Wednesday, August 10, 2011

కాల్షియం కోసం ‘రాగి అంబలి’

దేనికోసమో గాలిస్తుంటే ఈ లింకు తగిలింది.
(1) రాగుల్ని చోళ్ళు, తవిదెలు అని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. ‘చోడంబలి’ చిక్కగా, మృదువుగా ఉండి చలవనిస్తుంది. పుష్టినిస్తుంది. కడుపు నిండుతుంది. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపు చేస్తుంది.
(2) చక్కని పెరుగుని ఈ ‘రాగంబలి’లో కలిపి చిలికి ప్రాతఃకాలన తాగితే అన్నిరకాల వ్యాధులలోనూ మేలు చేకూరుస్తుంది.
(3) చదువుకునే పిల్లలకి, వృద్ధులకీ, రోగాలతో తీసుకొంటున్న వారికి, కృశించిపోతున్న వారికి, స్థూలకాయం ఉన్న వారిక్కూడా ప్రొద్దునే్న అంబలి తాగితే చాలా మేలు కలుగుతుంది. పాలుగాని, పెరుగు గాని, మజ్జిగ గాని కలిపి తాగవచ్చు కూడా!
కాల్షియం కోసం ‘రాగి అంబలి’ | Andhra Bhoomi

1 comment:

రసజ్ఞ said...

ఈ రాగులతో పాటు జొన్నలు, సజ్జలు, సగ్గుబియ్యం, బాదం, జీడిపప్పు ఇలా చాలా కలిపి పొడి చేసి దానితో జావ కాస్తారు. అది పరగడుపున తాగితే ఆరోగ్యానికి అన్నీ విధాలా చాలా మంచిది. రాగుల వాసన నచ్చని వాళ్లకి కూడా ఇది నచ్చుతుంది.