రెండు డబ్బాల బియ్యం, ఒక డబ్బా మినపగుండ్లు, ఒక స్పూన్ మెంతులు, చెటాకు అటుకులు - నానపెట్టు.
ఓ నాలుగోఐదోఆరో గంటాలు లేక నానినై అన్నాక *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును*.Friday, June 7, 2013
ఏంపాపం? మినపట్టు ఏంపాపం చేస్కుందీ?
Wednesday, June 5, 2013
ఉల్లి పెసర
రెండు డబ్బాల హోల్ పెసరపప్పుకి ఓ పిరికెడు బియ్యం పోసి ఓ ఆరు గంటలో ఎందిగంటలో నానబెట్టి నీళ్ళు ఒంపేసి వెట్ గ్రైండర్లో *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును* చేసేప్పుడే ఓ పదో ఇరవైయ్యో పచ్చిమిర్చి వేసి రుచికి ఉప్పు కలిపి *పెసర అట్టుకి* క్కావాల్సిన పిండిని సిద్ధం చేస్కుని మరోవైపు ఓ ఉల్లిపాయని సన్నగా తరిగి, ఓ పావలా బిళ్ళంత అల్లం [పావలా బిళ్ళంత అల్లం కావాల్నంటే కార్ అమ్ముకోవాల్సిన్ స్థితి, అర్థం చేస్కోగలను] సన్నగా తరిగి ఓ మిరపకాయ సన్నగా తరిగి పెనం పొయ్యిమీద పెట్టి వెలిగించి వేడెక్కగానే ఓ స్పూన్ నూనె వేసి తరుక్కున్న ఉల్స్ మిరపకాయ్ అల్లం ఓ సారి వేయించి పక్కనపెట్టి, పెనాన్ని సుబ్బరంగా ఓ ఉల్లిపాయముక్కతో తుడిచి అట్లపిండిని ఓ చిప్పగంటెతోతీసి పెనంమీద వేసి అట్టుపోసి అందులో ఓ గుప్పెడు ఇందాక వేయించిన ఉల్లిమిరపఅల్లం ముక్కలు వేసి అట్టు తీసి పళ్ళెంలోకి నెట్టి.................కుమ్మేలోపు పొయ్యి కట్టేయి లేకపోతే కాలుద్ది
Labels:
అట్టు,
ఆరోగ్యం,
ఆలివ్ నూనె,
తృణధాన్యాలు,
దేశీ
Subscribe to:
Posts (Atom)