Thursday, August 5, 2010

కీ.దో పచ్చడి

మొన్నీమధ్య కీ.దో పచ్చడి ఓ గిన్నెనిండా చేసి ప్రిజ్జీలో పడనూకా.
కీ.దో అంటే కీరా దోసకాయ అని.
కీరా దోసకాయతో పచ్చడి బాగనే ఉంటుంది ఓ సారి ప్రయత్నించి సూడండి.
ఏంకావాలా?
ఓ రెండు కీరా దోసకాయలు
ఓ పది పచ్చి మిర్చి
ఓ రెందు ఎండు మిర్చి
ఓ చెంచా నూనె
ఓ చిటికెడు మెంతులు
ఓ రెండు కొత్తిమీర కాడలు
ఓ చిన్న నిమ్మకాయంత సింతపండు
విధానం
కీరా దోసకాయని శుభ్రంగా కడిగి, తొక్క తీయకుండా సన్నగా తరుక్కో. పక్కనెట్టు.
ఓ గళాసులో సిన్తపన్డు ఏసి మినిగిందాకా నీళ్ళు పోసి పక్కనబెట్టు
భాండిపెట్టి సెంచా నూనె పోయి
ఏడెక్కెంగనే మెంతులు, ఎండు మిర్చి వెయ్యి
చిట్పట్ అనంగనే పచ్చిమిర్చి వెయ్యి
ఏయించు
మిర్చి చిట్పట్ అనుద్ది
ఆపేయ్ పొయ్యిని
సిన్తపన్డు నానుంటది సూడు
బాగా పిసికేసి పిప్పి పడనూకు
మిక్సీలో ముందు ఏయించుకున్న దాన్ని కుమ్ము, ఓ రుండు మిక్సింగు వెయ్యి. కొంచెం కచ్చాపచ్చీగా మెదిగిందా? ఇప్పుడు సిన్తపండు గుజ్జు దాంట్లో కలుపు. ఇప్పుడు ఓ సెంచా ఉప్పు వెయ్యి. మళ్ళీ ఓ సారి తిప్పు మిక్సీలో పేస్టులా అయ్యిందా లేదా సూడు. కొంచెం గట్టిగా ఐతే ఓ పావులో సగం గళాసు నీళ్ళు పోసి ఇంకోసారి మిక్సింగ్ సేయి.
ఇప్పుడు మొత్తం కీరా దోస్కాయ ముక్కలేసి జస్ట్ ఒక్కసారి అంటే ఒకే ఒక్కసారి మిక్సిలోని బిల్లేడు తిరిగేలా వేసి మిక్సిని అపేసి గిన్నెలోకి మార్చుకో కొత్తిమీర పైన జల్లు.
లాస్టుపేరా అర్ధం కాలేదు కదూ!
మరోమారు సూజ్దాం - అన్నీ ముక్కలు ఒక్కసారి తిప్పుతే కొన్ని నలుగుతై, ఆ చింతపండు మిర్చి మిశ్రమం బాగా పట్టుద్దని. మరి ముక్కలు ఎక్కువున్నై, అన్ని మిక్సీలో పట్టవూ అంటే, పట్టినన్నే వెయ్యి. మిగతావి మిక్సీలోంచి దింపుకున్యాక కలుపు బాగా.
ఉప్పు సెంచా చాలా? రుచికి తగ్గట్టుగా వేస్కో గురూ
మిక్సీ లేకపోతే ఏంజేయ్యలే?
ఇంటి ఓనర్ని అడగాలే. లేకుంటే పక్కింటోళ్ళను అడగాలే.

7 comments:

Sravya Vattikuti said...

మొత్తానికి కీరదోసకాయ పచ్చడి తో మళ్ళీ మెదలుబెట్టారు సంతోషం !
మనలో మనమాట నిజం చెప్పండి ఈ పచ్చడి చేసింది హరిత గారే కదూ , ఇన్ని రోజుల ఆవిడ లేనప్పుడు ఈ బ్లాగు మొహం చూడలేదు మీరు మళ్ళీ ఇప్పుడు హరిత గారు వచ్చాక రాస్తున్నారు అంటే మాకు అర్ధమవుతుంది :)

భాస్కర్ రామరాజు said...

అహవమానం. నేనేచేసా.
తను వేరే దుకాణం తెరిచింది.
http://harihyderabadi.blogspot.com

Sravya Vattikuti said...

Wow photos also my mouth is watering here my favourite cucumber.

చదువరి said...

పక్కింటోళ్ళను అడిగాం మాస్టారూ. వాళ్ళకు కీరాల్లేవంట. అవిస్తే మిక్సీ ఇస్తామంటున్నారు :)

నేస్తం said...

నాకు ఇలా సింపుల్గా అయిపోయే పచ్చడ్లు సూపర్ ఇష్టం..ఇదేదో క్రొత్తగా ఉంది థేంక్యూ

నేస్తం said...

భాస్కర్ గారు చిన్న డౌట్ కీరదోసకాయా కోసిన కొద్ది సేపటికి చేదు వస్తుంది కదండి..మరేం కాదా ఇలా పచ్చడి చేసినతరువాత..

Krishnapriya said...

ఇవ్వాళ్ళే చేసేస్తా.. మీరు చెప్పిన పద్ధతి, భాష నాకు చాలా నచ్చింది.. మీరు చెప్పిన వీటికోసం టపా ని రెండు సార్లు చదివాను..