ముందు మాట
(ఎవుడయ్యా అది, నేను సరిగానే అన్నా, నువ్వే మందుమాట అని విన్నావ్)
(ఎవుడయ్యా అది, నేను సరిగానే అన్నా, నువ్వే మందుమాట అని విన్నావ్)
సోదరులారా (సోదరీమణులారా)
నా ఈ బ్లాగు లక్ష్యం - రూముల్లో ఉంటూ ఇంటి వంటని ఎలా ప్రాక్టీసు చేయ్యొచ్చు, తేలికైన వంటలు, శులభమైన పద్ధతులు, మరియూ ఇత్యాదివి.
నేను ఒకప్పుడు రూములో ఉన్నోడ్నే. నాకుతెల్సు ఎలా ఉంటుందో ఆ జీవితం. ఆ జీవితంలో చాలా ఆనందాలు, కష్టాలు, నష్టాలు గట్రా ఉంటయి. మిగతావి ఎట్టా ఉన్నాఫుడ్డు మాత్రం కొంచెం కష్టమే. వంటకి కావాల్సింది సమయం, పప్పు, ఉప్పు, పొయ్యి, మంటా కాదు - ప్యాషన్, ఓపిక, జిహ్వ. ఇవి ఉంటే మిగతావి వాటంతట అవే సమకూరుతాయి.
ఇప్పటికింతే.
భాస్కర్
11 comments:
సోదర రత్నం గారూ.. థాంక్స్. చిటికెలో, వీజీగా, అసలు వండినట్టే అనిపించనివ్వని (తినడానికి మాత్రం మస్తు టేస్టుండాలి) వంటకాలని పరిచయం చెయ్యండి. (ఇంటి నుంచీ తెచ్చిన నిల్వ పచ్చళ్ళు ఉండనే ఉన్నాయి) మేము సర్దుకుంటాం.
రాజుగారు,
అవును కాస్త మీ పాకప్రావిణ్యాని చూపించండి. కష్టనష్టాలతో పాటు మీదైన వంటకాలు చెప్పండి. కావాలంటే మేము సరిదిద్దుతాములెండి. బ్రహ్మచారులకు పనికొస్తుంది..
! మాంచి కారం కారంగా ఉండే పలనాడు వంటలు వడ్డించాలి !
@సుజత గారు : మస్తు టేస్టుండాలే...ఛలో..గట్లనేజేద్దం, గట్లనే రాద్దం. ఏక్దం మస్త్ చేద్దం.
@జ్యోతి గారు: మీ వంటల్తో పోలిస్తే మా మగాళ్ళ వంటలు పెద్ద ఇవేమి కాదు, కాని మీకు దీటుగా రాయటాకి, చెయ్యటాకి ప్రయత్నిస్థా. ఇంట్లో అప్పుడే ఈగల పోరు మొదలైంది అనుకోండి (మా ఆవిడ మొదలెట్టింది -నువ్వు నిజంగనే వంటజేసావా జీవితమ్లో ఎప్పుడైనా? కనీసం రామ్ములక్కాయని తరిగిన మొహమ్లా కూడా లేదే అని...)
@సుజాత గారు: ఇంతకముందు చెప్పినట్టే పల్నాటి ప్రభంజనం మొదలైతే ఆగదు. కారమే కాదు రుచి కూడా నషాలానికి అంటాలి - అదీ నా లక్ష్యం. :)
మీ అందరూ తాలో చెయ్యి వేస్తే, ఇటు నా కళత్రం కూడా, మీ అందరికి నా థాంక్సులు తెలియజేస్కుంటా..
ఇంక మొదలెడతా...
ఇగో భాస్కరా .. నీ సంగతి కావల్నంటే నువ్వు చెప్పుకో. అంతే గాని, మా మగాల్ల వంట అని అందర్నీ కలిపి ఒకే గాటన కట్టెయ్యమాక. టైటిల్లో నలభీమ పాకం అన్నారు గానీ దమయంతి ద్రౌపది పాకం అన్లా .. గుర్తు పెట్టుకొ!
అసలు జ్యోతి గారు ముందు చానా డ్యామేజింగుగా మాట్టాడుతున్నారు. ఒక వంట చెయ్యగల మగవాడిగా నా మనోభావాలు చానా దెబ్బతినేస్తన్నాయధ్యక్షా అని మనవి జేస్తన్నాను. మా వంటల్ని మీరు సరి దిద్దేదేంది?
sujata గారు, చాలా ఈజీ .. నేను వొరిజినల్ గా చెబుదామనుకున్న సలహా మీకు పనికి రాదు, మీకు ఆల్రెడీ పెళ్ళై పోయింది కాబట్టి. ఇక మీరు చెయ్యగలిగిందల్లా స్వగృహా ఫుడ్స్ పక్కనే ఇల్లు తీసుకోడమే! :)
అన్నాయ్ - లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. కాబట్టి ఎంత గింజుకున్న నిజాల్ని మార్చలేం. :):)
ఆండువారిని పొగడకా తప్పదు లేక అప్పడాలకఱ్ఱల్ని దాపెట్టకా తప్పదు. (నేను నా హెల్మెట్ ని హైదరాబాదులో మచిపోయొచ్చా :()
పొగడ్డం వేరు. సందర్భోచితంగా పొగడాలి కూడా. ముందస్తుగా మీరు పొద్దులో అప్పుడెప్పుడో కృష్ణభగవానుడు పప్పు నాగరాజుగారి అవతారంలో ఉపదేశించిన స్త్రీహృదయోపనిషత్తు చదవాలి.
అటుపైన నా వంటి అనుభవజ్ఞులు భార్యామణి వంటని ప్రశంసించిన ఘట్టాల్ని తలుచుకోవాలి.
ఐతే .. పొగడ్డం వేరు, అన్యథా శరణం నాస్తి అని చేతులెత్తెయ్యడం వేరు.
యెనీవే, ఆల్దిబెష్టు.
@అన్నగారు: వాళ్ళనిపొగుడుతూనే, మనం జేయ్యాల్సింది జేస్తుంటం. ఏమైనా మీ ఆశీర్వచనాలకి నా కృతజ్ఞతలు
కాస్త ఆలస్యంగా కొత్తపాళీగారి అభియోగం చూసాను.
కొత్తపాళీగారు,
ఉన్నమాటంటే ఉలుకెందుకు. రోజు వండేవాళ్ళకు, అప్పుడప్పుడు వంటింట్లోకి కాలు పెట్టే వాళ్లకు చాలా తేడాలుంటాయి. ఇందులో మనోభావాలు దెబ్బతినడమేంటొ?? అయినా మీరు వంటచెయ్యగలను అంటున్నారు కాని. ఎన్ని రోజులకొకసారి వంట చేస్తారో మరి. అది మీ ఆవిడ సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడెప్పుడో ఆవిడ వంటకు పద్యం రాసినంత ఈజీకాదు వంట అంటే.. హన్నా !!!!!!!
ఏమి నలభీమపాకమో! ఒక రోజు వంట చేస్తే 10 రోజులదాకా మాడిన గిన్నెలు, నూనె పట్టిన గోడలు శుభ్రం చేసుకోడమే పని.
Post a Comment