గ్రీన్ టీ సింపుల్.
ఇదానం ౧. కావాల్సినవి, చాయ కాచటానికి ఓ గిన్నె, ఓ సెంచాడు చాయ పొడి. ఓ నిమ్మకాయ బద్ద, సెంచా తేనే లేక అరసెంచాంత బెల్లం, రెండు పుదీనా ఆకులు.
వెలాగ సెయ్యాలయ్యా అంటే -
గిన్నె పోయ్యిమీన నూకి, గల్లాసు నీళ్ళోసి మరిగించాల. పొయ్యి ఎలిగించకుంటా ఎట్టా అనమాక, ఆపాట పెట్టి ఒక్కటినూకినానంటే దిబ్బలోబడాతావు.
నీళ్ళు మరిగినాక పొయ్యి ఆపినూకాల
ఇప్పుడు సెంచా చాయ పొడి ఏసి మూతపెట్టాల. నిమిషంకాంగనే వడపోసి అందులో నిమ్మకాయ బద్ద పిండి, బెల్లవో తేనే ఏసి ఓమారు కలిపి పుదీనా ఆకు నులిమి అందులో ఏసి ఓ అరనిమిషం మూతపెట్టుంచి
కుమ్మహే!!
ఇదానం ౨. కావాల్సినవి - ఏడ్నీళ్ళు, టీ పొడ డిప్, పుదీనా రెండు రెబ్బలు, ఓ నిమ్మకాయ బద్ద, తేనే ఓ సెంచా
వెలాగ సేయ్యాల్నంటే -
ఏణ్ణీళ్ళ మరకాడికిబో. ఓ గళాసులో ఏణ్ణీళ్ళు కుమ్ముకొచ్చుకో. టీ పొడ సంచీ ముంచు ఓ నాల్గుసార్లు.
నిమ్మకాయ పిండు తేనె కుమ్ము
పుదీనా నులిమి కుమ్ము కలుపు
సెంచాతో కలుపు
తాగహే ఏటి సూత్తావ్
Tuesday, October 2, 2012
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
మీ టీ కన్నా భాష బాగుంది....
మేము కూడా నిమ్మ టీ ట్రై చేసాం.....కాని అదేదో అయ్యి జనాల్ని భయపెట్టింది....మా రూం లో బక్క వేమన విక్రాంత్ లేమోన్ టీ పెడితే నాలుక కాలుతున్న తాగే వాళ్ళం...పొద్దున్నే అదో ఆనందం....
నిమ్మకాయ చాయ ఎప్పుడూ ఒకమోస్తరు వేడిదే తాగాలి. ఎక్కువ వేడిలో నిమ్మకాయని పిండుట దాన్ని సేవించుటా మంచిదికాదని మా ముత్తతాతమ్మ చెల్లెలి ఆడ బిడ్డ మనవడి తమ్ముడు జస్ట్ నిన్ననే చెప్పాడు.
>>మీ టీ కన్నా భాష బాగుంది<<
ఖండ ఖండాలుగా ఖండిస్తున్నా
పొయ్యిమీద డెగిషా ఎత్తవతలనూకి నిన్ను కూర్చోపెడుతున్నా. హన్నా! ఎంతమాట?
:-)
idhi lemon tea kadha
Lolzzz
Post a Comment