేరే విధంగ చేసాను. ఇంతవరకు ఇంగ్లిష్లొ బ్లాగ్ రాసిన నేను తెలుగు బ్లాగ్ ఒపెన్ చెసెసుకొన్న. అన్నట్టు మాది రాయలసీమ. రాయలసీమ రుచులు అని ఓ బ్లాగ్ ఒపెన్ చేద్దామనుకొంటున్న . మీ ఇన్స్పిరేషన్ మరియు ఆశిశ్శులతొ..

d.o.l.l.y said...

హల్లో డాలి అంటే సౌజన్యనే లెండి . ఎవరొ అనుకొనేరు

కొత్త పాళీ said...

నీ బ్లాగుకి గుర్తింపు కల్పించడం వారి మంచి అభిరుచికి గుర్తు.
ఆ గుర్తింపు చూసి నువ్వు, అంతసీనుందా అని ఆత్మ పరిశీలన చేసుకోడం నీ నిజాయితీకి గుర్తు.
ప్రొసీడైపో

శ్రీనివాస్ పప్పు said...

ఈ పాలికలాక్కానీ అన్నగారు సెలవిచ్చినట్టు ఉన్నోళ్ళంతా ఎర్రిఎదవలైతే నాతెలివితేటలకేటొచ్చిందీ అంట అంటూ..మొత్తానికి పేపరెక్కేసావన్నమాట,భలే బంగారు పళ్ళేనికయినా గోడసేరుపు కావాలికదా మరి.ఈ పాలికిలాక్కానీ.

పరిమళం said...

Congrats !