Wednesday, August 7, 2013

అల్లం రసం

చారుకాసే గిన్నెలో
ఓ సెంచా నెయ్యివేసి పోపుప్వెట్టాలంట అంటే?
నెయ్యికాగంగనే జిలకర ఆవాలు కరివేపాకు వేసి చిటపటలాడంగనే ఇంగువ కుమ్మి, దాంట్లోనే ఓ రెండు పండుటమాటాలు పిసికేసి నీళ్ళు పోసి, రుచికి కావాల్సినంత సింతపండు నీళ్ళలో నానబెట్టి పిసికి రసం పోస్కోచ్చు లేక ఆపాట సింతపండు వేస్కోచ్చు, పసుపు వేసి, ఓ రెండు వెల్లుల్లి కుక్కి పొట్టుతీసి వేసి, ఓ ఐదురూపాయిబిళ్ళంత అల్లం నలగ్గొట్టి వేసి కొంచెం మిరయాల పొడి వేసి, సివరాకర్న రసంపొడి కావాల్సినంత వేసి, కొందరు ఓ చెంచా పందార వేస్తారు, కొందరు బెల్లం ముక్క వేయచ్చు వాళ్ళ ఇష్టాలను బట్టి. ఇక మరగనీయటం, బాగా మరిగినాక కొత్తిమీర వేసి కుమ్ముకోటం. మిరయాలు ఎక్కువేస్తే ఘాటుగా ఉంటుంది.

Friday, June 7, 2013

ఏంపాపం? మినపట్టు ఏంపాపం చేస్కుందీ?

రెండు డబ్బాల బియ్యం, ఒక డబ్బా మినపగుండ్లు, ఒక స్పూన్ మెంతులు, చెటాకు అటుకులు - నానపెట్టు.
ఓ నాలుగోఐదోఆరో గంటాలు లేక నానినై అన్నాక *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును*.
అలా వచ్చిన అట్టు పిండిని ఒవెన్లోనో బంధించు. ఫర్మెంట్ అవ్వాలి. పిండి పొంగుతుంది. అదన్నమాట. స్! ఓవర్నైట్ పిండి పులవనివ్వు.
మర్రోజు పొద్దున్నే
స్నానం గీనం చేయ్యంగనే
పొయ్యికాడికిబోంగనే
పిండి బయటకిలాగంగనే
సిప్పగంటెతో ఓపాలి కలయతిప్పంగనే
ఉప్పు తగినంత కుమ్మి సుబ్బరంగ కలపంగనే
పెనం పొయ్యిమీన నూకి ఎలిగించి ఏడెక్కేలోపల్నే
ఓ ఉల్స్ ఓ నాల్గు మిర్చ్స్ ఓ బేడ అంత అల్లం సన్నంగ తరగంగనే
ఓ సెంచా నూనె పెనంమీన నూకి ఏడెక్కంగనే
ఉల్స్ మిర్చ్స్ అల్లమ్స్ ఏపించంగనే
ఉల్లిముక్కతో పెనాన్ని తుడవంగ.............నే
సిప్పగంటెతో అట్లపిండి తీసి పెనంమీద అట్టుపోసి, దోరగా కాలినాక, ఉల్స్ మిర్చ్స్ అల్లమ్స్ ఏసేసి, అట్టుని దోకుడుపారతో దోకేసి, సిబ్బిరేకులో పడనూకి.......అల్లప్పచ్చడితో కుమ్మేస్కోహే








Wednesday, June 5, 2013

ఉల్లి పెసర

రెండు డబ్బాల హోల్ పెసరపప్పుకి ఓ పిరికెడు బియ్యం పోసి ఓ ఆరు గంటలో ఎందిగంటలో నానబెట్టి నీళ్ళు ఒంపేసి వెట్ గ్రైండర్లో *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును* చేసేప్పుడే ఓ పదో ఇరవైయ్యో పచ్చిమిర్చి వేసి రుచికి ఉప్పు కలిపి *పెసర అట్టుకి* క్కావాల్సిన పిండిని సిద్ధం చేస్కుని మరోవైపు ఓ ఉల్లిపాయని సన్నగా తరిగి, ఓ పావలా బిళ్ళంత అల్లం [పావలా బిళ్ళంత అల్లం కావాల్నంటే కార్ అమ్ముకోవాల్సిన్ స్థితి, అర్థం చేస్కోగలను] సన్నగా తరిగి ఓ మిరపకాయ సన్నగా తరిగి పెనం పొయ్యిమీద పెట్టి వెలిగించి వేడెక్కగానే ఓ స్పూన్ నూనె వేసి తరుక్కున్న ఉల్స్ మిరపకాయ్ అల్లం ఓ సారి వేయించి పక్కనపెట్టి, పెనాన్ని సుబ్బరంగా ఓ ఉల్లిపాయముక్కతో తుడిచి అట్లపిండిని ఓ చిప్పగంటెతోతీసి పెనంమీద వేసి అట్టుపోసి అందులో ఓ గుప్పెడు ఇందాక వేయించిన ఉల్లిమిరప‌అల్లం ముక్కలు వేసి అట్టు తీసి పళ్ళెంలోకి నెట్టి.................కుమ్మేలోపు పొయ్యి కట్టేయి లేకపోతే కాలుద్ది

Friday, May 31, 2013

రామ్ములక్కాయ మొక్కజొన్న ఇగురు

రాత్రి వంట చేస్కుందాం, ఏవున్నాయో ఫ్రిజ్ లో అని చూస్తే పండిపోతున్న రామ్ములక్కాయలు కనిపించాయి. సరే అని రామ్ములక్కాయలు ఓ మూడు చేతిలోకి తీస్కుని, మిరగాయలు తిద్దాం అని కింద సొరుగు లాగితే మొన్న తెచ్చిన మొక్కజొన్న కంకులు కనపడ్డాయి. అంతే! మనలోని షెఫ్ మెల్కొన్నాడు.
రామ్ములక్కాయ కూరలో మొక్కజొన్న వేసి వండినాను.
బాగుంది!!

Thursday, May 30, 2013

ఫ్రైడ్ బల్గర్

ఫ్రైడ్ రైస్ లాగా ఇది ఫ్రైడ్ బల్గర్ అన్నమాట.
పచ్చపచ్చగా భలే ఉందా చూట్టానికీ? మరే! మనం చేస్తే అంతేగా మరి.
ప్రొసీజర్ సో సింపులు.
౧. ముందు సగం గుండిక్కి నీళ్ళు పోయిమీద పడేయ్.
౨. నీళ్ళు మసలంగనే అందులో బల్గర్ పడేయ్.
ఎన్ని నీళ్ళకి ఎంత బల్గర్ అనేగా నీ ప్రశ్న. ఒక కప్పు బల్గర్కి రెండు కప్పుల నీళ్ళు. ఇక కుమ్ముకో
నీళ్ళలో బల్గర్ పడేశావా..ఇక ఉడకనీ
ఇంతలో
౩. రకరకాల బెంగుళూరు మిరపకాయలు అనగా పెప్పర్స్ తరుక్కో, ఒక టిన్ను బ్లాక్ బీన్స్ పక్కన పెట్టుకో. నాకు నానపెట్టే సమయంలేక టిన్ను వాడినాను. లేకపోతే నానబెట్టినవి ఓ మారు ఉడకపెట్టి వాడుకోవచ్చు
౪. సరిపోయినన్ని బీన్స్ తరుక్కో
సరిపోయినన్ని అంటే? ఓ పది
౫. ఓ సగం ఉల్ల్స్ సన్నగా నిలువుగా తరుక్కో, ఓ నాలుగు వెల్లుల్లి తొక్కతీసి పక్కనపెట్టు
౬. ఓ అరడజను మిర్చి సన్నగా పొడుగ్గా తరుక్కో
౭. రుచికి కొత్తిమీర దూసి కడిగి పక్కన పెట్టుకో, ఒక నిమ్మకాయ కోసి పక్కన పెట్టుకో
౮. భాండీ పెట్టు, పొయ్యి ఎలిగించి.
భాండీ ఎక్కడ పెట్టాలనేగా నీ ప్రశ్న? అలా పక్కకి వెళ్దాంపదా! వద్దా? ఐతే పొయ్యిమీద పెట్టి వెలిగించు మరి
౯. రెండో మూడో చెంచాల నూనె పోయి
౧౦. కాగగానే తరుక్కున్న మిరగాయలు వెయ్యి, చిట్పట్ మనగానే వెల్లుల్లి వెయ్యి
౧౧. ఓ సారి వేయించి తరిగిన ఉల్లిపాయలు వేసేయ్ చెప్తా
౧౨. ఉల్స్ కాస్త వేగయానే మిగతా ముక్కలు కూడా వేసేయ్
౧౩. బాగా వేగినాక బ్లాక్ బీన్స్ వేసేయ్
౧౪. ఓ రెండు మూడు నిమిషాలు శాతాలించి
౧౫. రుచికి కావాల్సినంత ఉప్పు తగిలించి కలిపి
౧౬. ఉడకబెట్టిన బల్గర్ కలుపు
౧౭. ఒకసారి కలియతిప్పి నిమ్మకాయ పిండి, కొత్తిమీర జల్లి
.....................................................అదన్నమాట

బల్గర్ అంటే గోధుమ నూక లాంటిదే!
http://en.wikipedia.org/wiki/Bulgur
బల్గరు అనేది హై ఇన్ ఫైబర్. ఇది హోల్ గ్రైన్.

Tuesday, January 15, 2013

రంగు రంగుల కూర ముక్కల కూర


కావాల్సినవి
గాజరగడ్డ, సెలెరీ, బ్రొక్కోలి, బోక్ చోయ్, ఆనియన్, బెంగళూరు మిరయాగలు రంగురంగులవి.
ఎన్నెన్నీ? తలా ఒకటి అనుకో.
ఇంకా నువ్వులు, నేనులు, అల్లము, బెల్లము, సున్నము, వెల్లుల్లి.
ఇంకా ఓ డేగిశా, ఓ భాండీ, ఓ ల్యాప్ టాపు, అగ్గిపెట్టె, నూనె, కారం ఉప్పు పసుపు తెలుపు నలుపు
ముంఫుగా గాజరగడ్డ, సెలెరీలనీ నచ్చిన ఇధంగా తరుక్కోవాల. బ్రొక్కోలి పూవులుగా కటింగు సేస్కోవాల.
డేగిశాలో నీళ్ళు నిండిగా పోసి, తెర్లుతున్న నీళ్ళల్లో గాజరగడ్డ సెలెరీ బ్రొక్కోలి వేసి ఒక్క రెండు నిమిషాలు కాంగనే దించేసి వడగట్టి ఉడికిన ముక్కలు పక్కన సిబ్బిరేకులో పెట్టుకోవాల
ఇప్పుడు, బెంగళూరు మిరగాయలు, ఉల్స్, బోక్ చోయ్ సన్నంగా తరుక్కోవాల. అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పెట్టుకోవాల. నాలుక్కు వెల్లుల్లి సరిపోను అల్లం చాలు.
భాండీలో పొయ్యిమీన పెట్టి ఓ రెండు సెంచాలు నూనె ఏసి కాగంగనే జిలకర ఏసి చిట్పట్ అనంగనే ఉల్స్, బెంగళూరు మిరగాయలు వేసి వేపాల, ఏగినాక రుచికి ఉప్పుస్, కారమ్స్, అల్లంవెల్లుల్లి ముద్దంగళు వేసి ఓపాలి కలియతిప్పి అందులో ఉడ్కబెట్టిన ముక్కలు వెయ్యాల. ఏసినంక *స్టిర్ ఫ్రై సాస్* కొంచెం వేస్తే బాగుణ్ణిద్ది. ఉంటే ఏసి ఓ చిటికెడు తెల్ల నువ్వులు జల్లాల.
ఓ ఐదునిమిషాలు హై మీద పెట్టి బాగా ఏపాల
ఏగినాక పొయ్యి కట్టెసి కుమ్మాల

1. carrot,celery,broccoli put in boiling water for 10min
then seperate them, keep them aside.
2. cut onion,capsicum,bok choy
fry jeera in oil
add onion,capsicum,bokchoy
3. then add salt,chilli powder,garlic-ginger paste
4. add boiled veggies and stir fry sauce, sprinkle sesame seeds
5. fry 5min on high flame


Wednesday, January 9, 2013

కాకరకాయ కారం

కావాల్సినవి -
నాల్గు కాకర
ఓ రెండు చెంచాల కూరల కారప్పొడి
ఓ స్పూను పందార
ఓ రెండు స్పూన్లు
కర్వేపాకు నాలుగు ఆకులు
ఓ నాల్గు వెల్లుల్లి
తిరగమాత గింజలు

౧. కాకరకాయల్ని నీ ఇష్టం వచ్చినట్టు తరుక్కో, అనగా సన్నగా తరుక్కో అని
౨. వెల్లుల్లి తాట్స్ తీయి
౩. భాండి పొయ్యిమీదకి ఎక్కించు
౪. నూనె పొయ్
౫. నూనె వేడెక్కినాక, జీలకర ఆవాలు కుమ్ము
౬. కర్వేపాకులు కుమ్ము
౭. చిట్పట్ అన్నాక వెల్లుల్లి వేసేయ్ చెప్తా, వేగనీ
౮. ఇప్పుడు తరిగిన కాకరకాయ ముక్కలు వేసేయ్, బాగా వేగనీ, క్రిస్పీగా వచ్చిందాకా వేగనీ
౯. బాగా వేగినాక అందులో రెండు చెంచాలు కారప్పొడి వేయి, చిటికెడు పందార, సరిపోయినంత ఉప్పు వేస్కో
౧౦. బాగా కలిపి, ఓ రెండ్నిముషాలు వేయించి దింపు.
౧౧. ......................
అదన్నమాట
ఏవన్నా తేడా ఒస్తే చెప్పు, మా మేడం గార్ని కనుక్కు చెప్తా

Monday, January 7, 2013

గొకమొలె/guacamole

అందరూ సేసినట్టు మనం సేస్తే మనకి అందరికీ తేడా ఏటుంటది బావా?
అహ! నువ్వే సెప్పు.
అవకాడో మంచిదంట. సరే! వలాగే!! అన్నాకదా బావా.
ఇదిగో మొట్టమొదటి సారి తింటన్నాగా బావా, కోప్పడమాక.
గొకమోలె అంట ఇదిగో మన ఇస్టైల్లో ఇట్టా జేసినా
౧. ఒక అవకాడొ
౨. సగం ఉల్లి
౩. నాలుగు పచ్చిమిరగాయలు
౪. నిమ్మ చెక్క
౫. కూసిన్ని కొత్తిమీర కాడలు

కత్తితో అవకాడోని నిలువుగా సర్రున గీయి. తొక్క పట్టుకు లాగు వచ్చేసుద్ది. నొక్కి గుజ్జు ఓ గిన్నెలోకి తీసి గింజ అవతల నూకు
ఉల్లి సన్నంగా తరుగి అందులో నూకు
మిరగాయలు సన్నంగా తరిగి అందులో ...
నిమ్మకాయ పిండు
ఉప్పు కావాల్నంటే సరిపోయినంత వేస్కో, నేనైతే వేస్కోల్యా.
ఓ సెంచాతో అంతా కలుపు
అయినంక కొత్తిమీర కడిగి సన్నంగా తరిగి పైన జల్లు

రొట్టెల్లోకి లాగించు