Thursday, October 23, 2008

డేగిషాడు ముప

ఏంది? అర్ధం కాలా?

మరి రూముల్లో, ఎంతమంది వస్థారో తెలీదు, ఎంత తింటామో తెలీదు, మందుకొడ్తుంటే తినలేకపోవొచ్చు, మామూలుగుంటే కుమ్మేయొచ్చు.

మరలాంటప్పుడు డేగిషానిండా వండుకోవాల్సిందేగా.

ముప అంటే? ఇది మానాన్న డైలాగు. తను ఎప్పుడు పిల్లల్ని ఏడిపించేప్పుడు వాడుతుండేవాడు. ఒరేయ్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఎంతరా? ఏ స్క్వేర్ .. ఓహ్.. తర్వాత.. ప్లస్ బీ స్క్వేర్...ఒహ్హ్...గుడ్. అంతేకదా..అంతే..ఇల పిల్లోళ్ళని భయాపెట్టి "ముప లటాలటా లాగించటం కాదు లెక్కలంటే" అని ఏడిపిస్తుండేవారు. ఇంతకీ ముప అంటే "ముద్ద పప్పు" అని.

రూముల్లో మరి వారాంతాలకి నెమ్మదిగా పస్కుండింటికి లేచి వోహ్ ఈయ్యాల వంటసేస్కుతిందాం అని భయంకరమైన నిర్ణయం తీసేసుకుని పప్పు జేద్దాం అనుకునే మగానుభావులకి ఇది.
ఇది అన్నగారు (కొత్త పాళీ అన్నగారు చెప్పాక వెలిగిన లైటు)హింటినాక జత చేసింది:
అసలు ముద్ద పప్పు అంటే:
ముద్ద పప్పు అని. :):) ముద్దైన పప్పు.

పప్పు వండటం చాలా తేలిక:
ఒక డేగిశాలో, పప్పు డబ్బాడో 4 డబ్బాలో, పోయి. శుభ్రంగా (నాయనా చేతులు, ఏటి చేతులు ముందు కడుక్కోపో నాయనా) కందిపపుని కడుగు. ఎంత పప్పు పోశవో ఇంటు మూడు నీళ్ళు పోయ్. అంటే ఒక డబ్బాకి 3 డబ్బాల నీళ్ళు. ఇంటో కుక్కరు ఉన్నోళ్ళు ఒకటికి రెండు పోస్తే సాలు. పొయి ఎలిగించు. మీడీయం మంట మీద డేగిషానిబెట్టు. చిటికెడు పసుపు వెయ్. మూత కొంచెం ఓపెన్ చేసి పెట్టు. దాని మానాన అది ఉడుకుతూ ఉంటుంది. పప్పు పొంగొస్తుందేమో చూడు. మూత తీ. కొంచెం పెంచు మంట. ఒక పప్పు టీ స్పూంతో తీ, షేపు మారిందేమోజూడు. మారితే (కందిపప్పు అంచులు గుండ్రంగా ఉందా లేక పగిలిపోయిందా అనేది లెక్క),ఉప్పు వేస్కో. నీళ్లు ఇంకిపోయ్యాయో లేదో చూడు. ముద్ద పప్పు గట్టిగా ఉండాలి. దింపేసేయ్. ముద్దపప్పు తాయారు..
ఇదీ ముద్ద పప్పు వండే పద్ధతి. కొంతమంది ముద్ద పప్పులో తిరగమాత వేస్తారు, కొంతమందినీళ్లు నీళ్లుగా చేస్కుంటారు. మా ఇంట్లో మాతర్మ్ ఇలా ఘట్టిగా ఉండేది ముద్ద పప్పు.
టిప్పు: ఉప్పు ఎప్పుడు వెయ్యాలి? ఉడికేప్పుడు ఉప్పేస్తే ఉడకదు అంటారు. అందుకే దాదాపు ఉడికింది అనే స్థితిలో ఉప్పేస్కోటం భేషు.


ముద్దపప్పుని బేస్ గా జేస్కొని కొన్ని ఎక్ష్టెంషన్లు:
రామ్ములక్కాయ పప్పు :- ఈ పద్ధతిని కొందరు దాల్ ఫ్రై అంటారు.
ఒక ఉల్లిగడ్డ, 2 రామ్ములక్కాయలు, 4 మిరగాయలు, 2 వెల్లుల్లి రెక్కలు, కొత్తి మీర తీస్కో. ఉల్లిపాయలు నీ సైజుని బట్టి తరుగు, పక్కన బెట్టు, వెల్లుల్లి నలిపేయ్, తెల్సుగ, బొటనవేల్తో నొక్కు, పక్కనబెట్టు, మిరగాయ్ నిలువునా ఛీరేయ్, పక్కన బెట్టు.

భాండి పెట్టు, పోపు వేయ్. పోపు ఐపోతుంది అనేలోపు ఇంగువ వెయ్ (ఆప్షనల్). పోపు చిటచిటా లాడంగనే మిరగాయలు వేయ్, తర్వాత నలగొట్టిన వెల్లుల్లి వెయ్. 1 నిముషమాగు. ఇప్పుడు ఉల్లిపాయ కోసావ్గా ఇందాక అది వెయ్. వేయించు. అప్పుడు రామ్ములక్కాయ వేయ్, మూత పెట్టు, 5 నిమిషాలు ఆగు. ఈలోపల పప్పు ఐందిగా, దాన్ని దింపు పొయ్ మీదనుండి. చేత్తో పట్టుకోకు కాలుద్ది. గుడ్డ గుడ్డ పెట్టి పట్టుకో. బుఱ్ఱ పెట్టండి (శనివారం అది పంజేయ్యదు - నాకు తెల్సనుకో). ఉప్పు కారం వేస్కో, ఈ పప్పుని దాంట్లో వేసేయ్, కొంచెం నీళ్లు పోయ్. ఓసారి కలిపు. కుత కుత లాడంగనే దింపు. కొత్తిమీర వెయ్, మూత పెట్టు.

గమనిక : ఒక్కో ఇంటో ఒక్కోలా వండుతారు. టొమాటో పప్పులో సానా మంది ఉల్లిగడ్డ వేస్కోరు. రూముల్లో ఇలాంటి స్టాండర్డ్స్ ఉండవు. "టమాటా" పప్పులో కాకరకాయ కూడా వేస్కోవచ్చు :) మన ఇష్టం (పొరబాటూన వేసేరు)

13 comments:

చైతన్య.ఎస్ said...

భాస్కర్ గారు అదుర్స్. అయినా మా రూం లో ముప మీకెలా తెలిసిందబ్బా..

ఉమాశంకర్ said...

ఉల్లిపాయలు నీ సైజుని బట్టి తరుగు . ????????????????

మిరగాయ్, నిలువునా ఛీరేయ్, పక్కన్ బెట్టు.

బావుందండి. పప్పు చెయ్యటాన్ని కూడా భీభత్సం గా బాగా చెప్పారు.

నా ప్రాణదాత ఈ పప్పు నేను బ్రహ్మచారి గా ఉన్నప్పుడు. ప్రియ పచ్చళ్ళు కూడా.

సుజ్జి said...

hahaahaaaaa
mee gamanika matram keka.. chala sepu navvukunna.. nice post

కొత్త పాళీ said...

I am losing confidence in your ability to lead this stupendous movement that is tryign to teach bachelors how to cook. :)
First, you got to get your definitions right.
By definition, muddapappu is devoid of any vegetables or popu. గట్టి ముద్దలా (ఎక్కువ నీళ్ళు లేకుండా) ఉడికించిన కంది పప్పు - అంతే.
కొంచెం నీళ్ళగా చేస్తే అది నార్తిండియన్ దాల్.
దాణికి పోపు తగిలిస్తే అది దాల్ ఫ్రై.
దాంటోనే ఏదన్నా కాయగూర తగిలిస్తే అది ఆ కాయ పప్పు .. టొమేటో పప్పు, బీరకాయ పప్పు .. ఇలా.
పాలకూర (Palak, spinach), టొమేటో, మెంతికూర, వంకాయ, ఇవి కందిపప్పుతో బావుంటై.
బీరకాయ, సొరకాయ, చౌచౌ (దీన్నే బెంగళూరొంకాయ అంటారు), జుకీనీ, యెల్లో స్క్వాష్ ఇవి పెసర పప్పుతో బావుంటై.

ఏ కాయతో పప్పు చేసినా, ఒకట్రెండు టొమేటోలు తగిలిస్తే, కొంచెం పులుపు తగిలి టేస్టు బావుంటుంది.

పచ్చి మిరపకాయలకి తోడు ఒక అరటీస్పూను కారప్పొడి కూడా వెయ్యొచ్చు.

ముఖ్య గమనిక. పప్పు పొపేసి పొయ్యి మీదనించి దింపిన తరవాతనే కొత్తిమీర వెయ్యాలి. కొత్తిమీర వేశాక ఉడికిస్తే వాసనొస్తుంది.

Bhãskar Rãmarãju said...

@అన్నాజి: Thought of writing something, but, ended up like this. Well, ముద్ద పప్పులో తిరగమాత వేస్కోరు. Wanted to have ముద్దపప్పు template and make varities with it.
Annyways, pointed noted, will be clear from now on.
@చైతన్య: థంక్స్
@ఉమాశంకర్: నీఇష్టం వచ్చిన సైజు అని. Any size you like అని.
@sijji: :)

ప్రదీపు said...

ఇలా పప్పుని కుక్కరు లేకుండా అప్పుడెప్పుడో చేసుకున్నా, ఇప్పుడయితే ఇలా చేయడం కష్టమే, కానీ అప్పటి రోజులను గుర్తు తెచ్చారు నాకు. నేను ఒకసారి కాకరకాయతో కూడా ఒకసారి చేసిచూద్దామని అనుకున్నా, కానీ మరీ అంత పెద్ద ప్రయోగం బాగోదని వూరుకున్నా :)

సుజాత వేల్పూరి said...

ముద్ద పప్పుని చేసేటపుడు ముందుగా కందిపప్పుని వేయిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది.

కుక్కర్లో చేసిన పప్పు జీవం లేకుండా ఉంటుంది నాకైతే! డైరెక్టుగా వండాలంటే బోలెడు టైం పడుతుంది కదాని కుక్కర్లో పెట్టడమే! మా అమ్మ కుమప్టి మీద వండే పప్పు రుచి నేను ఎంత ప్రయాస పడినా రాదెంచేతో!

Bolloju Baba said...

సుజాత గారూ
నిజమేనండి చిన్నప్పుడు పిడకలపొయ్యి/పొట్టుపొయ్యిలపై వండిన పప్పు వాసనలు కానీ,కూరల వాసనలు కానీ ఇప్పుడు రావేమండీ. హైబ్రిడ్ల ప్రభావమా లేక పురావాసనలు గొప్పతనమా?

బొల్లోజు బాబా

Viswanadh. BK said...

కుంఫటి అనే సాదనం గురించి వినే ఉంటే మీ పప్పు మరింత రుచి వచ్చేది. మా చిన్నప్పుడు మా వాళ్ళు ఆరు బయల కొన్ని పిడకలు నిప్పురాజేసి దానిపై పాత్ర పెట్టి దాని సంగతి మర్చిపోయేవారు. దాని పని అది చేసుకొన్న తరువాత అప్పుడు దాని్వైపు వెళ్ళేవారు.
చాలా కాలానికి అది గుర్తు వచ్చింది మీ టపాతో....

కొత్త పాళీ said...

I don't know how many people are aware of this - there is a definite chemistry of cooking. Something as simple as boiling rice or daal gives very different taste and texture based on the method of cooking: pressure cooker-brass pot on gas stove-brass pot on kumpati-clay vessel on firewood.
This has to do with the effect of temperature on the subtle enzymes and proteins that are in each food.
This is why slow cooking, especially of beans (all pappulu) and some grains produces excellent taste.

Bhãskar Rãmarãju said...

@ప్రదీపు: నా రాబోయే పోష్టుకోసం సిద్ధంగా ఉండు.:):) Thanks for visiting my blog..రుంబ నండ్రి
@సుజాత గారు: కుంపట్లో వండిన ఏదైనా బానే ఉంటుంది.
@బాబా గారు: ఊకపొయ్యి కూడా. ఇప్పుడు అవి ఎవరు వాడుతున్నారు గ్యాసు పొయ్యిలువచ్చాక. పల్లెల్లో కూడా లేవు.
@అన్నగారు: కుంపటి - పప్పు నా రాబోయే పోష్టు.

:)

కొత్త పాళీ said...

తంబీ, మీకు ఇంత అరవ క్నాలెడ్జి ఎప్పిడి? :)

Bhãskar Rãmarãju said...

నేను మద్రాసు సాంబార్లో రెండేళ్లు ఈదా, మా బుడ్డోడు చెన్నయిలోనే పుట్టాడు St. Isabels, Luz Corner లో. రాజా అన్నామలై పురమ్లో ఉండేవాళ్లం. బంగళూరులో ఎరడు వర్షె కళుసా మాడిదిని...