ఇప్పటి పల్లేల్లో ఎలా ఉందో నాకు సరైన అవగాహన లేదు గానీ!
మా ఇంట్లో పెద్దరోలు, రోకలి ఉండేవి. మా ఇంట్లో అనేకాదు, ప్రతీ ఇంట్లో అనుకోవచ్చు దాదాపు.
రోలు దాదాపు ఏ రెండొందల కిలోల బఱువో ఉండేదేమో. పెద్ద రాతిని చెక్కి రోలు చేసేవాళ్ళు. దాన్ని ఇంట్లో ఇన్స్టాల్ చెయ్యాలంటే కూడా ఓ పెద్ద తతంగమే.
కానీ!! ఆశ్చర్యం వేయదూ? వందల సంవత్సరాల క్రితం అంతంత పెద్ద రోళ్ళను ఇంటికి ఎలా తెచ్చేవాళ్ళూ? ఏ ఎద్దులబండి మీదనో వేస్కుని తోలుకొచ్చేవాళ్ళనుకుంటా.
ఇప్పట్లో బియ్యపు మూటనే ఎత్తలేరు మన జనాలు. హ్మ్!! జొన్నలు తిన్న శరీరాలు కాబట్టే వెయ్యేనుగుల బలమ్ ఉండేది మన పూర్వీకులకు. నో రైస్ మిల్, నో గ్రైన్ మిల్స్...ఓన్లీ హోల్ ఫుడ్. ప్రాసెస్డ్ యట్ హోం!!
కందులు, పెసలు, మినువులు, శెనగలు అన్నీ ఇంట్లోనే ప్రాసెస్ చేస్కునెవారు ఆడవారు. ఎంత శ్రమో తెలుసా? అంత శ్రమ పడేవారో అంత తినేవారు. అందుకే పది కాన్పులైనా అవలీలగా కనేవారు. తొమ్మిదో నెలలో కూడా కలుపులకూ కోతలకూ వెళ్ళేవార్ని నేను అనేకసార్లు చూసాను. మగాళ్ళు నాగలిని ఒక భుజం మీద, వేస్కుని పది మైళ్ళు నడక అవలీలగా కుమ్మెవాళ్ళు.
ఆ రోజులు పొయ్యాయి. ఎందుకూ? వరి బియ్యం మహత్యం. మిల్లుల మహత్యం. కందిపప్పు రుచిలేదు. వరిమీద రంగులేదు. అంతా తెలుపు. తెల్ల బియ్యం తింటే ఎంతా తినకపోతే ఎంతా?
కందిపప్పుక్కూడా పాలిష్ వేసి మూడు లేయర్లు లేపేసి, రంగేసి మార్కెట్లోకి వదులుతారు మీకు తెలుసా?
ఈవేళ మనం తింటున్నది, బలం విటమినులు ఇత్యాదివి పోగా మిగిలిన పిప్పి.
సరే!! కతలోకి పోదాం లెగండి.
జొన్న బువ్వ ఎట్టా వండాలా? అనేది పెస్న.
జొన్న బువ్వ వొంటాకి, జొన్నలుగావాల. రోలు, రోకలి కావాల.
ముంగట, జొన్నల్లో కాసిని నీళ్ళు జల్లి తడిపొడిగా సేస్కోవాల.
ఐనాక, రోట్లో ఆట్ని పోసి తొక్కాల. ఎంతకాడికి తొక్కాలా? పొట్టు లెగించిందాంక తొక్కాల.
తొక్కినాంక, ఆట్ని కడుక్కోవాల. పొట్టు పోయిందాంక కడగాల. మినుపప్పు నానబెట్టి పొట్టుతీస్తరుగా అట్టా అన్నమాట.
ఇప్పుడు ఎసరుపెట్టుకోవల, ఎసట్లో ఈ కడిగి పొట్టుదీసిన జొన్నలు వెయ్యాల.
ఉడికినంక ఏంజెయ్యలా?
గోంగోర పచ్చడి, ఓ పెద్దుల్లిపాయ పక్కనెట్టుకుని, కుమ్మాల, అయినంక, గడ్డపెరుగు ఏస్కుని, గండ్ల ఉప్పు ఏస్కుని కుమ్మాల.
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
గోంగోర పచ్చడి, ఓ పెద్దుల్లిపాయ పక్కనెట్టుకుని, కుమ్మాల, అయినంక, గడ్డపెరుగు ఏస్కుని, గండ్ల ఉప్పు ఏస్కుని కుమ్మాల.
హ హ్హ సూపర్ :))
నోరూరాలి అంటే బజ్ లో పెట్టిన ఫోటో పెట్టాలి :)
హ్మ్! మాకు తెల్లవారుతూనే అందరి ఇళ్ళల్లో రోళ్ళమోతలు వినిపించేవి... మానెడు జొన్నలు తొక్కేవాళ్ళు ఏకంగా.....పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ వెళ్ళి రోకలి పట్టుకున్నేవాళ్ళం....అన్నయ్య, నేను పోటీ పడి తొక్కేవాళ్ళం.... అబ్బో! అంత చిన్న గురుగున్న రోట్లో మూడు రోకళ్ళపోట్లు, నాలుగురోకళ్ళ పోట్లు..ఎంత స్కిల్లు కావాలో దానికి....ఒక రోకలికి ఒక రోకలి తగలకూడదు, రోటి అంచుకు తగలకూడదు...భలే ఛాలెంజింగుగా ఉండేదిలే....
మాకు అలా కాయలన్నం వండరన్నయ్యా.....
అలా పొట్టు వేరు చేసిన బియ్యాన్ని వడేసి, తర్వాత రోట్లో వేసి మళ్ళా తొక్కుతారు, నూకా పిండిగా......దాన్ని చెరిగి నూక, పిండి వేరు చేస్తారు...అది వండాలంటే అబ్బో, పెద్ద తతంగంలే...ముందు ఎసరు బాగా కాగనిచ్చి, దాంటో నూకపోసి ఉడకనిస్తారు ముందు...అది ఉడికింతర్వాత చివర్లో పిండిపోసి బాగా పెద్ద తెడ్డెట్టి వేగంగా తిప్పాలి...లేకపోతే ఉండకట్టిద్ది.....అలా బాగా దగ్గరకయ్యేవరకు ఉడికించాలి...
దించి వేడేడిగా కంచంలో పెట్టుకుని మజ్జెన పెద్దగురుగు చేసి, దాంటో సంబారు కారం, మాంఛి నెయ్యి పోసుకుని ఒక్కో ముద్దా కలుపుకు తింటుంటే ఆహా.....ఏ అన్నమూ పనికిరాదు దానిముందు...సంగట్లోకి పప్పుచారు, ఉప్పుగోంగూర, పప్పూఆవకాయ బెస్టు కాంబినేషన్సు.......
పెరుగుకంటే మజ్జిగ బాగుంటుంది సంకటిలోకి......ఉల్లిపాయ తింటే యాక్...నోరు కంపు కొట్టిద్ది..పక్కనున్నోళ్ళు ఆమడ దూరం పరిగెట్టాలి...పెద్దిళ్ళల్లో ఎవళ్ళూ పచ్చుల్లిపాయ తినేవాళ్ళు కాదు...పాలేళ్ళే తినేవాళ్ళు....
గోంగూర పచ్చడికి పచ్చి ఉల్లిపాయే కాంబినేషన్ !! కుంపట్లో కాల్చిన ఉల్లిపాయ అయితే ఇంకా సూపర్ ! సజ్జలతొ, రాగులతొ అన్నం తిన్నా. ఇక జొన్నన్నం ప్రయత్నించాలి. మాకు తెలిసిన ఒక అంకుల్ రోజూ రాత్రిళ్ళు జొన్నన్నమే తినేవారు.
అన్నగారూ,మీకో ప్రశన: జొన్నలు బాగా వేడి చేస్తాయి కదా? జొన్నన్నం వేడి చెయ్యదా?
america lo unte em jeyyaalaa...elaa vandaala...ekkada dorakutayi jonnalu, I can find jowar flour but not raw jowar
బాగుందబ్బాయ్ జొన్నన్నం.
తొక్కినాంక, ఆట్ని కడుక్కోవాల. పొట్టు పోయిందాంక కడగాల."
మా ప్రాంతంలో ఇలా చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఇసుర్రాయిలో(తిరగలి) వేసి ముక్కలుగా విసిరి తర్వాత వండుతారు.
తృష్ణగారూ! జొన్నలు వేడిచెయ్యవండి.జొన్నన్నంగానీ,జొన్నరొట్టెలుగానీ ఏవీ వేడి చేయవు.
ఆ మజ్జె పొన్నూరెల్లి ఓ చిల్లర కొట్లో జొన్నలు గావాలా ఓ నాలుక్కేజీలియ్యంటే,యేందబ్బాయ్ సుబ్బరంగా పిండి దొరికిద్దైతే యెందుకీ జొన్నలూ,అన్నాడు.పొన్నూళ్ళోనే జొన్నలు దొరక్కపోతే ఈ దిక్కుమాలిన వైజాగ్ లో అసలాటి గురించి చూట్టం కూడా దండగమారెవారం.కాబట్టి ప్యాకెట్లో దొరికే ఆ పిండితోనే రొట్టెలెట్ట జెయ్యాలో చెప్పు.
Post a Comment