ముందట్రోజు రేత్తిరే లీమా బిన్నీసులు, పుల్లచెనగలు నీళ్ళల్లో పోసి నానబెట్టుకోవాల.
మర్నాడు సాయంత్రానికి అదే నీళ్ళల్లో ఉడకబెట్టాల.
ఉడికినంక,
భాండీ పొయ్యిమీన పెట్టుడు,
ఓ సెంచా నూనె పోసుడు కాగినంక చిటికెడు ఆవాలు,
చిటికెడు జిలకర ఏసుడు,
ఏ రెండు ఎండుమిరగాయలు కుమ్ముడు,
సిటపటలాడంగనే ఓ నాల్గోఐదో ఎల్లుల్లి కుక్కి ఏసుడు వేయించుడు
అందలా ఈ లీమా ఉడ్కబెట్టిన లీమా బిన్నీసులు, పుల్లచెనగ ఏసుడు రవ్వంత ఉప్పు రవ్వంత కారం జల్లుడు దింపుడు.
దీన్నే మా యమ్మ శాతాలింటం అనేటిది.
శాతాలించినాంక,
ఇంకోసేత్తో ఓ ఉల్లయ్యని ఓ రెండు మిరగాయల్ని సన్నంగా కొసి పక్కనెబెట్టి ఓ నిమ్మకాయ నరికి సర్రున ఈటిమీన పిండి
ఇంకోసేత్తో రొట్టె తీస్కొనుడు మద్దెన పైన సేసిన గుగ్గిళ్ళు ఓ రెండు మూడో పస్కుండో సెంచాలు కుమ్మరించుకొనుడు పైన ఓ రెండో సెంచాలు ఉల్లిమిరగాయల్ని జల్లుకొనుడు
ఇంకా ఏందీ సూస్చా? మడతెట్టి కుమ్మహే
[నాసావే! రొట్టెలు యాణ్ణుండి తెమ్మంటా? అంటావా? కొసెన్లేసినావంటే ఇరగనూకుతా. ముందు తినహే]
2 comments:
బాగుంది!అసలంటూ మొదలు పెట్టారు.సంతోషం. కొంచం తరచుగా ఈ బ్లాగ్ రాస్తుండండి.
అన్నా,
జర్రింత సిలాంత్రో (గదే భాయ్, కొత్తిమీర) నూకితే ఇంకా మస్తుగుంటదేమో?? రెసిపీల్న సిటికెడు, గుప్పెడంటే జనాల్కి తెలుస్తదంటవా?? ఇస్పూన్లలో కొల్తలు జెప్పల్నేమో??
కం//
హెల్తీ రెసిపీ బ్రదరూ,
వెల్తిగదా కొత్తిమీర వేయక యున్నన్!
చెల్తాలే రెసిపీలో
కొల్తలు లేకున్ననేమి కొదవది శ్యామా!!
Post a Comment