అన్నం ఎలా వండాలి అనేదానిమీద కూడక టపా నూకుతారా అనుకోమాకా!
కలికాలం. ఎవైనా నొక్కిజెప్పకపోతే ఎట్టా
ఫేసుబుక్కులో ఓ రచ్చబండకాడి సెర్చ
ఏందయ్యా అంటే
అదే బియ్యం
అదే డేగిశా
అదే కొలత
ఎందుకు ఉడకలా అని
మంచి సెర్చే
వారెమ్మటికి నులకమంచానికానుకుని సుట్టతాగుతా కూకున్ననేను ఈ సెర్చని ఓరగంట సూసి
ఎహె! లాబంలేదహే
ఓ టపా నూకాల్సిందేని ఇట్టా వచ్చినా
అన్నం రెండ్రకాలుగా వండచ్చు
పొడిపొడిగా
మెత్తంగా
అన్నం రెండురకాలుగా వండచ్చు
ఎసరుపోసి
కొలతపోసి
ఎసరు పోయిటం:
గిన్నెలో నీళ్ళుపోసి మసిలినాక బియ్యం వేసి, ఉడికినాక మిగిలిన నీళ్ళు ఒంపుకిని, దాన్నే గంజి అంటార్లే, గంజి ఒంపినాక సిటపటా అన్నదాకా పోయిమీద గిన్నెనుంచి దింపటం ఓ పద్దతి
కొలత:
గిన్నెలో బియ్యం వేసి, బియ్యం తాకేలాగా చేయిపెట్టి, చేతి వేళ్ళు రెండో కణుపు మునిగిందాకా నీళ్ళు పోసి నిప్పురా జేయటం. చిటపట అనంగనే దింపటం ఓ పద్ధతి
కొలత:
డబ్బా బియ్యానికి రెండు డబ్బాల నీళు గుడ్డిగా పోసేసి దింపుకోటం ఇంకో ఇవరం
అత్యంత వీజీ ఇదానం
రైస్ కుక్కర్
ఒకటికి ఒకటిన్నర నీళ్ళుపోసి మూతపెట్టి స్పిచ్ ఏస్తే పొడి పొడి పొడిగా వన్నం ఉడికిద్ది
4 comments:
Almost after 2 years! Nice to see your post again, that too with the most needed recipie in today's world of non carb diet floods
ఒకటికి ఒకటిన్నర నీళ్ళుపోసి మూతపెట్టి స్పిచ్ ఏస్తే పొడి పొడి పొడిగా వన్నం ఉడికిద్ది
------------------------
ఇంత సింపుల్ అయినా ఒకళ్ళకి ఒకరోజు సరీగ్గా వస్తుంది ఒక రోజు సరీగ్గా రాదు. నాకొస్తుంది ఇంట్లోవాళ్ళకి "ఎందుకు సరీగ్గా రావటల్లేదు" అనే దాని మీద రిసెర్చ్ చేసి కనుగొన్న విశేషం ఏమయ్యా అంటే :
నీళ్ళు టాప్ నుండి డైరెక్ట్ గ పట్టుకుని పోస్తే, ఫోర్స్ మూలాన కొలిచే కప్పు పూర్తిగా నిండదు. అందుకని నీళ్ళు తక్కువయ్యి అన్నం సరీగ్గా ఉడకక పలుకవుతుంది.
1. సురభి గారూ! రాద్దామని ఉన్నా ఈ మధ్య పని ఒత్తిడితో కుదరటం లేదు
2. గుడ్ పాయింట్ రావు గారూ! నింపాదిగా నీళ్ళు పట్టుకుంటె మంచిదేమో!
నమస్కారం భాస్కర్ రామరాజు గారు నా పేరు సిద్దు.
మీ బ్లాగు ఈ రొజె చుసాను చాలా బాగుంది .
నాకు కొర్ర లెదా సామ బువ్వ ఏల చెస్తారొ చెప్తారా.
మార్కెట్ లొ ఖొర్రలు కనబడ్డాయి వాటిని ఎలా వండాలొ అంటె పొట్టు ఎలా తీయలొ తెలియక తీసుకొలెదు .
ధయ చేసి మీకు తెలిస్తె మొత్తం విదానం తెలుప గలరు .
Post a Comment