రెండు డబ్బాల బియ్యం, ఒక డబ్బా మినపగుండ్లు, ఒక స్పూన్ మెంతులు, చెటాకు అటుకులు - నానపెట్టు.
ఓ నాలుగోఐదోఆరో గంటాలు లేక నానినై అన్నాక *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును*.
అలా వచ్చిన అట్టు పిండిని ఒవెన్లోనో బంధించు. ఫర్మెంట్ అవ్వాలి. పిండి పొంగుతుంది. అదన్నమాట. స్! ఓవర్నైట్ పిండి పులవనివ్వు.
మర్రోజు పొద్దున్నే
స్నానం గీనం చేయ్యంగనే
పొయ్యికాడికిబోంగనే
పిండి బయటకిలాగంగనే
సిప్పగంటెతో ఓపాలి కలయతిప్పంగనే
ఉప్పు తగినంత కుమ్మి సుబ్బరంగ కలపంగనే
పెనం పొయ్యిమీన నూకి ఎలిగించి ఏడెక్కేలోపల్నే
ఓ ఉల్స్ ఓ నాల్గు మిర్చ్స్ ఓ బేడ అంత అల్లం సన్నంగ తరగంగనే
ఓ సెంచా నూనె పెనంమీన నూకి ఏడెక్కంగనే
ఉల్స్ మిర్చ్స్ అల్లమ్స్ ఏపించంగనే
ఉల్లిముక్కతో పెనాన్ని తుడవంగ.............నే
సిప్పగంటెతో అట్లపిండి తీసి పెనంమీద అట్టుపోసి, దోరగా కాలినాక, ఉల్స్ మిర్చ్స్ అల్లమ్స్ ఏసేసి, అట్టుని దోకుడుపారతో దోకేసి, సిబ్బిరేకులో పడనూకి.......అల్లప్పచ్చడితో కుమ్మేస్కోహే
6 comments:
videsi dosa
నీ ఎంకమ్మ! దేశీ అట్టు ఆన్ విదేశీ సిబ్బిరేకు
దోశని ఉల్లి వేసేముందు రెండో వైపు కాల్చనక్కరలేదాండి?
కాల్చవచ్చు! అవసరాన్నిబట్టి అనుకోండి. నాలాగా చేయితిరిగిన వాడు అట్టు వేస్తే....అక్కర్లేదు [:):)]
ఈ మధ్య కొందరు బ్రౌన్ బియ్యం, పొట్టు వున్న మినప గుండ్లు వాడుతున్నారు ఆరోగ్యం కోసం. Try చేసారా ఎప్పుడైనా?
నేను ముడి బియ్యమే వాడినాను. అనగా *బ్రౌన్ రైస్*
మినువులు వాడలేదుకానీ!
Post a Comment