Wednesday, June 5, 2013

ఉల్లి పెసర

రెండు డబ్బాల హోల్ పెసరపప్పుకి ఓ పిరికెడు బియ్యం పోసి ఓ ఆరు గంటలో ఎందిగంటలో నానబెట్టి నీళ్ళు ఒంపేసి వెట్ గ్రైండర్లో *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును* చేసేప్పుడే ఓ పదో ఇరవైయ్యో పచ్చిమిర్చి వేసి రుచికి ఉప్పు కలిపి *పెసర అట్టుకి* క్కావాల్సిన పిండిని సిద్ధం చేస్కుని మరోవైపు ఓ ఉల్లిపాయని సన్నగా తరిగి, ఓ పావలా బిళ్ళంత అల్లం [పావలా బిళ్ళంత అల్లం కావాల్నంటే కార్ అమ్ముకోవాల్సిన్ స్థితి, అర్థం చేస్కోగలను] సన్నగా తరిగి ఓ మిరపకాయ సన్నగా తరిగి పెనం పొయ్యిమీద పెట్టి వెలిగించి వేడెక్కగానే ఓ స్పూన్ నూనె వేసి తరుక్కున్న ఉల్స్ మిరపకాయ్ అల్లం ఓ సారి వేయించి పక్కనపెట్టి, పెనాన్ని సుబ్బరంగా ఓ ఉల్లిపాయముక్కతో తుడిచి అట్లపిండిని ఓ చిప్పగంటెతోతీసి పెనంమీద వేసి అట్టుపోసి అందులో ఓ గుప్పెడు ఇందాక వేయించిన ఉల్లిమిరప‌అల్లం ముక్కలు వేసి అట్టు తీసి పళ్ళెంలోకి నెట్టి.................కుమ్మేలోపు పొయ్యి కట్టేయి లేకపోతే కాలుద్ది

12 comments:

Lakshmi Naresh said...

oka ulli pesareyyyyyyyyyyy

Maitri said...

రెండు డబ్బాలంటే ఏ డబ్బా కొలత? ఉల్లిపెసర విన్నాను కానీ ఎప్పుడూ తినలేదూ చేయలేదూ. రేపే చేసి చూస్తాను :-)

Anonymous said...

please visit my blog
http://ahmedchowdary.blogspot.in/

Kottapali said...

పెసలు లేక పెసరపప్పు మూడు నాలుగ్గంటలు నానేస్తే చాలు

Sreelatha said...

మరి matching పచ్చడి?
అన్ని మిరపకాయలా?

Bhãskar Rãmarãju said...

అన్నగారూ!
నమస్తే!!
నాలుగంటలు నానినా చాలు. నిజమే.

లక్ష్మీ నరేశ్! పంపించా వచ్చిందా?
శ్రీలత గారూ - అల్లంపచ్చడో లేక వేరుశనగపచ్చడో. ఏదైనా బాగనే ఉంటుంది. మిర్చి అల్లం ఉల్లి వేశాం కాబట్టి పచ్చడి లేకున్నా బాగనే ఉంటుంది.

Kottapali said...

పెసరట్టులోకి నిజానికి పచ్చడి అక్కర్లా.

hari.S.babu said...

మాస్టారూ, పావలా బిళ్ల లన్నీ మాయామై పొయి చాలా కాలమైంది. ఇప్పుదు పావలా బిళ్ల లంటున్నారు. యెంత ఘోరం!!!

teresa said...

My most favorite b'fast/lunch/dinner :)
pesarattu+ uppma is good too.

సూర్య said...

o moola konchem takkuvaindi. nijam cheppandi. pesarattu vestoo meeru konchem kosesaru kadoo?

Bhãskar Rãmarãju said...

teresa గారూ! బహుకాల దర్శనం. రెండు యుగాలైందనుకుంటా మీరిటొచ్చి.
అంతా మంచేఅని భావిస్తున్నా!!
పెసరట్టు + ఉప్మా వావ్! అదీ గుంటూరులో కొన్ని హోటళ్ళలో ఐతే? ఇంకా అదుర్స్.

Bhãskar Rãmarãju said...

సూర్యం! పట్టేశావే!!