Friday, August 13, 2010

ఎఱ్ఱముల్లంగి ఏపుడు

మొన్నామధ్య ఎఱ్ఱముల్లంగి ఏపుడు సింపేసారేసా..అర్ధంకాలేదా?
ఓహ్!! ఎఱ్ఱముల్లంగి అంటే...వాకే వాకే.
ఎఱ్ఱముల్లంగి అంటే గాజరగడ్డ.
ఏం సమఝ్ గాలే?

ఛల్!! గాజరగడ్డ అంటే గాజర్, క్యారెట్టు అనీ.
నీ ఎన్కమ్మ!!

ఏందీ ఈ గాజర్ గీ గడ్డ కీ ఏపుడ్స్ అంటే -
ఏం గావాలే?
ఓ నాల్గు గాజరగడ్డలు
ఓ పది కొత్తిమీర కాడ్స్
ఓ నాల్గు పిరగాయల్స్
ఓ నాల్గు వెల్లుల్లి రెబ్బల్స్
ఓ సెంచా కొబ్బరికారం/శనగపొడి/కారప్పొడి
తిర్గమాత గింజల్
ఓ సెంచా నూనె
ముందు గాజరగడ్డల్ని సుబ్బనంగా కడుక్కోవాలె.
అయినంక తోలు తీకున్డా, సన్నంగా తరుక్కోవాలె.
మిర్చి కోసేసి పక్కన్నూకాలె.
వెల్లుల్లిని క్రష్ సేసి తోక్క తీసేసి పక్కనబెట్టుకోవాలె.
ఇప్పుడు భాండీ పెట్టాలె, పొయ్యి ఎలిగించాలె, ఏడెక్కంగనే నూనె సెంచా
ఏస్కోవాలె, నూనె ఏడెక్కినంక తిరగమాత గింజ్ల్ అందల నూకాలే, చిట్పట్
లాడంగనే వెల్లుల్లి రెబ్బలు మిరగాయలు ఎయ్యాలె. అయీ ఏగంగనే ఓ సిటికెడు
పసుపు వెయ్యాలె, గిప్పుడు గాజరగడ్డ ముక్కలు వెయ్యలె, ఏసి ఎయించాలె.
బాగా ఏగినంక ఉప్పు, కొబ్బరికారం/శనగపొడి/కారప్పొడి ఏదుంటే అది
జల్లుకోవాలె. ఏదీ లేకుంటే ఓ సెంచా కారం ఓ సిటికెడు శనగపిండి జల్లుకుంటే
మస్తుంటుంది. సివర్న కొత్తి మీర జల్లి, పొయ్యి అపేసి కుమ్ముడే ఇక.

గాజరగడ్డలో ఫైబర్ అనగా పీచు ఉంటుంది.

5 comments:

Anonymous said...

Erra mullanigi ante carrot aa?

త్రినేత్రుడు said...

కాస్త మామూలు భాషలో రాయండి ప్లీజ్

Bhãskar Rãmarãju said...

మామూలు భాష అంటే ఏంటటా?

రాజ్ కుమార్ said...

ఈ బ్లాగు కేక మాస్టారు..ఆ రోజు నా వాగుడికి మీకు బాగా మండి ఉంటుంది. క్షమించగలరు. :)
గాజరగడ్డలు, పిరగాయల్స్ వీటికి బ్రాకెట్లో మాకర్ధం అయ్యే పదాలు రాయండి. (మామూలు భాష :) :) )

Pradeep said...

gannaa, nuv super anna,

em rasanav bhai !

ek dum samjaipothunnadi !

nenu gudka bachelore ! " vanta kani wifendukura, blogunte chaalu " ani mana ramanna pata jara marchi paadukuntuna !